Ganapathi Chalisa - గణపతి చాలీసా
Ganapathi Chalisa - గణపతి చాలీసా |
ఏకదంతం మహకాయం తప్త కాంచన సన్నిభం
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్
గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్సరం బ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః
1. కాలగణపతి మహగణపతి అభయమిచ్చు తండ్రి, మా విజయ గణపతి మా విజయ గణపతి
2. పార్వతి మాత ముద్దు బిడ్డ నీవు వరము లొసుగు తండ్రి మా సిద్ది గణపతి మా సిద్ది గణపతి
3. పార్వతి మాత దేహమందు నుండి ఉత్పన్నమైన నలుగు పిండి నుంచి ఉద్భవించిన మా ఉద్భవ గణపతి మా ఉద్భవ గణపతి
4. తొలుతనే విఘ్నములు తొలుగుటకు నిన్ను ప్రార్ధింతురందరు మా విఘ్న గణపతి, మా విఘ్న గణపతి
5. మూషికాసురుని గర్వమణిచి నీవు నీ సేవకునిగ చేసుకొన్న మా వీర గణపతి, మా వీర గణపతి
6. ఆరోగ్య ప్రదాతైన సుబ్రమణ్యునికి తొలి గురువై నిలిచిన మా విద్యా గణపతి, మా విద్యా గణపతి
7. కోరిన వారికి కొంగు బంగారమై కొర్కలు తీర్చేటి మా లక్ష్మి గణపతి, మా లక్ష్మి గణపతి
8. అటుకులు కొబ్బరి పలుకులు నీకు సమర్పించిరందరు పూజింతురయ్య మా హేరంబ గణపతి, మా హేరంబ గణపతి
9. చల్లని తెల్లని వర్ణము కలిగిన ఆ చంద్రుని కన్న చల్లని మనసయ్య మా అర్క గణపతి, మా అర్క గణపతి
10. బుద్దిని, సిద్దిని, జ్ఞానాన్ని మాకు నీ విత్తువయ్య మా యెగ గణపతి, మా యెగ గణపతి
11. క్షీరఘటము నందు ఆ చవతి చంద్రుని చూచి నంతనే అపవాదము అసంభవించి వాసుదేవుడు నిన్ను ప్రార్థింపగ దర్శనమిచ్చిన మా ప్రసన్న గణపతి, మా ప్రసన్న గణపతి
12. కుష్టు వ్యాధీ నివారణకై ఆ సాంబుడు నిన్ను ప్రార్ధింపగా ప్రత్యక్షమైన మా భక్త గణపతి, మా భక్త గణపతి
13. ఆ ధర్మరాజు విజయము కొరకై నిన్ను ఆరాదింపగ వెనువెంటనే విజయమెసిగిన మా శక్తి గణపతి, మా శక్తి గణపతి
14. కుడుములు ఉండ్రాళ్ళు మెదకము నీకు సమర్పించిరందరు పూజింతురయ్య మా బొజ్జ గణపతి, మా బొజ్జ గణపతి
15. చెంగల్వ, చామంతి, గన్నేరు పూలతోనే అర్చించి నిన్నువరము నొందురే మా వర గణపతి, మా వర గణపతి
16. సృష్టిని రచియించెడి ఆ బ్రహ్మకైనా నీ ప్రార్థన సేయకనే ముందుకు పోవునా మా సృష్టి గణపతి, మా సృష్టి గణపతి
17. కైలాసములోని ఆ పరమ శివుడైన నీ రూపము చూడనిదే నృత్యము చేయునా మా నృత్య గణపతి, మా నృత్య గణపతి
18. ఆ గంగ మాతను భూమిపైకి తెచ్చుటకు భగీరథుడును నిన్ను ప్రార్థింపగ దయ చూపిన మా తరుణ గణపతి, మా తరుణ గణపతి
19. గరుడ, గందర్వ, కిన్నెర, కింపురుషులైన నీ వ్రతము చేయక ముందుకు పోదురా మా గరుడ గణపతి, మా గరుడ గణపతి
20. వృతాసురుని హతమార్చి ఆ ఇంద్రుడు నిన్ను ప్రార్థింపగ దర్శన మిచ్చిన మా ఉచ్చిష్ట గణపతి, మా ఉచ్చిష్ట గణపతి
21. చంద్రుని రూపము కలిగిన మా స్వామి చల్లగ మమ్ము దీవించవయ్య మా శ్వేత గణపతి, మా శ్వేత గణపతి
22. బంగారు వర్ణము కలిగిన మా గణపయ్య బంగారు వర్ణమునే కురిపించవయ్య మా సువర్ణ గణపతి, మా సువర్ణ గణపతి
23. నారదుడు, తంబురుడు అంజనేయుడైన నీ గానము సేయక హరిని స్మరింపరే మా నారద గణపతి, మా నారద గణపతి
24. సీతాదేవిని వెతుకుతకై ఆ రామచంద్రుడు నిన్ను ప్రార్థింపగ ఉద్భవించిన మా సంకష్టహర గణపతి, మా సంకష్టహర గణపతి
25. కైలసములోని ఆ నందిశ్వరుడైన నిన్ను ప్రార్థింపగ శివ ధ్యానమే చేయగలుగునా మా ఉద్దండ గణపతి, మా ఉద్దండ గణపతి
26. యజ్ఞోపవీతం దారణకై నీవు నాగులనే ధరించిన మా నాగ గణపతి, మా నాగ గణపతి
27. భండాసురుని హతమార్చి ఆ పార్వతి మాత నిన్ను పిలిచి నంతనే వచ్చి యంత్రము భేదించిన మా దుర్గ గణపతి, మా దుర్గ గణపతి
28. వేదములు వ్రాయుటకు ఆ వ్యాసుడు నిన్ను ప్రార్థింపగ దర్శనమిచ్చిన మా శారద గణపతి, మా శారద గణపతి
29. గణములకు అధ్యక్షుడు నీవేనయ్య గణములను శాసించే వాడువు నీవే మా కార గణపతి, మా కార గణపతి
30. గజముఖమునే కలిగిన సుందకార ఐశ్వర్యమెసగు తండ్రి మా ద్విముఖ గణపతి, మా ద్విముఖ గణపతి
31. పూజలు, నోములు చేయని వారికి నీ ధ్యానమే ముక్తి నొసగు తండ్రి మా క్షిప్ర గణపతి, మా క్షిప్ర గణపతి
32. ఏల్నాటి శనితో బాధ పడువారికి నీ పూజలే దారిని చూపు తండ్రి మా సింహ గణపతి, మా సింహ గణపతి
33. ఉదయము నీ ధ్యానము చేసుకొనువారు కష్టములన్ని తొలగి సుఖపడుదురు మా జ్ఞాన గణపతి, మా జ్ఞాన గణపతి
34. అసాధ్యమును సాధ్యము చేసెడి మా గణపయ్యా నీ శక్తిని మా కొసగుమా మా గోకర్ణ గణపతి, మా గోకర్ణ గణపతి
35. బీమసేనుడు కుంబదైత్యుని హతమార్చి నిన్ను ప్రార్ధింపగ ఉద్భవించిన మా అనె గుడ్డె గణపతి, మా అనె గుడ్డె గణపతి
36. వివాహమగుటకు కన్నె పిల్లలకు నీ దీక్షయే ఫలితమీయు తండ్రి మా హరిద్రా గణపతి, మా హరిద్రా గణపతి
37. సూర్యుని తేజము కలిగిన మా గణపయ్య నీ తేజము మా కొసగుమా మా ఆదిత్య గణపతి, మా ఆదిత్య గణపతి
38. ఋణములు కలిగిన వారికి నీవు ఋణములు పొగొట్టెడి మా ఋణ విమెచన గణపతి, మా ఋణ విమెచన గణపతి
39. మూషికాసురని హతమార్చి నీవు నీ దంతమునే ఆయుధముగ చేసుకొన్న స్వామి మా ఏకదంత గణపతి, మా ఏకదంత గణపతి
40. పార్వతి మాత వర పుత్రుడ నీవు వరము లొసగు తండ్రి మా కాణిపాకం గణపతి, మా కాణిపాకం గణపతి
ఓ పార్వతి తనయ నా పలుకులందు దోషములున్న మన్నింపుము సదా నన్ను రక్షించుము
మంగళ హరతి స్వీకరింపుమా ఓ గణపతి సదా నా సంగటములను తొలగింపుము
0 Comments