Aditya Hrudayam in Telugu - ఆదిత్య హృదయం

 Aditya Hrudayam in Telugu ఆదిత్య హృదయం

Aditya Hrudayam in Telugu ఆదిత్య హృదయం

Aditya Hrudayam in Telugu - ఆదిత్య హృదయం


ధ్యానం

నమస్సవిత్రే జగదేక చక్షుసే

జగత్ప్రసూతి స్థితి నాశహేతవే

త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే

విరించి నారాయణ శంకరాత్మనే

 

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ 1

 

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్

ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషిః 2

 

అగస్యోవాచ:

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్

యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి 3

 

ఆదిత్యహృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనమ్

జయావహం జపే న్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ 4

 

సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనమ్

చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్ 5

 

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ 6

 

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః

ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7

 

ఏష బ్రహ్మా విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః 8

 

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః 9

 

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10

 

హరిదశ్వః సహస్రార్చి సప్తసప్తి ర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ 11

 

హిరణ్యగర్భ శ్శిశిర తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భో దితేః పుత్రః శంఖః శ్శిశిరనాశనః 12

 

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు సామ పారగః

ఘనావృష్టి రపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః 13

 

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

రవి ర్విశ్వో మహాతేజో రక్తః సర్వభవోద్భవః 14

 

నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ న్నమోస్తు తే 15

                                                          

నమః పూర్వాయ గిరయే పశ్చిమా యాద్రయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః 16

 

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17

 

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః 18

 

బ్రహ్మేశానాచ్యు తేశాయ సూర్యాయాదిత్య వర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః 19

 

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20

 

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే

నమస్తమోభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే 21

 

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22

 

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష ఏవాగ్నిహోత్రం ఫలం చైవాగ్ని హోత్రిణామ్ 23

 

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః 24

 

ఫలశ్రుతిః

 

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు

కీర్తయన్ పురుషః కశ్చి న్నావశీదతి రాఘవ 25

 

పూజయ స్వైన మేకాగ్రః దేవదేవం జగత్పతిమ్

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26

 

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవ ముక్త్వా తదాగస్త్యో జగామ యథాగతమ్ 27

 

ఏత చ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా

ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్ 28

 

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్ష మవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29

 

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్ 30

 

అధ రవి రవద న్నిరీక్ష్య రామం

ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా

సురగణ మధ్యగతో వచస్త్వరేతి 31

 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతతమః సర్గః

 

ఆదిత్య హృదయం అర్ధం

యుద్దము చేసి చేసి మిక్కిలి అలసియున్న

శ్రీరాముడు సమరంగమున చింతా

క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు

యుద్ధసన్నద్ధుడై స్వామియెదుట నిలిచి యుండను.

 

యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి

అచ్చుటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య

మహర్షి శ్రీరాముని సమీపించి, ఆప్రభువుతో ఇట్లు పల్కెను.

 

ఓరామా!మహాబాహూ!నాయనా!

సనాతనము మిగుల గోప్యము ఐన స్తోత్రమును

గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో

సమరమున నీవు శత్రువుల పై విజయము సాధించగలవు.

 

ఆదిత్యహృదయం అను స్తోత్రము పరమ

పవిత్రమైనది. సమస్త శత్రువులను

నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో

సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది

సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.

 

ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను

సమకూర్చి సమస్త పాపములను నశింపజేయను

ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును

వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది.

కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యకము.

 

అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు,

జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు

ప్రణమిల్లుదురు> మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త

భువనములను నియంత్రించువాడు, లోకములకు

వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము

 

ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు.

తేజో రాశ్. తన కిరణములచే లోకమునకు

శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర

గణములతో గూడి సమస్త లోకములను తన

కిరణములచే రక్షించుచుండువాడు.

 

బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి,

ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు,

కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు,

వరుణుడు మరియు

 

పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీదేవతలు,

మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు

మెదలగు వాఇ స్వరూపములు అన్నియు ఇతనివే.

షడృతువులకు కారకుడు ప్రభాకరుడే.

 

ఆదిత్యుడు జగత్ సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు

ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి

వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును

ప్రకాశింప జేయును.

 

బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగ ప్రకాశించువాడు.  

బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను

తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను

 

శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు, అసంఖ్యాకములైన

కిరణములుగలవాడు. సప్త అను పేరుగల రాధాశ్వముగలవాడు.

రథమునకు ఏడు గుఱ్ఱములు గలవాడు. తేజో నిధానములైన

కిరణములు గలవాడు .

 

చీకట్లను  పారద్రోలువాడు. సుఖములను

గూర్చువాడు, సర్వసంహారకుడు, జగత్ర్పళయమునకు పిమ్మట

దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు, నిరంతరము

తన కిరణముల్లుచే ప్రకాశించుచుండువాడు,

 

బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు,

తాపత్రయములతో బాధాపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు

శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు, దివ్యములైన

వెలుగులను గూర్చువాడు, సకల లోకములకు స్తుతిపాత్రుడు,

దివాసమయమున అగ్నిని గర్భనునందు ధరించువాడు. అదితి

దేవికి పుత్రుడుగా అవతరించినవాడు, సాయంకాలమున

స్వయముగ శాంతించువాడు. మంచును తొలగించువాడు,

 

ఆకాశమునకు అధిపతియైనవాడు, రాహువును ఛేదించు

లక్షణము గలవాడు, పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న

సమయమున యజుర్వేదరూపమును, సాయం సమయమున

సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా

వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను

వర్షింపజేయువాడు అని ఖ్యతి వహించెను. వింధ్యగిరి

మార్గమున అతివేగముగా సంచరించువాడు.

 

వేడిని కలిగియుండువాడు, వృత్తాకారమైన బింబము

గలవాడు. విరోధులను రూపుమాపువాడు, ప్రభాతసమయమున

పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున

సర్వప్రాణులను తపింపజేయుచుండువాడు. వ్యాకరణాది సమస్త

శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు,

గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయుందును అనురక్తి గలిగి

యుండువాడు సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.

 

వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము

గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున

పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున

సర్వప్రాణులను తపింపజేయుచుండువాడు, వ్యాకరణాది సమస్త

శాస్ర్తముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు.

గొప్ప తేజస్సు గలవాడు, సకల ప్రాణులయందును అనురక్తి గలిగి

యుండువాడు సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు

 

నక్షత్రములకు, గ్రహములకు, రారలకును అధిపతి

యైనవాడు, విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు

మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో

విలసిల్లువాడు. నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం

 

స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి

యందును విలసిల్లుచుండువాడవు, గ్రహములకు

నక్షత్రములకు, దివారాత్రములకు అధి[అతివి.

ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి

సూర్యభగవానుడా నీకు నమస్కారము.

 

జయములను, శుభములను చేకూర్చువాడవు,

శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడవు.

వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన

సూర్యభగవానుడా నీకు నమస్కారము.

 

నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు.

ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శ్రీఘ్రముగ

ప్రయాణించువాడవు. పర్మములను వికసింప

జేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల

సృజించుటకై ఆవిర్భవించు నటి సూర్యభగవానుడా

నీ నమస్కారము

 

బ్రహ్మ, విష్ణు, మహెశ్వరులకు ప్రతీకవు,

దివ్య తేజస్సంపన్నుడవు, కాంతికి నిధియైన వాడవు,

ప్రళయకాలమున లయ కారకుడవు, అందువలన

రుద్రస్వరూపుడవైన సూర్యభగవానుడా నీకు నమస్కారము.

 

తమస్సును రూపుమాపువాడవు, జడత్వమును,

శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను

ఆశ్రయించినవారి శత్రువులను సంహరించువాడవు.

పరమాత్మ స్వరూపుడవు, కృతఘ్నలను నశింప

జేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, సమస్త

జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.

 

బంగారమువంటి వన్నెగలవాడవు, ఆహుతులను

గ్రహించువాడవు, సర్వజగత్కర్తవు, తమస్సులను

పారద్రోలువాడవు, ప్రకాశస్వరూపుడవు, జగత్తున

జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవుకనుక

సూర్యభగవానుడా నీకు నమస్కారము.

 

రఘునందనా! ప్రభువే సమస్త

ప్రాణులను లయమెనర్చును. పిదప సృష్టించి

పాలించుచుండును. ఇతడు తన కిరణములచేత

జగత్తును తపింపజేయును. వర్షములను ప్రసాసించుచుండును.

 

ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా

నుండును. వారు నిద్రించుచున్నను తాను

మేల్కొనియే యుండును. హవిస్సు యెక్క

స్వరూపమూ ఇతడే, తత్పలస్వరూపమూ ఇతడే

 

ఇతడు వేద వేద్యుడు, యజ్ఞఫలస్వరూపుడు,

లోకములో జరిగెడి సమస్త కార్యములకు

సూర్యభగవానుడే ప్రభువు.

 

రఘురామా! ఆపదలయందును, కష్టముల

యందును, దుర్గమ మార్గములయందును,

భయస్థితులయందును స్వామిని కీర్తించిన

వారికి నాశము ఉండదు.

 

దేవదేవుడు, జగత్పతియైన

సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము,

ఆదిత్య హృదయమును ముమ్మారు

జపించినచో నీవు మహా సంగ్రామము నందు

విజయము పొందగలవు.

 

మహాబాహూ!రామా! క్షణముననే నీవు

రావణుని వధింపగలవు అని పలికి

అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.

 

మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహా ముని

ద్వారా ఆదిత్య హృదయ మహిమను

గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి

సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ

మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.

 

పిదప ముమ్మూరు ఆచమించి శుచియై

సూర్యభగవానుని జూచుచు మంత్రమును

జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట్

రఘువీరుడు తన ధనువును చేబూనెను

 

మిక్కిలి సంతుష్టుడైయున్న రాముడు

రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను.

అన్ని విధములుగా గట్టి పూనికతో నిశాచరుని

వధించుటకు కృతనిశ్చయుడయ్యెను

 

పిమ్మట దేవతలమధ్యనున్న

సూర్యభగవానుడు రావణుడు నశించుట

తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును

పొందినవాడై, ప్రరమ సంతోషముతో

శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను

శ్రీ సూర్యనారాయణ స్వామి చాలీసా

Post a Comment

0 Comments