Andal Tiruppavai - ఆండాళ్ తిరుప్పావై

 Andal Tiruppavai - ఆండాళ్ తిరుప్పావై

Andal Tiruppavai - ఆండాళ్ తిరుప్పావై
Andal Tiruppavai - ఆండాళ్ తిరుప్పావై


మెదలు పెట్టేముందు శ్లోకం చదివి మెదలు పెట్టాలి

నీళాతుజ్ఞ స్తనగిరి తటీ

సుప్తము ద్బోద్యకృష్ణం

పారార్థ్యం స్వం శ్రుతి శత శిర

స్సిద్ద మద్యాప యన్తీ

స్వోచ్చిష్టా యాంస్ర జినిగళితం

యాబలాత్ కృత్యభుజ్త్కే

గోదాతస్యైనమ ఇదమిదం

భూయ వాస్తు భూయః

Andal Tiruppavai

ఆండాళ్ తిరుప్పావై

శ్రీమతే రామానుజాచార్యాయ నమః

అళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం

1.      శ్రీ శైలా చార్యులు దయకు పాత్రులు జ్ఞానభక్తి పరిపూర్ణులూ యతిరాజులకూ ప్రీతి పాత్రులు మణవాళ్ మామునికి వందనమూ కూరత్తాళ్వార్ తనియన్

2.      లక్ష్మినాయక నారాయణ శ్రీనాధమునులు శ్రీ ఆళవందార్లు

గురుపరంప రాచార్యులు పంక్తికి సేవించెదమూ యెల్లపుడూ

3.      సర్వేశ్వర తిరుచరణము తప్ప ఇతరవిషయములు తృణములుగా

తలచిన పూజ్యులు రామానుజులూ తిరువడినాశ్ర యించెదమూ

శ్రీ ఆళవందార్ తనియన్

4.      జననిజనకులు స్త్రీలుపుత్రులు వంశపుజనులూ నేమముచే

ఆళ్వారుల తిరువడిద్వయమగుచును శఠగోపులకూ వందనమూ

5.      ప్రసన్న జనులుమనోహరమగు పగడపుష్పముతో నొప్పినదో

శ్రీశఠగోపుల పాదద్వయమును శిరము చేత సేవించెదనూ

శ్రీవరాశరబట్టర్ తనియన్

6.      పూదత్తాళ్వార్ పొయ్ గెయారుల పేయాళ్వారు పెరియాళ్వార్ల

తిరుమల శై యాళ్వార్ కుల శేకరులా తొండరడిప్పొడియాళ్వార్ల

7.      తిరుమంగై యాళ్వార్ నమ్మాళ్వార్లును పూజ్యలగు ఎతిరాజులనూ

నిరతమునే సేవించువాడను తిరిపడిగళకూ ప్రణుతింతూ

అండాళ్ తిరునక్షత్ర తనియన్

8.      కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం

    పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీ రంగనాయకీం

ఆండాళామ్మ ఆనతిచ్చిన తిరుప్పావు

పల్లవి

9.      గోదాదేవి కోరిభజించేగోకులనాథుని చరితమునూ

          పెరియాళ్వారుల ముద్దులపట్టి పాడినపాటలు వినరండి

10. గోకులవాసుని గోపికలోలుని కోరిభజింతము రారండి

గోదాదేవీ కోరిక తీర్చిన రంగనాథునీ గానంబూ

11. క్షీరసాగరశాయికి లక్ష్మీ పాదములొత్తుచు నుండగనూ

      జననమరణ రాహిత్యముకొరకూ వుపాయమేమని ప్రశ్నించే

12. పనగశాయి బూమిపిరాట్టికీ ప్రియవచనములా యిటుబలి కే

      తురుత్తుళాయి పుష్పమాల కైంకర్యము నాకు శ్రేష్టంబూ

13. ఈరీతిగ నా భక్తుల అందరూ శ్రద్దతోనన్నే పూజించి

      ప్రకృతిబంధము విడుదలపొండి పరమపదంబూ పొందెదరూ

తిరుప్పావూ తనియన్

14. ఆండాలమ్మా ఆనతిచ్చినా తిరుప్పావనే ప్రబంధమూ

      భాగవతోత్తము లందరు చేరీ పరంధామునీ భజించుడీ

15. రుక్మిణిదేవితో కూడిసుఖించే కృష్ణస్వామిని మేల్కొలిపీ

      దాస్యము జేయు ఆసక్తిగలది శ్రీ ఆండాళుకు వందనమూ

16. హంసనడకల ఆండాలమ్మా అనుసంధాన రూపముతో

     పాతరూపముగ ప్రసాదించినా పుష్పమాలనూ ధరించెనూ

17. శ్రీ విల్లిపుత్తూరిలో అవతరించినా శూడికొడుత్త నాచ్చారు

     రంగనాథునికి సమర్పించినా గోదాగానము చేయండీ.

18. తగిన వయసుగల ఆండాళమ్మా తనకు నాథుడు రంగడనీ

      తాను ధరించిన ప్రేమమాలను రంగనిమెడలో వేసెనుగా.

19. శ్యామసుందరుని పెండ్లియాడుటకు శ్రీనివాసునీ ప్రార్థించీ

      ముప్పదిదినములు మగువలజేరీ ఉత్తమ వ్రరమూ జేసెనుగా

1 మార్గళి

20. మార్గశీర్షమూ శుక్లపక్షమూ శుభదినంబు సమకూడినదీ

      నంద యశోదల పుత్రుడైన శ్రీ కృష్ణుని గానము చేయగనూ

21. మనకు నాథుడని మార్గళినోముకు ఇచ్చగించువారలు రండీ

     భవసాగర తాపము దీరుటకూ యమునాస్నానము చేయుదమూ

22. శ్రీ విల్లిపుత్తూరి గోదాదేవి గోపిక స్త్రీలను పిలవగనూ

      కృష్ణరసాయన పానముకొరకూ మార్గళినోముకు రారండీ

2 వైయత్తు

23. భోగ్యమైన వస్తువులు భుజింపము అలంకారమూ వలదు సుమా

      శ్రీయః పతియగు సర్వేశ్వరుని తిరువడి ధ్యానము మాకిమ్మా

24. సన్యాసులకూ బ్రహ్మచారులకు శక్తికొలది దానము చేసి

      కొండెము జెప్పక కృష్ణసన్నిధికి నోమునోచనూ రారండీ

3 ఓంగి

25. త్రిలోకములు నీ పాదస్పర్శచే కొలచిన పురుషోత్తముడవుగా

      ప్రీతితోపాడీ సంకల్పించి ప్రార్థనచే నీరాడినచో

26. లోకమంతటా క్షామములేక అమృతవర్షము కురియునుగా

      ఐశ్వర్యము సంపూర్ణమునుండు పశుసమృద్ది బాగుండూ

4 ఆ

27. గోపికలతో శ్రీ ఆండాళమ్మా వరుణదేవుని ప్రార్థించీ

      దేశమంతటా సుఖించునట్లు ఓ పర్జన్యుడ వర్షింపూ

28. శీతలజలముల స్నానము చేసి నీలమేఘునీ ధ్యానించీ

      మందగమనులూ మాధవ సేవకు ముందుగపోదము రమ్మనిరీ

5 మాయనై

29. ఉత్తర మధురలో అవతరించినా దామెదర తిరునామములు

      శుచిగావచ్చీ మనసాతలచీ అంజలి చేసినవారలకూ

30. అగ్నిలొ పడినా దూదిరీతిగా పాపము భస్మము చేయునుగా

     ఆండాళమ్మా ఆనతిచ్చిరీ అతివలందరికి యీరీతి

6 పుళ్ళుం

31. గరుత్మంతుని ప్రభువగు తండ్రీ పూతన శకటా సంహారి

     అనంత శాయిని మహాత్ములందరు హరిహరీయని పొగడిరిగా

32. సర్వేశ్వరునీ తెల్లనిశంకూ గొప్పధ్వనియూ వినలేదా

     తరుణి నీవూ తెల్లవారినది మేల్కొనుమాయని లేపిరిగా

7 కీశుకీశు

33. భరద్వాజపక్షులు కీచుకీచని అరచెడి ధ్వనియూ వినలేదా

      గొల్లపడుచులు పెరుగుచిలికెడీ గలగల శబ్దము వినలేదా

34. స్త్రీలకందరికి స్వామియైన శ్రీమన్నారాయణ అవతారమును

     మధుర గానమూ పాడిన పాటలు వినలేదా నీ వీనులకూ

8 కీశు

35. తూర్పుదిక్కునా తెల్లవారినది తెలియద నీకు ఓ లలనా

      చంద్రబింబముఖ కాంతిచె నీకూ అరుణోదయమూ తోచెనుగా

36. గోపికగోష్టీ కృష్ణగానము పాడుచు వాకిట నిలిచిరిగా

     దేవదేవినీ ప్రార్థన చేయూ నిన్ను పిలువగా వచ్చితిమీ

9 తూమణి

37. మంచితత్నములు పొదగిన మేడలో దీప కాంతులూ పరిమళము

      మెత్తని పాన్పుపై పవ్వళించిన మేనత్త కూతుర లేలెమ్మా

38. వాసుదేవ వైకుంఠనాథుడని సర్వేశ్వర తిరునామములూ

      ఆర్తితో మేమూ పాడినగానీ చెవుడా మూగవ మేల్కొనుమా

10 నొత్తు

39. నోముచె సుఖము పొందదలచినా తరుణీ తలుపు తెరువమ్మా

     తులసీ మాలను ధరించిన శ్రీ పరమేశ్వరునీ స్మరించనూ

40. గాఢనిద్రలోనున్న గోపికను గోదాదేవి పిలిచిరిగా

     శ్యామసుందరుని చేరిభజింతము ప్రధానులారా రావమ్మా

11 కత్తు

41. కదలక మెదలక నిద్రించుటలో లాభము ఏముందీ

      కాళమేఘశ్రీ కేశవచరితము గానమూ చేయను లేవమ్మా

42. బంగారపు తీగెవంటి దానవా భవసాగరమూ తరించనూ

     ప్రణవ స్వరూపుని పాటలు పాడుచు నీవాకిటనే నిలిచిరిగా

12 కనై

43. సర్వ సంపదగల సహోదరీ గుంపుగ వాకిట నిలిచితిమీ

          పరంధాముని స్తోత్రము చేసీ మంచులో మేమూ తడిసితిమీ

44. సీతాదేవిని యెడబాసిన శ్రీ రామచంద్రునీ నామమునూ

      చింతించుటకూ తగిన సమయమిది వేగమె నిద్ర లేవమ్మా

13 పుళ్ళిన్

45. రామకృష్ణుల వీర చరితమూ పాడుచూ నోమునోచుటకూ

     చల్లని యమునా స్నానము చేయక నిద్రలో వుండ తగదుసుమా

46. కృష్ణుని చేరీ సుఖించుకొరకు మంచిసమయమిదె లేవమ్మా

     ప్రభాత సమయ పక్షుల ధ్వనియు అందగత్తెనువు వినలేదా

14 పుంగళ్

47. తపస్యలును శ్రీ వైష్ణవోత్తములు పుండరీకాక్షుని ప్రార్థనకు

      అతిశీఘ్రముగా ఆలయమునకు తలుపు తెరవను పోయిరిగా

48. అందరికన్న ముందుగవచ్చీ లేపునటుల చెప్పిన బాలా

      మధురభాషిణీ మేల్కొనవేమీ మాధవగానము పాడుటకూ

15 ఎల్లే

49. చిలుకవంటి మృదు పలుకులు పలికే గోపిక లేచి రావమ్మా

     కువలయాపీడ సంహారకునీ స్తోత్రము చేయను పోవుదమూ

50. ఆండాళమ్మా పిలిచిన పలుకు గోపిక స్త్రీకి వినగానే

      ఎందుకు తొందర ఇదోవచ్చెదను రాదలచిన వారొచ్చెదరా

51. భాగవతుల గోష్టిని సేవించను శ్రీరాముని కీర్తించుటకు

      చమత్కారగల గోపికనీవూ లెక్క పెట్టి చూడుము తల్లీ

52. నందగోపునీ తిరుమాళిగెనూ కాచిన ద్వారా పాలకుడా

     అందమైన ఈ తలుపు గడియను తెరవమని అందరు వేడా

16 నాయగ

53. నీలవర్ణము గల శ్రీకృష్ణుడు మాకు విశేష వాద్యములూ

     ఇచ్చునటుల వాగ్దానము జేసెను దాసుల మేము వచ్చితిమీ

54. మనసులో నీవూ ఏమి తలచినా వాక్కులో బదులు చెప్పకుమా

      పరిశుద్దులమై పాడవచ్చితిమి పరంధామునీ నామములు

17 అంబర

55. నందగోప యశోదాదేవీ ఈ కులమంగళజ్యోతియై

      ధారగాపోషక భోగ్యములిచ్చే ప్రభువా మీరు మేల్కొనరో

56. శ్రీ మంతుడ బలరాముడ శ్రీ కృష్ణస్వామిమెల్కొనరో

      వామనరూపా వాసుదేవ నీ పాదపద్మములకు వందనమూ

18 వుందు

57. తల్లిదండ్రులా అన్నదమ్ములా పిలిచినఫలమూ ఏముందీ

      పురుషాకార నప్పినపిరాట్టిని ప్రార్థన మనమూ చేయవలెన్

58. కోకిలగుంపు కూయుచున్నది తెల్లవారెను లేవమ్మా

      నందగోపుని కోడలా నీవూ తలుపు తెరువు తిరుహస్తముచే

19 కుత్తు

59. స్తంభదీపములు ప్రకాశించగా దంతపు కాళ్ళమంచముపై

          సౌందర్యము శైత్యము దావళ్యము మార్ధమ పరిమళ పాన్పుపై

60. పూలకొప్పుగల నాయకిగూడ కౌగిలించి శయనించిన స్వామీ

      నోరు తెరచి మీ అమృత వాక్కులు ప్రసాదంచమని వేడెదము

61. రుక్మిణీ దేవి ప్రాణనాథునీ ఒక క్షణమైనా లేవనీయకా

      వుండుట మీకి స్వరూపముగాదు ఆండాళమ్మా నుడివిరిగా

20 ముప్పత్తు

62. ముప్పదుమూడు కోట్ల దేవతల ముప్పు వచ్చుటకు ముందుగా

      ఆపద తీర్చిన గీతాచార్య ఆనందముతో మేల్కొనుమా

63. మహాలక్ష్మీ నప్పినపిరాట్టి పూర్ణ ప్రేమతో దయగనుమా

      విరహముచే శ్రమజెందిన మమ్ముల కరుణించుము నీళాదేవి

64. వ్రత సామాగ్రి ఆలపట్టము అద్దము నొసగి మమ్ములనూ

     పార్థసారధితో తీర్థమాడించి సుఖింపజేయుము ఈ క్షణమే

21 ఏత్త

65. రుక్మిణి దేవి గోపికలందరు కృష్ణుని వీరచరితమునూ

      స్తుతించి మంగళములు పాడుచునూ వాకిటవచ్చీ నిలిచితిమీ

66. గోవిందుని ప్రార్థింతము రండూ కోరిక పూర్తి చేసెదనూ

      చింతన వలదని సమాధాన వాక్యము పలికే శ్రీ లక్ష్మీ

22 అంగణ్

67. రాజ్యమేలు ఈ పృథ్వీ రాజులు శరణు పొందురీతిగా

      భక్తులందరూ సమీపించితిమి నీ సన్నిధిలో చేరుటకూ

68. ఎర్రకలువులా నొప్పునేత్రముల సూర్యచంద్రులా ప్రకాశమూ

 నీకడగంటిలో కటాక్షింపవా మా పాపములు తొలగునుగా

23 మారి

69. వర్షాకాలము పర్వతగుహలో మేల్కొను సింహము రీతిగా

      నీ శయనాగృహమునుండి ఈ మణిమంటపముమునకు వేంచేయూ

70. జయప్రదము సింహాసనముపై గూరుచుండి మా కార్యమునూ

      విచారించి కృప చేయుమాయనీ ప్రార్థన చేసిరీ గోపికలూ

24 అంతు

71. గోపికలారా మీ ప్రార్థనచే శయనాగృహమూ విడిచితిని

      మీ కోర్కెలను తీర్చెదనేనూ నన్ను క్షమాపణ చేయుడికా

72. ఒయ్యారముతో వేంచేసిన వటపత్ర శాయినీ సేవించి

      గోపికలందరు గోదాదేవితో మంగళాశాసనం చేసిరిగా

73. వాద్యవిశేషము పురుషార్థములు పల్లవదారిని వేడిరిగా

      ప్రణవ స్వరూపుడు గీతాచార్యుడు ప్రసాదించెను పణతులకూ

25 ఒరుత్తి

74. ఒక్క రాత్రిలో దేవకిపుత్ర యశోద తనయుడై పెరిగితివీ

     మా మనోరథము లీడేర్చిన వటపత్ర శాయితో సుఖింతమూ

75. ఈ చలికోర్చి శ్రమపడి వచ్చిన గోపికలారా రారమ్మా

     తరుగని సంపద యిచ్చెద మీకు సంతోషముతో వుండుడికా

26 మాలే

76. ప్రళయాంతమున మర్రి చిదురుపై పవ్వళించినా శ్రీ నాథా

      ఉత్తమపురుషులు అనుష్టించెడీ మార్గళిస్నాన క్రమమున్ను

77. వింటిరేని మీకు దెల్పెదా వున్నతమైన ప్రభావమూ

      నీ తిరునామము పానము చేసీ తురుప్పల్లాండు పాడెదమూ

78. పావనమూర్తి పాంచజన్యము వాద్యవిశేష ధ్వజములనూ

      మంగళకర దీపముమేల్ కట్టు కృపచేయుము కరుణాకరా

27 కూడారై

79. శత్రులందరిని జయించు స్వామీ జగదోద్దారునీ సేవించీ

      జానకీ రమణుని ప్రాప్యముపొంద సన్మానమునూ తెల్పెదమూ

80. సమస్త తిరువాభరణంబులనూ పట్టు చీరలూ ధరింతమూ

      అందమైన గోవిందునినామము అందరు చేరీ పాడెదమూ

81. నెయ్యితో చేర్చిన క్షీరాన్నమును ముంజేతికారునటుల్ భుజియించీ

     దేవదేవునీ కూడి సుఖించే చింతనమాకు వున్నదిగా

28 కత్తు

82. ఆండాళమ్మా గోపికలతో శ్రీ కృషుణుని ప్రార్థన చేసిరిగా

      పశువులమేపి జీవించువారము గొల్లకులమునా అవతారం

83. గలిగినట్టి ఓ పుణ్యపురుషుడా మీతో మాకు సంబంధం

     తొలగత్రోసినా పోజాలదుగా తెలివిలేని ఈ గొల్లలమూ

84. చులకనతో మీ పేరులు పిలిచితిమి కోపగించకూ దయానిధీ

      మధుసూదన కృపచేయవలెను ఇక మీ చిత్తం మా భాగ్యము తండ్రీ

24 శిత్తుం

85. సర్వకాల సర్వావస్థలందును ఎన్ని జన్మములు వచ్చిననూ

      అంతరంగ కైంకర్యము నొసగీ అజ్ఞానమునూ పోదోలూ

86. వ్యవహారార్థము నోము నోచితిమి వుండజాలము మిమువిడచి

      ఇతర చింతలు కలుగజేయకా తిరువడిధ్యానము మాకిమ్మా

30 వంగ

87. తిరువాయ్ పాడిలో అవతరించినా కృష్ణగోపిక లీలలను

      అందమైన శ్రీవిల్లిపుత్తూరి పెరియాళ్వార్ల పుత్రికయూ

88. ఆండాళమ్మా ద్రవిడ భాషలో ఆనతిచ్చినా తిరుప్పావూ

      ముప్పదు పాశురసూక్తి మాలగా అనుసందించువారలకూ

89. శ్రీయః పతియగు సర్వేశ్వరుడూ ఇహపరలోకములందును

     పూర్ణకటాక్షము అనుగ్రహించును బ్రహ్మానందము పొందెదరు

90. రంగనాథుడూ పరమాచార్యులు అంతరాలయమున నిలచీ

      సర్వజనులకు సులభగ్రాహ్యాము సులలితబోధను పలికించే

91. మంత్రస్వరూపుడు రంగనాథుడు మమ్ములనేలినా వారలూ

      రంగనాయకిని బ్రోచినవారి తిరువడిగళకూ ప్రణుతింతూ

92. భావశుద్దితో ఈ ప్రబంధమూ అభ్యసించువారలకూ

      సంశయ రాహిత్యము గలవారికి తప్పక మెక్షము సిద్దించూ

93. బౌరంగపురిలో భక్తులందరూ భజనచేసిరీ యీరీతి

     ముప్పదిపాశుర తొహరామాలను గానము చేసిరి శ్రద్దగనూ

94. భక్తుల పెన్నిధి ఆండాళమ్మా రాజమదాసిని మరువకమా

      భవసాగరము తరింపజేసి ముకిభాగ్యము దయచేయూ

శ్రీరంగాజయ శ్రీరంగాజయ శ్రీరంగాజయ శ్రీరంగా

శ్రీరంగాజయ శ్రీరంగాజయ శ్రీరంగాజయ శ్రీరంగా

తిరుప్పావు తొహరగానము సంపూర్ణం

ఆండాళ్ తిరువడిగళే శరణం

జీయర్ తిరువడిగళే శరణం

అస్మద్ గురుభ్యోనమః

Facebook

లక్ష్మీ కటాక్షము కథ

Post a Comment

0 Comments