Narayana Stotram in Telugu – శ్రీ నారాయణ స్తోత్రం

 Narayana Stotram in Telugu – శ్రీ నారాయణ స్తోత్రం

Narayana Stotram in Telugu – శ్రీ నారాయణ స్తోత్రం
 Narayana Stotram in Telugu – శ్రీ నారాయణ స్తోత్రం

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ 1

ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ 2

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ 3

పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ 4

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ 5

రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ 6

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ 7

బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ 8

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ 9

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ 10

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ 11

అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ 12

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ 13

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ 14

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ 15

సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ 16

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ 17

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ 18

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ 19

దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ 20

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ 21

వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ 22

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ 23

జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ 24

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ 25

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ 26

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ 27

అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ 28

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ 29

భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ 30

నారాయణ నారాయణ జయ గోవింద హరే

నారాయణ నారాయణ జయ గోపాల హరే

ఇతి శ్రీ నారాయణ స్తోత్రం ||

శ్రీ నారాయణ స్తోత్రం భావం

సముద్రమున వసించువాడా, ఇరువది నాలుగు తత్వములు కలవాడా, సగుణ నిర్గుణస్వరూపము కలవాడా, సృష్టికర్తృత్వము సంహార్తృత్వము స్వీకరించినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

దయాసముద్రుడా,గంబీరసముద్రుడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

నల్లటిదట్టమైన మబ్బువంటి శరీరము కలవాడా, కలికాలమున చేసే పాపములను నాశనము చేయువాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

యమునానదితీరాన గోపికలతో విహహించేవాడా,కౌస్తుభమణిహారమును ధరించేవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

బంగారు పట్టువస్త్రములు ధరించినవాడా, సురకళ్యాణానికి నిధివి, అట్టి స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

మాయామానుషవేషదారి, మనోహరమైన గురివిందపూసలను దండగా ధరించినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

రాధాదేవి అధరమాధుర్యమును గ్రోలినవాడా, చంద్రవంశమునకు అలం కారమైనవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

మురళీగానముతో వినోదించువాడా, భూమి పాదములు, గగనము శిరస్సు అని వేదములచే కొనియాడబడేవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

నీటబుట్టిన శంఖమును ఆభరణముగా కలవాడా, లక్ష్మీ అవతారమైన రుక్మిణీదేవిని ఆనందపరచువాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

తామరరేకులవంటి కన్నులుగల వాడా, జగన్నాటక సూత్రధారి, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

పాపమనెడి కాళరాత్రిని సంహరించు వాడా, నీవు దయాసముద్రుడవు నన్నుద్ధరించుము, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

గోపాల! పాపాత్ములైన బకుడు కంసుడు మురుడు మెదలైన రాక్షసులను సంహరించినవాడా! స్వామీ! అందమైన కేశములతో అందరినీ ఆకర్షించు స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

బంగారమువంటి పట్టుపీతాంబరములు ధరించినవాడా నాకభయ మెసంగుము స్వామీ! హే!నారాయణ! గోపాల! నీకు జయము

దశరథరాజతనయా, దానవసంహారా! స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

దేవేంద్రుని గర్వభంగమునేయనెంచి పసివాడుగానే గోవర్థనమునెత్తి గోగోపజనమును కాపాడి వారి మనములనాకర్షించిన స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

సరయుతీరవిహారా, సజ్జనములనులకోర్కెలను దీర్చు స్వభావము కలవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

విశ్వావిత్రుని యజ్ఞమును సంరక్షించినవాడా, మృతులను సైతము బ్రతికించిన చరిత్రకలవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

ధ్వజము వజ్రము అంకుశము మెదలగు ఉత్తమ రేఖలతో ఉత్తమ సాముద్రిక లక్షణముకతో నిప్పపాదములుగల స్వామీ! సీతాదేవితో నిత్యా నందనమునొందు, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

సీతాదేవిని పాలించువాడా, నీ లీలలు సదా ఎల్లరు తలచుకొంటూంటారు, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

తండ్రియగు దశరథుని మాటను శిరసావహించినవాడా, దండకారణ్యమున సంచరించినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

చాణూర ముష్టికులనే దుష్టమల్లులను సంహరించి ముని మానసముల కానందమును కూర్చినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

వాలిని వధించిన శూరుడా, శరణు జొచ్చిన సుగ్రీవుని ఆదరించిన రామా! స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

మురళీధరా, ధీవరా, శ్రీధరా నన్ను కాపాడుము, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

సముద్రమునకు వంతెన కట్టి ధీరుడా! రావణుని కంఠములను నరికి ప్రోవులు చేసినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

గర్దభాసురుని సంహరించి తాటితోపును ధ్వంసము చేసి మాయామానుషత్వమును నటించుచు వివిధములైన సంపదలతో విరాజిల్లువాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

గౌతమపత్నిచే పూజలనందుకొన్నవాడా, గొప్పకరుణతోనిండిన చూపులతో ఆమెను ఉద్ధరించినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

గొప్పసంభ్రమపరాక్రమములతో శత్రువుని జయించి సీతను తీసుకొని వచ్చి సాకేతపురమున పట్టాభిషిక్తుడవై విహరించిన రామా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

చిటికనవ్రేలితో గోవర్ధనపర్వతమునెత్తిన వాడా, భక్తులనబుగ్రహించుటలో తదేకనిష్ట కలవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

నిన్నుగురించి వేదములు చేయునట్టి గానమున వినోదించువాడా, హిరణ్యకశివుని సుతుడైన ప్రహ్లాదుని ఆనందింపచేయు కళ్యాణగుణా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత నారాయణ స్తోత్రము సంపూర్ణమ్

Facebook

గరుడ గమన తవ


Post a Comment

0 Comments