Vasavi Chalisa - శ్రీ వాసవి చాలీసా
Vasavi Chalisa - శ్రీ వాసవి చాలీసా |
వాసవి మాత సత్యప్రియా -
జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం -
జగమంటటికి ఆధారం || 1 ||
మల్లెపువ్వులు
తెచ్చితిమి - మనసును నీకే ఇచ్చితిమి
వాసవులంతా చేరితిమి -
నీ పారాయణమే చేసితిమి || 2 ||
పద్మరేకుల కాంతులతో -
పసిడి మెరుపులా మెరియంగా
హంసవాహిని రూపిణిగా - వెలసితివమ్మా కన్నెమ్మ || 3 ||
తెల్లని వస్త్రము
ధరియించి - మెల్లె మాలను వేసుకొని
భక్తి మార్గము చూపితివి
- జ్ఞాన జ్యోతిని నింపితివి || 4 ||
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
పెనుగొండాపురి వాసవిగా -
కన్యక దేవి రూపంగా
వెలసితివమ్మా నీవమ్మా -
దర్శన ఈయగ రావమ్మా || 5 ||
వాసవి మాతా దర్శనము - సిరి
సంపదలకు ఆహ్వానం
కలుయుగమందున నీరూపం -
కల్మషనాశిని నీవమ్మా || 6 ||
కుసుమ రాజునకు
పుత్రికగా - కుసుమాంబా కూతురుగా
జనియించితివి లోకానా -
జనులందరికీ దేవతగా || 7 ||
అందం చందం నీవమ్మా- గుడికే
అందం నీవమ్మా
దర్శన మీయగ రావమ్మా-
కష్టాలను కడతేర్చమ్మా || 8 ||
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
పసిడి వెన్నెల కాంతులతో
- పదునాలుగు లోకాలల్లో
పయనించితివి నీవమ్మా - పార్వతి
రూపం నీవమ్మా || 9 ||
తెల్లని వస్త్రము
ధరియించి - శాంతికి రూపం నీవమ్మా
చల్లగ దీవెన లిచ్చావు -
సంతోషాని పెంచావు || 10 ||
దేవతలంతా నూకొకటి -
శాంతి దేవతవు నీవమ్మా
వైశ్యుల ఇంట వెలసితివి -
ధనలక్ష్మీగ నీవమ్మా || 11 ||
విరూపాక్షునికి సోదరిగా
- వైశ్యులందరికి దేవతగా
వెలసితివంటా మాయింట -
గుండెలలో నిలిచావంటా || 12 ||
చీరా, రవికా కోరితివి - పసుపు కుంకుమ లడిగితివి
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
భక్తి మార్గము
తెలిపితివి - భక్తుల మనసును దోచితివి || 13 ||
సమాధి నిన్ను కొలవంగా -
తపస్సు నిన్ను మెచ్చంగా
దర్శన మీయగ వచ్చితివి -
కోరిన కోర్కెను తీర్చితివి || 14 ||
ఏడు వందలా పదునాలుగు -
గోత్రము లున్నయ్ మనకంటు
నిలిచాయంటా నూట్రొండు -
వాసవి వెంట మనమంటూ || 15 ||
పెండ్లికుల గోత్రినిగా -
పెనుగొండాపురి వాసవిగా
సిరిసంపదలు ఇవ్వమ్మా-
పాపహారిణిగా రావమ్మా || 16 ||
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
శంఖు చక్రము ధరియించి -
విష్ణు వర్థనుని హతమార్చి
లోకమాతగా వెలిశావు -
భక్తుల మదిలో నిలిచాచు || 17 ||
దేవతలంతా వనగూడి -
శిరస్సును వంచి మ్రెక్కంగా
పసిడి వెన్నెల కాంతులతో
- పాద పద్మములు మెరవంగా || 18 ||
త్రిశూల ధారుణి మాతవుగా
- త్రిభువన పాలిని దేవతగా
తల్లిని, తండ్రివి నీవేగా - గురువు దైవము నీవమ్మా || 19 ||
ఆర్యవైశ్య కుల దేవతగా -
వైశ్యోద్ధారణ మాతవుగా
విశ్వ రూపము చూపితివి -
జ్ఞాన మార్గమును నింపితివి || 20 ||
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
ఎన్నో రూపాలున్నాయి -
అంతటా నీవే ఉన్నవు
ఏ పేరున నిన్నుపిలిచేము
- ఏ రూపముగా నిను కొలిచేము || 21 ||
సోమ దత్తుని పుత్రుకగా -
సౌభాగ్యవతి కానుకగా
భూలోకానికి వచ్చితివి -
భక్తుల కోర్కెలు తీర్చితివి || 22 ||
దుర్గాకాళీ అవతారం - దయచూపంగా
వచ్చితివి
దర్శన మీయగా రావమ్మా- కనకదుర్గ
అవతారం || 23 ||
వరాలనిచ్చే వరలక్ష్మీ-
దీవెనలన్నీ ఇవ్వమ్మా
కష్టాలన్నీ తొలగించి -
శాంతి సుఖములు ఇవ్వమ్మా || 24 ||
త్రిపురా సుందరి అవతారం
- మహిషాసురుని వదియించి
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
అద్భుతమైనది నీ మహిమా -
అతి సుందరము నీరూపం || 25 ||
కరుణించమ్మా లలితమ్మా-
కాపాడమ్మా కామాక్షమ్మా
దర్శన మీయగ రావమ్మా- కోరిన
కోర్కెలు తీర్చమ్మా || 26 ||
సర్వేశ్వరుని
ప్రియసతిగా - జగమంతటికి కన్యవుగా
వైశ్యుల సెవల నందుకొని -
అంతట నీవే నిండితివి || 27 ||
నలభై రోజుల మాలంటా -
వాసవి మాతామాకంత
ఆత్మాహుతి రోజున మేము -
పెను గొండాపురి చేరెదము || 28 ||
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
అంబా శాంభవి నీరూపం-
అద్భుతమైనది నీ రూపం
అతి సుందరము నీ దర్శనము
- అద్భుతమైనది నీ రూపం || 29 ||
వాసువులంతా రారండి -
దేవి రూపము చూడండి
అమ్మకు నీరాజన మివ్వండి
- వాసవి దీవెన పొందడి || 30 ||
భక్తవ శంకరి నీవమ్మ-
భవనా నీవమ్మా
అందరి శ్రేయస్సు
కోరెదవూ - అమ్మల గన్న అమ్మావు నీవమ్మా || 31 ||
ఆర్య వైశ్యులను బ్రోవంగా
- భువిలో వెలసితివి వాసవిగా
దుష్ఠ శిక్షణ సలుపుటకై
- అవతరించితివి భువిలోన || 32 ||
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
చిద్రూపిణివి నీవమ్మా-
చిద్విలాసినివి నీవమ్మా
శక్తి దాయినివి
నీవమ్మా- ముక్తి దాయినివి నీవమ్మా ||
33 ||
అరిషడ్వర్గము తొలగించి -
సద్గుణా వళిని చేకూర్చి
మెక్ష మెసంగి దేవతగా -
చల్లని తల్లిని నీవమ్మా || 34 ||
శక్తి పీఠమై వెలుగొంద -
సుప్రసిద్దమై పరగంగా
దివ్య మహిమలు జుపించు -
తేజోరూపిణి నీవమ్మా || 35 ||
భయభయ హారిణి నీవమ్మా -
కామేశ్వరిని నీవమ్మా
సర్వ వ్యాపిని నీవమ్మా-
దీనుల గావగ రావమ్మా || 36 ||
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
భక్తుల కోర్కెలు
తీర్చుటకై - పెనుగొండపురిలో వెలసితివి
నీ మహిమంబును కొనయాడగ -
ఆది శేషునికి తరమౌనా || 37 ||
పెనుగొండ పురమందు -
వాసవి కన్యకు దేవతగా
భక్తి జనావళి బ్రోవంగా -
శక్తి మాతగా వెలసితివి || 38 ||
మంగళ గౌరి నీ రూపం -
మనసుల నిండా నింపితిని (నింపండి)
వాసవి దేవికి మనమంతా -
మంగళ హారురులిద్దామా || 39 ||
వాసవి మాత సత్యప్రియా - జగతికి మూలం నీవమ్మా
కన్యక దేవీ అవతారం - జగమంటటికి ఆధారం
వాసవీ మాతా చాలీసా ప్రతీ దినం పటించినచో దరి
చేరలేవు నీ శోకాలు కలుగునులే శాంతి సుఖాలు
జై వాసవీ మాతా, జై జై వాసవీ మాతా
0 Comments