Lakshmi Kubera Vratha Katha - శ్రీ లక్ష్మీ కుబేర కథ

 Lakshmi Kubera Vratha Katha - శ్రీ లక్ష్మీ కుబేర కథ

Lakshmi Kubera Vratha Katha - శ్రీ లక్ష్మీ కుబేర కథ
Lakshmi Kubera Vratha Katha - శ్రీ లక్ష్మీ కుబేర కథ

       నైమిశారన్యములో మహర్షులంతా సత్ర యాగము చేస్తుండగా యాగానికి వ్యాస శిష్యుడైన సూతుల వారు కూడా వచ్చారు. మధ్యాహ్న సమయములో మహర్షులంతా సూతులవారి వద్దకి చేరి " సూతా! నీవు సర్వపురనాలు వ్యాసుల వారి వద్ద తెలుసుకొన్న మహనీయుడవు భూమండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు. సుఖం ఎంతో కష్టపడి తప్పస్సు చేస్తేగాని, భగవంతుని అనుగ్రహం వలగాని లభించదు. అంత కష్టపడే స్వభావం కలియుగంలోని మానవులకు ఉండదు. తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలంటే వ్రతము చేయాలో దానిని మాకు తెలియజేయుము" అని ప్రార్థించిరి. అప్పుడు సూతులవారు " మహర్షులారా లోకులు మేలు కోసం మంచి ప్రశ్న వేశారు. అటు వంటి వ్రతం ఒకతి ఉంది. దానిని కుబేర వత్రం అంటారు. ఈశ్వరుడు కుబేరుని మిద అనుగ్రహం కలుగగా, దేవతల సంపదనంతా పొందుపరచమని కుబేరుని హస్తగతం చేసినాడు. ఆతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తరదిక్కుకు పాలకుడుగా అదికారమును పొందెను. అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకొన్న ఆరోగ్య-కుబేర ధనలక్ష్మి, లక్ష్మి సహితుడైన కుబేరుని ఆరాదించిన వారు, ధనవంతులై సుఖపడతారు. అందులో సందేహము లేదు. కుబేరునికి పదవి కలుగుటకు కారణం చెపుతాను శ్రద్దగా వినండి.

        కాంచీపురములో ధనదత్తుడనే షావుకారు ఉండేవాడుఅతడు ఎన్నో వ్యాపారాలు చేసి ధనాని కూడబెట్టాడుధనాన్ని సంపాదించడమే గాని ఖర్చు పెట్టేవాడు కాడు. అతడు రోజులో చాలా ధనవంతుడనే పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు. దానికి తోడు నల్గురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు ఉండేవారు. ధనసంపద కుటుంబ సంపద గల షావుకారు, కుటుంబం గడవడానికి కూడా సరిగా ఖర్చు పెట్టక, పీనాసితనంతో జీవయాత్ర గడిపేవాడు, పిల్లలందరికీ గుణాలే నేర్పి వారిని కూడా తన బాటలోనే నడిపించేవాడు. కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసి అల్లళ్ళను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వ్యాపారాలు చాయించేవాడు. చివరైకి ధనదత్తుడు మహరాజులకే అవసరమిస్తే ధనాన్ని వడ్డీకి ఇచ్చే స్థాయికి పెరిగిపోయాడు. పైస ఖర్చు పెట్టాలంటే ముందు వెనుకా చాలా ఆలోచించే వాడు. దేవాలయానికి వెళ్లి దేవునికి నమస్కారాలు పెట్టి ఒక్క పైసయినా దానం చేసిన పాపాన పోలేదు. పీనాసివాడనే పేరు తాను పొందడమే గాక ఇంటిలోని వారందరికి పేరు వారసత్వంగా అందించాడు. కాలం గడిచిపోతోంది.

      ఒకనాడు మహాసిద్దుడు ఒకడు ధనదత్తుడు కమ్మని కబుర్లు చెప్పి ఒక్క నమస్కారంతో సరిపెట్టి  ఊరిలో చాలా మంది స్వయంపాకాలు ఇచ్చెవారున్నారని, దయ చేసి వెళ్లమని సాగనంపి తలుపులు వేసుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. మళ్లీ సిద్దుడు ధనదత్తుని వద్దకు వచ్చాడు. ధనదత్తుడు మంచిమాటలు చెప్పి సిద్దుని వెళ్ళిరమ్మన్నాడు. సిద్దుడు ఏదో చెప్పబోతుండగా మాట వినిపించుకోకుండా తలుపు వేసుకుని లోపలకు వెళ్ళి పోయాడు. మరల కొంతకాలానికి సిద్దుడు ధనదత్తుని ఇంటికి వచ్చి నేను స్వయం పాకం కోసం రాలేదని నా మాటలు వినిపించుకోమని చెప్పాడు. ధనదత్తుడు నాకు మాటలు వినే సమయం లేదని, చాలా తొందర పనులు ఉన్నాయని నెలరోజుల తరువాత రమ్మని పంపించి వేసి తలుపులు వేసికున్నాడు నెల్ రోజులు దాటిన తరువాత సిద్దిడు మరల వచ్చాడు. వచ్చిరాగానే అయ్యా! నాకు ఇంకా ఖాళీ అవలేదు. రెండు మాసాల తరువాత దయచేయండి అని తలుపులు వేసుకున్నాడు.

     విధముగా సాకులు చెపుతూ ఒక సంవత్సరము గడిపేశాడు. సిద్దుడు రావడం మానలేదు. చివరకు ఒక రోజు ధనదత్తుడు మీరేమి చెపుతారో ఒక్కమాటలో చెప్పి వెళ్ళండి అన్నాడు. వెంటనే సిద్దుడు షావుకారు! నీ భార్యా పుత్రులకోసం నువ్వు లంపటంలో మునిగి నీకు రాబోయే కష్టాన్ని తెలుసుకోవటం లేదు. కాస్త నా మాటలు విను అనగానే ధనదత్తుడు నాకే కష్టాలు రాబోతున్నాయె తొందరగా తెలుపండి అని, అయినా అనేక సంపదలు సంపాదించాను నా కుటుంబం కూడా చాలా వృద్ది పొందింది. నాకు లోతు ఏమున్నది అనెను. అప్పుడు సిద్దుడు ధనదత్తా! నీకు త్వరలో అపమృత్యువు సంభవిస్తుంది. మృత్యువు నుండి నిన్ను నీవు కాపాడుకోనుటకు ఒకే ఒక మార్గము కలదు. నీ భార్యగాని నీ సంతానము ఎవరైనా అపమృత్యువును తీసుకొనుటకు అంగీకరించినచో నీవు ఇంకా అరువది సంవత్సరములు సుఖముగా జీవిస్తావు. లేనియెడల నీకు మృత్యువు తప్పదని పలికెను.

     అపుడు ధనదత్తుడు తన వారందరిని పిలిచి మృత్యువును మీరు ఎవరైనను స్వీకరిస్తారాయని ప్రశ్నించెను. ఎవరూ మృత్యువు వాతపడుటకు ఇష్టపడక నీ పాపము నీవే అనుభవించవలసిందేనని పల్కిరి. అంతట ధనదత్తుడు యెగితో నా వారెవ్వరు అపమృత్యువును స్వీకరించుటకు సమ్మతించడం లేదు. నా ధనమునే అందరూ కోరుకొనుచున్నారు. కాబట్టి నా అపమృత్యువు తొలుగుటకు మరియెక్క మార్గమును చెప్పమని యెగిని ప్రార్థించెను. అపుడా సిద్దుడు నీవు దనమును ఖర్చు పెట్టి అఖండ శివారాధన చేయాలని చెప్పినాడు. నా ప్రాణముల కంటే ధనము ఎక్కువదా? తప్పక ఖర్చు చేయగనని చెప్పెను. వెంటనే సిద్దుడు వైశ్యుని చేత అఖండ శివారాధన చేయించెను. అతడు శివారాధనాతత్పరుడై భక్తిశ్రద్దలతో శివారాధన సలుపుచూ జీవితమంతా గడిపి కొంతకాలమునకు శివనామార్చన జరుపుతూ తనువు చాలించెను. తత్సలితముగా ధనదత్తుడు శివలోక ప్రాప్తినొంది శివుని ఆంతరంగిక మిత్రుడయ్యెను. శివానుగ్రహముచే దేవలోకమునకు ధనపతియై కుబేరుడని పేరుగాంచెను. అతనికి దేవలోకములోని సంపదలపైనా, నవనిధులపైనా, అధికారము కలిగెను. చిత్రరేఖ అను పేరుతో ధనలక్ష్మి కుబేరుని అర్దాంగియై వెలిసెను. ధనలక్ష్మి సైహితుడగు తనను ఆరాధన సలిపిన భక్తులకు ఆరోగ్య భాగ్యాలనూ, ఇష్ట సంపదలను ఇచ్చెదనని ఆయన ప్రతిజ్ఞ చేసెను, నవనిధి పరిపాలకుడగుటచే తన పూజను తొమ్మిది వారములు ఆచరింపవలయుననియు, తొమ్మిది మందిచే చేయించినవారికి అంతులేని సంపదలు ఇచ్చెదననియు ప్రతినబూనెను. తొమ్మిది గురువారములు గాని తొమ్మిది శుక్రవారములు గాని ఆచరింపవలయను. పదవ వారము ఉద్యాపన చేయవలెను. అన్ని వారముల పూజ చేయలేని అశక్తులు కనీసం అయిదు వారము లైనను పూజ చేసి ఆరవ వారముతో ఉద్యాపనము చేసికొనవచ్చును.

ఉద్యాపనము:-  పదవ వారౌన మామూలుగా ధనలక్ష్మి సమేతుడైన కుబేరుని పూజించి కలశము దగ్గర తొమ్మిది వ్రత విధాన పుస్తకములను ఉంచి, పూజించి పుస్తకములను తొమ్మదిమంది దంపతులకు లేదా ముతైదువులకు పండు తాంబూలములతో వాయనమివ్వవలెను, వారు కూడ వ్రతము ఆచరించునట్లు నచ్చ జెప్పవలెను. వారు కూడా వ్రతమును ఆచరించునట్లు నచ్చ జెప్పవలెను. భక్తి శ్రద్దలు ప్రధానము. ఇందులోనున్న కుబేరయంత్రమును పటము కట్టించుకొని పూజమందిరములో ఉంచుకొనవలెను ఇట్లు చేసి వారికి సమస్త రోగములను తొలిగి ఆరోగ్యము గలుగును. అష్టైశ్వర్యములను భోగభాగ్యములు కలుగును. ఇహపర సౌఖ్యములు గలుగుటకు ఇంతకుమించిన వ్రతము లేదు. అని సూతుడు మహర్షులకు లోకాను గ్రహర్థము వినిపించెను. పూజానంతరము కథను చదివి అక్షతలను శిరషుపై వేసుకొనవలెను.

మూలమంత్రము :- " రాజాధిరాజాయ వైశ్రవణ కుబేరాయ నమః "

కుబేర గాయత్రి :-  " రజాధిరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నః కుబేరః ప్రచోదయాత్ "

మూలమంత్రము జపం తరువాత కుబేరగాయత్రిని కనీసం ఇరవై ఎనిమిది సార్లు జపించాలి.

 

Post a Comment

0 Comments