Lingashtakam in Telugu - లింగాష్టకం

 Lingashtakam in Telugu - లింగాష్టకం

Lingashtakam in Telugu - లింగాష్టకం
Lingashtakam in Telugu - లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మల భాసిత శోభిత లింగమ్

జన్మజ దుఃఖ వినాశక లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ 1

అర్థం :- లింగమును బ్రహ్మ, విష్ణు మెదలగు సురులు అర్చించుదురో, లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, లింగము జన్మమునకు ముడుపడుయున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను

దేవముని ప్రవరార్చిత లింగం

కామదహన కరుణాకర లింగమ్

రావణ దర్ప వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ 2

అర్థం :- లింగమును దేవతల యెక్క ఋషులయెక్క తరతరాలు అర్చించుచున్నాయో, లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను

సర్వ సుగంధ సులేపిత లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగమ్

సిద్ధ సురాసుర వందిత లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ 3

అర్థం :- లింగము అన్ని రకముల సుగంధములచే అద్దబడియున్నదో, లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, లింగము సిద్దులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను

కనక మహామణి భూషిత లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్

దక్షసుయజ్ఞ వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ 4

అర్థం:- లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, లింగము సర్పరాజముచే చుటుకొనబడి అలంకరింపబడి యున్నదో లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను

కుంకుమ చందన లేపిత లింగం

పంకజ హార సుశోభిత లింగమ్

సంచిత పాప వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ 5

అర్థం:- లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, లింగము సంపాదించబడిన పాపరాసిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను

 

దేవగణార్చిత సేవిత లింగం

భావైర్భక్తిభిరేవ లింగమ్

దినకర కోటి ప్రభాకర లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ 6

అర్థం:- లింగము దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో,   అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను

 

అష్టదళోపరివేష్టిత లింగం

సర్వసముద్భవ కారణ లింగమ్

అష్టదరిద్ర వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ 7

అర్థం:- లింగము ఎనిమిది (బిల్వ) దళములను చుట్టూ కలిగియున్నదో, లింగము  సమస్త సృష్టికి కారణమై యున్నదో, లింగము  ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను

 

సురగురు సురవర పూజిత లింగం

సురవన పుష్ప సదార్చిత లింగమ్

పరమపదం పరమాత్మక లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్ 8

అర్థం:- లింగము సురుల యెక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

ఫలం: లింగాష్టకం ఒకఅష్టకం” (ఎనిమిది చరణాలు కూడిన ఒక స్తోత్రం). లింగాష్టకంలింగరూపంలో శివుని ఆరాధనకు అంకితం చేయబడింది.

 శివుని సమక్షంలో దీనిని నిత్యమూ పఠించేవాళ్లు శివలోకాన్ని పొందుతారు

Post a Comment

0 Comments