Sundarakanda 2 - సుందరకాండ 2
Sundarakanda 2 - సుందరకాండ 2 |
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నేలను తాకక్క నిలచి యిండునది రావణ భవన మధ్యంబున నున్నది
వాయు పథమున ప్రతిష్టమైనది మనమున దలచిన రీతి పోగలది
దివినుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది
పుష్పకమను మహా విమానమది మారుతి గాంచెను అచ్చెరివొంది || 51 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అర్థ యెజన విస్తీర్ణము గలది ఏక యెజన ఆయతము గలది
మూడు నాల్గు దంతాలు గల్గిన మదకుంజర యూధంబులు గలది
చతురంగ బల సురక్షితమైనది మహోదధివలె ఘోషించునది
పుష్పకమను మహా విమానమది మారుతి గాంచెను అచ్చెరివొంది || 52 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అద్బుతమైన సువర్ణ మందిరము ఇంద్ర నీలమణి వేదికా యుతము
రక్తచందన సుగంధ పూరితము అరుణ కిరణ బాలార్క భాసితము
నానా కూట నిబిడీకృతము వరాకార శిఖరావృతము
పుష్పకమందు రావణ మందిరమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 53 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
లంకాధీశుని ప్రేమ మందిరము రత్న కచితమౌ హేమ మందిరము
చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్దము
ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 54 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పంది మేక ఎనుబోతు మృగముల నెమలి కొక్కెర ఖడ్గ మృగముల
మంసపు ముద్దలు వేరు వేరుగ పచనము చేయబడె రుచులు రుచులుగ
తినగా మిగిలిన పదార్థములతో బంగరు కంచములు వెలుగు కాంతులతో
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 55 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ద్రాక్ష దాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసనములు
నానావిధ ఫల పుష్ప జాతుల పలుచని చిక్కని మధుర రసాలు
త్రాగగా మిగిలిన పానీయములతో బంగరు పాత్రులు వెలుగు కాంతులతో || 56 ||
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మత్తున శయనించు సుదతుల మెములు పద్మములనుకొని మూగు భ్రమరములు
నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మ పత్రములు
ఉత్తమ కాంతల గూడి రావణుడు తారాపతివలె తేజరిల్లెడు
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 57 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
స్తన మధ్యసీమ ముత్యాల హారము నిదురబోదూగు హంసల వారము
మెల నూలు మెరయు ఘన జఘనములు జల పక్షులాడు ఇసుక తిన్నెలు
చలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 58 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఆలింగనముల సాక్కిన వనితల మణిహారముల వొత్తిడిన కుచములు
కామగ్రీడల సోలిన కాంతల చెదరిన కురులు జారిన చీరలు
తునిగిన మాలలు నలిగిన పూవులు మదగజమాడిన వనమునుబోలు
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 59 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కుచములు భుజములు పిరుదులు తొడలు ఒండొరులకు అమరిన తలగడలు
అల్లి బిల్లిగా వొరిగిన కొమ్మలు వ్రాలిన కురులు రాలిన విరులు
చెదరిన చిన్నెలు తరిగిన వన్నెలు సుడిగాలి బడిన వనమును బోలు
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 60 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
తాగితాగి మత్తిల్లిన సవతులు ఒకరినొకరు ముంచెత్తు చుంబనలు
సాటి కాంతను కాంతుడనుకొని బిగి కౌగిటగొను కామినీ మణులు
మధువు గ్రోలిన సతుల శ్వాసలు రావణు కెంతో సుఖ వాసనలు
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 61 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు జేర్చెను
పితృదైత్య గంధర్య కన్యలు ఎందరెందరొ రాజర్షి కన్యలు
సీతదక్క వారందరు కన్యలె రావణుమెచ్చి వరించిన వారలె
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 62 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు శృంగార ప్రియులు సౌందర్యవతులు
రావణు శక్తి సంపదల మురిసిరి వంచన లేకయె మెహితలైరి
సతులందరిని లంకేశ్వరుడు సమముగ నేలెడు రసిక శేఖరుడు
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 63 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సీతగూడ అవి వాహితయైన రావణుని దశ మిన్నంటకుండున?
రాణులందరికి మహారాణియన సీత సుఖములకు హద్దులుండునా?
అని హనుమంతుడు తలచె భ్రమించి లంకేశుని ఔన్నత్యము గాంచి
పుష్పకమందు రావణ మందిరంమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 64 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మహా పతివ్రతను లోకమాతను ఎంత హీనముగ తలపోసినాను
మహా పతివ్రతను లోకమాతను ఎంత హీనముగ తలపోసినాను
రావణాసురుడు ఇంతటనైన రాముని సీతను రాముని కొసగిన
శాంతి భద్రతలు నిలుచును గాని లేకున్న లంకకు చేటు కాల మని
సీతను
గానక యెచన జేయుచు మారుతి వెదకెను కడు చింతించుచు || 65 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
స్ఫటిక మణులతో నిర్మితమైనది రత్న కాంతులతో వెలుగొందునది
సుగంధములతో నిండియున్నది దంతపు పనులతో అమరియున్నది
ఉన్నతమై విశాలమైనది స్వర్గతుల్యమై అలరారునది
లంకేశ్వరుని దివ్య శయనమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 66 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మావి కాజిన సంవృతమైనది అతి మృదువై మనోహరమైనది
అశోక కుసుమ మాలలల్లినది చంద్రుని బోలిన ఛత్రమున్నది
స్వర్ణమయమై రంజిల్లునది సూర్యకాంతులతో భాసిల్లునది
లంకేశ్వరుని దివ్య శయనమది మారుతి గాంచెను అచ్చెరువొంది || 67 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఐరావతము దంతపు మెనలతో పోరున బొడిచిన గంటులతో
వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో
జయం పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో
లంకేశుడు
శయనించె కాంతలతో సీతకై వెదకె మారుతి ఆశతో
|| 68 ||
మినప రాశివలె నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు
రక్త చందన చర్చితగాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు
సతులగూడి మధు గ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు
లంకేశుడు శయనించె కాంతలతో సీతకై వెదకె మారుతి ఆశతో || 69 ||
సులక్షణమౌ సుందరాందుడు మణిమయ భూషిత కామరూపుడు
భుజబల తేజుడు మహావీరుడు దశకంఠుడు విశాల వక్షుడు
పద్మముఖులచే పరివేష్టితుడు పద్మాకరమున కరి సదృశుడు
లంకేశుడు శయనించె కాంతలతో సీతకై వెదకె మారుతి ఆశతో || 70 ||
శ్రేష్టమైన పీతాంబర ధారుడు షడ్రసోపేత మృష్టాన్న ప్రియుడు
మధువాసనల బుసగొట్టువాడు కోడెత్రాచువలె శయనించువాడు
మణిమయ కుండల మండిత వదనుడు జరిగిన స్వర్ణ కిరీట శోభితుడు
లంకేశుడు శయనించె కాంతలతో సీతకై వెదకె మారుతి ఆశతో || 71 ||
ఉత్తమాంగనల ఆలింగనముల పరిమళితము లతని సర్వాంగములు
అయిదు తలల్లు గల పెనుబాములు తీరుగ బలిసిన అతని బాహువులు
చంద్రకాంతిలో మెరసే మేఘము చంద్రముఖులతో అతని దేహము
లంకేశుడు శయనించె కాంతలతో సీతకై వెదకె మారుతి ఆశతో || 72 ||
వీణావేణు మృదంగ వాద్యముల ఆటల పాటల అలసిన యువతులు
వీణను చేరిని దురించు గాయని చుంబనలిడు తన ప్రియుడే యనుకొని
మరియెక జవ్వని పిల్లనగ్రోవిని మత్తుగ ముద్దిడు మగడే యనుకొని
లంకేశుడు శయనించె కాంతలతో సీతకై వెదకె మారుతి ఆశతో || 73 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మదవతి యెకతె మృదంగము పైగొని మధుర స్వప్నమున మాణిత మాడును
సుందరాంగి యెక పణవము జేకొని శయనించును తన ప్రియుని అంకమని
స్వహస్తముల స్తనములబూని కిల కిల లాడుచు కోమలి కలగని
లంకేశుడు శయనించె కాంతలతో సీతకై వెదకె మారుతి ఆశతో || 74 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అందొక వంక పర్యంకము జేరి నిదురించుచుండే దివ్యమనోహరి
నవరత్న ఖచిత భూషణ ధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి
స్వర్ణ దేహిని చారురూపిణి రాణులకు రాణి పట్టపు రాణి
లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి || 75 ||
మండోదరిని జానికి యనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి
వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజము తట్టి
స్తంభము లెగసి క్రిందకు దుమికి పల్లటీలు గొట్టి చెంగున జుట్టి
చంచమమౌ
కపి స్వభావమును పవన తనయుడు ప్రదర్శన జేసెను
|| 76 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రాముని సీత ఇటులుండునా? రావణు
జేరి శయనించునా?
రాముని బాసి నిదురించునా? భుజియించునా?
భూషణముల దాల్చునా?
పరమపురుషుని రాముని మరచునా? పరపురుషునితో
కాపురముందునా?
సీతకాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను || 77 ||
పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో జూచితి
నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని
రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని
ధర్మము గానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను || 78 ||
సుదతుల తోడ సీత యుండగ వారల జూడక వెదకుటెలాగ?
మనసున ఏమి వికారము నొందక నిస్కామముగ వివేకము వీడక
సీతను వెదకుచు చూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని
స్వామి
సేవ పరమార్థముగా గొని మారుతి సాగెను సీత కోసమని
|| 79 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
భూమీ గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు
ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చ వీధులు
మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు
ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచె || 80 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సీతామాత బ్రతికి యుండునో క్రూర రాక్షసుల పాల్పడి యుండునో
తాను పొందని సీత యెందుకని రావణుడే హతమార్చి యుండునో
అని యెచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు
ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచె || 81 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
దశకంఠునింట సీత యుండునని పక్షిరాజు సంపాతి మాటవిని
లంకాపురమున ప్రతి అంగుళమును పరిపరి విధముల పరికించితిని
లంకేశ్వరుని భవనములన్నీ తిరిగి తిరిగి పలుమారు వెదకితిని
అని చింతించుచు రాముని దలచుచు మారుతి సాగెను సీతను వెదకుచు || 82 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రాక్షస మాయకు సీత లొంగెనో రావణాసురుని వశమై యుండునో
సవతి యగునని రావణు సతులు సీతను ద్వేషించి చంపి యుందురో
హా రామా! హా లక్ష్మణా! యని
కృంగి కృశించి వైదేహి వొరిగెనో
అని చింతించుచు రాముని దలచుచు మారుతి సాగెను సీతను వెదకుచు || 83 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"పంజరమందున శారిక రీతిని లంకాపురనున సీత యుండెనో
అంధకార బంధురమౌ శాలల సీత నిరాశతో చెరలందుండెనో
రామ వియెగపు దుఃఖ భారమున తనకు తానుగా మరణ మెందెనో"
అని
చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరె ప్రాకారము పైకి || 84 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ నే
పలికెద సీతా రామకథ
"సీత జాడ కన లేదను వార్తను తెలిపిన క్రూరం లేకున్న ద్రోహం
హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా?
అన్నయే తన సర్వమనుకొనే లక్ష్మణుడాపై బ్రతికి యుండునా?"
అని మారితి విరుద్ధ భావనల కలతగ నిలచె కన్నీటి ధారల || 85 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"రామ లక్ష్మణులు గతించిరనిన భరత శతృఘ్నలు బ్రతుక జాలరు
కౌసల్యా సుమిత్రా కైకలు పుత్ర శోకమున మరణించెదరు
ఇంతటి ఘోరము గాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు"
అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచె కన్నీటి ధారల || 86 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"అటుపై రుమ సుగ్రీవు భార్యయు భర్త వియెగము న అసువులు బాయు
వాలి భార్య తార ఓరిమి జార బ్రతుకలేక పర లోకము జేరు
అంగదుడదిగ వానరులందరు శోకాబ్ధి మునిగి మృతి జెందెదరు"
అని మారుతి విరుద్ధ భావనల కలతగ నిలచె కన్నీటి ధారల || 87 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
"ఇంత వినాశము నావల్లనేను నే కిష్కింధకు పోనే పోను
వానప్రస్తా శ్రమ వాసుడనై నియమ నిష్టలతో బ్రతుకువాడనై
సీతామాతను చూచు తీరెదను లేకున్న నేను అగ్ని దూకెదను"
అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలుదెసల గనె సాహసవంతుడై || 88 ||
చూడమరచిన అశోక వనమును చూపుమేరలో మారితి గాంచెను
సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు
ఇంద్రాది యమ వాయు దేవులకు సూర్య చంద్ర మ రుద్గణములకు
వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడివడి || 89 ||
ఎల్లవేళల అశోక వనమున చల్లని గాలి వీచెడు మెల్లన
ఎటు చూచిన రాక్షసవీరులు కావలి యుందురు రేయింబవలు
రామకార్యమును నెరవేర్చుటకై రావణాదులు చూడకుండుటకై
వామన
రూపము మారుతి దాలిచి వనమున సాగె పెద్దల తలచి || 90 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
చంపక వకుళ సువర్ణ చందన శింశుప అశోక దేవకాంచన
నారికేళ, చూత నాగ కేసర సాల, రసాల,
ఖర్జూర, కర వీర
వివిధ పుష్ప ఫల జాతులతో విరిసిన వసంత శోభలతో
సుందరమైన అశోక వనమున మారుతి వెదకెను సీతను కనుగొన || 91 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
విరి తేనియలు గ్రోలు భృంగములు విందారగ గేయు ఝంకారములు
లే జివురాలకుల మెసపు కోయిలలు పంచమ స్వరమున పలికే పాటలు
పురులు విప్పి నాట్యమాడు నెమళ్ళులు కిలకిలలాడే పక్షుల గుంపులు
సుందరమైన అశోక వనమున మారుతి వెదకెను సీతను కనుగొన || 92 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊగుచు దూక సాగెను
పూవులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను
పూలు పై రాల పవన కుమారుడు పుష్పరథమువలె వనమున దోచెడు
సుందరమైన అశోక వనమున మారుతి వెదకెను సీతను కనుగొన || 93 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ముక్తామణిమయ సోపానములు కలువలు నిండిన నడబావులు
భరత శారిక హంస మయూర పారావతాది పక్షుల కూతలు
కుసుమలతావృత కుంజ వాటికలు స్వాదు జలములు ఉద్యాన వనములు
సుందరమైన అశోక వనమున మారుతి వెదకెను సీతను కనుగొన || 94 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నానా పుష్ప సుగంధములు విరియ కుంజ కుటీర క్రీడలు వెలయ
కాంచన శిఖర కాంతులు మెరయ పులకిత పయె ధరయై వెలయ
వినోదార్థము వన మధ్యమున క్రీడాచలము నిర్మితమైన
సుందరమైన అశోక వనమున మారుతి వెదకెను సీతను కనుగొన || 95 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మగనిపై అలిగి తరలెడు స్త్రీ వలె నగము వీడి వడి సెలయేతు వెడలె
హితము గొలుపు ప్రియ బాంధవులవలె ఏటినీట తరు శాఖలు వ్రాలె
తెలివిగ పతిజేర మరలెడు సతివలె శిలలను దాకిన వాహిని మరలె
సుందరమైన అశోక వనమున మారుతి వెదకెను సీతను కనుగొన || 96 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
చివురులు మెరసే రెమ్మలతో పూవులు విరిసే కొమ్మలతో
అమరిన బంగరు చిరుగుంటలతో కదలిన శాఖల గణ గణ ధ్వనులతో
ఫల పుష్పముల పరిమళాలతో అందరమయిన అలంకరణలతో
శోభిల్లు శింశుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయ జూచెను || 97 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పూవులనిన పూతీవియ లనిన జానకి కెంతో మనసౌనని
పద్మ పత్రముల పద్మాక్షుని గన పద్మాకరముల పొంతజేరునని
అన్ని రీతుల అనువైనదని అశోకవని సీత యుండునని
శోభిల్లు శింశుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయ జూచెను || 98 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మృగములు పక్షులు వనచరములనిన జానకి కెంతో ప్రాణప్రదమని
సంధ్యా సమయ ప్రార్థన కేని నదీతీరము డాయునని
మంగళకరమౌ అశోకవని మంగళకారిణి సీతయుండునని
శోభిల్లు శింశుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయ జూచెను || 99 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ప్రవాళాంకిత సోపానముల తప్తకాంచన విశాల వేదికల
గగన చుంబిత వర శిఖరాల నలుదెసల నింపు ధవళ కాంతుల
వేయి స్తంభముల దివ్య భవనము వన మధ్యమున ఠీవిగ నుండెను
0 Comments