Sri Venkateshwara Swamy Chalisa -శ్రీ వెంకటేశ్వర స్వామి చాలీసా

 Sri Venkateshwara Swamy Chalisa -శ్రీ వెంకటేశ్వర స్వామి చాలీసా

Sri Venkateshwara Swamy Chalisa -శ్రీ వెంకటేశ్వర స్వామి చాలీసా
Sri Venkateshwara Swamy Chalisa -శ్రీ వెంకటేశ్వర స్వామి చాలీసా


 శ్రీ వెంకటేశ గోవిందా

శ్రీశ్రీనివాస గోవిందా

సప్తగిరీవాస గోవిందా

శ్రితజన పాలా గోవిందా                || 1 ||

విందాం విందాం గోవిందుని

శ్రీగిరి నిలయుని శుభ చరితని

అందాం అందాం గోవిందుని

ఆనంద నిలయిని శరణమ్మని      || 2 ||

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

ఆ భృగు పాదం తాకిందని

అలుకతో లక్ష్మీ వెడలిందని

పాలకడలినే విడిచావట

పుడమని చేరి వెతికావట            || 3 ||

పుట్టెడు దిగులతో తిరిగేవట

పుట్టను చేరి పవళించావట

విషయము తెలియక విపంచికి

ఈశునికీ కథ వివరించె                || 4 ||

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

నీ ఆకలి దప్పిక తీర్చగను

గోవత్సముల రూపముతో

మహరాజు చెంతకు చేరేను

గోమందతో కూడి సాగేను             || 5 ||

మందతో మేతకు చరియిస్తూ

ఆ పుట్ట చెంతకు చేరేను

పొట్ట నింపగా తలచేను

పుట్టలో పాలు విడిచేను               || 6 ||         

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

పశువుల కాపరికది తెలసి

కొట్ట బోవగా చేయత్తె

అంతట నీవుగ ఎదురొచ్చి

గోవుకు రక్షగ నిలిచేవు                || 7 ||

గోపబాలుని కరుణించి

తొలి దర్శన భాగ్యము కలిగించి

ఘనమగు వరమును ఒసగేవు

తరతరాలకూ సాగించేవు             || 8 ||         

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

పుట్టను వీడి వెడలేవు

పద్మావతిని వలచేవు

వకుల మాతకు చేరేవు

వరము తీర్చగా మసలేవు           || 9 ||

అచ్చట ముచ్చటలాడేవు

అమ్మవు నీవని పలికేవు

పెండ్లి మాటను తెలిపేవు

పెళ్ళి మాటలకు పంపేవు             || 10 ||           

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

మాటతో మనువు కుదిరింది

యశోద వరము పండింది

ఆనందం ఎద విరిసింది

ముక్తి ఫలముతో ముగిసింది         || 11 ||

కళ్యాణానికి ఆరంభం

కుభేరునితో ఒప్పందం

వడ్డి కాసులకు ఒడంబడి

కాసులు కూడగట్టేవు                  || 12 ||           

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

రావి చెట్టు మరి సాక్షంగా

రాసిన పత్రం ఇచ్చేవు

యుగ ధర్మం నెరిగించావు

వడ్డి భారం మెసావు                    || 13 ||

కళ్యాణం మరి విరిసింది

కమనీయంగా ముగిసింది

సురముని జనులకు సంతోషం

భువిజనులకు ఇది శుభయెగం     || 14 || 

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

వివాహంలో నీ విందు

విశ్వానికే ఇది పసందు

హరిగిరి శ్రీగిరి ఒక్కటాయెను

అనంతునికే ఇది చిత్రమాయెను   || 15 ||

నిను చేరగ వచ్చిన శ్రీలక్ష్మీ

నిలదీసి అడిగెను నిను చూసి

నిప్పుల చూపును చూచినది

నిందా వాక్యము పలికినది           || 16  ||     

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

తగవు తీరని తరుణంలో

శిలా రూపమును దాల్చితివి

సజీవ శిల్పమై నిలచితివి

ఏక శిలగా వెలిగితివి                    || 17 ||

తొండమానునికి తోడుగను

ఆళ్వారునకు అండగను

నిలిచితివీవు నిక్కముగా

చేసిన పూజలు పుణ్యముగా         || 18 ||       

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

బావాజీతో సహవాసం

ఆట మాటల సహచర్యం

నమ్మకానికే నిదర్శనం

నమ్మిన వారికి నిజ దర్శనం        || 19 ||

చెఱసాలలో చిత్రంగా

చొరబడ్డావు హథీగా

తెరిపించావి కన్నులను

విడిపించావు బంధములు            || 20 ||          

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

వెంగమాంబ వ్యవహారం

తరిగొండ వీడటే పరిహారం

ప్రతినిత్య నీ ఉపచారం

నీ సన్నది సేవే సంసారం              || 21 ||

పాచికలాడగ నీ సాటి

కొంగు వీడుట ఏపాటి

భక్తులతో ఇది పరిపాటి

భక్త రక్షణలో ఘనాపాఠి               || 22 ||            

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

వాడిన పూలకు మురిసి

మట్టి పూలలో మెరిసి

కలిమి ఎంతో కలిగున్నా

మట్టి పాత్రలో నైవేద్యం                 || 23 ||

పంచ భక్షాలు పెడుతున్నా

పెరుగన్నమే పరమాన్నం

అదే ప్రియమగు వైవేద్యం

నిత్యం దానికి నువు సిద్దం           || 24 ||         

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

భార్గవి హృదిలో వసియిస్తూ

బ్రహ్మముగా మరి భాసిస్తూ

నిలువు కొలువులో నిలిచేవు

నిత్య పూజలు బడసేవు               || 25 ||

పుడమిని పుట్టిన నదులన్నీ

పదమునంటగా నిను జేరి

పుష్కరణిగ రూపం దాల్చేను

పుష్కలంబుగా మురిసేను           || 26 ||         

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

శిరో భారమును తగ్గించ

శిరో ముండనము కోరేవు

పాప భారమును తొలిగించ

ప్రక్షాళన గావించావు                   || 27 ||

సేవలు పొందెడి నెపముంచి

నీ సేవా భాగ్యము నొసగేవు

ఒక కళ్యాణమును కల్పించి

లోక కళ్యాణానికి నిలిచేవు             || 28 ||       

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

నిత్య కళ్యాణాల నిలిచేవు

నీరాజనాల మెరిసేవు

నీ వాకిట నిలిచిన క్షణమైనా

మా తలపును తాకు నీ వీక్షణం    || 29 ||

ఏడు కొండల ఏలికా

ఏడేడు లోకాల పాలకా

గోవింద నామాన తెలిసేవు

గోవింద నామాన మురిసేవు         || 30 ||        

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

గోవింద నామాన మెరుపున్నది

పంచ భూతల ప్రభ అయినది

ఇహ పరముల మెరుగైనది

అద్యంతముల కది రక్ష అయినది  || 31 ||

పంచాయుధ పరాయణా

పుడమిని చేరిన నారాయణా

నరుడై వచ్చెను నంధకము

పద కవితల తానే ఘనము          || 32 ||     

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

రోజు రోజుకో ఉత్సవం

రోజులన్నిటా మహోత్సవం

వారోత్సవం మాసోత్సవం

ఏటేటా నీకు బ్రహ్మోత్సవం            || 33 ||

మాఢ వీధుల చేరి తిరిగేవు

మలయప్ప స్వామిగ తెలిసేవు

గరుడ వాహనమెంతో ఘనమైనది

కల్పవృక్షము కూడ కదిలొచ్చెను  || 34 ||  

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

నిధులన్ని నీ చెంత నిక్షేపము

నిత్య కళ్యాణాలు నీ పక్షము

కళశాభిషేకాలు కమనీయము

వారాభిషేకాలు విడ్డూరము           || 35 ||

వైకుంఠ ద్వారాలు ఇలకొచ్చెను

సప్తగిరులై ఇచ్చోట శోభించెను

కామిత ఫలములు కురిపించుచూ

కలియుగ వైకుంఠమై ఒప్పేను     || 36 ||    

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

శ్రీగిరి శిఖరాన శ్రీ నిలయము

ఆనందమూర్తికి ఆవాసము

అచ్చోట అగుపించు దృవభేరము

ఆనందమెలకించు శుభ రూపము || 37 ||

వాదాలు వేవేలు వినిపించినా

వేదాల పరమైన నువె సత్యము

ఈశ్వర తేజాన నువు నిత్యము

ఈ సర్వలోకాలు నీ సొంతము      || 38 ||     

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

ఇలలోన మాకొరకు వెలసేవు

కలి భారం నీ మెపున మెసేవు

కలి వేంకట నాయక శరణం         

సర్వ లోక పాలక శరణం              || 39 ||

అశ్రిత జనరక్షక శరణం

బ్రహ్మాండ నాయక శరణం

భాగవతోత్తమా శరణం

భవ బంధ నాశక శరణం              || 40 ||            

జయజయజయ గోవిందా

జయముజయము శ్రీగోవిందా       || 2 ||

వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి 102 శరణలు

Post a Comment

0 Comments