Ardhanarishwara Ashtakam - అర్ధ నారీశ్వర అష్టకం

 Ardhanarishwara Ashtakam - అర్ధ నారీశ్వర అష్టకం

Ardhanarishwara Ashtakam - అర్ధ నారీశ్వర అష్టకం

Ardhanarishwara Ashtakam - అర్ధ నారీశ్వర అష్టకం


చాంపేయ గౌరార్ధ శరీరకాయై

కర్పూర గౌరార్ధ శరీరకాయ

ధమ్మిల్లకాయై జటాధరాయ

నమః శివాయై నమః శివాయ 1

కస్తూరికాకుంకుమ చర్చితాయై

చితారజః పుంజ విచర్చితాయ

కృత స్మరాయై వికృత స్మరాయ

నమః శివాయై నమః శివాయ 2

ఝణత్క్వణత్కంకణ నూపురాయై

పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ

హేమాంగదాయై భుజగాంగదాయ

నమః శివాయై నమః శివాయ 3

విశాలనీలోత్పల లోచనాయై

వికాసి పంకేరుహ లోచనాయ

సమేక్షణాయై విషమేక్షణాయ

నమః శివాయై నమః శివాయ 4

మందారమాలా కలితాలకాయై

కపాలమాలాం కితకంధరాయ

దివ్యాంబరాయై దిగంబరాయ

నమః శివాయై నమః శివాయ 5

అంభోధర శ్యామల కుంతలాయై

తటిత్ప్ర భాతామ్ర జటాధరాయ

నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ

నమః శివాయై నమః శివాయ 6

ప్రపంచసృష్ట్యున్ ముఖ లాస్యకాయై

సమస్త సంహారక తాండవాయ

జగజ్జనన్యై జగదేక పిత్రే

నమః శివాయై నమః శివాయ 7

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై

స్ఫురన్మహా పన్నగ భూషణాయ

శివాన్వితాయై శివాన్వితాయ

నమః శివాయై నమః శివాయ 8

ఏతత్పఠే దష్టక మిష్టదం యో

భక్త్యా మాన్యో భువి దీర్ఘ జీవీ

ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం

భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః

భావం:

సంపెంగ పువ్వువలే ఎర్రనైన అర్థ శరీరము కలది - కొప్పు ధరించినది అగు పార్వతికి, కర్పూరము వలే తెల్లనైన అర్థశరీరము కలవాడు - జటాజూటము ధరించినవాడు అగు శివునకు నమస్కారము. || 1 ||

కస్తూరీ - కుంకుమలను శరీరము పై పూసుకున్నది - మన్మథుని బ్రతికించినది అగు పార్వతికి, చితిలోని భస్మను పూసుకున్న వాడు - మన్మథుని సంహరించిన వాడు అగు శివునకు నమస్కారము. || 2 ||

ఝణ ఝణమని మ్రెగు కంకణములు - అందేలు, బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతికి, పాములను పాదములందు కడియములుగానూ చేతులందు కేయూరములుగానూ ధరించిన శివునకు నమస్కారము. || 3 ||

 

విశాలమైన నల్లకలువలవంటి కన్నులు కలది - రెండు కన్నులున్నది అగు పార్వతికి, వికసించిన ఎర్రతామరలవంతి కన్నులు కలవాడు - మూడు కన్నులవాడు శివునకు నమస్కారము. || 4 ||

 

మందారమాలను కురులలో అలంకరించుకున్నది దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతికి, మెడలో కపాలమాలను అలంకరించుకున్న వాడు, దిగంబరుడు అగు శివునకు నమస్కారము. || 5 ||

మబ్బువంటి నల్లని కేశములు కలది - తనకంటె గొప్పవారు లేనిది అగు పార్వతికి, మెరుస్తున్న రాగిరంగు జటాజూటము కలవాడు - అందరికంటే గొప్పవాడు అగు శివునకు నమస్కారము. || 6 ||

ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చేయు జగన్మాతయగు పార్వతికి, సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు జగత్పితయగు శివునకు నమస్కారము. || 7 ||

ప్రకాశించు రత్నకుండలములు ధరించినది- శివునితో కలసినది అగు పార్వతికి, శోభిల్లు మహాసర్పములను అలంకరించుకున్నవాడు పార్వతితో కలసిన వాడు అగు శివునకు నమస్కారము. || 8 ||

కోరికలు తీర్చు ఈ ఎనిమిది శ్లోకముల స్తోత్రమును భక్తితో పఠించువాడు, ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును. అనంత కాలము సౌగ్యమును పొందును. అతనికి ఎల్లప్పుడు అన్నీ సిద్దించును.

శివ తాండవ స్తోత్రం

Post a Comment

0 Comments