Hanuman Varnamala - హనుమాన్ వర్ణమాల
Hanuman Varnamala - హనుమాన్ వర్ణమాల |
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
సుందరమైనది నీ చరిత్ర
అతి సుందరమైనది నీ గనత
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
జయ జయ హనుమాన్ జయ హనుమాన్
జయము జయము జయ శ్రీ హనుమాన్
రామచంద్రకే జయ హనుమాన్
అభయ ప్రదాత జయ హనుమాన్
వాయుబీజముగా వ్యాపించి
రుద్ర తేజమున భాసించి
వనర రూపున వెలిగేవు
వారది పేరున వెలిగేవు
పవన తేజమున ప్రభవించి
రుద్ర అంశతో శోదించి
పుడమిని చేరే మెరిసావు
పరమాత్ముని ఎరిగించావు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
ఆట పాటల అలిసేవు
ఆకలి దిక్కులు చూసేవు
సూర్యూని ఫలముగా తలచేవు
నింగికి నేరుగా ఎగిసేవు
అంతరిక్షమున నిన్ను చూసి
రాహువుగా తలబోసి
నిశ్చితంగా చూసేను ఇంద్రుడు
వజ్రాయుదము సాక్షిగా
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
నేల కూలిన నిన్ను చూసి
మరణముగా మది తలచి
వాయు దేవుడు వేడిఎక్కి
తన కదలికలను అపేను
విషయము తెలిసి విరయించి
ఇరు కదలికలు కలిపించి
దివ్య వరములు వొసగేను
పవనానుకి ప్రమోదము
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
సర్వ దేవతలు స్పదించి
శుభమగు వరములు కురుపించి
చీరాయువు అని నిన్ను దీవించి
చిరాంజీవిగా నిన్ను చేసితివి
స్వవర్ణ కాంతితో మెరిసేవు
మరణ గీతను దాటేవు
అమృత త్తత్వం పోందేవు
అమితానందం పంచేవు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
జయ జయ హనుమాన్ జయ హనుమాన్
జయము జయము జయ శ్రీ హనుమాన్
రామచంద్రకే జయ హనుమాన్
అభయ ప్రదాత జయ హనుమాన్
వజ్రాగములా పెరిగావు
భజరంగ బలి అని తెలిసేవు
వానరశ్రేష్టుడా వైయావు
నీ వత్వమున వెలిగావు
ఆదిత్య మాటకు కట్టుబడి
నీ కవితనే పద మందించి
గగన మార్గమున మసలితివి
గనము అగు విద్యలను బడసితివి
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
వేదసారమును గ్రహియించి
వ్యాకర్ణమున వెలిసావు
వాక్కులలోన వెలిగావు
విప్పలలోన మెరిసావు
బ్రహ్మ చరియమే నీ లక్ష్యం
ఉపాసనార్థం వివాహము
సువరచలమగు ప్రకాశం
సూర్యూడు వసగిన తేజము
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
గురుదక్షిణ నీ ఎద తలచి
గురు సుతుని సేవల నిలచి
సూక్ష్మ బుద్దితో తెలిసావు
మంత్రిగా మేపు పొందావు
సుగ్రీవుడు సతసము ఉండగా
కార్య దక్షత కణబరచిన
రాముని సేవను కూర్చావు
రాజ కార్యమును సాధించావు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
అవలీలగా అవదిని దాటి
లంకిని భరతము పటావు
లంకని చూట్టి వచ్చావు
సీతను వెతుకొను వెతికావు
రామ కార్యమును నేరింపి
అశోక వనమున చేరావు
దీన వదన రూపము చూసి
సీతమ్మగా మనస్సున తెలసి
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
జయ జయ హనుమాన్ జయ హనుమాన్
జయము జయము జయ శ్రీ హనుమాన్
రామచంద్రకే జయ హనుమాన్
అభయ ప్రదాత జయ హనుమాన్
సతంసము సగమై విరిసే
పంతము అంతమే బ్రతుకు ఎరిగే
అంతరాన ఆలోచన చేసి
కార్యానికి తల వంచావు
సీతమ్మ చెంతకు చేరి
చిన్నమాట తెలియక పలికి
చిత్తమందున చిత్తము మాపే
కన్నులలో కాంతిని చూసావు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
రామ భటుగా నిన్ను తెలిపి
ప్రియమగు మాటను పలికి
రామ గానమును చేసావు
రాముని మాటను తెలిపావు
సీత మానసము సంతసించ
అంగుళికము అందిచావు
చిత్తములోని చింతము చేరిపి
బ్రతుకు ప్రాయాసను కలిగించావు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
రావణ సభకు చేర తలంచి
విద్వంశమును సృష్టించావు
రావణ సైన్యము రమమును ఆపి
బీతి భయములు కలిగించావు
రామ భక్తితో చేతులు జోడి
రాముని శక్తిని ఎరిగించావు
విపరిత బుద్దిని వీణగ తెలిపి
కాగల ఉన్నది కనబరచావు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
అగ్నికి అజాము తోడైనట్లు
వానము నందు అగ్ని కూడగా
లంకాపురినే రగిలించావు
దవళనాని మరిపించావు
నూరు యెజనములు దాటి
జామవంతుని ముంగిట నిలచి
విషయమును అంత వివరించావు
ముగిసిన కార్యము తెలిపావు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
జయ జయ హనుమాన్ జయ హనుమాన్
జయము జయము జయ శ్రీ హనుమాన్
రామచంద్రకే జయ హనుమాన్
అభయ ప్రదాత జయ హనుమాన్
రాముని చెంతకు రయమున సాగే
చింతను మాపేడి మాటను తెలిపి
సీతమ్మ జాడను తెలిపావు
రాముని మననా పొందావు
కాంచన లంకకు కదలి పోవగా
కడలిపై వారది కట్టగా
కూడి గట్టి కపి సైన్యమును
దన పూరించగా దానవ రాజుకు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
తేరు ఏమిటి రుచి చూసి రాముని
రథముగా సేవించావా దేవుని
సంజీవిని తెచ్చి సమయానికి
ప్రాణయమిగా సౌమిత్రి ప్రాణానికి
భక్తునిగా నీవు బాసించి
భగవంతునిగా శోకించి
పూజలు అందగా ఎదిగేవు
పూర్వ దిక్కున మెరిసేవు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
అష్ట సిద్దులు నీ వశము
ఇష్ట కామ్యములు ఫల ప్రధము
సర్వ కార్యములు పరహితము
స్వామి మెదమే సంమతము
ఆయుదము ఎరుగని వీరుడవు
అపజయము ఎరుగని సూర్యూడవు
అందములోన ఇంద్రుడవు
అనందం పంచే ఆత్మ బందువు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
సిందూరంల శోదించి
బంగారంలాగ వికసించి
విశ్వం మేలుగగా మెరిగావు
చిరంజివిగా వెలిచావు
బాహ్యను రూపును కొలచి
అంతరాన తగ తెలసి
తన సావాసాన నమ్మెవు
మహదానందము పొందేవు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
జయ జయ హనుమాన్ జయ హనుమాన్
జయము జయము జయ శ్రీ హనుమాన్
రామచంద్రకే జయ హనుమాన్
అభయ ప్రదాత జయ హనుమాన్
రామ భక్తిలో నిలచేవు
రామనామములు చాటేవు
అందరు కోరి అలింగనము
ప్రయాచితముగా పొందేవు
రామ కార్యము రాచ కార్యము
అన్య కార్యములు ఎరుగవు
రాముని సేవలో సంతసము
రాముని సేవకే అంకితము
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
రాముని దేవునిగా తెలిసి
రాముని పదములు ఎదకొలచి
రామ భక్తిలో మురిసేవు
రాముని శక్తి తెలిసేవు
భక్తులలోన శ్రేష్టువై
భగవంతుని స్థాయికి చేరావు
భూతప్రేతాలకు భయమైనావు
భయహరులకు నేలవైనావు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
సంగీతమున సర్వోనతము
వ్యాకర్ణమున మహోనతము
సర్వకలల సమునతము
శక్తి యుక్తుల మహోనతము
నిత్య స్మరణలో నిలిచేవు
ముక్తి పదములు మెరిసేవు
కన్నులలోన మెలిగేవు
కాగల బ్రహ్మగా తేలిసేవు
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
శ్రీ అంజినేయ ప్రసనాంజనేయ
వీర అంజినేయ విజయ అంజినేయ
భక్త అంజినేయ బ్రహ్మాండ తేజ
మంగళ మూర్తి జనలోక పూజ ||2||
కేసరి నందన కపి వీర
అంజని తనయ నగదీర
జయ జయ హనుమాన్ జయ హనుమాన్
జయము జయము జయ శ్రీ హనుమాన్
రామచంద్రకే జయ హనుమాన్
0 Comments