Sundarakanda 7 - సుందరకాండ 7
Sundarakanda 7 - సుందరకాండ 7 |
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కైలాసగిరిని పెకలించునాడు నను శపించెను నందీశ్వరుడు
కపిరూపమున వాడే వీడుగ వచ్చియుండెనో నను వంచింపగ
బాణాసురుడే ఈ వానరుడుగ వేచియుండెనో నను సాధింపగ
అని లంకేశుడు మంత్రి ప్రహస్తుని ఆదేశించెను మర్మమరయమని || 301 ||
ఓ వానరుడా భయము వీడుము నీకు శుభమగు నిజమును దెల్పుము
యమ కుబేర ఇంద్రాదు లెవరేని నిను దూతగ ఇట్లు పంపినారేమి?
విష్ణుదేవుడే మాపై పగగొని నిను బంటుగ ఇటు అంపినాడేమి?
నిజము బల్కుచో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను || 302 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మహాకాంతితో వెలుగొందు నీవు మామూలు కోతివి కానేకావు
కోతి రూపమున కనిపించు నీవు ఎవడవో కాని కామరూపుడవు
లంకేశ్వరుని మందిరమందు ఎందులకై ప్రవేశించినావు?
నిజము బల్కుచో బ్రతుకిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను || 303 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
యమ కుబేర ఇంద్రాదు లెవ్వరికి దూతను గాను దాసుడ గాను
సహజమైన వానరుడను నేను ఆలకింపుము నిజము బల్కెదను
రాముని దూతగ ఇటు వచ్చినాను రావణు జూడగ ఇటు జేసినాను
అని మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 304 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అశోక వనము ధ్వంసము చేసితి రాక్షసవీరుల సంహరించితి
నాతో సమరము చేయవచ్చిన అసుర వీరులను వరుసగ గూల్చితి
ఈ వంకనైన లంకేశునితో సంవాదము లభించ నెంచితి
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 305 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
దశరథ రాజ కుమారుడు రాముడు తండ్రిమాట జవ దాటనివాడు
అనుకూలవతి సతీ సీతతో ప్రియ సోదరుడు సౌమిత్రితో ప్రియసోదరుడు సౌమిత్రితో
తంద్రిమాట నిలుప రాజ్యము వీడె పదునాల్గేండ్లు వనవాస మేగె
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 306 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సీతాపహరణము జరిగె వనమున రామలక్ష్మణులు లేని సమయమున
రామలక్ష్మణులు సీతను వెదకుచు ఋష్యమూకమున మమ్ము కలసిరి
రామ సుగ్రీవులు సన్నిహితులైరి మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 307 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగ జేసెను
సీత జాడగన కపివీరులను నలుదిశలకు సుగ్రీవు డంపెను
శత యెజనముల వారిధి దాటి ఒంటిగ నేను లంక జేరితి
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 308 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అడుగడుగున ఈ లంక వెదకితి నీ భవనముల పరిశీలించితి
నీ సంగతి నీవారల సంగతి సంపూర్ణముగా నే గ్రహియించితి
సీతను చివరకు కాంచగలిగితి రాముని దూతగ కీర్తిబొందితి
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 309 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నిన్ను మించిన వానర వీరులు వెదకుచున్నారు ముల్లోకములు
గరుడుని మించిన కడు బలవంతులు వవనుని మించిన వేగవంతులు
నా కబురందిన మరు నిముసమున రాగలరిటకు రణోత్సాహమున
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 310 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అసురేంద్రా! విశ్వసింపుము నీ క్షేమము నే తెల్చెద వినుము
బలవంతుడవు తపోవంతుడవు ముల్లోకముల మెప్పించినవాడవు
ధర్మార్థముల ఎరిగినవాడవు పరకాంతల ఆసించగా తగదు
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 311 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అతి బలశాలిని వాలిని గూల్చి సుగ్రీవుని కపి రాజుగ జేసిన
ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమను కీర్తి వహించిన
జానకీపతి పురుషోత్తముడు శ్రితజనపాలుడు ధర్మరక్షకుడు
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 312 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సీతామాతను అపహరించితివి లంకకు దెచ్చి బంధించితివి
జానకీమాత అవనీజాత పావన చరిత మహా పతివ్రత
ఆమెను వేల్చు వియెగజ్వాల నీ సర్వమును దహించగల కీల
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 313 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఇంద్రుడేని చతుర్ముఖుడెని ఎవ్వడేని మరి త్రినేత్రుడేని
తిరుగులేని శ్రీరామ బాణమును ఎదిరించి నిలిచి బ్రతుక
నేర్తురే
ఇంతటనైన సీతామాతను రామున కొసగి శరణు వేడుము
అని
మారుపల్కె మారుతి దిటవుగ లంకేశ్వరుని వినుమని సూటిగ || 314 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సూటి పోటిగ హితము దెల్పెడు చాటు మాటుగ భేదము గొల్పెడు
ఈ వానరుని పలుకులు ములుకులు వినజాలను కర్ణ కఠోరములు
మనయెడ ద్రోహము చేసిన పాపుడు వేగమె వీని వధించి వేయుడు
అని
రావణుడు గర్జన చేయగ మారుతి నిలచె కడు నిబ్బరముగ || 315 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అన్నా!రావణ! తెలిసినవాడవు శాంతముగా నా మనవిని వినుము
దూతను జంపుట ధర్మము గానిది లోకముచే గర్వింపబడునది
శూరుడవైన నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది
అని
విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను || 316 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
హితవు దెలిపిన సోదరుని గని రావణుండు రోషాన మండిపడి
దూతగ వచ్చిన ఈ వనచరుడు మనయెడ ద్రోహము చేసిన పాపుడు
పాపిని జంపుట పాపము గాదు ద్రోహిని వదలుట ధర్మము గాదు
అని
రావణుడు మహోగ్రుడై నిలిచె కపిని బట్టి వధింపగ బలికె || 317 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అన్నా! రావణా! కరుణ జూపుమా ప్రసన్నుడవై ఆలకింపుమా
అన్నా!రావణా!కరుణ జూపుమా ప్రసన్నుడవై ఆలకింపుమా
మంత్రి సుతులను సేనాపతులను అక్షకుమారుని ఈ కపి చంపెను
మనకీతడు శత్రువేను నిజముగ అయినను దూతగ వచ్చినాడుగ
అని
వీభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను || 318 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అనా! వీనిని వధియింపకుమా తగురీతిని దండించి పంపుమా
దూతయెడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి
తల గొరిగించుట చబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు జేయుట
అని
వీభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను || 319 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఈ వానరము పరబ్రహ్మమె దివ్యతేజమె సత్యరూపమె
యమ కుబేర ఇంద్రాది దేవతలు తపోబలమున పంపిన భూతమె
వైష్ణవ మాయ కపి రూపమున నను వంచించి వధింప వచ్చెనో
అని
దశకంఠుడు తర్కించుకొనెను పరిపరి విధముల తనలో తాను || 320 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అన్నా! రావణ! తెలిసినవాడవు శాంతముగా నా మనవిని వినుము
దూతను జంపుట ధర్మము గానిది లోకముచే గర్వింపబడునది
శూరుడవైన నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది
అని
విభీషుణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను || 321 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
హితవు దెలిపిన సోదరుని గని రావణుండు రోషాన మండిపడి
దూతగ వచ్చిన ఈ వనచరుడు మనయెడ ద్రోహము చేసిన పాపుడు
పాపిని జంపుట పాపము గాదు ద్రోహిని వదలుట ధర్మము గాదు
అని
రావణుడు మహోగ్రుడై నిలిచె కపిన్ బట్టి వధింపగ బలికె || 322 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అన్నా! రావణా! కరుణ జూపుమా ప్రసన్నుడవై ఆలకింపుమా
మంత్రి సుతులను సేనాపతులను అక్షకుమారుని ఈ కపి చంపెను
మనకీతడు శత్రువేను నిజముగ అయినను దూతగ వచ్చినాడుగ
అని
విభీషుణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను || 323 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అనా! వీనిని వధియింపకుమా తగురీతిని దండించి పంపుమా
దూతయెడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి
తల గొరుగించుట చబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు జేయుట
అని
విభీషుణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను || 324 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఈ వానరము పరబ్రహ్మమె దివ్యతేజమె సత్యరూపమె
యమ కుబేర ఇంద్రాది దేవతలు తపోబలమున పంపిన భూతమె
వైష్ణవ మాయ కపి రూపమున నను వంచించి వధింప వచ్చెనో
అని
దశకంఠుడు తర్కించుకొనెను పరిపరి విధముల తనలో తాను || 325 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కపులకు వాలము ప్రియ భూషణము కావున కాల్చుడు వీని వాలము
వాడవాడల ఊరేగింపుడు పరాభవించి వదిలివేయుడు
కాలిన తోకతో వీడేగు గాక అంపిన వారికి తల వొంపుకాగ
అని
రావణుడు విభీషుని గని ఆజ్ఞాపించెను కోపమణచుకొని
|| 326 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
జీర్ణాంబరములు అసురులు దెచ్చిరి వాయుకుమారుని తోకకు
జుట్టిరి
నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగ సంతసించిరి
కపి కుంజరుని ఈడ్చుకుబోయిరి నడివీధులలో ఊరేగించిరి
మారుతి
మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను
|| 327 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నడివీధుల నినాదము జేయుచు కూడలి స్థలముల ఆగుచు సాగుచు
రామదూత ఇతడీతడే యనుచు దూషణలాడుచు హేళన జేయుచు
రాజభటులు మహావీరులనగ వానరోత్తముని వీధుల ద్రిప్పగ
పిన్నలు
పెద్దలు అసురులు చేరి దారి పొడవున వేడుక గాంచిరి || 328 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కపిని బంధించి తోక గాల్చిరని నడివీధులలో త్రిప్పుచుండిరని
రాక్షస వనితలు వేడుక మీరగ పరుగున పోయి సీతకు దెల్పగ
అంతటి ఆపద తన మూలమున వాయు సుతునకు వాటిల్లెనని
సీతామాత
కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన జేసెను || 329 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగ దోచెను
అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతనో
రామదూతనై వచ్చుట చేతనో సీతామాత మహిమ చేతనో
మండే
జ్వాలలు పిల్లగాలులై వీవసాగనెనని మారుతి పొంగెను || 330 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఆనందముతో కాయము బెంచెను బంధములన్నీ తెగి పడిపోయెను
అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అట్టడగించెను
గిరి శిఖరమువలె ఎత్తుగనున్న నగర ద్వార గోపురమందున
స్తంభము పైకి మారుతి ఎగసెను
లంకాపురమును పరివీక్షించెను || 331 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఏ మంటల నా వాలము గాల్చిరో ఆ మంటల నే లంక గాల్తునని
భీమరూపుడై గర్జన జేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు
మేడ మిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి
||332 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మంత్రి ప్రహస్త మహాపార్మ్వుల విరూపాక్ష వజ్రదంష్ట్రుల
ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల
కుంభ నికుంభ కుంభకర్ణుల శుక సారణాది రాక్షస గృహముల
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి || 333 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అగ్ని వాయువు తోడై రాగ లంకాపురమున మంట లెగయగ
ఎల్లరాక్షసుల గృహములు కాలి నేల గూలెను బూడిదపాలై
లంకావాసులు భయపడిపోయిరి దీనారవముల పరుగిడసాగిరి
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి || 334 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పసి పాపలను కరముల నిడుకొని తల్లులు ఏడ్చుచు పరుగిడసాగిరి
మంటలు మండే మేడల నుండి క్రిండకు దుమికిరి యువతులు తెగబడి
అగ్నిహోత్రుడే ఈ వానరుడని అసురులందరు ఆక్రందించిరి
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి
|| 335 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సర్వమంగళ సంశోభితము మందరగిరివలె మహోన్నతము
పతాకాంకిత ధ్వజాకీర్ణము చతురంగబల పరివేష్టితము
లంకేశ్వరుని దివ్య భవనము క్షణములో నాయె జ్వాలామయము
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి
|| 336 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
విమానములు మంటలంటుకొని నేల గూలెను తునాతునకలై
మణిమయ స్వర్ణ సాధముల కాలి కరిగి పారెను బూడిదపాలై
సుందరమయిన లంకాపురము రూపు మాసెను మంటలపాలై
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి
|| 337 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగ ఎగసిన జ్వాలల బోలిన మంటల
రాక్షస మృత దేహాలు ఆజ్యముగ ధూమ రహితమై మండిన మంటల
ఫెళ ఫెళ ఫెళమను నిధ్వానమ్ముల లంకాపురము రగిలెను మంటల
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి
|| 338 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడ బూరుగు పుష్పచ్చాయల
ఒకచో మెదుగు విరుల తేజముల ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల
కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి
|| 339 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
భూమ్యాకాశములు ఏక జ్వాలగ లంకా దహనము పూర్తికాగ
ఇంతటి మారణహోమము జేసి రాముని దలచుచు మారుతి నిలువగ
దేవ గంధర్వ సిద్ధచారణులు పవన కుమారుని పొగడిరి ఘనముగ
చూచి
రమ్మనిన కాల్చివచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి || 340 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనె లాంగూల జ్వాల
తలచిన కార్యము నెరవేర్చితినని తేరిపార జూచె వెనుకకు తిరిగి
కునుపించెను ఘోరాతి ఘోరము జ్వాలా భీలము లంకాపురము
మారుతి
వగచె తా చేసిన పనిగని తన కోపమె తన శత్రువాయెనని
|| 341 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కోపిష్టులు తమ బుద్ధి నశించగ గురవులనైన హింసించెదరు
తగున తగదను విచార మెరుగక యెగ్యులనైన తూలనాడుదురు
పాప పుణ్యముల లెక్క చేయక ఎంతటి ఘోరములైన చేతురని
మారుతి
వగచె తా చేసిన పనిగని తన కోపమె తన శత్రువాయెనని || 342 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పాము కుబుసమును దిగవిడిచి నటుల నరుడు కోపమును వదులుకోవలె
జలముచేత అగ్ని నార్పినటుల బుద్ధి చేత కోపాగ్ని నణచవలె
కోపములేని ప్రశాంత చిత్తులు ఉత్తమ పురుషులు ధన్యజీవులని
మారుతి
వగచె తా చేసిన పనిగని తన కోపమె తన శత్రువాయెనని || 343 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సీతామాత క్షేమము మరచితి కోప తాపమున లంక దహించితి
లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలి యుండునా
సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను జంపిన మహాపాపి నని
మారుతి
వగచె తా చేసిన పనిగని తన కోపమె తన శత్రువాయెనని || 344 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సీత లేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు
భరత శతృఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు
ఈఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్య మని
మారుతి
వగచె తా చేసిన పనిగని తన కోపమె తన శత్రువాయెనని || 345 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
శ్రీరఘురాముని ప్రియసతి సీత అగ్నివంటి మహాపతివ్రత
అగ్నిని అగ్ని దహింప నేర్చునా? అయెనిజను అగ్ని దహించునా?
నను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగ చూడకుండునా?
అని
హనుమంతుడు తలచుచుండగ శుభ శకునములు తోచె ప్రీతిగ || 346 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఎల్ల రాక్షసుల సిరిసంపదలు మంటలపాలై దహన మాయెనని
అశోక వనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని
లంకాపురము రూపు మాసినను విభీషణు గృహము నిలచి యుండెనని
అంబర
వీధిని సిద్ధ చారణులు పలుకగా విని మారుతి పొంగె || 347 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అశోక వనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను
తల్లీ! నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను
పోయివత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను
సీతామాత
హనుమంతునితో ప్రీతిగ పలికెను ఆనందముతో || 348 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
హనుమా! అతులిత బలధామా శత్రు కర్శనా శాంతి నిదానా
ఇందుంది నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థిడ వీవే
రాముని వేగమె తోడ్కొని రమ్ము రాక్షస చర నాకు తొలగింపుము
అని
పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో
|| 349 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పోని హనుమా నేటికి నిలుమా బడలిక తీరగ రేపు పొమ్మా
నీ విందుండిన స్వల్ప కాలము నాలో తరిగెను శోకభారము
నిన్నంపుట నాకు మరో దుఃఖము ఎటు భరింతునో ఈ పరితాపము
అని
పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో || 350 ||
0 Comments