Ganesha Chalisa - గణపతి చాలీసా 2
తొలి దంపతుల తొలి సుతుడు
తొలి పూజలనందే ఘన విభుడు
విఘ్ననాశాక భయ హరుడు
విశ్వ పాలక శుభ చరుడు || 1 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
అమ్మ నలుగుతో అమరేవు
అమ్మ జిలుగులు పొందేవు
అమ్మ వాకిట నిలిచేవు
అయ్యతో పోరున నిలిచేవు ||
2 ||
తగవులాటలో తల తెగి
అమ్మ మాటతో తల కుదిరి
శివ జ్ఞానముతో వెలిగేవు
శివ సన్నిధిలో నిలిచేవు ||
3 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
"గ" వర్ణమున నీ నామం
"గం" భీజముగా నీ మంత్రం
సాకారమున నీ రూపం
ఓం కారమున నీ తేజం || 4 ||
వక్రతుండమగు వేషముతో
బ్రహ్మ తేజమున భాసించి
ఏక దంతమున ఏలికగా
ఎఱుక చేసెను ఏకంగా ||
5 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
శూర్ప కర్ణముల శోభించి
సిద్ది బుద్దులతో భాసించి
శివ సన్నిధిలో మెలిగావు
శుభములు కూర్చుట నెరిగావు || 6 ||
గుజ్జు రూపమును దాల్చేవు
ఒజ్జగా పూజలు బడసేవు
విరాట్ స్వరూపమున విరిసేవు
విఘ్న గణముల శాసించేవు || 7 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
గణముల కధిపతివయ్యావు
గణపతిగా ఘనత నొందావు
నాట్య శాస్త్ర నైపుణ్యముతో
నాట్య గణపతిగ తెలిసేవు || 8 ||
చతుర్బుజముల నీరూపము
పిత్రాంకమే నీ ప్రియ పీఠము
పాశాంకుశాల నీ హస్తము
ఆ జంట కూడేను అభయయాస్తము || 9 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
పార్వతి దేవి ప్రియ సుతుడు
అగ్నిరూపునకు అగ్రజుడు
ప్రమధ గణములకు అధ్యుడు
పరమానంద స్వరూపుడు || 10 ||
ఈశుడు మెచ్చిన పాలకుడై
వ్యాసుడు మెచ్చిన లేఖకుడై
పంచమ వేదం వ్రాసితివి
ప్రత్యేకత నీదని తెలిపితివి ||
11 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
క్షామములను తొలగించేవు
క్షేమములను చేకూర్చేవు
కామమును కడతేర్చేవు
కామ్యములను ఈడేర్చేవు || 12 ||
శూల హస్తమున శోభించేవు
కాల హస్తమున కనిపించేవు
నీలాబ్జ నిలయునిగా తెలిసేవు
ఉపమానములకు మించేవు || 13 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
ఘంటమయినది నీ దంతం
అసురునంతము చేసెను దంతం
ఘనత చాటెను ఆ ఉదంతం
గణాధిపతునకే ఇది సొంతం ||
14 ||
నిత్య బాలునిగ అగుపిస్తూ
నిర్గుణ బ్రహ్మ మనిపిస్తూ
నింగి నేలల భాసించేవు
నిత్య పూజలు బడసేవు || 15 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
గరికకు ఘనతను ఒసగేవు
నీ పూజలో నిలువగ జేసేవు
మెదక మందగ మురుసేవు
మహదానందం నొసగేవు || 16 ||
చిత్రమైనది నీ చరిత
విచిత్ర మైనది నీ ఘనత
తల్లి ప్రేమతో నిలిచేవు
తండ్రితో తలపడ తెలిసేవు ||
17 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
ఎలుకను ఎక్కి ఎగిరేవు
ఎల్ల లోకముల తిరిగేవు
ఎల్ల విఘ్నముల నణచేవు
ఎదురు లేదని చాటేవు || 18 ||
అదితి గర్బమున అమరేవు
కాశ్యపేయునిగ తెలిసేవు
పలు నామాల పెరిగేవు
పలు రూపాల మెరిసేవు || 19 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
అందరి దీవెనలందేవు
అసుర సంహారం చేసేవు
అక్షయమైనది నీ లీల
విలక్షణమైనది నీ హేల || 20 ||
సంపూర్ణ కళాపూర్ణ
విఘ్న దోష సంస్కరణా
సిద్ది బుద్ది ప్రియ సదనా
సర్వలోక సంస్మరణా || 21 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
అష్ట భుజముల అగుపించి
తరుణ గణపతిగ కనిపించి
విరజను అంతము చేసావు
నీ
జయమును జగతికి ఒసగావు || 22 ||
భక్త గణపతిగ భాసించావు
చతుర్బుజముల శోభించినావు
గుడపాయస పాత్రను దాల్చావు
గండములన్నీ దాటించావు || 23 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
షోడశ భుజ సంభూత
శోక దుఃఖ పరిహార
చక్రాయుధ దర సుందరా
శక్తాయుధ నిజ శోభితా || 24 ||
పరుశు హస్తమున దాల్చేవు
వీర గణపతిగ తెలిసేవు
ఖట్వాంగముతో కనిపించి
శూల పాశకముల మెరిసేవు || 25 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
బహు రూపాల ప్రభవించేవు
బహు నామాల తెలిసేవు
బహుముఖ ప్రజ్ఞతో వెలిగేవు
బహు కార్యాల నిలిచేవు || 26 ||
సకల కళలకు నువు నిలయం
విశ్వ వ్యాప్తికి నువ్వు వలయం
సకల కార్యముల నీ సంకల్పం
సర్వ జగతికి అది మూలం || 27 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
గణనాయకా సకల గుణ దాయకా
వరదాయకా సర్వ శుభ కారకా
గణ సేవితా దివ్య గుణ శోభితా
జన పూజితా సురమని సన్నుతా || 28 ||
ఏకదంతముతో నీవు శోభించి
అర్థనారీశ్వరునిగ అగుపించి
అద్వైతమును బోధించినావు
అజ్ఞానమును తొలగించినావు || 29 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
పచ్చి కాయలకే పరవశించి
పచ్చ గడ్డిని పూవును చేసి
ఆ పువు పూజకే మురిసావు
ముప్పేట వరముల నొసగావు || 30 ||
ఓంకరలన్నీ సవరించావు
సంకటములు తొలగించేవు
శివ జ్ఞానమును కలిగించేవు
శివ భక్తుల కూడి మురిసేవు || 31 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
దశ బాహువుల మెరిసేవు
దశదిశలా వ్యాపించేవు
మయూరేశునిగ మసలేవు
కమలాసురుని నిర్జించావు ||
32 ||
గణపతి విష్ణువు అభేదము
అవతారములు అందు విశేషము
దర్మ రక్షణే తొలి లక్ష్యం
దుష్ట శిక్షణే పరమార్థం || 33 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
ఉపాసనకు ఉన్నతము
ఉపదేశాన నువు ప్రదమం
ఉజ్వలమైనది నీ తేజం
మహోజ్వలమైనది నీ తత్వం || 34 ||
గజముఖమున ఘనతుంది
సూక్ష్మగ్రాహక శక్తుంది
దేహ కాంతిలో సింధూరం
బ్రహ్మ తేజమునకే ఇది సాధ్యం || 35 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
అవతారములను దాల్చేవు
అసుర శక్తులను అణిచేవు
నిన్ను తెలియుట ఘన యెగం
కరుణ తపముల సంయెగం || 36 ||
మూషిక వాహన విజయ గణపతి
మెదక హస్త మహా గణపతి
పాశాంకుశముల ప్రధమ గణపతి
పరశు హస్త దర సిద్ది గణపతి || 37 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
బంధ విమెచక ఊర్ద్వ గణపతి
భాగ్య ప్రదాత బహుముఖ గణపతి
లక్ష్య ప్రదాతా లక్ష్మీ గణపతి
సిద్ది ప్రదాతా సిద్ది గణపతి ||
38 ||
భక్తి ముక్తి ప్రద బాల గణపతి
శక్తి యుక్తి ప్రద వీర గణపతి
పాల నేత్ర తేజ దృష్టి గణపతి
నిత్య విఘ్నహర నీల గణపతి || 39 ||
గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా ||తొలి దంపతుల||
జయ జయ జయ విజయ గణపతి
జయము జయము సుజ్ఞాన గణపతి
జయ జయ జయ క్షిప్ర గణపతి
శరణు శరణు హేరంబ గణపతి || 40 ||
0 Comments