శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహస్రనామ స్తోత్రం
Sri Vasavi Sahasranama Stotram - శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహస్రనామ స్తోత్రం |
ఓం
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహస్రనామ స్తోత్రం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
న్యాసం:-
అస్య శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ సహస్రనామ స్తోత్ర
మహామంత్రస్య సమాధి ఋషిః, శ్రీ
వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవతా, అనుష్టుప్ఛందః వంబీజం
స్వాహాశక్తిః, సౌభాగ్యమితి కీలకం, శ్రీ
వాసవీ కన్యకా పరమేశ్వరీ ప్రసాద సిద్ద్యర్ఠే జపే వినియెగః
ధ్యానం:-
వందే సర్వసుమంగళ రూపిణీం, వందే సౌభాగ్యదాయినీం
వందే కరుణామయ సుందరీం వందే కన్యకాపరమేశ్వరీం
వందే భక్తరక్షణ కారిణీం వాసవీం వందే శ్రీ మంత్రపుర వాసినీం
వందే నిత్యానంద స్వరూపిణీం వందే పెనుకొండపుర వాసినీం
శ్రీ
వాసవీ కన్యకా పరమేశ్వరీ శతోత్తర సహస్రనామ స్తోత్రము
శ్రీ కన్యా కన్యకాంబా చ కన్యకా పరమేశ్వరీ
కన్యకా వాసవీ దేవి మాతా వాసవకన్యకా 1
మణి ద్వీపాధి నేత్రీ చ మంగళా మంగళాయనీ
గౌతమీ తీర భూమిస్థా మహాగిరి నివాసినీ 2
సర్వ మంత్రాత్మికా చైవ సర్వ యంత్రాధినాయికా
సర్వ తాంత్రమయా భద్రా సర్వ మంత్రార్థరూపిణీ 3
సర్వజ్ఞా సర్వగా సర్వా బ్రహ్మ విష్ణు సమర్చితా
నవ్యా దివ్యా చ సేవ్యా చ భవ్యా సవ్యా సదవ్యయా 4
చిత్రకంఠ మదచ్ఛేత్రీ చిత లీలామయీ శుభా
వేదాతీతా వరా శ్రీదా విశాలాక్షీ శుభ ప్రదా 5
శంభుశ్రేష్ఠి సుతా పూతా విశ్వ విశ్వంభరావనీ
గణ్యా విశ్వమయా పుణ్యా అగణ్యా రూప సుందరీ 6
సగుణా నిర్గుణా చైవ నిర్ద్వంద్వా నిర్మ లానఘా
సత్యాసత్య స్వరూపా చ సత్యాసత్య స్వరూపిణీ 7
చరాచర మయీ చైవ యెగనిద్రా సుయెగినీ
నిత్యధర్మా నిష్కళా చ నిత్య ధర్మ పరాయణా 8
కుసుమశ్రేష్టి పుత్త్రీ చ కుసుమాలయ భూషణా
కుసుమాంబా కుమారీ చ విరూపాక్ష సహోదరీ 9
కర్మమయీ కర్మ హంత్రీ కర్మ బంధ విమెచనీ
శర్మదా భర్మవర్మాంగీ నిర్మలా నిస్తుల ప్రభా 10
ఇందీవర సమానాక్షీ ఇందిందిర సమాలకా
కృపాళిందా కృపా వార్దిః మణినూపుర మండితా 11
త్రిమూర్తి పదవీ దాత్రీ త్రిజగ ద్రక్షణ కాతరా
సర్వ భద్ర స్వరూపా చ సర్వ భద్ర ప్రదాయినీ 12
మణి కాంచన మంజీరా అరుణాంఘ్రి సరోరుహా
శూన్యమధ్యా సర్వమాన్యా ధన్యానన్యసమాద్భుతా 13
విష్ణువర్దన సమ్మెహన కారిణీ, పాపవారిణీ
సర్వ సంపత్కరీ సర్వరోగ శోక నివారిణీ 14
ఆత్మ గౌర సౌజన్య బోధినీ మానదాయినీ
మాన రక్షాకరీ భుక్తి ముక్తి దాత్రీ, శివప్రదా 15
నిస్సమా నిరధికా చైవ యెగమాయా హ్యనుత్తమా
మహామహా మహా శక్తిః అరి వర్గాపహారిణీ 16
భానుకోటి సహస్రాభా మల్లీ చంపక గంధిలా
రత్న కాంచన కోటీరా చంద్రఖండయుతాళికా 17
చంద్రబింబ సమాస్యాంక మృగనాభి విశేషకా
రాగ కృపాశాఢ్యా, అగ్ని పూజ్యా చతుర్భుజా 18
నాసా చాంపేయ పుష్పా చ నాసా మౌక్తిక సూజ్జ్వలా
కురువింద కపోలా చ ఇందు రోచిస్స్మి తాంచితా 19
వీణానిస్స్వన సల్లాపా అగ్ని శుద్డాంశుకాంచితా
గూఢ గుల్ఫా జగన్మాయా మణీ సింహాసన స్థితా 20
అప్రమేయా స్వప్రకాశా శిష్టేష్టా శిష్ట పూజితా
చిచ్ఛక్తి శ్చేతనాకారా మనో వాచా మగోచరా 21
చతుర్దశ విద్యారూపా చతుర్దశ కళామయీ
మహా చతుష్టష్టి కోటి యెగినీగణ సేవితా 22
చిన్మయీ పరమానందా విజ్ఞాన ఘన
రూపిణీ
ధ్యాన రూపా ధ్యేయాకారా
ధర్మా ధర్మ విదూరగా 23
చారు రూపా చారు హాసా చారు చంద్ర కళాధరా
చరాచర జగన్నేత్రీ చక్రరాజ నికేతనా 24
బ్రహ్మాదిక సృష్టి కర్త్రీ గోప్త్రీ తేజస్స్వరూపిణీ
భానుమండల మధ్యస్థా భగవతీ సదా శివా 25
ఆ బ్రహ్మ కీటజననీ పురుషార్థ ప్రదాంబికా
ఆది మధ్యాంత రహితా హరి బ్రహ్మేశ్వ రార్చితా 26
నారాయణీ నాదరూపా సంపూర్ణాభువనేశ్వరీ
రాజరాజార్చితా రమ్యా రంజనీ ముని రంజనీ 27
కళ్యాణీ లోకవరదా కరుణారస మంజులా
వరదా వామనయనా మహారాజ్ఞీ నిరీశ్వరీ 28
రక్షాకరీ రాక్షాసఘ్నీ దుష్టరాజ మదాపహా
విధాత్రీ వేద జననీ రాకాచంద్ర సమాననా 29
తంత్రరూపా తంత్రిణీ చ తంత్రనేత్త్రీ చ తంత్రగా
శాస్త్రరూపా శాస్త్రాధారా సర్వ శాస్ర్త స్వరూపిణీ 30
రాగపాశా, మనశ్చాపా పంచభూతమయీతథా
పంచ తన్మాత్ర విశిఖా క్రోధాకారాంకుశాంచితా 31
నిజ కాంతి భరాఖండ మండ లా ఖండలార్చితా
కదంబమయ తాటంకా పద్మ చాంపేయ గంధిలా 32
సర్వ విద్యాంకు రాశంక్య దంత పంక్తి ద్వయాంచితా
సర సాలాప మాధుర్య జిత వాణీ విపంచికా 33
గ్రైవేయ మణి చింతాకా కూర్మపృష్ఠ పదద్వయా
నఖకాంతి పరిచ్ఛన్న నమద్ర్వా త తమె గుణా 34
మణీ కింకిణీకా దీవ్య ద్రశనా దామవిభూషితా
రంభాస్తంభ మనో జ్ఞాతి మనో జ్ఞోరుద్వయాంచితా 35
పదశోభా జితాంభోజా మహాగిరి పురీశ్వరీ
దేవరత్న గ్రుహాంతస్థ్సా సర్వ బ్రహ్మాసనస్థితా 36
మహాపద్మ వనస్థానా కదంబవనవాసినీ
నిజాంశభాగ ప్రొల్లాసి లక్ష్మీ గౌరీ సరస్వతీ 37
మంజుగుంజ న్మణి మంజీ రాలంకృత పదాంబుజా
హంసికా మందగమనా మహాసౌందర్య వారిధిః 38
అనవ ద్యారుణాగణ్యా చా గణ్యా గుణదూరగా
సంపద్దా త్ర్యాశ్వినేయౌఘ దేవవ్రాత సుసేవితా 39
గేయచక్ర రథారూఢ మంత్రిణ్యంబా సమర్చితా
కామదానవద్యాంగీ దేవర్షి స్తుత వైభవా 40
విఘ్న యంత్ర చమూభేత్త్రీ కరోద్య న్నైక మాధవా
సంకల్పమాత్ర నిర్ధూత విష్ణువర్థన వైభవా 41
మూర్తి త్రయ సదా సేవ్యా సమయస్థా నిరామయా
మూలాధారభవా, బ్రహ్మ గ్రంథి సంభేదినీ, పరా 42
మణిపూరాంత రావాసా విష్ణుగ్రంథి విభేదినీ
ఆజ్ఞాచక్రగతా, మాయా రుద్రగ్రంథి విమెక్షదా 43
సహస్రార సమారుఢా సుధాసార ప్రవర్షిణీ
తటిద్రేఖా సమాభాసా షట్చక్రోపరి వాసినీ 44
భక్తి వశ్యా భక్తి గమ్యా భక్త రక్షణ కాతరా
భక్తిప్రియా భద్రమూర్తిః భక్త సంతోష దాయినీ 45
సర్వదా కుండలి న్యంబా శారదేడ్యా చ శర్మదా
సాధ్వీ శ్రీక ర్యుదారాచ ధీకరీ శంభూమానితా 46
శరచ్చంద్ర ముఖీ
శిష్టా నిరాకారా నిరాకులా
నిర్లేపా నిస్తులా చైవ నిరవద్యా నిరంతరా 47
నిష్కారణా నిష్కళంకా నిత్యబుద్డా నిరీశ్వరా
నీరాగా రాగదమనా నిర్మదా మదనాశినీ 48
నిర్మమా సమమా చాన్యా అనన్యా జగదీశ్వరీ
నీరోగా నిరుపాధి శ్చ నిరానందా నిరాశ్రయా 49
నిత్య ముక్త నిగమగా నిత్య శుద్దా నిరుత్తమా
నిర్వ్యాధి ర్వ్యాధిమథనా నిష్క్రియా నిరుపప్లవా 50
నిరహంకారా చ నిశ్చింతా నిర్మోహా మెహ వారిణీ
నిర్బాధా మమతా హంత్రీ నిష్పాపా పాప నాశినీ 51
అభదా చ సాక్షి రూపా నిర్భేదా భేద నాశినీ
నిర్నాశా నాశ మథనీ నిర్లోభా లోభ హారిణీ 52
నీలవేణీ నిరాలంబా నిరపాయా భయాపహా
నిస్సందేహా సంశయఘ్నీ నిర్భవా చ నిరంచితా 53
సుఖప్రదా దుష్టదూరా నిర్చికల్పా నిరత్యయా
సర్వజ్ఞానా దుఃఖ హంత్రీ సమానాధిక వర్జితా 54
సర్వ శక్తి మయీ సర్వ మంగళా సద్గతిప్రదా
సర్వేశ్వరీ సర్వమయీ సర్వతత్త్వ స్వరూపిణీ 55
మహామాయా మహాశక్తిః మహాసత్త్వా మహాబలా
మహావీర్యా మహాబుద్ధిః మహైశ్వర్యా మహాగతిః 56
మనోన్మనీ మహాదేవీ మహాపాతక నాశినీ
మహాపూజ్యా మహాసిద్దిః మహా యెగీశ్వరేశ్వరీ 57
మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా
మహాయాగ క్రమారారాధ్యా మహాయెగ సమర్చితా 58
ప్రకృతి ర్వికృతి ర్విద్యా సర్వభూత హితప్రదా
శుచి స్స్వాహా చ ధన్యాచ స్వధా సుధా
హిరణ్మయీ 59
మాన్యా శ్రద్దా విభూతి శ్చ బ్రహ్మ విష్ణు శివాత్మకా
దీప్తా కాంతా చ కామాక్షీ నిత్య పుష్పా విభావరీ 60
అనుగ్రహపదా రామా అనఘా లోకవల్లభా
అమృతా చా శోకమూర్తిః లోక దుఃఖ వినాశినీ 61
కరుణా ధర్మనిలయా పద్మిణీ పద్మగంధినీ
సుప్రసన్నా
పుణ్యగంధా ప్రసాదాభిముఖీ ప్రభా 62
పద్మాక్షీ పద్మముఖీ చ లోకమా తేందుశీతలా
ఆహ్లాద జననీ పుష్టా పద్మ మాలా ధ రాద్భుతా 63
అర్థచంద్ర సుఫాలాచ సారా వైశ్య సహోదరీ
వైశ్య సౌఖ్య ప్రదా తుష్టిః శివా దారిద్ర్య నాశినీ 64
శివ దాత్రీ చ విమలా స్వామినీ ప్రీతి పుష్కలా
ఆర్యా శ్యామా సతీ సౌమ్యా శ్రీదా మంగళదాయినీ 65
భక్త గేహభరా నందా సిద్ధిరూపా వసు ప్రదా
భాస్కరీ జ్ఞాననిలయా లలి తాంగీ యశస్స్వినీ 66
త్రికాల జ్ఞోరుసంపన్నా సర్వకాల స్వరూపిణీ
దారిద్ర్య ధ్వంసినీ కాంతి స్సర్వోపద్రవ వారిణీ 67
అన్నదా చా న్నదాత్రీచ అచ్యుతానందకారిణీ
అనంతాచ్యుతా వ్యక్తా అవ్యక్త వ్యక్తరూపిణీ 68
శారదాంబోజ పత్త్రాక్షీ శరచ్చంద్ర రుచిస్మితా
జయా జయావకాశా శా అవకాశ స్వరూపిణీ 69
ఆకాశమయ పద్మస్థా అనాద్యా చ త్వయెనిజా
ఆబాలాం బాంబి కా గాధా ఆత్మజ్ఞా చాత్మగోచరా 70
అధ్యానా ద్యాదిదేవీ చ ఆదిత్యచయ భాస్వరా
కార్తస్వరమనోజ్ఞాంగీ కలకంఠ నిభస్వరా 71
ఆత్మసూ రాత్మదయితా ఆధారా చాత్మ రూపిణీ
అనీశా కాశ్యపైశానీ ఈశ్వ ర్యైశ్వర్యదాయినీ 72
ఇంద్రసూ రిందుమాతా చ ఇంద్రియా చేందుమండితా
ఇందుబింబ సమానాస్యా ఇంద్రియాణాం వశంకరీ 73
ఏకా చైకవీరా చ ఏకాకారైక వైభవా
ఓఘత్రయ సుపూజ్యా చ ఓఘసూ రోఘదాయినీ 74
వర్ణాత్మా వర్ణ నిలయా షోడశ స్వర రూపిణీ
కళీ కృత్యా మహారాత్రిః ర్మోహరాత్రి స్సులోచనా 75
కమనీయా కళాధారా కామధూ వర్ణ మాలినీ
కాశ్మీర ద్రవ లిప్తాంగీ కామ్యా చ కమలార్చితా 76
మాణీక్యభాస్యలంకారా కనకా కనక ప్రదా
కంబు గ్రీవా కృపాయుక్తా కిశోరీ చ లలాటినీ 77
కాలస్ఠా చ నిమేషా చ కాలధాత్రీ కళావతీ
కాలజ్ఞా కాలమాతా చ కాలనేత్త్రీ కళావనీ 78
కాలదా కాలహా కీర్తీః కీర్థిస్థా కీర్తి వర్ధినీ
కీర్తిజ్ఞా కీర్తిత గుణా కేశ వానంద కారిణీ 79
కుమారీ కుముదాభా చ కర్మదా కర్మ భంజనీ
కౌముదీ కుముదానందా కాలాంగీ కాల భూషణా 80
కపర్థినీ కోమలాంగీ కృపాసింధుః కృపామయీ
కంజస్థా కంజ వదనా కూట స్థోరు గిరీశ్వరీ 81
కుండసుస్థా చ కౌబేరీ కలికల్మష నాశినీ
కాశ్యాపీ కామరూపా చ కంజ కింజల్క చర్చితా 82
ఖంజన ద్వంద్వనేత్రీ చ కేచరీ ఖడ్గయు క్కరీ
చిత్తజ్ఞా చింతిత పదా చిత్తస్థా చిత్స్వరూపిణీ 83
చంపకాభ మనోజ్ఞాంగీ చారు చంపక మాలినీ
చండీ చ చండరూపా చ చైతన్య ఘన గేహినీ 84
చిదానందా చిదాధారా చిదాకారా చిదాలయా
చపకాభాంగ లతికా చంద్రకోటి సుభాస్వరా 85
చింతామణి గుణాధారా చింతామణి విభూషితా
భక్త చింతామణీ లతా చింతామణి సుమందిరా 86
చారుచందన లిప్తాంగీ చతురా చతురాననా
ఛత్రదా ఛత్రధారీ చ చారుచామర వీజితా 87
భక్తానాం ఛత్రరూపా చ ఛత్రచ్ఛాయా కృతాలయా
జగజ్జీవా జగద్దాత్రీ జగదానంద కారిణీ 88
జననీ చ యజ్ఞరతా జప యజ్ఞ పరాయణా
యజ్ఞదా యజ్ఞఫలదా యజ్ఞస్థాన కృతాలయా 89
యజ్ఞ భోక్త్రీ యజ్ఞరూపా యజ్ఞ విఘ్న వినాశినీ
కర్మ యెగా కర్మరూపా కర్మ విఘ్న వినాశినీ 90
కర్మదా కర్మఫలదా కర్మ స్థాన కృతాలయా
కాలుష్యాపేత చారిత్రా సర్వకర్మ సమచింతా 91
జయస్థా జయదా జైత్రీ జీవదా జయ కారిణీ
యశోదా యశసాం రాశిః యశోదానంద కారిణీ 92
జ్వలినీ జ్వాలినీ జ్వాలా జ్వలత్పావక సన్నిభా
జ్వాలాముఖీ జనానందా జంబుద్వీప కృతాలయా 93
జన్మదా జన్మహా జన్మ జన్మభూ ర్జన్మ రంజనీ
జంబూనద సమానాంగీ జాంబూనద విభూషణా 94
జాతిదా జాతిచ జాతి జ్ఞానదా జ్ఞానగోచరా
జ్ఞానహా జ్ఞానరూపా చ జ్ఞానవిజ్ఞానశాలినీ 95
జపాపుష్ప సమానోష్ఠా జపాకుసుమ శోభితా
జినజైత్రీ జినాధారా జినమాతా జినేశ్వరీ 96
తీర్థంకరీ నరాధారా అమలాంబర ధారిణీ
శంభుకోటి దురాధర్షా విష్ణువర్ధన మర్ధినీ 97
సముద్రకోటి గంభీరా వాయుకోటి మహాబలా
సూర్యకోటి ప్రతీకాశా యమకోటి పరాక్రమా 98
కామధుక్కోటి ఫలదా శక్రకోటి సురాజ్యదా
రతికోటి సులావణ్యా పద్మ కోటి నిభాననా 99
పృధ్వీకోటి జనాధారా అగ్నికోటి భయంకరీ
ఈశానాతిగసచ్ఛక్తిః ధనదౌఘ ధనప్రదా 100
అణిమా మహిమా ప్రాప్తి ర్గరిమా లఘిమా తథా
ప్రాకామ్యదా వశకరీ ఈశికా సిద్దిదా తథా 101
మహిమాది గుణైర్యుక్తా అణిమాద్యష్ట సిద్దిదా
జవనఘ్నీ జనాధీనా అజరా చ జరాపహా 102
తారిణీ తారికాకారా త్రిగుణా తులసీనతా
త్రైవిద్యా చ త్రయీ త్రిఘ్నీ తిరీయా త్రిగుణేశ్వరీ 103
త్రివిధా త్రిదశారాధ్యా త్రిమూర్తీ జననీ త్వరా
త్రివర్ణా చ త్రైలోక్యా చ త్రిదివా త్రైలోక్యధారిణీ 104
త్రిమూర్తి శ్చ త్రిజననీ త్రిభూ స్తారా తపస్స్వినీ
తరుణీ చ తపోనిష్ఠా తప్తకాంచన సన్నిభా 105
తరుణా త్రిదివేశానీ తాపసీ తార రూపిణీ
తరుణార్కప్రతీకాశా తాపఘ్నీ చ తమెపహా 106
తార్కికీ తర్క విద్యాచ త్రైలోక్య వ్యాపి
నీశ్వరీ
త్రిపుష్కరా త్రికాలజ్ఞా తాపత్రయ వినాశినీ 107
గుణాఢ్యా చ గుణాతీతా తపస్సిద్ది ప్రదాయినీ
కారికా తీర్థ రూపా చ తీర్థ తీర్థకరీ తథా 108
దారిద్ర్య దుఃఖ దళినీ అదీనా దీన వత్సలా
దీనానాథ ప్రియా దీర్ఘా దయాపూర్ణా దయాత్మికా 109
దేవ దానవ సంఫూజ్యా దేవానాం మెద కారిణీ
దేవసూ దక్షిణా దక్షా దైవీ దుర్గతినాశినీ 110
అనందోదధి మధ్యస్థా అఘో రాట్టహాసినీ
ఘోరాగ్ని దాహ దమనీ దుఃఖ దుస్స్వప్న వారిణీ 111
శ్రీమతీ శ్రీమయీ శ్రేష్ఠా శ్రీకరీ శ్రీవిభావనీ
శ్రీదా శ్రీశా శ్రీనివాసా శ్రీయుతా శ్రీమతీ
గతిః 112
ధనదా దామినీ దాంతా ధర్మదా ధనశాలినీ
దాడిమీబీజ రదనా ధనాగారా ధనంజయా 113
ధరణీ ధారిణీ ధైర్యా ధరా ధాత్రీ చ ధైర్యదా
దయా దోగ్ధ్రీ ధార్మిణీ చ దమినీ చ దురాపదా 114
నానారత్న విచిత్రాంగీ నానాభరణ మండితా
నీరజాస్యా నిరాతంకా నవలావణ్య సుందరీ 115
నిధిదా నిధి రూపా చ మతి నిర్యాణ సుందరీ
పరమా నిర్వికారా చ నిర్వైరా నిఖిలాధికా 116
ప్రమితా ప్రాజ్ఞా చ పూర్వా సర్వ పావన పావనీ
సర్వప్రియా సర్వ రతా పావనా పాపనాశినీ 117
వాసవ్యంశ భాగాచ పరంజ్యోతి స్స్వరూపిణీ
పరేశీ పార గా పారా పరాసిద్దిః పరాగతిః 118
పితా మాతా చ పశుదా పశుపాశ వినాశినీ
పద్మ గంధా చ పద్మాక్షీ పద్మ కేసర మందిరా 119
పరబ్రహ్మ స్వరూపా చ పరబ్రహ్మ నివాసినీ
పరమానంద ముదితా పూర్ణ పీఠ నివాసినీ 120
పరమేశీ చ పృధ్వీ చ పరచక్ర వినాశినీ
పరాపరా పరావిద్యా పరమానంద దాయినీ 121
వాగ్రూపా వాఙ్మయీ వాగ్దా వాఙ్నేత్రీ వాగ్వీశారదా
ధీరూపా ధీమయీ ధీరా ధీదాత్రీ ధీ విశారదా 122
బృందారక బృంద వంద్యా వైశ్యబృంద సహోదరీ
పరమర్షివ్రాత వినుతా పినాకీ పరికీర్తితా 123
ఫణిభూషా బాలా పూజా ప్రాణరూపా ప్రియంవదా
భవారాధ్యా భవేశీ చ భవా చైవ భవేశ్వరీ 124
భవమాతా భవాగమ్యా భవకంటక నాశినీ
భవానందా భవనీయా భూతపంచక వాసినీ 125
భగవతీ భూత ధాత్రీ భూతేశీ భూత రూపిణీ
భూతస్థా భూత మాతా చ భూతఘ్నీ భవ మెచనీ 126
భక్తశోక తమెహర్త్రీ భవభార వినాశినీ
భూగోపచార కుశలా భిస్సా ధాత్రీచ భూచరీ 127
భీతిహా చ భక్తి రమ్యా భక్తానా మిష్టదాయినీ
భక్తానుకంపినీ భీమా భక్తానా మార్తినాశినీ 128
భాస్వరా భాస్వతీ భీతిః భాస్వ దుత్తానశాలినీ
భూతిదా భూతిరూపా చ భూతిగా భువనేశ్వరీ 129
మహా జిహ్వా మహా దంష్ట్రా మణిపూర నివాసినీ
మానసీ మానదా మాన్యా మనశ్చక్షు రగోచరా 130
మహాకుండలినీ మధురా మహాశ్రతు వినాశినీ
మహా మెహాంధకారఘ్నీ మహామెక్ష ప్రదాయినీ 131
మహాశక్తి ర్మహావీర్యా మహాసుర విమర్ధినీ
శక్తి ర్మేధా చ మతిదా మహావైభవ వర్ధినీ 132
మహాపాతక సంహర్త్రీ ముక్తి కామ్యార్థ సిద్దిదా
మహావ్రతా మహామూర్థా మహాభయవినాశినీ 133
మహనీయా మాననీయా మత్త మాతంగ గామినీ
ముక్తాహార లతోపేతా మహాచోర భయాపహా 134
మహాఘోరా మంత మాతా మకరాకృతి కుండలా
మాలినీ మానినీ మాధ్వీ మహాసూక్ష్మా మహాప్రభా 135
మహాచింత్య మహారూపా మహామంత్ర మహౌషధీః
మణిమండప మధ్యస్థా మణిమాలా విరాజితా 136
మనోరమా రమా మాతా రాజ్ఞీ రాజీవ లోచనా
విద్యానీ విష్ణురూపా చ విశాలనయ నోత్సలా 137
వీరేశ్వరీ చ వర్దా వీరసూ వీర నందినీ
విశ్వభూ వీరవిద్యా చ విష్ణుమాయా విమెహినీ 138
విశ్వేశ్వరీ విశాలాక్షీ విఖ్యాతా విలసత్కచా
బ్రహ్మేశీ చ బ్రహ్మ విద్యా బ్రహ్మాణీ బ్రహ్మరూపిణీ 139
విశ్వా చ విశ్వ వంద్యా చ విశ్వ శక్తి విచక్షణా
వీరా చ బిందుస్థా చైవ విశ్వ పాశ విమెచనీ 140
శిశు ప్రాయా వైద్య విద్యా శీలా శీల ప్రదయినీ
క్షేత్రా క్షేమంకరీ వైశ్యా ఆర్య వైశ్య కులేశ్వరీ 141
కుసుమ శ్రేష్టి సత్పుత్త్రీ కుసుమాంబా కుమారికా
బాల నగర సంపూజ్యా విరూపాక్ష సహోదరీ 142
సర్వ సిద్దేశ్వరారాధ్యా సర్వేశ్వర ఫల ప్రదా
సర్వదుష్ట ప్రశమనీ సర్వరక్షా స్వరూపిణీ 143
విబుధా విష్ణుసంకల్పా విజ్ఞాన ఘనరూపిణీ
విచిత్రిణీ విష్ణూపూజ్యా విశ్వమాయా విలాసినీ 144
వైశ్య త్రాత్రీ వైశ్యగోత్రా వైశ్య గోత్ర వివర్ధినీ
వైశ్య భోజన సంతుష్టా విష్ణురూపా వినోసిణీ 145
సంకల్ప రూపిణీ సంధ్యా సత్య జ్ఞాన ప్రబోధినీ
వికార రహితా వేద్యా విజయా విశ్వ సాక్షిణీ 146
తత్త్వజ్ఞా చ తత్త్వాచ తత్పదార్థ స్వరూపిణీ
తప స్స్వాధ్యాయ నిరతా తపస్స్వి జన సన్నుతా 147
వింధ్యవాసి న్యర్చితా చ నగరేశ్వర మానితా
కమలాదేవీ సంపూజ్యా జనార్ధన సుపూజితా 148
వందితా వరరూపా చ వరా చ వరవర్ణినీ
వారిదాకార సికచా వైశ్య లోక వశంకరీ 149
తత్కీర్తిగుణ సంపన్నా తధ్యవాక్చ తపోబలా
తరుణాదిత్య సంకాశ తపోలోక నివాసినీ 150
తంత్ర సారా తంత్ర మాత తంత్ర మార్గ ప్రదర్శినీ
తంత్రా తంత్ర విధానజ్ఞా తంత్రస్థా తంత్ర సాక్షిణీ 151
సర్వ సంపత్తి జననీ సత్పదా సక లేప్టదా
అసమానా సామ దేవీ సమర్హా సకల స్తుతా 152
సనకాది ముని ధ్యేయా సర్వ శాస్త్రార్థ గోచరా
సదా శివా సముత్తీర్ణా సహస్రదళ పద్మగా 153
సర్వ వేదాంత నిలయా సమయా సర్వతో ముఖీ
సాత్త్వికా సంభ్రమా చైవ సర్వ చైతన్య రూపిణీ 154
సర్వోపాధి వినిర్ముక్తా సచ్చిదానంద రూపిణీ
సర్వ విశ్వంభరా వంద్యా సర్వజ్ఞాన విశారదా 155
విద్యా విద్యాకరీ విద్యా విద్యా విద్య ప్రబోధినీ
విమలా విభవావేద్యా విశ్వస్థా వివిధోజ్వలా 156
|
వీర మధ్యా విరాడ్రూపా వితంత్రా విశ్వనాయికా 157
విశ్వంభరా సమారాధ్యా విక్రమా విశ్వ మంగళా
వినాయకీ వినోదస్థా విశ్వ విభ్రమ కారిణీ 158
వివాహా రహి తా వేలా వీరగోష్టి వివర్ధినీ
తుంబురాది స్తుతి ప్రీతా మహాగిరి పురీశ్వరీ 159
తుష్ఠా చ తుష్ఠి జననీ తుష్ట లోక నివాసినీ
తులాధారా తులా మధ్యా తులాస్థా తులుఅదూరగా 160
తురీయత్వ సుగంభీరా తూర్యారావ స్వరూపిణీ
తూర్య విద్యా నృత్య తుష్టా తూర్య విద్యార్థ వాదినీ 161
తురీయ శస్త్ర తత్త్వజ్ఞా తూర్య నాద వినోదినీ
తూర్య నాదాంత నిలయా తూర్యానంద స్వరూపిణీ 162
తురీయ భక్తి జననీ తూర్య నాద వినోదినీ
శ్రీ వరేణ్యా వరిష్ఠాచైవ వేద శాస్త్ర ప్రదర్శినీ 163
వికల్ప శమనీ వాణీ వాంఛితార్థ ఫలప్రదా
వందినీ వాదినీ వశ్యా వయె వస్థా దివర్జితా 164
వసిష్ఠ వామదేవాది వంద్యావంద్య స్వరూపిణీ
వసుప్రదా వాసుదేవీ వషట్కారీ వసుంధరా 165
వాసవార్చిత పాద శ్రీ ర్వాసవారి వినాశినీ
వశినీ వాగ్గృహస్థాచ వాగీశ్వర్యర్చిత ప్రభా 166
రవిమండల మద్యస్థా రమణీ రవి లోచనా
రంభాతిశాయిలావణ్యా రంగమండల మధ్యగా 167
వర్ణితా వైశ్యజననీ వర్ణ్యా సర్వేందు మధ్యగా
రావిణీ రాగిణీ రంజ్యా రజరాజేశ్వరార్చితా 168
రాజన్వతీ రాజ నీతి ర్వైశ్వనీతి ర్వర ప్రదా
అభంగా భంగాచ భంగ దూరా త్వభంగూరా 169
రాఘవార్చిత పాదశ్రీ రత్నాంగీ రత్న దాయినీ
రత్న ప్రాకార మధ్యస్థా తత్నమండప మధ్యగా 170
రత్నాభిషేక సంతుష్టా రత్నాంగీ రత్న దాయినీ
నీవారశూకవత్తన్వీ పీతాభాస్వ త్యణూపమా 171
నీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవభాస్వరా
కవయిత్రీ నిర్జరా చ విశ్వార్చి ర్విశ్వతో మిఖీ 172
సర్వానందమయీ నవ్యా సర్వ రక్షాస్వరూపిణీ
సర్వ సిద్ధేశ్వరై ర్వంద్వా సర్వ మంగళ మంగళా 173
నిత్యోత్సవా నిత్య పూజా నిత్యానంద స్వరూపిణీ
నిర్గుణస్థా నిశ్చింతాచ నిత్య మంగళ రూపిణీ 174
నిరీహా నిమేషా నారీ నిఖిలాగమ వేదినీ
నిస్సంశ యా నిర్లోభా చ నిత్య కర్మ ఫల ప్రదా 175
సర్వ సంగత మాంగల్యా భక్త సర్వార్థ సాధకా
వైశ్యాస చ్చమూహర్త్రీ వైశ్యసంపత్ప్రదాయినీ 176
మహాశైల పురీ గేహ సర్వ వైశ్య శుభప్రదా
ద్వ్యుత్తరశత గో త్రార్య వైశ్య సౌఖ్యప్రదాయినీ 177
శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వర్యై నమః 178
ఇతి శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వరీ శతోత్తర
సహస్రనామ స్తోత్రమ్
సంపూర్ణమ్
0 Comments