Sri Vishnu Chalisa - శ్రీ విష్ణు చాలీసా
Sri Vishnu Chalisa - శ్రీ విష్ణు చాలీసా |
హరి ఓం హరి ఓం నారాయణ
అచ్చుత కేశవ నారాయణ
జగతి పాలకా జనార్థనా
జయము జయము హరి నారాయణ || హరి ఓం ||
మాయాలోక నివాసి
మెహన రూప ప్రకాశి
వ్యాపకత్వమున తెలిసేవు
శివ హృదయాన వెలిగేవు
సృష్టి కర్తనే సృష్టించి
సృష్టికి మూలంగా తెలిసి
స్థితి కార్యమున నిలిచేవు
లయకారకుని కలిసేవు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
మనసున మాయను నింపి
కామము మెహము పెంచి
సత్వ గుణమును తీసేవు
రజో తమములను పెంచేవు
కల్పాంతములో కనిపించి
వట పత్రములో శయనించి
విష్ణుమూర్తిగా తెలిసితివి
విశ్వ పాలన చేసితివి
హరి ఓం హరి ఓం నారాయణ
అచ్చుత కేశవ నారాయణ
జగతి పాలకా జనార్థనా
జయము జయము హరి నారాయణ
కమలములోన భాసించి
కమలనాభునిగ కనిపించి
కమలాక్షునిగా విరిసావు
కమలానికి ఘనతొసగావు
ఏడు గడపల సమహారం
వైకుంఠముగా వ్యవహారం
విశ్వ ప్రకాశం నీ తేజం
పాలకడలి నీ నిజవాసం
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
పద్మనాభునిగ తెలిసితివి
పద్మ నేత్రి కూడితివి
పరమేష్టి నెరుగగ జేసితివి
పరమ పురుషునిగ ప్రభవించితివి
సంకల్పమున సృష్టించి
సామరస్యమున పాలించి
దుష్ట శిక్షణ గావించి
శిష్ట రక్షణ చేసితివి
హరి ఓం
హరి ఓం నారాయణ
అచ్చుత
కేశవ నారాయణ
జగతి పాలకా
జనార్థనా
జయము జయము
హరి నారాయణ
భక్తుని శాపము భరియించి
శాపముక్తుని గావించి
శోకమునే తొలిగించావు
శాంత మనస్కుని చేసావు
ధరణి ధర్మము పూయించ
ధర్మ కర్మములు పాటించి
ధర్మ మార్గమును చూపేవు
ధర్మ రక్షణ చేసేవు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
అంబరీశునికి అభయముతో
అందిందు జనించ బడంబడి
ఆకారములను దరియించి
అవనిని పావనమెనర్చావు
పలు యెనుల జన్మించి
పలు రీతులగ ప్రభవించి
ప్రత్యగాత్మగ తెలిసితివి
పరమానందం పంచితివి
హరి ఓం
హరి ఓం నారాయణ
అచ్చుత
కేశవ నారాయణ
జగతి పాలకా
జనార్థనా
జయము జయము
హరి నారాయణ
అవని భారము తొలగించ
అవతరించగా తలచావు
అవతారములను దాల్చావు
అసుర శక్తులను తృంచావు
విష్ణు వాసమును వదిలే
వింత వాసమును చేసి
వేడుకగా కథ వివరించి
జగతికి పాఠం
తెలిపేవు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
మత్సరూపమున అరుదెంచి
సోమాకాసురుని దృంచితివి
వేదములను రక్షించావు
విరించి ముఖమున నిలిపావు
కూర్మ రూపమున కదలాడి
మంద్రగిరిని మరి భరియించి
పాలకడలి చిలికిచావు
పరమార్థమును అందించావు
హరి ఓం
హరి ఓం నారాయణ
అచ్చుత
కేశవ నారాయణ
జగతి పాలకా
జనార్థనా
జయము జయము
హరి నారాయణ
భూభారమును మెసావు
భూమి భారమును తీసావు
పాలన చందము నెరిగించి
పరిపాలన చేయగ నిలిచావు
మెహన రూపము దాల్చావు
మెహినిగా అగుపించావు
అసురుల మాయ చేసావు
సురలకు అమృతము పంచావు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
లక్ష్య సాధన సాగించి
లక్ష్మికి చేయిని అందించి
పత్ని పీఠము ఒసగావు
పట్టమహిషిగా తెలిపావు
వరాహ రూపము నరుదెంచి
హిరణ్యాక్షుని హతమార్చి
వసుధకు రక్షణ కూర్చావు
భూపతిగా భాసించావు
హరి ఓం
హరి ఓం నారాయణ
అచ్చుత
కేశవ నారాయణ
జగతి పాలకా
జనార్థనా
జయము జయము
హరి నారాయణ
చిత్తమునెమ్చిన రూపంతో
చిత్రమైన సందేశముతో
కంభము నుండి కదిలావు
కన్నులు చెదరగ మెరిసావు
నృసింహమూర్తిగ అరుదెంచి
నిజ భక్తుని మాటకు విలువిచ్చి
దాసుని శాపము తీర్చావు
సర్వాంతర్యామిగ శోభించావు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
వర బలమును గుర్తించి
నీ బలమును విస్తరించి
నఖములతో చీల్చే వేసి
నర వైరిని కూల్చావు
వామనమూర్తిగ విచ్చేసి
విప్ర రూపమున యాచించి
నీ వాక్కున మర్మం దాచావు
ఆ వాక్కున కట్టడి చేసావు
హరి ఓం
హరి ఓం నారాయణ
అచ్చుత
కేశవ నారాయణ
జగతి పాలకా
జనార్థనా
జయము జయము
హరి నారాయణ
దాన గ్రహీతగ చేయుంచి
దానవ సర్వం గ్రహించి
పాతాళానికి పంపావు
భూతలమున కీర్తిని పెంచావు
జమదగ్ని సుతునిగ జన్మించి
రామ నామమున చరియించి
పరమేశుని వరమున ప్రభవించి
పరశు రామునిగ తెలిసేవు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
ధరణిని రాజుల జయుంచి
ధర్మ రూపాన అగుపించి
దాతగ జనులకు తెలిసావు
దక్షణ దిక్కుకు సాగేవు
రఘు వంశములో జనియించి
రఘు రామునిగా రావించి
వశిష్టుని కూడి విరిసావు
వంశ తిలకమై వెలిగేవు
హరి ఓం
హరి ఓం నారాయణ
అచ్చుత
కేశవ నారాయణ
జగతి పాలకా
జనార్థనా
జయము జయము
హరి నారాయణ
సూర్య వంశమున శోభించి
సంఘ మిత్రనిగ చరియించి
చంద్ర కాంతుల మెరిసేవు
అమృత వాక్కుల విరిసేవు
వానర మూకల కూడేవు
వారది కట్టగ వినిచేవు
కడలిని కలగా దాటేవు
కోలాహలమును చాటేవు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
రావణ రావమనాపేవు
రాక్షస మూకల అణచేవు
విభీషణ పాలన స్థాపించి
లంకకు లక్షణమెసగేవు
యుగములందు అగుపించి
యుగ ధర్మమును పాటించి
కర్మాచరణము తెలిపావు
కర్మ యెగిగా మసలేవు
హరి ఓం
హరి ఓం నారాయణ
అచ్చుత
కేశవ నారాయణ
జగతి పాలకా
జనార్థనా
జయము జయము
హరి నారాయణ
మాతృ ప్రేమకు మురిసావు
మరలా మరలా పుట్టావు
అచ్చట ఇచ్చట పెరిగావు
ముచ్చట తీరగ మసలావు
చీకటి వేళల జనియించి
వెలుగుల పూవులు పూయించి
జగతిని మత్తున ముంచేవు
పల్లెకు గుట్టుగ సాగేవు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా
వరములు తీర్చగ అరుదెంచి
శాపము తీర్చగ చరియించి
నిశ్చల స్థితిని నిలిచేవు
స్థితి కారకునిగా తెలిసేవు
గోవింద నామాన మురిసి
పలుమార్లు కీర్తిగా బడసి
నీ స్మరణలో వెలిగేవయ్యా
ఆ స్మరణకే మురిసేవయ్యా
హరి ఓం
హరి ఓం నారాయణ
అచ్చుత
కేశవ నారాయణ
జగతి పాలకా
జనార్థనా
జయము జయము
హరి నారాయణ
అవతరించుటయే నీ పనిగా
కరుణించుటయే
కార్యముగా
తిరగరాసావు తేరుగా
తిరిగి వచ్చావు మమ్ము
ఎలగా
నల్లని రూపున మెరిసేవు
చల్లని చూపుల విరిసేవు
ఏక పక్షముననిలిచేవు
ఏనాటికి జయమును కూచేవు
హరి హరి
హరి హరి గోవిందా
హరి నారాయణ
గోవిందా
ముకుందా
మాదవ గోవిందా
మధుసుధన
హరి గోవిందా ||
హరి హరి||
Sri Vasavi Kanyaka Parameswari
0 Comments