Melukolupu Pata - మేలుకొలుపు పాట

 Melukolupu Pata - మేలుకొలుపు పాట

Melukolupu Pata - మేలుకొలుపు పాట

Melukolupu Pata - మేలుకొలుపు పాట

కేశవ నామాల మేలుకొలుపులు

1. కేశవ యని నిన్ను వాసిగ భక్తులు

    వర్ణించు చున్నారు మేలుకో,

    వాసవ వందిత వసుదేవ నందన

    వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా మేలుకో ||

2. నారాయణా నిన్ను - నమ్మిన భక్తుల

    కరుణ బ్రోతువు వేగ మేలుకో,

    శరణన్న రక్షణ బిరుదు నీకున్నది

    శశిధర సన్నుతా మేలుకో || కృష్ణా మేలుకో ||

3. మాధవ యని నిన్ను యాదవులందరు

    మమత గొల్తురు దేవ మేలుకో,

    చల్లని చూపుల మెల్లగా బరపెడు

     నల్లని నాస్వామి మేలుకో || కృష్ణా మేలుకో ||

4. గోవింద యని నిన్ను గోపికలందరు

    గోపాలయని పిల్తురు మేలుకో

    వెన్నముద్దలు చల్ది వేడుకగా తిన్నాల

    వేణుగోపాలుడవు మేలుకో || కృష్ణా మేలుకో ||

5. విష్ణు రూపముదాల్చి విభవము నగుపించు

    విష్ణు స్వరూపుడ మేలుకో,

    దుష్టసంహారక దురితము లెడబాపు

     సృష్టి సంరక్షక మేలుకో || కృష్ణా మేలుకో ||

6. మధుసూదన నీవు మగువ తోడుత గూడి

    మరచి నిద్రించేవు మేలుకో,

    ఉదయార్క బింబము ఉదయించు వేళాయె

    వనరుహ లోచన మేలుకో || కృష్ణా మేలుకో ||

7. త్రివిక్రమా యని శక్రాదులందరు

    విక్రమ మందురు మేలుకో,

    శుక్రాది గ్రహములు సుందరరూపము

 

    చూడగోరుచున్నారు మేలుకో || కృష్ణా మేలుకో ||

8. వామన రూపమున భూదాన మడిగిన

    పుండరీకాక్షుడా మేలుకో,

     బలిని నీ పాదమున బంధన జేసిన

     కశ్యప నందనా మేలుకో || కృష్ణా మేలుకో ||

9. శ్రీధర గోవింద, రాధా మనోహర

    యాదవ కులతిలక మేలుకో,

    రాధావధూమణి రాజిల్క నంపింది

    పొడచూతువుగాని మేలుకో || కృష్ణా మేలుకో ||

10. హృషీకేశ యీ భువియందు ఋషులందరు

      వచ్చి కూర్చొన్నారు మేలుకో,

      వచ్చినవారికి వరములు కావలె

      వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా మేలుకో ||

11. పద్మనాభ నీదు పత్ని - భాగాదులు

      వచ్చి కూర్చున్నారు మేలుకో,

      పరమ తారకమైన పావన నామము

      పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||

12. దామోదరా యని దేవతలందరు

       దర్శించ వచ్చిరి మేలుకో,

       భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావె

       భూకాంత రమణుడా మేలుకో || కృష్ణా మేలుకో ||

13. సంకర్షణ నీవు శత్రుసంహార మొనర్ప

      సమయమై యున్నది మేలుకో,

      పంకజాక్షులు నీదు పావన నామము

      పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||

14. వాసుదేవా నీకు భూసుర పత్నులు

      భుజియింప దెచ్చిరి మేలుకో,

      భూసురంబుగ యాగసంరక్షణ కొరకు

      వర్ణింపు చున్నారు మేలుకో || కృష్ణా మేలుకో ||

15. ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ

      దుర్జన సంహార మేలుకో,

      అబ్జవంశమునందు ఉద్భవించియు కుబ్జ

      నాదరించిన దేవ మేలుకో || కృష్ణా మేలుకో ||

16. అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులు

       అనుసరింప వచ్చె మేలుకో,

       అండజవాహన అబ్ధిగర్వాంతక

       దర్భశయన వేగ మేలుకో || కృష్ణా మేలుకో ||

17. పురుషోత్తమా యని పుణ్యాంగనలందరు

       పూజలు జేతురు మేలుకో,

       పురుహూతవందిత పురహర మిత్రుడ

       పూతన సంహార మేలుకో || కృష్ణా మేలుకో ||

18. అధోక్షజ మిమ్ము స్మరణ జేసినవారి

      దురితము నెడబాప మేలుకో,

      వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి

      వందన మొసగెద మేలుకో || కృష్ణా మేలుకో ||

19. నారసింహ నిన్ను నమ్మిన భక్తుల

      కరుణబ్రోతువు వేగ మేలుకో,

      శరణన్న రక్షణ బిరుదు గల్గిన తండ్రి

      శశిధరసన్నుతా మేలుకో || కృష్ణా మేలుకో ||

20. అచ్యుతా యని నిన్ను సత్యముగ వ్రతవిధులు

       కొనియాడవచ్చిరి మేలుకో,

       పచ్చని చేలమూ అచ్చంగ దాల్చిన

       లక్ష్మీమనోహర మేలుకో || కృష్ణా మేలుకో ||

21. 'జనార్దనా నీవు శత్రుసంహార మొనర్చ

       సమయమైయున్నది మేలుకో,

       పంకజాక్షులు నీదు పావననామము

      పాడుచువచ్చిరి మేలుకో || కృష్ణా మేలుకో ||

22. ఉపేంద్రా యని నిను నువిదలందరు గూడి

      యమునతీర మందున్నారు మేలుకో,

      గోపీకాంతలు నీదురాక గోరుచున్నారు

      మురళీనాదవినోద మేలుకో || కృష్ణా మేలుకో ||

23. హరి యని నిన్ను కొనియాడ గోపికా

     జనులంత వచ్చిరి మేలుకో,

     అష్టభార్యలు నీదు రాకగోరుచున్నారు

     వనమాలికాధర మేలుకో || కృష్ణా మేలుకో ||

24. శ్రీకృష్ణా యని నిన్ను గోపాల బాలురు

      బంతులాడ వచ్చిరి మేలుకో,

      కాళీయ మర్దన కౌస్తుభ మణిహార

      కంససంహరణా మేలుకో || కృష్ణా మేలుకో ||

25. శ్రీరామ యని మునులు స్థిరభక్తితో మిమ్ము

       సేవించుచున్నారు మేలుకో,

       తాటకాసంహార ఖరదూషణాంతక

       కాకుత్థ్సకులరామా మేలుకో || కృష్ణా మేలుకో ||

26. తెల్లవారవచ్చె దిక్కులు తెలుపొందె

      నల్లని నాస్వామి మేలుకో,

      వేళాయె గోవులమందకు పోవలె

      గోపాల బాలుడా మేలుకో || కృష్ణా మేలుకో ||

 Facebook

గోదాదేవి సంకీర్తన


 



Post a Comment

0 Comments