Aditya Kavacham - ఆదిత్య కవచం

 Aditya Kavacham - ఆదిత్య కవచం


Aditya Kavacham - ఆదిత్య కవచం
Aditya Kavacham - ఆదిత్య కవచం


అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

ధ్యానం

జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం

సిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్।

మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితం

సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ॥

దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితమ్ ।

ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ॥

కవచం

ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ ।

ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ॥

ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః ।

జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ॥

స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః ।

కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ॥

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ ।

ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ॥

 జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః।

పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఖిలం వపుః ॥

ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ ।

సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥

సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ ।

అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలమ్ ।

ఆదిత్య మండల స్తుతిః –

అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ ।

కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్ ॥

సిందూరవర్ణాయ సుమండలాయ

సువర్ణరత్నాభరణాయ తుభ్యమ్ ।

పద్మాదినేత్రే చ సుపంకజాయ

బ్రహ్మేంద్ర-నారాయణ-శంకరాయ ॥

సంరక్తచూర్ణం ససువర్ణతోయం

సకుంకుమాభం సకుశం సపుష్పమ్ ।

ప్రదత్తమాదాయ చ హేమపాత్రే

ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ॥

ఇతి ఆదిత్య కవచమ్

 

సూర్య మండల స్తోత్రం

 



Post a Comment

0 Comments