Sundarakanda 1 - సుందరకాండ 1
Sundarakanda 1 - సుందరకాండ 1 |
రామాయ రామభద్రయ రామచంద్రాయ వేధసే
రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః
శ్రీ ఆంజనేయ ప్రార్థనా
గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం
రామాయణమహామాలారత్నం వందే౭నిలాత్మజమ్
శ్రీ వాల్మీకి ప్రార్థనా
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితాశాఖాం వందే వల్మీకి కోకిలమ్
శ్రీ హనూమతే నమః
సుందరకాండ
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి
బలవంతుడు రామ భక్తుడు
లంకకు బోయి రాగల ధీరుడు మహిమెపేతుడు శత్రు కర్శనుడు
జాంబవదాది వీరులందరును ప్రేరెంపిపగ సమ్మతించిను
లంకేశ్వరుడు
అపహరించిన జానకి మాత జాడ తెలిసికొన || 1
||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
తన తండ్రియైన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు
వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడె పూర్వాభిముఖుడై
రామనామమున పరవశుడయ్యె రోమ రోమమున పులికితుడయ్యె
కాయము
బెంచె కుప్పించి ఎగసె దక్షిణ దిశగా లంక చేరగ
|| 2 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పది యెజనముల విస్తీర్ణముగ ముప్పది యెజనముల ఆయతముగ
మహామేఘమై మహార్ణవముపై మహావేగమై మహాకాంతియై
వారిధి దాటెడు వాతాత్మజుపై కురిపించిరి సురలు పుష్పవర్షములు
సాగనంపునటుల ఎగసిన తరువులు సాగరమున రాల్చె పుష్ప భాష్పములు || 3 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పవన తనయుని పదఘట్టనకె పర్వత రాజము గడగడ వణకే
ఫల పుష్పదులు జలజల రాలె పరిమళాలు గిరి శిఖరాలు నిండె
పగిలిన శిలల ధాతువు లెగసె రత్నకాంతులు నలుదిశల మెరసె
గుహలను దాగిన భూతములు లదిరి దీనారవముల పరుగిడె బెదరి || 4 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
భయపడి పోయిరి విద్యాధరులు పరుగిడ సాగిరి తపోధనులు
తమ తమ స్త్రీలతో గగనాని కెగిరి తత్తరపాటున వింతగ జూచిరి
గగన మార్గమున సిద్దచారణులు పోవుచు పలికిన పలుకులు వినిరి
రామభక్త హనుమాను డీతడని సీత జూడగని రాగలవాడని" || 5 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని
నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని
నీకడ కొంత విశ్రాంతి దీసికొని పూజలందుకొని పోవచ్చునని
సగర ప్రవర్థితుడు సాగరుడెంతో ముదమున బలికె మైనాకునితో || 6 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కాంచన శిఖర కాంతులు మెరయ సాగరమున మైనకుడు ఎగయ
నీలాకాశము నలువంకలను బంగరు వన్నెలు ప్రజ్వరిల్లెను
ఆంజనేయుని అతిధిగ బిలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ
ఎందరో సూర్యులు ఒక్కమారుగ ఉదయించినటుల తోచె భ్రాంతిగా || 7 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మైనకుడు ఉన్నతుడై నిలిచె హనుమంతుడు ఆగ్రహమున గాంచె
ఇదియెక విఘ్నము కాబోలునని వారిధి బడద్రోసె ఉరముచే గిరిని
పర్వత శ్రేష్ఠుడా పోటున క్రుంగె పవన తనయుని బలము గని పొంగె
తిరిగి నిలిచె
హనుమంతుని బిలిచె తన శిఖరముపై నరుని రూపమై
|| 8 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ దీర్చుకొనుమా
కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా
శతయెజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల
నీదు
మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యూడు నాకు " || 9 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"కృతయుగంబున విచ్చల విడిగ గిరిలెగిరెడి వి రెక్కలు కలిగి
ఇంద్రుడలిగి లోకాలను గావగ గిరిల రెక్కలను ముక్కలు జేయగ
వాయుదేవుడు దయకొని నన్ను వే వేగముగ వారధి జేర్చెను
దాగియుంటినీ
సాగరమందు దాచుకుంటి నా రెక్కలపొందు" || 10 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని
"ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని
రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని
నే పోవలె
క్షణ మెంతో విలువలే నీ దీవనలే నాకు బలములే "
|| 11 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అనాయాసముగ అంబర వీధిని పయనము జేసెడు పవన కుమారుని
ఇంద్రాదులు మహర్షులు సిద్దులు పులకాంకితులై ప్రస్తుతించిరి
రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని
కపివరుడెంతటి
ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను || 12 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నాగమాత సురస దను జాగృతి గొని ఎగసి మాటాడె హనుమంతుని గని
"దేవతలంపిరి నిన్ను మ్రింగమని ఆకొనియుంటి నా నోటబడు"
మని
ఘోరమౌ బుసల నోటిని దెరచె క్రూరమో కరకు కోరలు మెరసె
కేసరీ
సుతుడు చిరునగ వొలుకగ కరములు మెడ్చి పలికెను తీరుగ || 13 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"ఓ సురసా ఇది సమయము కాదు నన్నాప నీకు న్యాయము కాదు
రామ కార్యమై లంకకు ఒంటిగ సీత జాడగన ఏగుచుంటిగ
తల్లి జాడ తెలసి తండ్రికి దెలిపి మరలివచ్చి నీనోట బడుదును"
అని
హనుమంతుడు చిరునగ వొలకగ తీరుగ బలికె స్వామి సాక్షిగ || 14 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"ఎపుడో నన్ను నిన్ను మ్రింగమని వరమెసగ మరీ బ్రహ్మపంపె"
నని
అతిగా సురస నోటిని దెరచె హనుమంతు డలగి కాయము బెంచె
ఒకరినొకరు మించి కాయము బెంచిరి శతయెజనముల విస్తరించిరి
పైనుండి
సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవ్వరిదో గెలువనిరి || 15 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సురస ముఖము విశాల మాటగని సూక్ష్మబుద్దిగొని సమయ మిదేనని
క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచ్చి వెలివచ్చె విజయుడై
పవన కుమారుని సాహసము గని దీవించె సురస నిజరూపము గొని
సాధు సాధు
యనిసురలు నుతించిరి జయ హనుమా ! యని దీవన లొసగిరి || 16 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఘనా ఘన ఘన విన్యాసితము నారద తుంబురు గాన శోభితము
గరుడు గంధర్వ వాహనాంచితము దేవ విమాన యాన భాసితము
సూర్య చంద్ర నక్షత్ర మండితము బ్రహ్మనిర్మితము ప్రణవాన్వితము
నిరాలంబ
నీ లాంబరము గనుచు మారుతి ఏగెను వేగము పెంచుచు || 17 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
జలనిధి తేలే మారుతి చాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను
గుహనుబోలు తన నోటిని దెరచెను కపివరుని గుంజి మ్రింగ జూచెను
అతిబలవంతుని అంజనేయిని కదలనీయక తికమక పరచెను
మును
సుగ్రీవుడు గురుతుగ దెల్పిన ఛాయా గ్రాహి ఆ దేనని తెలిసెను || 18 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"మహామేధాని కపి కుంజరుడు క్షణములో నాయె సూక్ష్మరూపుడు
మెరుపువోలె మెరసి సింహిక ముఖమును చొచ్చి చీల్చి వెలి వచ్చి నిల్చెను
సింహిక హృదయము చీలిక లాయను సాగరమునబడి అసువులు బాసెను
దేవ
గంధర్వ సిద్ద గణంబులు పవన కుమారుని పొగడిరి ఘనముగ || 19 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
వారిధి దాటెను వాయు కుమారుడు లంక జేరెను కార్యశూరుడు
కేతకోద్దాల నారికేళాది ఫలవృక్షములతో నిండినది
పూతీవెలతో సుందరమైనది రంగురంగులతో శోభిల్లునది
సువేలాచల శిఖరమది హనిమంతుడు తొలత వాలినది || 20 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యెచన జేసి
నలువంకలను కలయ జూచుచు నిజరూపమున మెల్లగ సాగుచు
త్రికూటాచల శిఖరముపైన విశ్వకర్మవి నిర్మితమైన
స్వర్గపురముతో
సమానమైన లంకాపురమును మారుతి గాంచెను || 21 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కర్ణి కార కర వీర ఖర్జూర శింశుప అశోక కోవిదార
సాలరసాల సప్త వర్ణ నాగకేసర నారికేళాది
తరవులు ఎంతో కనుల పండువుగ ఫలపుష్పములతో నిండుగ యుండుగ
రావణుండు పరి పాలించు లంకను కలయ జూచుచు మారుతి సాగెను || 22 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పద్మోత్సలాది పుష్పచయములు నిండారగ అల రారు అగడ్తలు
హంస కారండవ జలపక్షులు గల రమణీయమైన నడబావులు
కేళీ విలాస జలాశయములు వివిధ వినోధ ఉద్యాన వనములు
రావణుండు పరి పాలించు లంకను కలయ జూచుచు మారుతి సాగెను || 23 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
స్వర్ణమయమైన ప్రాకారములు విశాలమైన తిన్నని వీధులు
మత్స్య మకర లతాది పతాకలు ఎత్తున ఎగిరే కోట బురుజులు
ఏడంతస్తుల తెల్లని మేడలు ఎటుజూచిని తీర్చిన గృహములు
రావణుండు పరిపాలించు లంకను కలయ జూచుచు మారుతి సాగెను || 24 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఘన జఘనము వప్ర ప్రాకారము నవ్యాంబరము విపులాంబువు
కర్ణాభర్ణములు కోట ఋరుజులు కేశాంతములు శతఘ్నీ శూలములు
సుందరమైన స్త్రీ రూపమున విశ్వకర్మచే నిర్మితమైన
రావణుండు పరిపాలించు లంకను కలయ జూచుచు మారుతి సాగెను || 25 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కరకు కత్తులు విల్లంబులు శూల పట్టసాది ఆయుధ ధారులు
కామరూపులు మాయెపేతులు ఘోరకిరాతకులు ఘాతకులు
అతిబలవంతులు క్రూరకర్మలు నిశాచరులు రాక్షస వీరులు
రావణుండు పరి పాలించు లంకను కలయ జూచుచు మారుతి సాగెను || 26 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సామముచే స్వాధీనము గారు దానముచే అధీనము గారు
భేదముచే బలహీనులు గారు దండముచే రణ భీరులు గారు
సామ దాన బేధ దండములందు రాక్షస వీరులు చిక్కనివారు
రావణుండు పరి పాలించు లంకను కలయ జూచుచూ మారుతి సాగెను || 27 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అనిల కుమారుడా రాత్రివేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను
రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను
పిల్లివలె పొంది మెల్లగ సాగెను ఉత్తర ప్రాకార ద్వారము జేరెను
లంకా
రాక్షసి కపివరు గాంచెను గర్జన చేయుచు అడ్డగించెను || 28 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కొండ కోనల తిరుగాడు కోతిని ఈ పురికి ఏ పనికై వచ్చితిని
లంకేశ్వరుని ఆనతిమేర లంకాపురికి కావలియున్న
లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున దీతును
కదలక
మెదలక నిజము బల్కు మని లంక ఎదుర్కొనె కపికిశోరుని || 29 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అతి సుందరమీ లంకాపురమని ముచ్చటబడి నే చూడ వచ్చితిని
ఈ మాత్రమునకు కోపమెందుకులే పురము గాంచి నే మరలి పోదులే
అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని
లంకా
రాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచెను || 30 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సింహనాదమును మారుతి జేసె కొండంతగ తన కాయము బెంచె
వామహస్తమున పిడికిలి బిగించె ఒకే పోటున లంకను గూల్చె
కొండబండలా రక్కసి డొల్లె కనులప్పగించి నోటిని దెరచె
అబలను
జంపుట ధర్మము కాదని లంకను విడిచె మారుతి దయగొని
|| 31 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఓ బలభీమా వానరోత్తమా ఓ మహాత్మా మన్నింపుమా
ఇంతకాలముగ లంకను గాచితి నేటికి నీవే ఓట మెరిగితి
ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమెసగెనని
లంకారాక్షసి నిజము దెల్పెను హనుమంతుని ఉత్సాహ పరచెను || 32 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నందికేశ్వరుల శాపమున్నది లంక వినాశము మూడనున్నది
స్వేచ్చగబోయి లంకను జూడుము వేగమె పోయి సీతను గాంచుము
రావణు డాదిగ రాక్షసులందరు సీత మూలమున అంతమెందెదరు
ఇది
నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరీశుని
|| 33 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కోటగోడ అవలీలగ బ్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను
శత్రుపతనముగ వామపాదమును ముందుగ మెపెను ముందుకు సాగెను
అణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల
వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడు గాంచెను || 34 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సువర్ణమయ సాధరాజముల ధగధగ మెరసే ఉన్నత గృహములు
కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమౌ నృత్య గీతములు
అప్పరసల మరంపించు మదవతుల త్రిస్టాయి బలుకు గాన మాధురులు
వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడు గాంచెను || 35 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవ నమ్ములలోన
మెల్ల మెల్లగ మెట్ల వెంబడి కూడి నడయాడు రమణుల సందడి
బడ్డాణపు చిరు గజ్జల రవళి ఘల్లుఘల్లుమను అందెల సవ్వడి
వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడు గాంచెను || 36 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఋగ్ యజుస్సామ వేదత్రయమును అధ్యయనము చేయు యాతుధానులు
అరివీరులను అగ్నిగుండము మారణ హోమము సేయు మాంత్రికులు
యజ్ఞ దీక్షితుల జటధారులు ముండితులు దర్భ ముష్టిదారులు
వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడు గాంచెను || 37 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఏక కర్ణులు ఏకాక్షులు లంబోదరులు వికృత రూపులు
ధనుర్థరులు ఖడ్గధారులు వివిధ కవచముల దాల్చిన వారలు
అస్తశస్త్రముల దాల్చిన యెధులు వీర విహారులు కామరూపులు
వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడు గాంచెను || 38 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నల్లనివారు తగు పొడగరులు దృఢకాయులు తేజోవంతులు
కనక మణిమయ భూషణ ధారులు స్త్రీలోలురు మాధూమాంస ప్రియులు
నిశాచరులు నరహంతకులు విచ్చలవిడిగా విహరించు వారలు
వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడు గాంచెను || 39 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఆలమందలో వృషభేంద్రునివలె మందగిరి గుహ మృగరాజువలె
రజిత పంజురాన రాజహంసవలె బంగారు పొన్నుల దంతివోలె
కాంతి లక్ష్మి కళా నిలయమువలె విజయ విరాజిత రాజేంద్రునివలె
వెలిగెడు
పూర్ణ శశాంకుని కాంతిలో వెదకెను సీతను మారుతి లంకలో || 40 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మధువు గ్రోలి మత్తిల్లిన రమణులు దిస మెలలతో శయనించు స్త్రీలు
మురిసి మురిపించు కామినీమణులు అతిరతి కెగెసే మిఠారి కొమ్మలు
పరవశ మెందించు ఆటలు పాటలు అందెవేసిన మెహనాంగనలు
కామ
క్రీడల లంక తేలగ కపివరుడుగాంచె పరిశీలనగ
|| 41 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మేలిమి బంగరు మేనికాంతుల రాజిల్లెడు ఉత్తమజాతి స్త్రీలు
మేడలపై విహరించు యువతులు ప్రియాంకముల సుఖించు కామినులు
డెందమున కుందు విరహకాంతలు వెలవెల బోయెడు చంద్రవదనలు
కామక్రీడల లంక తేలగ కపివరుడు గాంచె పరిశీలనగ
|| 42 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మనమున రాముని విడువక దలచు క్షణమెక యుగముగ గడువక గడుపు
ధరణీజాత సీతమాత ధర్మచరిత మహా పతివ్రత
ఈ కామాంధుల కలసి యుండునని ఇందు వెదకుట మతిలేక యని
లలిత కుసుమలత సీతను గానక మారుతి వగచె మరేమి తోచక || 43 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మూలబలముల పరివేష్టితమై గిరి శిఖరాన ప్రతిష్టితమై
నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతుల దీప్యమానమై
బంగారు తోరణ శృంగార మెలుకు స్వర్గపురముతో సరితూగ కులకు
లంకేశ్వరుని దివ్య భవనమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 44 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సుందరమైన హేమమందిరము రత్న ఖచితమౌ సింహద్వారము
పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము
నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము
లంకేశ్వరుని దివ్య భవనమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 45 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
శుక శారికాది పక్షులు పాటల చెంగున ఎగిరే
మృగముల ఆటలు
ఉద్యానముల చిత్రశాలలు రతీ గృహములు లతా గృహములు
ఉత్తమ జాతికి చెందిన స్ర్రీలు వేలకు వేలు ప్రియ భామినులు
లంకేశ్వరుని దివ్య భవనమది మారుతి గాంచెను అచ్చెరునొంది || 46 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు
స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవ్వాది గంధములు
నిత్యపూజలు శివార్చనలు మాస పర్వముల హోమమ్ములు
లంకేశ్వరుని దివ్య భవనమది మారుతి గాంచెను అచ్చెరునొంది || 47 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మంత్రి ప్రహస్త మహాపార్మ్యుల విరూపాక్ష విభీషణాదుల
ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణీతాక్ష విభీషణాదుల
ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణీతాక్ష మకరాక్ష కరాళుల
కుంభ నికుంభ కుంభకర్ణుల వజ్రదంష్ట్ర శుక సారణాదుల
ఎల్ల
రాక్షసుల గృహములు వెదకి సీతను గానక వగచె మారుతి
|| 48 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది
విశ్వకర్మ తొలుత బ్రహ్మ కిచ్చినది బ్రహ్మ వరమున కుబేరు డందినది
రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొ్నితెచ్చినది
పుష్పకమను మహా విమానమది మారుతి గాంచెను అచ్చెరివొంది || 49 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కాంచన చారు మనోహర తేజము జలధర సామ్య మహోన్నత రూపము
ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహు రత్న శోభితము
విశ్వకర్మ విచిత్ర నిర్మతము రావణు గుణగణ బలాను రూపము
పుష్పకమను మహా విమానమది మారుతి గాంచెను అచ్చెరివొంది || 50 ||
0 Comments