Lakshmi Kataksham story - లక్ష్మీ కటాక్షము కథ

Lakshmi Kataksham story - లక్ష్మీ కటాక్షము కథ 

Lakshmi Kataksham story

Lakshmi Kataksham story - లక్ష్మీ కటాక్షము కథ


పూజ చేయు విధానము

     పూజ పదకుండు దినములు చేయవలెను. దీనిని గురువారము సురువు చేసి సోమవారము నాటికి ముగించ వలయును. మెదటి నాడు మరియు ముగించు నాడు, మంగళ స్నానము చేయవలెను. వ్రత ముగ్గు వేసి అయిదు దీపాలు పెట్టవలెను. ముగ్గు మధ్య నెయ్యి దీపము, నాలుగు దిక్కుల నూనె దీపములు పెట్టి పూజ చేయవలెను. గణేష అష్టోత్రము, కథను చదువవలెయును. మంగళ హరతులు చేయవలెను. దినము పూజకు నైవేద్యము పెట్టవలయును. పెసరపప్పు, పానకము, అరటిపండ్లు ఏదైనా సరే తాంబూలము ప్రతి దినము ఒక ముతైదువులకు ఇవ్వవలెయును. కొన దినము ఐదు మంది ముతైదువులకు ఐదు పసుపు కొమ్ములు, ఐదు వక్కలు, ఐదు తమలపాకులుటెంకాయ, గాజులు, శవాకు, అరటి పండ్లు, రవిక బట్టలు ఇవ్వవలెను. చిత్రాన్నము, పెరుగు అన్నము, పొంగళి చేయవలయును. కొరిక వుంటే భోజనమునకు చెప్పవచ్చును. నైవేద్యము చేసి పాత్ర అట్లే పెట్ట వలయును. వేరు పాత్రలో పెట్టరాదు. పనెండోవ దినము కలశము పెట్టవలెను.

కాగురు అనే ఒక ఊరు ఊరిలో నారాయణ అనే ఒక అయ్యంగారు వుండిరి. ఆయన చాలా పేదవారు, ఆయన ప్రతి దిన్నము స్నానము చేసి సంధ్యా వందనము చేసి దేవుని పూజ, శివుని పూజ, అరవై నాలుగు కాలజ్ఞానములు ఆరు శాస్త్రములు, నాలుగు వేదములు ప్రతి దినము పటించుచుండేవారు. ఆయనకు ఇద్దరు ఆడబిడ్డలు పుట్టినారు. బిడ్డలకు తల్లి ఇరుగింట, పోరిగింట పాలు పోసి జీవించినది. పెంచి పెద్ద బిడ్డలను చేసినది. ఆమె ఒక దినము తన భర్తతో భన్నరాలుగా వ్యసనముగా మన బిడ్డలు పెద్దవారు అయ్యారు కదా పెండ్లి ఈడు వచ్చినది. బిడ్డలకు పెండ్లి చెయవలెనని చెప్పినది. మరుసటి దినమున ఆయన పూజ కార్యక్రమములు అన్నియు సక్రమముగా చేసి బిడ్డలకు తలంటి స్నానము చేయించి బిడ్డలను తోడుకొని పోవుచున్నారు. ఊరిలో సోమయాజులు అనేవారు ఒకరు వున్నారు ఆయన ప్రతి శుక్రవారము నందు లక్ష్మీ పూచేసి ఒకరికి బోజనము పెట్టి సంతృప్తి పరిచేవారు. ఆయన కూడా రవై నాలుగు కాలజ్ఞానములు ఆరు శాస్త్రములు, నాలుగు వేదములు దేవుని పూజ అన్ని తీర్చుకొని మద్యాహ్నము అయ్యెలోగా అప్పుడు అతిదులు అయినా సరే, తెలిసిన వారైన సరే ఉండే వాళ్ళను భోజనమునకు పిల్చే పద్దతి వాళ్ళకు అదే రీతిగా ఆయన వారిని రండి అని పిలిచి కాళ్ళకు, చేతులకు నీళ్ళు ఇచ్చి వార వేసి తామరాకు వేసి, అన్నము తాలింపులు,పులుసు, చారు, చిత్రాన్నము, పాయసము, 18 రకముల పిండి వంటలతో ఆయన వడ్డించినారు. పాలు, నెయ్యితో పెరుగు సదా వడ్డించి తృప్తితో భోజనము చేయమని నిదానముగా భోజనము చెయ్యండని చెప్పి అచటనే చేతులు కడుగుకొనుటకు నీళ్ళు తెచ్చి ఇచ్చినారు. అట్లే దక్షిణ తాంబూలమును ఇచ్చినారు. ఇచ్చిన తరువాత మీ ఊరు ఏది, మీ పేరు ఏమి, ఏమి పనిమీద వచ్చినారని అడిగినారు సోమయాజులు నా పేరు నారాయణ అయ్యంగారు, మా ఊరు కాగురు, నేను బిడ్డలిద్దిరికి పెండ్లి చేయవలెను. దాని వల్ల పోవుచున్నాను అని చెప్పినారు. దానికి సోమయజులు నాకు పెద్ద కొడుకు వున్నాడు నీ పెద్ద కుమారైను నా పెద్ద కొడుకుకి ఇచ్చి వివాహము చెయమని చెప్పినారు దానికి నేను సంతృప్తి పడి ఇద్దరి బిడ్డలకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు ధరించి దేవస్థానమునకు తోడుకొని పొయి తులసి దళము రుకులతో కృష్ణార్పణమని దారపోసి పూలమాలలు మార్చినారు. అప్పుడు వారి పజినిమిది తరముల నుండి పితృలు స్వర్గమునకు పోక వుండినారు. బిడ్డలకు దార పోసిన  తక్షణం స్వర్గమునకు చెరినారు.

         తరువాత పెద్ద కూతురిని  వుంచి తాను చిన్న కూతుర్ని పిలుచుకొని పోవుతున్నారు. దారిలో చిన్న ఊరు అనే ఒక ఊరికి వచ్చినారు. ఊరిలో  సోమయజులు అనే వారు అరవై నాలుగు కాలజ్ఞానములు, ఆరు శాస్త్రములు, నాలుగు వేదములు దేవుని పూజ చేసి ఒక విప్రునికి భోజనము పెట్టి సంతృప్తి పరిచేవారు. నాడు పూజ తీర్చుకొని ఇవతలకు వచ్చి నాలుగు దిక్కులు చూసి అతిథులు అయిన సరే భోజానమునకు వచ్చెది అని పిలిచి కాళ్ళకు చేతులకు నీళ్ళు ఇచ్చినారు. పీట వేసి తామరాకు వేసి అన్నము తాళింపు పులుసు పాయసము చిత్రానము ఇరవై ఒకటి రకాల పిండి వంటలతోను పాలు పెరుగు వడ్డించి తృప్తితో బోజనము చేయండి అని చెప్పి ఉపచారము చేసి అచ్చటనే చేతులు కడుగుకునుటకు నీళ్ళు ఇచ్చినారు. తరువాత దక్షణ తాంబూలాలను ఇచ్చి మీది ఊరు మీరు పని మీదుగా వచ్చినారు అని అడిగినారు. ఆయన మా ఊరు కాగురు నా పేరు నారాయణ అయ్యంగారు. నేను చాలా పేదవాడను. నాకు ఇద్దరు ఆడ్డ పిల్లలు వాళ్ళకు కన్యాదానం చేయుటకు వచ్చినాను. పెద్ద ఊరు అనే ఊరికి వచ్చినాను, అచ్చట సోమయజులు అనే వారు చాలా ఉపచారము చేసి బోజనము వడ్డంచిరి. పిమ్మట తన పెద్ద కొడుకునకు నా పెద్ద కుతురిని పెళ్ళి చేసుకున్నారు. చిన్న బిడ్డకు పెళ్ళి చేయవలెనని కనుక పోవుతున్నాను అని చెప్పినారు దానికి సోమయాజులు నా కూమారునికి ఇచ్చి వివాహము చెయ్యండని చెప్పినారు. మరుసటి దినమున తలంటి స్నానము చేయించి కొత్త బట్టలు వేయించి దేవస్థానమునకు పీలుచుకొని పోయి తులసీ దళము రూకులతో కృష్ణార్పణం అని దారిపొసినారు చాలా సంతోషపడినారు. ఇరవై ఒకటి తరముల వారు స్వర్గమునకు చెరినారు. అచ్చటనే బిడ్డలను వుంచి తాను ఊరికి ప్రయాణమై వస్తునారు. అంతలో కైలాసము నందు ఈశ్వరునితో మెక్షమనగా ఏమి అని అడిగినారు. దానికి శివుడు మెక్షమనగా పుష్యమాసము సప్తమి దిననున మండపము కట్టి రెండు దిక్కుల యందు పరదాలు కట్టించి నాలుగు దిక్కులకు అరటి స్థంబాలుంచి మామిడి ఆకులతో తోరణం కట్టించి విస్తరాకులు వేయించి ఐదు పావుల బియ్యం పెట్టి దాని మిద బూడిద గమ్మడికాయ పసుపు కుంకుమ పెట్టీ వజ్ర వైడూర్యమ్య్లు, ముత్యలు, రత్నాలు వుంచి పూజ చేసి అన్నియు ఒక విప్రునికి దానం ఇచ్చిన యెడల మెక్షము కలుగునని ఈశ్వరుడు తెలిపినారు.         

           కామ్యార్థమనగా నేమి అని అడిగితే ఆడది పుట్టినప్పటి నుంచి తలితండ్రులు ఆజ్ఞాతో విండిన తరువాత బిడ్డలు మనమలు ఆజ్ఞాతో ఉండిన వారికి కామ్యార్థమని పేరు కల్జునని చెప్పినారు. దానికి పార్వతిదేవి, సరస్వతిదేవి, లక్ష్మిదేవి ముగ్గరు ప్రపంచమునకు వచ్చి అడవిలో ఇల్లును గావించి దానిలో మడపం కట్టించి మామిడి తోరణం కట్టించి ఆకులో బియ్యం ఉంచి జ్యోతిని వెలిగించి పూజ చేసి దానికి ఎవరికైనా దానం ఇవ్వవలెనని లక్షిదేవి ఇచ్చినది. అప్పుడు నారాయణశాస్త్రీగారు తన బిడ్డలను విడచి ఊరికి వస్తుండగా నేను వచ్చినప్పుడు అడవిగా ఉన్నది. ఇప్పుడు దారి తప్పినానెమె తెలియదని అచ్చట ఏమె చూచి పదామని ఇంటికి వెళ్ళినారు అప్పుడు లక్ష్మిదేవి అతిథులైన సరే, పరదేశీయులైన సరే, తెలిసిన వారైనసరే, తెలియని వారైనసరే దానమును తీసుకొన్నట్లుయితే వచ్చెది అని చెప్పినది అన్నియు తీసుకొని ఇది సూర్యచంద్రుల కథ, దేవతలు చెప్పిన కథ దానిని శ్రద్దగా విని ముగ్గరికి ఉపదేశము చేయవలెను కథ చెప్పి ఇదే రీతిగా నడుచుకొని తలుచుకొని దానము ఇచ్చినది. సమయములో సరిగా ఊరిలో తన భార్య చపలబడుతు ఉండేది పక్క ఇంటి అమ్మయి వచ్చి  ఏలమ్మ ఇలా ఉన్నావు అని అడిగినది. దానికి మా ఆయన ఇద్దరు బిడ్డలను తోడుకొని పొయి నాలుగురోజ్జులు అయినది వారు రాలేదు అదే చపలముగా ఉన్నది. సమాచారము తెలియలేదు అని చెప్పినది దినానికి అరపావు బియ్యము ఇస్తున్నాను దానికి ఆయా నామగుడు ఒక పూటకి నాలుగు ఊర్లు తిరిగి నాలుగు పిడికెళ్ళ బియ్యం తెస్తున్నారు దానికి వండి మేము బోజనం చేసే వారము మేము అప్పు తీర్చుకున్న అప్పు తీర్చే విధం లేదు అని చెప్పినది దానికి ఆమె ఇంటి పనులు చేయువారికి ఋణం లేదని చెప్పి పని చేయుచుకొని అరపావు బియ్యం ఇచ్చినది అదే రెండు దినములు వండి బోజనము చెసినది మూడవ దినము లక్ష్మీదేవి నిండిన నీళ్ళు నిండినట్లు కలగన్నది జ్యోతిని వెలిగినట్లు కలగన్నది తనకు మంచిదో, చెడ్డదో తెలియక వారి ఇంటికి పోక కలవరపడుతు ఉండేది ప్రక్క ఉంటి అమ్మాయి వచ్చి ఎలమ్మ నీవు పనికి రాలేదు అని అడిగినది దానికి ఆమె నేను రాత్రి ఇలా కలగన్నాను అది చెడ్డదో మంచిదో అని తెలియక నాకు చాలా చపలముగా వున్నది అని తెలిపినది దానికి అది మంచిది కాని చెడ్డది కాదు నేను బియ్యము తెచ్చి ఇస్తున్నాను వండి బోజనము చేయి అని చేప్పినది.

            బియ్యము తెచ్చి ఇచ్చినది దానికి ఆమెకు మనస్సు రాక ఖనిజముతో బియ్యము అంతయును కుప్పనూకి ఇచ్చినది. ఖనిజము నిండి ఉన్నది సంగతి తెలియక పోసిన బియ్యము అంతయును ఇల్లంతా నెరిసినది దానికి ఆమె చాల చపలపడుతుండగా ప్రక్క ఇంటి అమ్మాయిని అడిగినది పెద్దలు ఇల్లంతా విసరాదని అంటారు నా ఇల్లంతా విసిరినది నాకు చాలా చపలముగా వున్నది అని చెప్పినది దానికి ఆమె నీ ఇల్లు నిండినట్లు చపలపడవద్దు అని చెప్పి అంతయును తోసి ఇచ్చినది, ఇచ్చి వాకిలికి వచ్చినది వచ్చేటప్పటికి నారాయన అయ్యంగారు చమలి వలే అంబరమీద కూర్చోని వైడుర్యములు, ముత్యములు, రత్నములు, తాళామేళాలతో వస్తున్నారు చూస్తువురా అని పిలిచినది ఆమె తట్ట చెంబుతో నీళ్ళు ఎత్తుకొని వచ్చి పతిదిగిన వెంటనే నీళ్ళు ప్రోక్షణ చేసుకొని కూర్చొండ బెట్టినది నిండా బియ్యము వున్నది వంట చేయుచున్నాను అని చేప్పినది దానికి ఆయన నేను ఒక కథ చెప్పుతున్నాను సూర్యచంద్రుల వ్రతము దేవతలు చెప్పిన కథ చెప్పుతున్నాను కథను శ్రద్దగా భక్తిగా వినయముగా విని పూజ చేసిన పిమ్మట చేస్తువుగా అని చెప్పినారు కథ పూర్తి అయ్యెలోగా ఇల్లు నిండాకు దాన్యాము ధనములు నిండియున్నది అది చూచి సుకృతమైనది మనకు కష్టములున్న వేలా బిడ్డలున్నారు. ఇప్పుడు సిరి సంపదలతోవున్నాము బిడ్డలను పులుచుకొనిరండి పది రోజులు వుండి పొని చెప్పినది. దాని ఆడ వారి మనస్సు ఆడవారికె తెలుసు అలాగే పిల్చుకొని వస్తానని చెప్పినారు.

           మరుసటి రోజున ప్రయాణమై పెద్ద ఊరికి పెద్ద కూతురి ఇంటికి వెళ్ళినారు. నాన్న ఎప్పుడు వస్తువి మీరు కుశలమ అమ్మ కుశలమ అని అడిగినది అంత బాగా వుండరమ్మ అని చెప్పిననారు దానికి ఆయన నేను సూర్యచంద్రుల కథ దేవతలు చెప్పిన కథ చెప్పుతున్నాను దీనిని శ్రద్దగా వినమని చెప్పినారు దానికి కూతురు చంకలో బిడ్డ ఏడుస్తున్నది పోయి మీద పాలు పొంగుచున్నది పని మనిషి కాచుకొని వున్నది ఆవులకొటులో ఆవులకు కసువు మేయవలెను ఇన్నియు నా కథగా వున్నది ఇక నీ కథ ఎలా వినను అని చెప్పినది. దానికి ఆయన ఏమి మాట్లాడక చిన్న ఊరికి వెళ్ళినారు చిన్న ఊరిలో చిన్న కుతురితో మాట్లాడినారు కుతురు నాన్న అందరు క్షేమమెన అని అడిగినది. అంత బాగా వుండారమ్మ అని చెప్పినారు. అటు పిమ్మట బోజనము చెయ్యమని చెప్పినది దానికి ఆయన బోజనము తిరిగి చెస్తాను నేను సూర్యచంద్రుల కథ దేవతలు చెప్పిన కథ చెప్పుతున్నాను అని దానికి ఆయమ్మ చాప వేసి సాంబ్రాణి కడ్డి అంటించి శ్రద్దగా కూర్చోని భక్తిగా వినయముగా ఆమె వినినది తన తండ్రి తన ఊరికి వెళ్ళినారు కొన్ని దినముల తరువాత పెద్ద కూతురికి దినదినము కష్టములు కలిగినది. ఒకనాడు మగనికి మజ్జిగ తేవాలన్న ఇల్లంతా వేతికిన ఒక లోట సహ చిక్కలేదు.

           ఆవుల కొటమునకు పొయినది అచ్చట ఆవుకు కసువు వేయవలెనని గంపకు చెల్లులు ఇంటికి పోయినది చెల్లెలు అని పిలిచినది చెల్లెలు అక్క అని వచ్చినది ఆమె కొన్ని రోజుల ముందు మన  తండ్రి మా ఇంటికి వచ్చినారు. శత్రువు అయిన ఒక కథ చెప్పుతానాని చెప్పినారు శత్రువు అయిన ఒక కథ చెప్పుతానని చెప్పినారు నేను వినలేదు అది మెదలకొని నాకు స్థితి కలిగినది మన తండ్రిని మాత్రం శత్రువు అని అనవద్దు దేవునితో సమానమైన మన తండ్రి కొన్ని రోజుల ముందు మా ఇంటికి వచ్చినారు నాకు ఒక కథ చెప్పినారు. నేను ఇప్పుడు కోటిశ్వరాలుగా ఉన్నాను. మన తండ్రిని మాత్రం శత్రువు అని అనవద్దు. దేవునితో సమానమైన తండ్రి అని చెప్పి ఒక చెంబు నిండాకు మజ్జిగ ఇచ్చినది నీ భర్త బిడ్డలకు ఇచ్చి పనెండు గంటలకు సరిగా ఇచ్చటికి రమ్ము అని చెప్పెను. కథను చెప్పుతున్నాను సాయంకాలములోగా కథను ముగ్గరికి ఉపదేశము చేయి నీ కష్టములు అని నివారణ్ కలుగునని చెల్లెలు అక్కకు చెప్పినది. అదే రీతిగా చెంబును ఎత్తుకొని భర్త బిడ్డలకు ఇచ్చి వచ్చినది. చెల్లెలు చెప్పిన కథ శ్రద్దగాభక్తిగా వినయముగా విని ముందుకు వెళ్ళినది. వెళ్ళుతు వుండగా దారిలో ఒక గానిగ వాడు రాజుకు నూనె బండి తీసుకొని వస్తుండగా జారి క్రింద పడిపోయినది చెపలముతో కూర్చొని ఉండగా ఆమె అచ్చటకు పోయి నాయనా నీకు ఒక కథ చెప్పుతున్నాను విను అని చెప్పినది దానికి అతడు రాజుకు ప్రతి దినము నూనె కుండను ఇచ్చెవాడిని దినము జారి పడిపోయినది . ఇది నాకు ఒక కథగా ఉన్నది. రాజు శిక్ష విదించునో అని చపలముగా విన్నది నువ్వువ్ విన్న సరే వినకపోయిన సరే నేను చెప్పుతానని నా కర్తవయ్యం అని సగము చెప్పెలోగా లెక్కెలేన్నని నూనె కుండలు అయినది. దానికి నీవు  పార్వతిదేవియ, సరస్వతిదేవియ, లక్షిదేవియా తెలియకమ్మ ఒక నూనె కుండ చాలు మిగిలినవి నీవే ఎత్తుకొని పోమ్మని అన్నాడు. దానికి నేను నీ వంటి నరమనిషినే చెప్పవలసిన కర్తవ్యంగా చెప్పినాను,.

           అది లక్ష్మి కటాక్షం నీవే ఎత్తుకొమని ముందుకు పోవుచుండగా ఒక కూమారుడు చపల చిత్తముతో కూర్చోన్నాడు దానికి ఆమె అయ్య నేను ఒక కథ చెప్పుతున్నాను అని చెప్పినది. ఆరు నేలలు కాసులు కాయక ఇంటి ముందు అందరు ఉపవాసంతో ఉన్నారు కుండలన్నియు అలాగే ఉన్నాయి ఇక నీ కథ ఎలా వినను అని చెప్పినాడు. దానికి ఆమె వినినా సరే వినకపోయిన సరే నేను చెప్పుతాను నా కర్తవ్యం అని చెప్పినది. సగం చెప్పినతలోనే ఇంటి నిండా బంగారం, వెండి, ఇత్తడి, దాన్యములు సరుకులు నిండినది దానికి ఆయన నీవు పార్వతి దేవియు , సర్స్వతి దేవియ దానికి ఆమె అన్నియు నేను కాదు నీ వట్టి నరమనిషినే అని చెప్పెను. ఆది లక్ష్మి కటాక్షం నీవె ఎత్తుకొమ్మని చెప్పి ముందుకు వెల్లినది. అచ్చట ఒక ఆమె ఏడుస్తు ఉన్నది. నేను ఒక కథ చెపుతున్నాను అని చెప్పినది దానికి ఆమె తెల్లవారి నుండి ఐదు గంటలకు ఆవు పాలు పిండి పాలతో పాయసము చేసి బిడ్డలకు ఇచ్చెదాన్ని దినము అలాగే చెసినాను దానిలో విషం ఉంది బిడ్డల్ందరు చనిపోయినారు. నాకు బిడ్డలు లేక పోయినది సహ చపలముగా లేదు భగవంతుడు ఎంత చపలపడుతున్నాడు నా కథ పెద్దగా ఉన్నది. ఇంక నీ కథ ఎలా వినను అని చెప్పినది దానికి ఆమె నెరుగా లోపలికి పోయినది పోయి దేవి ముందర జ్యోతిని వెలిగించి కథ చెప్పినది. ఒక కర్ర ఎత్తుకొని ప్రత్యక్షమైనది. బిడ్డల్కు నీళ్ళు పోసి కర్రతో ఒక తట్టి తట్టినది చెక్కకోరు అమ్మ అమ్మ అని నిద్రలో లేచినారు. అప్పుడు ఆమె నీవు పార్వతి దేవియ, లక్ష్మిదేవియ, సరస్వతిదేవియ చెప్పమ్మ నా బిడ్డలను బ్రతికించినావు అని అడిగినది. దానికి దేవి నీ భక్తికి మెచ్చి వచ్చినది. నేను నీ వంటి నరమనిసినే అని చెప్పి ఇంటికి పోవుతుండగా వారి ఇల్లంతా బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, దాన్యములు అన్నియు కలిగినది. తన భర్త బిడ్డలు తాళమేళాలతో వచ్చి ఆమెను తోడుకొని పోయినారు. కథను చెప్పవలెనని వినవలనని ఆశతో వినవలయును. అటు వంటి వినిన వారికి లక్ష్మి కటాక్షము తప్పక కుగును ఆవునా లేడా అని చేయక శ్రద్దతో చేసిన ఎడలా తలి లక్ష్మి కటాక్షము తప్పక కలుగును.

మధుర మీనాక్షమ్మ నమస్కారములు

కుచులంబ నమస్కారములు

కాశీ విశాలాక్షి నమస్కారములు

కంచి కామాక్షి నమస్కారములు        
ఓం శాంతి శాంతి శాంతిః

అది లక్ష్మి - చిత్రానము

దాన్య లక్ష్మి - క్షీరాన్నము, పాలు, చక్కర

దైర్య లక్ష్మి - శెనగలు, గుగ్గిలు

గజ లక్ష్మి - పొంగలి

సంతాన లక్ష్మి - స్వీటు

విజయ లక్ష్మి - పెసరగుగ్గిలు

విద్యా లక్ష్మి - పెరుగు, అన్నము

దన లక్ష్మి - మిరియల అన్నము

మణిద్వీపేశ్వరి అష్టోత్తరశతనామావళిః

Post a Comment

0 Comments