Sundarakanda 4 - సుందరకాండ 4 |
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి
కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు
దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయంమేను
అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 151 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
గజ దంతములచే నిర్మితమైన వేయి హంసలతో ఒనరుగ నున్న
గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్ఠమైన ఒక శిబిక యందున
శుక్లాంబరముల దాల్చినవారు రామలక్ష్మణులు అగుపించినారు
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 152 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నాల్గు దంతముల ఏనుగుపైన రామలక్ష్మణులు ఏతెంచినారు
వైదేహికి ఇరు వంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు
మువ్వురతో ఆ మహాగజము లంకాపురిపై చేసెను పయనము
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 153 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే
పలికెద సీతా రామకథ
సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరముపైన
శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము జేర్చను
అవనీజాత రవి చంద్రులను చేతులారగ తాకుచుండెను
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 154 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పాలకడలిలో తెల్లని ఒక గిరి గిరిపై గిరివలె తెల్లెని ఒక కరి
కరిపై మంగళకరమౌ అంబారి అంబారిపైన శ్రీ రామమూర్తి
చిరునగవులతో ఆసీనుడయ్యె జగదభి రాముడు పూర్వాభి ముఖుడై
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 155 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
దేవతలందరు పరిసేవింప ఋషి గణంబులు అభిషేకింప
గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందు నుతింప
సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 156 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
బ్రహ్మము, సత్యము జ్ఞనము, తపము
బీజము, క్షేతము మూలకారణము
సరసిజనాభుడు చతుర్బుజుడు శంఖచక్ర గదా యుధ ధరుడు
శ్రీవత్సాంకిత విశల వక్షుడు శ్యామసుందరుడు సీతారాముడు
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 157 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు
కాలాంబరమును ధరియించినాడు కర వీర మాల దాల్చినాడు
పుష్పమందుండి నేలబడినాడు కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 158 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన
ఇంద్రజిత్తు మకరముపైన దక్షిణ దిశగా పడిపోయినారు
రాక్షసులందరు గుంపు గుంపులుగ మన్నున గలిసిరి సమ్మూలమ్ముగ
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 159 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
వరాహముపై పోవు రావణుడు భయపడి బెదిరి జారిపడినాడు
వెర్రివానివలె కేకలిడినాడు వన్త్రహీనుడై పరుగిడినాడు
దుర్గంధ పంక కూపమందున దుర్గతిపాలై తూలిపడినాడు
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 160 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
తల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేన బూసికిని
నృత్య మృదంగ మంగళ ధ్వనులతో చంద్రకాంతు లెగజిమ్ము ఛత్రముతో
తెల్లని కరిపై మంత్రి వర్యులతో వెడలె విభీషణుడు దివ్యకాంతితో
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 161 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను
రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహియించినాడు
ప్రళయ భయానక సదృశమాయెను సాగరమును లంక మునిగిపోయెను
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 162 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగ పలుకుడు ఇక మీదట
ప్రాధేయపడుడు అభయమిమ్మని ఆపదల నుండి రక్షింపుమని
లేకుండిన మిమ్మందరితోడ చంపగ మానడు శ్రీ రఘువీరుడు
అని దెల్చె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము || 163 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అని బల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల
నే కలగన్నది నిజమౌ గాక సీతాదేవికి మంచి కాలమిక
ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదరుచుండెగా
ఎడమ భూజము తొడ అదరుచుండెగా రాముడు రాగల శుభ సూచనగా || 164 ||
అని బల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల
సీతామాత మహా పతివ్రత భువిని బోలిన క్షమా దేవత
మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు
సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదదే పక్షి గొంతుక || 165 ||
అని పల్కు త్రిజట మాటలు వినుచూ రాక్షస వనితలు నిద్ర దూగిరి
రావణుండు నాకు ఒసగిన గడువు రెండు నెలలలో తీరిపోవు
ఈలోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్న
రావణుచేత మడియుట కన్న నాకై నేనే పోవిట మిన్న
అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున || 166 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రావణుండు నాకు ఒసగిన గడువు రెండు నెలలలో తీరిపోవు
ఈలోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్న
రావణుచేత మడియుట కన్న నాకై నేనే పోవుట మిన్న
అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున || 167 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మారీచుడు తన పన్నాగమున రామలక్ష్మణుల చంపి యుండునా?
నా దౌర్భాగ్యమె లేడి రూపమున మమ్మీరీతిగ దూరము చేసెనా?
కడకీనాటికి ఇంత విషమైన కరవయ్యె నాకు లంకాపురమున
అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమున || 168 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున గడగడ వణకుచు
జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా గొని మెల్లగ నిలిచి
శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసికొని
ప్రాణత్యాగము చేయబూనగా శుభ శుకునములు తోచె వింతగా || 169 ||
మీను కదపిన పద్మమువోలె నీరజాక్షికి ఎడమ కన్నదరె
పురుషోత్తముని ప్రేమ కౌగిలిలో చుంబనలందిన ఎడమ భుజమదరె
శ్రీ రఘురాముని అనురాగమున కలసి మెలసిన ఎడమ తొడ అదరె
శుభ
శకునోదయ కాంతులు విరిసె చిరునగ వొలుకగ జానికి గాంచె || 170 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సీతకెంత దురవస్త ఘటిల్లె నా తల్లి నెటుల ఊరడించవలె
నన్ను నే నెటుల తెల్పుకోవలె తల్లి నెటుల కాపాడుకోవలె
ఏ మాత్రము నే ఆలసించినా సీతామాత ప్రాణములుండునా?
అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను || 171 ||
ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతా రామకథ
సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది
సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకున తేనెలొలుకునది
అని హనుమంతుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ || 172 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
దశరథ విభుడు రాజోత్తముడు పుణ్యశీలుడు కీర్తిమంతుడు
రాజర్షులలో ఉత్తమెత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు
అయెద్యాపురి రాజధానిగ కోసల రాజ్యము ఏలుచుండెగ
అని
హనుమంతుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ || 173 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
దశరథునకు కడు ప్రియమైనవాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీఘురాముడు
సత్యవంతుడు జ్ఞాన శ్రేష్ఠుడు ధనుర్థరులలో అగ్రగణ్యుడు
ధర్మరక్షకుడు శ్రితజనపాలుడు పితృవాక్య పరిపాలన శీలుడు
అని హనుమంతుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ || 174 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
శ్రీ రాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభసమయమున
చిన్నభార్య కైక దశరథుజేరి తనకొసగిన రెండు వరములు కోరె
భరతునకు పట్టాభిషేకము పదునాలుగేండ్లు రామ వనవాసము
అని హనుమంతుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ || 175 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
తండ్రిమాట నిలుప రామచంద్రుడు వల్కల ధారియై రాజ్యము వీడె
సీతాలక్ష్మణులు తనతో రాగ పదునాల్గేండ్లు వనవాస మేగ
ఖరదూషణాది పదునాల్గువేల అసురల జంపె జనస్థానమున
అని హనుమంతుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ || 176 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రాముడు వెడలె సీత కోర్కెపై మాయలేడిని కొనితెచ్చుటకై
రామలక్ష్మణులు లేని సమయమున అపహరించె లంకేశుడు సీతను
సీతను గానక రామచంద్రుడు ఆడువులపాలై వెదకుచుండెను
అని హనుమంతుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ || 177 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రలైరి ప్రతిజ్ఞల బూనిరి
శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపి రాజుగ జేసెను
కదలె కపిసేన సుగ్రీవునాన నలుదిశలు వెదకి సీతను కనుగొన
అని హనుమంతుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ || 178 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
లంకాపురిలో సీతయుండునని పక్షిరాజు సంపాతి మాట విని
శతయెజనముల వారిధి దాటి సీతజాడ గన లంక జేరితి
రాముడు దెలిపిన గురుతులు గలిగిన సీతామాతను కనుగొన గలిగితి
అని హనుమంతుడు మృదు మధురముగ పలికెను సీతా రామకథ || 179 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
వానరోత్తముడు పలుకుట మానెను జానకి కెంతో విస్మయ మాయెను
భయము భయముగ నలువంకల గని మెల్లగ మెమెత్తి పైకి జూచెను
శోభిల్లు శింశుపా శాఖలందున బాలార్కుని వలె మారుతి దోచెను || 180 ||
మారుతి రూపము చిన్నదైనను తేజో మయమై భీతి గొల్పెను
పవన కుమారుని భీమ రూపమును జానకి జూచి భీతి జెందెను
హా! రామా! యని లక్ష్మణా!
యని భ్రమజెంది తూలి మూర్చనొందెను
తేరుకొని సీత తిరిగి చూచెను వినమ్రుడై అట మారుతి దోచెను
ఇది కలయె
నిజమా తెలుపుడని బ్రహ్మాదులను జానకి వేడెను
|| 181 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
తల్లీ! తెల్పుము నీవు ఎవరవో దేవ గంధర్వ
కిన్నరాంగనవో?
కాంతులు మెరసే బంగరు మేన మలినాంబర మేల దాల్చితివో?
ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేల నింపితివో?
అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచె || 182 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో?
రామలక్ష్మణులు వనమున వెదకెడు అవనీ జాతవో నీవు సీతవో?
సర్వ సులక్ష్మణ లక్షిత జాతవు తల్లీ తెల్పుము నీవు ఎవరవో?
అని హనుమంతుడు సీతతోపల్కె అంజలి ఘటించి చెంతన నిలిచె || 183 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను
శ్రీ రఘురాముని ప్రియసతి నేను సీతయను పేర వరలు దానను
పరిణయమైన పది రెండేడులు అనుభవించితిమి భోగ భాగ్యములు
అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో || 184 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
శ్రీ రాముని పట్టాభిషేకమును తండ్రి దశరధుడు చేయనెంచెను
చిన్న భార్య కైక కోరె దశరథుని వెనుకటి వరములు రెండు తీర్చుమని
భరతునకు పట్టాభిషేకము శ్రీరామునకు వనవాసము
అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో || 185 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పితృవాక్య పరిపాలుడు రాముడు అడవుల కేగి పదు నాలుగేండ్లు
రామునితో సౌమిత్రియు నేను వనవాసమునే కోరుకున్నాము
ఆశ్రమమ్మున ఒంటిగనున్న రావణాసురుడు అపహరించెను
అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో || 186 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రావణూడొసగిన ఏడాది గడువు రెండు నెలలలో ఇక తీరిపోవు
రాముడు నన్ను కాపాడునన్ని వేచి వేచి వేసారి పోతిని
అసురులు నన్ను చంపక మున్నె నాకై నేను పోనెంచితిని
అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో || 187 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అమ్మా సీతా! నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను
రామలక్ష్మణులు క్షేమమ్మన్నరు నీ క్షేమమరసి రమ్మన్నారు
రాముడు నీకు దీవెనలంపె సౌమిత్రి నీకు వందనములిడె
అని
హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి ముందుకు జరిగె || 188 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మారుతి ఎంతగ ముందుకు జరిగెనో జానకి అంతగ అనుమానించెను
రావణాసురుడై ఈ వానరుడని కామరూపుడై వచ్చియుందునని
ఆశ్రమమున ఒంటిగనున్న తనన్ను వంచించిన సన్యాసి ఈతడని
తలవాల్చుకొని
భయకంపితయై కటిక నేలపై జానకి తూలె || 189 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
తల్లీ! నీవిటు శోకింపకము చూతువుగా రావణు పాపఫలము
శ్రీరఘురాముని అగ్ని బాణముల చూతువుగా రావణు దుర్మరణము
మును ముందుగా నీ జాడ తెలియగ వాచ్చినాడను రాముని బంటుగ
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెందన నిలిచె || 190 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని
రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు
రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 191 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఓ హనుమంతా! హాయి బొందితిని నీ పలికిన శ్రీరామకథ విని
రామలక్షణుల ఎట్లెరిగితివి? రూపు
రేఖలను ఎట్లు గాంచితివి?
వారి మాటలను ఎట్లు వింటివి? వారి
గుణములను ఎట్లు తెలిసితివి?
అని పల్కె
సీత హనుమంతునితో రామ కథను కీర్తించిన వానితో || 192 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సర్వ జీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయా సాంద్రుడు
బుద్దియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు
క్షమా గుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 193 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
వేదసారముల గ్రోలినవాడు ధనుర్థరులతో అగ్రగణ్యుడు
ఎనిమిది అడుగుల దీర్ఘకాయుడు అరి భయంకరుడు ఆశ్రితపాలుడు
చతుర్వర్ణ సంరక్షణ దక్షుడు సదాచార సంపన్నుడు రాముడు
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 194 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
చతుర్వేదములు తెలిసినవాడని అంగుష్టమూల రేఖలుదెల్పెడు
దీర్ఘయుష్యము కలిగినవాడని ముఖపాద హస్త రేఖలు దెల్పెడు
పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపు రేఖలు దెల్పెడు
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 195 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కరచరణాది ద్వందాంగములు పదునాల్గు జతలు సమములుగా గల
నాసికాకర్ణ నయనాదులు అష్టాంగములు దీర్ఘములుగా గల
శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామసుందరుడు శ్రీరఘురాముడు
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 196 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సమదీర్ఘములగు కేశములు గల శిరోభాగమున మూడు సుడులు గల
సింహ శార్దూల వృషభేంద్రులవలె హొయలు మీర వెడలు నడకలు గల
అలకలాడు అందాల మెము గల అరవిందాక్షుడు శ్రీరఘురాముడు
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 197 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కను కొలకులతో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయి గల
శంఖమువంటి కంఠసీమ గల గంభీరమైన కంఠధ్వని గల
సురచిర కర్ణ కపోలములు గల ఆజానుబాహుడు శ్రీరఘురాముడు
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 198 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు
ధర్మనిరతి వర్థిల్లు శ్రీలుడు ధర్మమరసి వర్థిల్లు శీలుడు
కీర్తితాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీరఘురాముడు
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 199 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు
అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రు భయంకరుడు
సామాన్యులు కారు సోదరు లిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చెంతన నిలిచె || 200 ||
0 Comments