Sundarakanda 5 - సుందరకాండ 5

  Sundarakanda 5 - సుందరకాండ 5
Sundarakanda 5 - సుందరకాండ 5
 Sundarakanda 5 - సుందరకాండ 5

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగె తగవులు

సుగ్రీవుని వాలి పారద్రోలెను తమ్ముని భార్యను తాను హరించెను

సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యమూకమను గిరిపై దాగెను

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 201 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

వాలి సుగ్రీవుల అన్నదమ్ములు వారి నడుమ చెలరేగె తగవులు

సుగ్రీవుని వాలి పారద్రోలెను తమ్ముని భార్యను తాను హరించెను

సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యమూకమను గిరిపై దాగెను

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 202 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సుగ్రీవుని సేవించుచు మేము ఋష్యమూకమున చేరియున్నాము

ఆ సమయాన సమీప వనాల పొడగాంచినాము రామలక్ష్మణుల

వల్కలధారులై ధనుర్థారులై వెదుకుచున్నారు అడవులపాలై

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 203 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రామ లక్ష్మణూల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము బ్రాకెను

వృత్తాంతమరసి వేగరమ్మని వారికడకు నన్నొంటిగ బంపెను

కాంచినాడ శ్రీరామలక్ష్మణుల పొందినాడ దివ్యానుభూతుల

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 204 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రామ లక్షణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకొని నే జేర్చినాడ

రామ సుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతులైరి ప్రతిజ్ఞల బూనిరి

రాముడు వాలిని సంహరింతునని సుగ్రీవుడు నిన్నన్వేషింతునని

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 205 ||          

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఋష్యమూకమున నీవు వైచినవి సొమ్ములన్నియు మాకడనున్నవి

ఆ సొమ్ముల శ్రీరాముడు గాంచి నిన్ను గనినటుల కడు విలపించె

నిన్నెడబాసిన రామచంద్రుడు నిద్రాహారములు మరచినాడు

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 206 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

కోదండపాణి అండ జూచుకొని సుగ్రీవుడు కిష్కింధ చేరుకొని

పోరుకి రమ్మని వాలిని బిలిచె ఇరువురి నడు్మ పోరు చెలరేగె

శ్రీరాముడు ఒకే బాణముచే అతి బలశాలిని వాలిని గూల్చె

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 207 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సుగ్రీవుడు వానర రాజయ్యెను నిను వెదకగ మమ్మాజ్ఞాపించెను

వానర వీరులు నలువంకలకు వెడలినారు నీ జాడ తెలియుటకు

అంగదుడాదిగ మేము కొందరము దక్షిణ దిశగ పయనించినాము

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 208 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రావణుండు నిను గొనిపోయెనని లంకలోన బంధించి యుండునని

పక్షిరాజు సంపాతి మాట విని సాగర తీరము వేగ చేరితిమి

శతయెజనముల వారిధి దాటి ఒంటిగ నేను లంక జేరితి

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 209 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రామ భక్తుడ సుగ్రీవు సచివుడ వాయు తనయుడ కామరూపుడ

రామదూతగనే వచ్చినాడ అడుగడుగున లంక వెదకినాడ

కడకు నీ జాడ తెలిసినాడ నినుగాంచిన కీర్తి పొందినాడ

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 210 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

మాల్యవంతమను నగమున నుండెడు కేసరియను నొక వానరోత్తముడు

మాల్యవంతమును వదలివెళ్ళెను గోకర్ణమను శిఖరి చేరెను

అచట ఋషులచే నియమింపబడి శంబసాదనుడను అసురుని గూల్చె

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 211 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"అంజనీదేవీ ఆ కేసరి సతి వాయుదేవు వరమున నన్ను గన్నది

కన్నతల్లి నను ప్రాణప్రదముగ పెద్ద చేసినది ప్రేమ మీరగ

సుగ్రీవునకు మంత్రినైతిని రామదూతనై ఇటు వచ్చితిని

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 212 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని

రామదూత యని నమ్మతగునని తెలిసినవన్నీ సత్యములేనని

ఆనందాశ్రులు కన్నులు నిండగ చిరునగవులతో జానికి చూడగ

జయహనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె   || 213 ||                     

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని

రామదూత యని నమ్మతగునని తెలిసినవన్నీ సత్యములేనని

ఆనందాశ్రులు కన్నులు నిండగ చిరునగవులతో జానకి చూడగ

జయహనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె   || 214 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"ఇకపై నీకు శుభమాగు తల్లీ ఊరడిల్లుము శోకము వదలి

నీ క్షేమము విని రాముడెంతగా ఆనందముతో పొంగునో కదా!

ఇదిగో తలీ! ఇది తిలకింపుము రాముడంపిన ఆంగుళీయకము"

అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను  || 215 ||   

రామచంద్రుని ముద్రిక జేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని

మధుర స్మృతుల మదిలో మెదల సిగ్గిచేత తన శిరము వంచుకొని

ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభ శకునముల విశేష మనుకొని

జానికి పల్కె హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో  || 216 ||                                  

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"ఓ మహాబలా! వాయునందనా! ఓ మహాతేజ! వానరోత్తమా!

శతయెజనముల వారిధి దాటి ఒంటిగ నీవు లంక జేరితివి

రావణుడాదిగ రాక్షసవీరుల లెక్కచేయకే నను కనుగొంటివి"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో  || 217 ||                            

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"ఎన్నడు రాముడు ఇట కేతెంచునో ఎన్నడు రావణుని హతము చేయునో

లక్ష్మణుండు తన అగ్ని శరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో

సుగ్రీవుడు తన వానసేనతో చుట్టుముట్టి ఈ లంకను గాల్చునో

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో  || 218 ||                            

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను

రావణు డొసగిన ఏడాది గడువు రెండు నెలలలో ఇక తీరిపోవు

ప్రాణములను అరచేత నిల్చుకొని ఎదురుచూతు నీ రెండు మాసములు"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో || 219 ||                             

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"నీవలెనె శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా

ఫలపుష్పాదులు ప్రియమైనవిగని హా సీతా! యని శోకించునమ్మా

నీ జాడ తెలిసి కోదండపాణి తడవు చేయకే రాగలడమ్మా

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 220 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"నీవలెనె శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా

ఫలపుష్పాదులు ప్రియమైనవిగని హా సీతా! యని శోకించునమ్మా

నీ జాడ తెలిసి కోదండపాణి తడవు చేయకే రాగలడమ్మా

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 221 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"రావణు తమ్ముడు విభీషణుడు రాముని కడకు నన్ను జేర్చుమని

పలికినందులకు రావణుడలిగి తమ్మున్నిపై దుర్భాషలాడెనని

విభీషణు సుత నలయును కన్యక స్వయముగ దెల్చెను నాకీ వార్త"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో        || 222 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"ఓ హనుమంతా! నిను గనినంత నాలో కలెగె ప్రశాంతత కొంత 

వానరోత్తమా! నిను వినినంత నే పొందితిని ఊరట కొంత

రాముని వేగమె రమ్మని దెల్పుము రెండు నెలలు గడువు మరువ బోకుము"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో        || 223 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"తల్లీ! నీ విటు శోకింపనేల? వగచి వగది ఇటు భీతిల్ల నేల?

ఇపుడే నీకీ చెర విడిపింతును కూర్చుండుము నామూపు మీదను

వచ్చిన త్రోవనే కొనిపోయెదను శ్రీరామునితో నిను జేర్చెదను"

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 224 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"పోనివ్వక పోతివిగా హనుమా సహజమైన నీ చెంచల భావము

అరయగ అల్ప శరీరుడ వీవు ఏ తీరుగ నను గొనిపోగలవు

రాముని కడకే జారవిడుతువో" కడలిలోననే జారవిడుతువో"

అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో      || 225 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను

సీతచెంత తన కామరూపమును ప్రదర్శింపగ సంకల్పించెను

కొండంతగ తన కాయము బెంచెను కాంతిమంతుడై చెంత నిలిచెను

జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను || 226 ||                 

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ఎర్రని మెమ్ము ఎర్రని కన్నులు వజ్ర దంతములు వజ్ర నఖములు

పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశమై

మందర గిరివలె మహోన్నతమై కాంతులెగజిమ్మె అతి భీకరమై

అనిల కుమారుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను || 227 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"అద్భుతమౌ నీ కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా

పవన కుమారా నీవుగాక మరి ఎవరీ వారిధి దాటెదరయ్యా

క్రూర రాక్షసుల కంట బడకయే లంక వెదకి నను కనగలరయ్యా"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో   || 228 ||               

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"వాయువేగమున పోగలిగిన నీ మూపుపైన నేకూర్చుండ గలనా?

ఆకసమంటి ఎగిరిపోవు నీ మూపునుండి నేభయపడి పడనా?

జలధి పడినచో జలచరములు నను ప్రీతిగ మ్రింగక వదలివేయునా?"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో   || 229 ||                           

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"నను గొనిపోయెడి నినుగని అసురులు ఒక్కసారిగా నిన్నెదిరించగ

అస్త్ర శస్త్రములు కలిగిన వారితో నిరాయుధుడవై ఎటు పోరగలవు?

క్రూర కర్ములగు అసుర వీరులతో నన్ను మెయ్యుచు ఎటు పోరగలవు?

అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో  || 230 ||                                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"యుద్ధమందు జయాప జయములు తెలియారాని దైవాధీనములు

ఎందులకయిన మంచిది వినుము కీడెంచి పిదప మేలెంచుదము

రాక్షసులే నిను గెలిచిరనుకొనుము పూర్తిగ చెడును రామకార్యము"

అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో      || 231 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"హనుమా! నీవే అసురుల గెల్చి ఒకవేళ నన్ను రాముని జేర్చిన

మహాపరాక్రమ విశ్రతుడైన సాకేత పతికది కీర్తికరమా?

తిరుగులేని అగ్ని శరములు గల కోదండపాణి కది కీర్తికరమా?"

అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో  || 232 ||                          

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"శ్రీరాముడు నా ప్రాణ విభుడు నన్నంటగల పురుషోత్తముడు

ఒంటరి దానను వివశురాలను నను స్పృశించి గొనివచ్చె రావణుడు

రాముడెపుడు దశకఠుని ద్రుంచునో అపుడే నాకు శాంతి కలుగును"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో  || 233 ||                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"తల్లీ!నేను నీయందుగల భక్తి భావమున అటుల దెల్పితి

క్రూర రాక్షసుల బారినుండి నిను కాపాడనెంచి అటుల బల్కితి

వేగమే నిన్ను రాముని జేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి"

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 234 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"తల్లీ! నీవు తెలిపిన వన్నీ శ్రీరామునకు విన్నవించెదను

సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భర్యవు

అమ్మా! ఇమ్ము ఏదో గురుతుగ శ్రీరాముడు గని ఆనందించగ"

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 235 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"మును చిత్రకూట పర్వత మందున వివిధ పుష్పఫల వనము లందున 

రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి చెట్ల నీడల

శ్రీరాముడు నా తొడపై తలపడి నిదుర బోయెను హాయిగ ఒరిగి"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వసముతో  || 236 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"కాకాసురుడను ఇంద్ర కుమారుడు ఆ సమయమున అట చేరినాడు

ముక్కుతోటి నా స్తనాంతరమును రక్తము చిందగ చీరినాడు

రాముడు మేల్కొని ఆగ్రహమెందెను బ్రహ్మాస్త్రముగా దర్బను విసరెను"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వసముతో  || 237 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

"బ్రహ్మాస్త్రము ఆ కాకాసురుని మంటలజిమ్ముచు వెంబడించెను

భయపడి కాకి కావు కావుమని తిరిగి చూచెను లోకాలన్నీ

దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను"

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వసముతో  || 238 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

ప్రయెగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము జేయక సాధ్యము గాదని

కాకియెక్క కుడి కన్ను హరించి రాముడు వదలె కడకు మన్నించి

చావుదప్పి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని బోయె

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వసముతో  || 239 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రామలక్ష్మణ సుగ్రీవాదులతో సీత క్షేమమని తెలుపుము దయతో

వారి రాకకై వేయి కన్నులతో ఎదురు చూతునని తెల్పుము ప్రీతితో

రెండు నెలలే ఇక మిగిలిన గడువని మరి మరి తెల్పుము శ్రీరామునితో

అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వసముతో    || 240 ||                

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రామచంద్రునకు కడు ప్రియమైనది శ్రేష్ఠమైనది శుభకరమైనది

చెంగు ముడినున్న చూడామణిని మెల్లగ దీసి మారుతి కొసగి

పదిలముగా గొని పోయిరమ్మని శ్రీరామునకు గురుతుగ నిమ్మని

ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వసముతో   || 241 ||                 

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

చేతులారగ చూడామణిగొని ఆనందముగ కనుల కద్దుకొని

వైదేహికి ప్రదక్షిణలు జేసి పదముల వ్రాలి వందనము లిడి

మనమున రాముని ధ్యానించికొని మరలి పోవగ అనిమతి నిమ్మని

అంజనీ సుతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె  || 242 ||                  

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరగా రేపు పొమ్మా

నీ విందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోక భారము

నిన్నంపుట నాకు మరో దుఃఖము ఎటు భరింతునో ఈ పరితాపము

అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగి వాత్సలముతో  || 243 ||                              

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

హనుమా! నాకొక అనుమానము సుమా! అమరిక లేక నాకు తెల్పుమా

వానర్ సేనతో సుగ్రీవాదులు వారిధి దాటి ఇటు రాగలరే

రామ కార్యమును సాధించుటలో అతి సమర్థుడవు నీ వందరిలో

అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగి వాత్సలముతో || 244 ||                               

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

తల్లీ! నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము

సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మించిన వీరాధి వీరులు

వాయువేగ మనో వేగవంతులు పలుమార్లు భువిని చుట్టిన ధీరులు

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 245 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

నా భుజములపై రామలక్ష్మణుల తిన్నగ లంకకు తోడ్కొని రాగల

ఆ సోదరులు మహావీరుల సుర్యచంద్ర సమాన తేజులు

తృటిలో రావణుని పరిమార్చ గలరు అయ్యెధ్యకు నిన్ను గోనిపోగలరు

అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె    || 246 ||                      

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

రామలక్ష్మణ సుగ్రీవాదులగొని వానర సేనతో వేగరమ్మని

అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో

జానికి పలికె అతి దుఃఖముతో పోయి రమ్మని హనుమంతునితో

అంతట మారుతి కాయము పెంచె ఉత్తర దిశగా కుప్పించి ఎగసె  || 247 ||                             

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను గలదు

కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద

రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద

అని హనుమంతుడు యెచన జేయుచు తోరణ స్తంభముపైన నిల్చెను  || 248 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

సామదాన భేదోపాయములు దానవుల యెడ నిరుపయెగములు

దండోపాయమె తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయెగము

రావణుడాదిగ అసురులందరు రామదూత మహిమ ఇక జూచెదరు

అని హనుమంతుడు యెచన జేయుచు తోరణ స్తంభముపైన నిల్చెను  || 249 ||                   

శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ

తరువుల బెరికి శాఖల విరిచి తీవల ద్రెంచి పూవుల ద్రుంచి

పుష్పకుంజముల మట్టము జేసి గిరిశిఖరముల బ్రద్దలు చేసి

సోపానముల ముక్కలు చేసి నడబావుల కూలగ ద్రోసి

సుందరమైన అశోకవనమును చిందర వందర చేసె మారుతి   || 250 ||         

Sundarakanda 4 - సుందరకాండ

Facebook

Post a Comment

0 Comments