Sri Vasavi Kanyaka Ashtakam – శ్రీ వాసవీకన్యకాష్టకం
Sri Vasavi Kanyaka Ashtakam – శ్రీ వాసవీకన్యకాష్టకం |
1. ఇంద్ర సురార్చిత
వాసవి కన్యే - మందర ధరణి సహోదర కన్యే
ఇందువదన
సతి పార్వతి కన్యే - తత్ప్రణమామి సదాశివ
కన్యే
2. నిగమ వినోదిని నిశ్చల
కన్యే - నిగమాతీత కళాత్మిక కన్యే
భగవతి
శంకరి భార్గవి కన్యే - తత్ప్రణమామి
సదాశివ కన్యే
3. కనకాంబర కరుణాకరి
కన్యే - సనకస నందన వందిత కన్యే
మునిజన సురనుత వాసవి కన్యే - తత్ప్రణమామి సదాశివ కన్యే
4. విశ్వ స్వరూపిణి వాసవి
కన్యే - విశ్వ వ్యాపిని వాసవి
కన్యే
విశ్వంబరి
శ్రీ వాసవి కన్యే - తత్ప్రణమామి
సదాశివ కన్యే
5. నగరేశ్వర సతి మంగళ
కన్యే - నారద వందిత పూజిత కన్యే
తిమూర్తి
పూజిత శక్తివి కన్యే - తత్ప్రణమామి
సదాశివ కన్యే
6. కమలనయన కనకాంబర
కన్యే - విమల చరిత విద్యాధరి కన్యే
సుమనోహరి సురవందిత కన్యే - తత్ప్రణమామి
సదాశివ కన్యే
7. దుష్టుల శిక్షింప దుర్గవు కన్యే - శిష్టుల రక్షింప శంకరి కన్యే
కష్ట
నివారిణి వాసవి కన్యే - తత్ప్రణమామి
సదాశివ కన్యే
8. అఖిలరూపిణి అక్షయ
కన్యే - అనంత నామ రూపిణి కన్యే
అనంత
భక్తుల పూజిత కన్యే - తత్ప్రణమామి
సదాశివ కన్యే
శ్రీ వాసవి కన్యకాష్టకం సంపూర్ణం
Sri Vasavi Kanyaka Ashtakam – శ్రీ వాసవీకన్యకాష్టకం 2
నమె దేవ్యై సుభద్రాయై -కన్యకాయై నమె నమః
శుభం కురు మహాదేవి -వాసవ్యై చ నమె నమః
జయాయై చంద్రరూపాయై -చండికాయై నమె నమః
శాంతి మావహ నో దేవి - వాసవ్యై చ నమె నమః
నందాయై తే నమస్తే స్తు-గౌర్యౌ దేవ్యై నమె నమః
పాహి నః పుత్రదారాంశ్చ-వాసవ్యై చ నమె నమః
అపర్ణాయై నమస్తే స్తు- గౌర్యౌ దేవ్యై నమె నమః
నమః కమల హస్తాయై -వాసవ్యై చ నమె నమః
చతుర్భుజాయై శర్వాణ్యై- శుకపాణ్యై నమె నమః
సుముఖాయై నమస్తేస్తు- వాసవ్యై తే కులాలయై
కమలాయై నమస్తేస్తు-విష్ణు నేత్ర కులాలయే
మృడాన్యై తే నమస్తేస్తు-వాసవ్యై తే కులాలయై
నమ శ్సీతలపాదాయై-నమ్స్తే పరమేశ్వరి
శ్రియం నో దేహి మత స్త్వం-వాసవ్యై తే కులాలయై
త్వర్పాదపద్మ విన్యాసం - చంద్రమండల శీతలం
గృహేషు సర్వదా స్మాకం- దేహి శ్రీ పరమేశ్వరి
ఇతి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం సంపూర్ణం
Sri Vasavi Kanyaka Ashtakam – శ్రీ వాసవీకన్యకాష్టకం 3
కన్యకాంబా, కన్యకాంబా, కన్యకాంబా పాహిమాం
వాసవీ శ్రీ కన్యకాపరమేశ్వరీ జయ రక్షమాం
కమలహస్తే, కమలవదనే కరుణాహృదయే పాహిమాం
కనకవర్ణే కన్యరూపిణి కనకవదనే రక్షమాం
పాపనాశిని పరమ పావని భయనివారిణి పాహిమాం
దుష్టశిక్షణ శిష్టరక్షణి భక్తరక్షణి రక్షమాం
భద్ర రూపిణి భద్రదాయిని భక్త పాలిని పాహిమాం
భక్తరంజని శక్తి రూపిణి ముక్తిదాయిని రక్షమాం
కుసుమపుత్రి అసమగాత్రి కమలనేత్రి పాహిమాం
విష్ణువర్దన వంశమర్ధిని విమల చరితే రక్షమాం
భక్తి తో పఠించువారల పరమ పావని పాహిమాం
ఇహపరాదుల కోర్కెలిచ్చెడు ఈశ్వరీ జయ రక్షమాం
వైశ్యతోషిణి విశ్వపోషిణి విశ్వరూపిణి పాహిమాం
విశ్వ మెహిని విశ్వపావని వైశ్యరక్షణి రక్షమాం
వరము లొసగెడు భక్తజనులకు వరద రూపిణి పాహిమాం
వాసిగా పెనుగొండ పట్టణ క్షేత్రవాసిని రక్షమాం
ఇతి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం సంపూర్ణం
0 Comments