Sri Krishna Chalisa - శ్రీ కృష్ణ చాలీసా

 Sri Krishna Chalisa - శ్రీ కృష్ణ చాలీసా

Sri Krishna Chalisa - శ్రీ కృష్ణ చాలీసా
Sri Krishna Chalisa -  శ్రీ కృష్ణ చాలీసా

గోకుల క్రిష్ణా జనార్ధనా గోపకిషోరా నారాయణా

గోకులనందా ఘనావనా గోవిందాశ్రిత కృపావనా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

ధరలో ధర్మము దుర్భలమై అధర్మాచరణ ప్రతిహరిగా

యుగయుగముల నీ అవతారం ధర్మరక్షణకు ప్రతినిధిగా

సాధుసంతులను రక్షించి దుష్కర్ములను శిక్షించి

ఇలలో ధర్మము స్థాపించి మెక్షమార్గమును భోదించే

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

భక్తి జ్ఞాన వైరాగ్యములు యెగశాస్త్రమును ఇమిడించి

జీవనపథమును ప్రవచించి మానవాళికి వివరించి

సుఖదుఃఖాలు క్షణికమని జనామరణములు సత్యమని

ఆత్మ ఒక్కటే నిత్యమని గీతభోద గావించావు

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

వినీనిర్మల ఆకాశం సుందర యమునా సమీరము

ఆధ్యాత్మిక బ్రహ్మానందం వేణువుపై సమ్మెహనము

బంధవిముక్త మహామంత్రం నగుమెము జనిత ప్రవచనము

మైమరచిన గోపనివహం గోపికలకు ఆత్మానందం

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

కృష్ణాష్టమి శుభ తిధినందు అష్టమగర్భము సంతానం

కారాగృహమే ఆశ్రయమై దేవకిమాతకు సంతసము

కంసుని దైత్యమునకు వెరసి యమున దారితము అబ్బురము

వసుదేవుని సిరముపస్థితమై నందగోకులము సంగతము

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

అభయ చరణ అభయంకార అభయాశ్రయ అజ అధోక్షజ

అచలధారక అధికర్త ఆదిదేవ అద్భుతరూప

అమృత రూప అమరేంద్ర అమలస్వభావ అకౄర

అక్షయరూప అఖిలాత్మ ఆనందసాగర అఖిలేశ

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

బలరాముని ప్రియ అనుజున్ముడుగ యశోదమాతకు ప్రాణపదంగా

నెమలిపించమె శిఖినలరించగ బాలకృష్ణుడై మురిపెములలరగ

దామెదర ద్వారకనాధ దేవకినందన దయానిధి

దీనబంధు ధర్మాద్యక్ష దేవదేవ ఓ ధరణీధర

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గజేంద్రవరద నారాయణ గరుడవాహన మనోన్మన

గోవర్థనగిరి ఉన్నమన గోపాల ప్రియ నారాయణ

గోపినాధ వరానన గోపికలవస్త్ర అపహరణ

గోపకాంతః మనోహరణ గరుఢధ్వజ ఓ ఘనాఘన

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

హరిహర వినుత హయాననా హరిగోవింద హరేశ్వర

హరగోపాలా హరినయన హిరణ్యనాభ హేమాంగా

జగద్బంధు హరి జగధీశ జగన్నాధ హరి జనార్ధన

జగత్కారణ జయేశ్వర జ్యోతిరాదిత్య జగద్గురు

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

కాలియమర్ధన కంసాంతక కమలనయన హరి కరుణార్ణవ

కరుణాలోల కృపామయ కోటిసూర్య సమ ప్రభాసిత

కృష్ణచంద్ర హరి కృపామయ కైతభమర్ధన కృపాళువు

కపిల కేశవ కిషోరచంద్ర కృష్ణమురారి కృపానిధి

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

లీలామానుష ప్రతిరూప లక్ష్మీకాంతలీలామయ

లోకాద్యక్ష లక్ష్మీపతి లోకపాలక లోకేశ

నందగోపాల నందలాల నవనితచోర నీలేశ

నిర్గుణరూప నరోత్తమ నరకాంతక హరి నారాయణ

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

మదన మనోహర ఆకార మేఘశ్యామ మణికంఠ

మత్స్యరూపధర ముకుంద మాధవ మురళి మనోహర మురారి శౌరి

ముష్టికాసుర చానూర దైత్యచేదక జనారధన

పవిత్రరూపా పరమాత్మ మముక్షువులకే ముక్తిప్రదాత

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

నిత్యానంద నిర్గుణరూప నాగశయన హరి నందలాల

పాంచజన్యధర పద్మహస్త హరి పన్నగ శయన పరాత్పర

పరమపురుష పరమాత్మ పరాత్పర పార్థసారధి ప్రజాపతి

పతితపావన ప్రద్యుమ్న పీతాంబరధర పరమేశ

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

రాధావల్లభ రాధేశ రామకృష్ణ హరి సాకేట

రుక్మిణేశ రవిలోచన కృష్ణ పుండరీకాక్ష ప్రజాపతి

సహస్రాక్ష సహస్రపాద సహస్రాజిత సాక్షీభూత

సర్వపాలక సర్వేశ సాగరమదనా సర్వాతీత

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

సంసార బంధ సాగరతరణ సాధుసంతు జన అమందకరుణ

సత్యభామ ప్రియ సర్వజ్ఞ సర్వభూతాత్మ పావన చరణ

శ్రీగోపాల శ్రీకాంత శ్రీచక్రధారి సిద్ధాంత

శ్రీనివాస ఓ శ్రీకృష్ణ శ్రీధర శ్రీకర శ్రీనాధ

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

సారంగపాణి శాంతాత్మ శిశుపాల శిరచ్చేద దండన

శటకాసుర భంజన తేజము పూతన స్తన్యము చిద్రఖండన

రాధామాధవ విరహ వేదనం రుక్మిణి సత్యల ప్రణయ నందన

పరమాత్మాత్మల మధుర సంగమం ప్రణయజగతికపురూప చందనం

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

శ్రీవత్కౌస్తుభ ధారణ అనుజాత సుభద్ర సహోదర

వైకుంఠనాధ త్రివిక్రమ వనమాలి వనవిహారి కృష్ణ

వేణుమాధవ వేదాత్మ వృషభాసుర విధ్వంసక

విశ్వాంబరధర వేదాత్మ విశ్వరూపధర విశ్వత్మ

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

పాంచజన్యమను శంఖమును కరవాలమును

సుదర్శనము అను చక్రమును సారంగమను ధనస్సును

కౌమెదకి అను గధాదండము శమంతకమణి వనమాల

పిల్లనగ్రోవి నెమలిపించము ఆభరణములై అమరెనుగ

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గుణనిధి గుణమయ జ్ఞానేశ జగత్కారణ జగధీశ

కాంచనలోచన కరుణార్ణవ క్రోధరూప ఓ కృపామయ

రాధాకాంతా రాధేశ రాజీవలోచన రవినయన

సనాతన ఓ సంకర్షణ సత్యసంకల్ప సాకేత

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

యాదవేంద్ర హరి యదునాధ సురానంద గోవింద ముకుంద

పాండవోద్ధార కురునాశ పురుషోత్తమ ఓ పరమేశ

స్మరణ మాత్రమున శుభకరణం శరణాగతులకు భవహరణం

శ్రీకరము నీ నామస్మరణం మంగళ ప్రదము నీచరణం

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

గోవిందా హరి గోవిందా మెహన రూపా గోవిందా

గోవిందా హరి గోవిందా నందకిషోరా గోవిందా

Facebook

కృష్ణం వందే జగద్గురుం పాట


Post a Comment

0 Comments