Sri Suryanarayana Swamy Chalisa - శ్రీ సూర్యనారాయణ స్వామి చాలీసా

 Sri Suryanarayana Swamy Chalisa - శ్రీ సూర్యనారాయణ స్వామి చాలీసా

Sri Suryanarayana Swamy Chalisa - శ్రీ సూర్యనారాయణ స్వామి చాలీసా

Sri Suryanarayana Swamy Chalisa - శ్రీ సూర్యనారాయణ స్వామి చాలీసా

అదిగో అదిగో ఆదిత్యుడు

ఆదితి కన్న ప్రియ సుతుడు

సప్తాశ్వముల శోభితుడు

కన్నుల వెలిగే ఘన విభుడు || 2 ||

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

బ్రహ్మ తేజమున భాసించి

సాకారమున చరియించి

ఏక గమనమున పయనించి

ఏకోన్మఖముగ సాగేను

కాంతికి రూపంగా తెలిసి

కోటి కిరణముల భాసించె

కాల గమనుని కందాము

కరముల జోడి ఉందాము

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

కాల చక్రమున కదలాడే

కాశ్యపేయుని కనరండి

కర్మ సాక్షిగా కనిపించే

కనుల మాటను కనరండి

సూర్య దేవుని కథ తెలియండి

ఆదిత్య దేవుని స్మరియించండి

కాశ్యపేయునిగ కనిపించాడు

అదితి సుతునిగా వెలిగాడు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

సాకారమున చరియిస్తూ

సర్వ జగతిని పాలిస్తూ

జగతిని జాగృతి చేసాడు

చైతన్యము తానై శోభించాడు

విశ్వ తేజ మై వెలిగాడు

విష్ణు తత్వమును చాటాడు

చైతన్యానికి సారథిగా

సకల జగతిని చుట్టాడు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

విశ్వ నేత్రముగ విరిసాడు

ఓం కారమును నింపుకొని

సాకారమును కూర్చుకొని

సంఘ మిత్రునిగ మెలిగాడు

విష్ణు నామాన విరిసేవు

విశ్వ ఖ్యాతిని బడసేవు

రుద్ర రూపమును దాల్చేవు

భద్ర మూర్తిగా మెలిగేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

ఆకాశాన నీ పయనం

నదీ గమనముల నిర్దేశం

నియమ పాలన నీ తత్వం

అవని జనులకు శుభ శకునం

ప్రకృతి చక్రం తిరుగాడ

పుడమిని జలమును గ్రహించి

వర్షముగా మరి కురిపించి

పంటకు ప్రాణం పోసావు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

సూర్య మండలము వాసముగా

సకల దేవతలు వసియించ

అన్న ప్రాణములు వికసించి

అన్న జీవులా మెరిసేను

కడలితో స్నేహం చేసావు

కలువకు మిత్రుడవైనావు

కోటి ప్రభల కనిపించావు

కనువిప్పగ కాంతుల మెరిసావు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

చైతన్యానికి స్పూర్తివి నీవు

కాంతి మండలపు కీర్తివి నీవు

వికాసానికి ఊపిరి నీవు

ప్రకాశినికి ప్రాణం నీవు

కాలచక్రము నిను కూడ

ధర్మ చక్రముగ మెలిగితివి

మూడు కాలములా ముచ్చటగా

సంద్యను కూడి మెలిగితివి

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

నిన్ను కూడగా సంధ్యా కాంత

వందనీయతకు బడసింది

సంద్య తేజమున నిను కూడి

మూడు సంద్యలా మెరిసింది

అంతరిక్షమున ఆధ్యుడవు

గ్రహమండలమున రారాజవు

పాడిపంటలకు నువు ప్రాణం

రేయి పగలకు నువు మూలం

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

వెలుగు రూపము దాలచ్చినది

విశ్వ నేత్రమై వెలిగినది

శివహరి తేజము శోభించ

సూర్య నామమున తెలిసినది

చైత్రములోన దాతగ తెలిసి

రక్త వర్ణమున శోభించి

కాశీ వాసము చేసావు

లోలార్కుని తెలిసేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

వైశాఖమున ఆర్యముడై

పీత వర్ణమున ప్రభవించి

మేరు శిఖరమున మెరిసేవు

కమల వికాసము కూర్చేవు

దేవతలందరు నిను వేడ

శిలా రూపమును దాల్చి

మయుని చేతిలో శిల్పంగా

అవతరించేను అపురూపంగా

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

శిలా ఖండములు అస్త్రములై

సుర సైన్యమున శోభించి

అసుర సైన్యమును హతమార్చి

అమరావతిని చేకూర్చె

జేష్ఠములో జన మిత్రునిగా

చీకట్లను తొలగించి

అరుణ వర్ణమున వెలిగేను

అంతట మెదము కూర్చేను

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

ఉపాసనయే ఉపాయంగా

సాంబుడు నిన్ను సేవించ

ఆరోగ్యము సమకూర్చావు

శాప ముక్తుని చేసావు

ఆరోగ్యం భాస్కరాదిత్య

అన్న నానుడికి శ్రీకారం

ఆనాటి నుండియే సాకారం

సర్వ జనులకు శుభ యెగం

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

ఆషాడంలో అరుణుడవు

శ్యామ వర్ణపు వరుణుడవు

కాశీలోన కొలవైనావు

ద్రౌపదాత్యునిగ తెలిసేవు

రూపమున నిను కొలువ

ఆకలి బాధలు తీర్చేవు

అమృతత్వమును కురిపించి

అండగ ఎన్నడు నిలిచేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

శ్రావణమందున ఇంద్రుడవై

శ్వేత వర్ణమున వెలిగేవు

మయూఖముల విరిసేవు

సౌభాగ్యదాతగా తెలిసేవు

అంశుమాలిగా నిను తెలియ

అభయ ప్రదాతగ నువు విరియ

ఆది వ్యాధులను అణచేవు

ఆరోగ్య సర్వమూ ఒసగేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

గోదుమ వర్ణములో నీవు

గ్రహమండలమున వెలిగేవు

బాద్రపదమున భాసించేవు

వివస్వంతునిగ తెలిసేవు

అశ్వయుజమున అగుపించి

త్వష్ట రూపుడై తెలిసేవు

విచిత్ర వర్ణముల శోభించి

త్వష్టాదిత్యునిగ వెలిగేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

కార్తీకమున కనిపిస్తూ

అరుణ వర్ణమున అమరేవు

విష్ణు నామమును వెలిగేవు

విశ్వ పాలన చేసావు

మార్గశిరమున అంశుమంతుడై

ఆకు రంగున అమరేవు

అనూరుడు రథ సారధిగా

మనో రథములను తీర్చేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

పుష్య మానమున ప్రభవించి

భగ నామమున భాసించేవు

రక్త వర్ణమున రాజిల్లేవు

విమలాదిత్యునిగ వెలిగేవు

సోమునివోలె చల్లదనముతో

శివునివోలె శుభములు కూర్చుచు

దివ్య శోభతో దర్శనమిచ్చి

దుఃఖములను తొలగించేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

మాఘ మాసమున మెరిసేవు

పూషాదిత్యునిగ తెలిసేవు

లక్క వర్ణమున వెలిగేవు

శోక తాపములు తీర్చేవు

పాల్గుణమందు ప్రభవించి

పర్జన్యునిగ పేరొంది

అరుణ తేజమున వెలిగేవు

దుర్గతులను దూరం చేసేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

మాసానికి ఒక నామంతో

మెదము కూర్చెడి రూపంతో

సకల వర్ణముల శోభించేవు

ద్వాదశాదిత్యునిగ తెలిసేవు

పూర్వ దిక్కును చూపించేవు

దశ దిశలా వెలుగిచ్చేవు

పడమటింటికి పయనించేవు

పరమ పదమును సూచించేవు

నారాయణ సూర్యనారాయణ

ఆదిత్య రూపా నారాయణా

దినకర తేజా దివాకరా

పరమ ప్రకాశా ప్రభాకరా

Facebook

శ్రీ శ్యామలా దండకమ్



Post a Comment

0 Comments