శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత గీతము
Sri Vasavi Kanyaka Parameswari
Sri Vasavi Kanyaka Parameswari song - శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత గీతము |
1. కొందరు వరములు పూర్తి చేయుటకు అవతరించెదరు భువిలో
అందున కొందరు వ్రేళ్ళ లెక్కలో వెలిసియుందురు భువిలో
2. అదే ఛాయలో అవతరించెను వాసవి కన్యక భువిలో
దర్మ రక్షణకు అహుతియయ్యి, దైవమయ్యెను భువిలో
3. తెలుగు దేశమున పేరు గాంచినది పెనుగొండ ఒక గ్రామం
ఆ గ్రామానికి అధిపతి ఉండెను కుసుమ శ్రేష్టియను నామం
4. ఆర్య వైశ్యుడు వ్యాపారములో సంపాదించెను ధనము
పిల్లలు లేని కొరతను తలచి దిగులు చెందెను దినము
5. కులదేవి శ్రీ కోమటేశ్వరి కనిపించెను స్వప్నములో
పుత్ర యాగమును జరిపించుమని వినిపించెను స్వప్నములో
6. కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులు జరిపించిరి యజ్ఞమును
కుల గురువైన బాస్కరచార్యులు పూరించిరి యజ్ఞమును
7. శివ పార్వతులు సంతోషముతో వారిని దీవించారు
యజ్ఞము నుండి పాయసమును వారికి అందించారు
8. ఆ ప్రసదమును ఆరగించెను సంతసించి కుసుమాంబ
నవమాసములు నిండిన పిదప కవలపిల్లలను కనెను
9. మగ శిశువునకు విరూపాక్షుడని పేరు పెట్టిరి నాడు
నింగి మాట పిని ఆడ శిశువునను వాసవి యనిరి వారు
10. శక్తి అంశము "వాసవి" యనుచు గగనము తెలిపెను నాడు
పరమేశ్వరి తమ యింట వెలసెనని ఎంతో మురిసిరి వారు
11. అన్న చెల్లెలు ఐదు ఏళ్ళకు, చుట్టిరి శ్రీకారమును
భాస్కరచార్యుని దీవనలంది, చదివిరి పలు శాస్త్రములు
12. విరూపాక్షునికి వివాహమయ్యెను వైభవముగ ఒక నాడు
రత్నావతి యను ముద్దుల కన్య అతనికి జతయయ్యెను
13. విష్ణువర్ధనుని పాలననుండెను రాజ మహేంద్రవరము
జైత్రయాత్రలో రాజోకనాడు పెనుకొండను చేరెను
14. కుసుమశ్రేష్టి స్వాగతమును పలికెను ముదముతో ఆ రాజునకు
ఆ సయములో వాసవిదేవిని, వింతగజూచెను రాజు
15. జ్యోతిని మించిన దివ్య తేజము, వాసవి మెమున కలదు
ఆ తేజమునకు భ్రమసినరాజు, ఆమెను వలచెను నాడ
16. మంత్రిని పిలిచి విన్నవించెను తన ఎదలోని మాట
కుసుమశ్రేష్ఠిని సంప్రదించుమనె, వివాహమున కాపూట
17. నిరాకరించిన వాసవిని, ఆపహరించి తెమ్మనెను
దిగులతో మంత్రి కుస్సుమశ్రేష్ఠికి రాజ కాంక్ష తెలిపెను
18. మంత్రి మాటలను వినగా శ్రేష్ఠికి, చీకటి మయ్యను జాగము
ఏమి తోచకా వైశ్యులునాడు, సమావేశమయ్యారు
19. కుల ధర్మామును దాటకూడ దని అందరు పలికిరి ఒకటై
ప్రాణముకన్న ధర్మము మిన్న అని పలికిరి వారోకటై
20. బాల నాగరులు గొప్ప నేర్పుతో, రాజును దర్శించారు
వివాహమునకై రెండు మాసములు, గడువును వారడిగారు
21. సంతోషముతో సమ్మతించెను వారి కొర్కెను రాజు
వాసవి నామము వళ్ళించుచునే తరిలెను తన పురమునకు
22. నూట రెండుగోత్ర వైశ్యులు, కంకణములు కట్టారు
వాసవిదేవితో అగ్ని ప్రవేశము చేయుటకై నిలిచారు
23. నాడు వాసవి శక్తి రూపమును చూపెను ఆ వైశ్యులకు
పూర్వపు గాధ్ల్ రహస్యములను బయలుపర్చెను తుదకు
24. విష్ణువర్ధనుడు శాపగ్రస్తుడు మరణము తప్పదు ఇప్పుడు
అని పలికిన మరుక్షణమే ఆమె మార్చెను తన రూపమును
25. నూటమూడు కుండములందు జ్వాలలు రగిలెను నాడు
నూట రెండు జతలు వాసవితో, ఆహుతియయ్యెను నాడూ
26. సాగించెను తన పెళ్ళి యాత్రను గడువురాగనే రాజు
చికటి పడగా మద్యదారిలో భగ్నపురిన నిలిచెను
27. అర్ధరాత్రి ఒక శక్తి వానిని చంపెను శివశూలముతో
కేకలు వేసి శవమై పడెను సైన్యము చేరేవరకు
28. విష్ణువర్ధనుని సుతుడట కెగి జరిపించెను తుదిక్రియలు
విరూపాక్షునకు పరిపాలించె పట్టము నిచ్చెను తుదకు
29. వాసవినీ దేవతయని పలికి, కట్టించెను ఆలయము
ప్రాణత్యాగమే ప్రణవమయ్యెనని, ప్రణమిల్లెను ఆశిలకు
30. గోత్రవైశ్యులు పిండ ప్రదనము చేయుటకై వెడలారు
పుణ్యక్షేత్ర నది జలములయందు కలిపిరి ఆ భస్మములు
31. కాశి నుండి నూటక్క లింగములు వెంట దెచ్చిరి వారు
పెనుగొండ శివ ఆలయమందు ప్రతిష్టించిరి వారు
32. బాల నాగరులతో జతకు వెలిరి కొందరు భటులు
వారిలో కొందరు గంగా జలమును వెంట దెచ్చిరి ఇటకు
33. శివ లింగమును తెచ్చినవారు మైలారులు యనబడిరి
గంగా జలమును దెచ్చినవారు వీరముష్టులనబడిరి
34. వాసవిదేవి ఉత్సవములతో, వీరికి అగ్రత కలదు
త్రిపుండ్రింకిత దేహదారులై పాడెదరు ప్రణవము
పరమం పవిత్రం వాసవి చరితం
పరమం విచిత్రం ఈ జీవిత గీతం
పరమార్థ ఇష్టార్థ మెక్షాప్రదాత
శ్రీ వాసవి గీతం మనసాస్మరామి
శ్రి కన్యకా గీతం మనసాస్మరామి
శ్రీ వైశ్యకుల దైవం మనసాస్మరామి
0 Comments