Vasavi Chalisa - శ్రీ వాసవి చాలీసా 2
Vasavi Chalisa 2 - శ్రీ వాసవి చాలీసా 2 |
1. అమ్మ వాసవి కన్యకా మమ పాలించే దేవతా, నోరారా నీ చాలిసా తర తరాలకు స్మరణీయం..
2. సమాధి మహర్షి ఆశీస్సులతో, సోమ దత్తముని ప్రార్థనతో..
3. కుసుమ దంపతుల ఫలనివై, వైశ్య కులానికి పరానివై
4. వైశ్యకులముని వేలిశావమ్మ, ఘనతలనెన్నో తెలిసావమ్మ
5. పెనుగొండలోన జననం, పరమ పవిత్రం నీ చరితం
6.ఐదో యేడు రాగానే, గురుకులానికి చేరితివి
7.సమస్త విద్యలు సాదించి, అనంత శక్తులు అర్జించితివి
8.యుక్త వయసులో వాసవిగా, అపురూపవతివై వేలిగావమ్మా
9.వివాహామంటె వలదన్నావు, కన్యకగానే ఉన్నావు
10.విష్ణువర్దన మహారాజు, బలదర్బముతో చూశాడు
11.కన్ను మున్ను కానక నిన్ను, కామ కాంక్షతో చూశాడు
12.కన్యవైన నిన్ను కోరాడు, అకాల మరణం ఆహ్వానించాడు
13.అపచారానికి తలను వంచక, సమర శంకముకు పూరించక
14.అహింసా ధర్మాన్ని ఆశ్రయించి, తనువు త్యాగాన్ని ఆచరించావు
15.శక్తి రూపినిగా సాక్షాత్కరించి, భక్త జనులకు మెక్షమిచ్చితివి
16.దేహబ్రాంతిని తోలిగించావు, అద్వైత సూత్రాన్ని వెలిగించావు
17.ఆత్మకు మానవ రూపం మజిలీగా, పరమాత్మ లో లీనం బదిలీగా
18.శాశ్వత సత్యం ప్రవచించావు, సృష్టి రహస్యం బోధించావు
19.స్థిత ప్రజ్ఞత గలజ్గ్నరాలివి, ప్రతిభా పాటవ ప్రజ్ఞాశాలివి
20.నీ ఆదర్శం అనుస్మరనీయం, నీ వ్యక్తిత్వం స్మరణీయం
21.దుష్టునికి దాసోహం కాక, శిష్టురాలివై మార్గహం చూపావు
22.నీతో నూటారెండు గోత్రాలవారు, ఆత్మార్పనతో పునీతులయ్యారు
23.భౌతిక ధర్మాలు భోదించావు, నైతిక సూక్ష్మాలు ధరించమన్నావు
24.నీ మాటలు మాకు శిరోధార్యాలు, నీ భాటలు ఇస్తాయి శౌర్యధైర్యాలు
25.పుణ్యవసిష్టానది తీరము లో, బ్రహ్మకుండ పావన ప్రా
26.అగ్నిగుండమున అడుగేశావు, పరాశక్తి గా నిలిచావు
27.కరుణాకటక్షాల కరుణామూర్తిని, కోరిన కోర్కేలు తీర్చే కల్పవల్లీ
28.నిన్నే మదినిలిపి కొలిచేము, ఎన్నటికీ నీనామం తలచేము
29.కోట్ల ప్రజల కుల దేవతగా, దివ్యప్రభల ఇలవేలపుగా
30.మా పూజల గైకొనవమమ్మ, మా ప్రార్థనలు మన్నించవమ్మ
31.కృప చూపాలని వేడితిమమ్మ, ఆపదలు బాపి రక్షించవమ్మ
32.జగన్మాతకు ప్రతిరూపానివి, జగతికి నీవే ఆధారానివి
33. నిన్ను ప్రార్థిస్తే శుభాలుకలుగును, నిన్ను సేవిస్తే సంపదలబ్బును
34.దీక్షాధృతితో ఆత్మార్పణం, శిక్షా స్కృతిగా రాజు మరణం
35.స్వజనుల కాచి పరాశక్తివై, దుర్జనుల కళ్ళు తెరిపించావు
36.వైశాక శుద్దదశమి న జననము, మాఘ శుద్ద విదియన ఆత్మార్పణము
37.చిత్త శుద్దితో ధ్యానించెదము, భక్తి శ్రద్దలతో నిన్ను స్మరించేదము.
38. అందిస్తున్నామమ్మా వాసవీమాతా, అందుకోవమ్మ మా ప్రణామాలు
39. శక్తి రూపిణిగా సాక్షాత్కరించి భక్తి జనులకు మెక్ష
మిచ్చితివి
వాసవీ మాతా చాలీసా ప్రతీ దినం పటించినచో దరి చేరలేవు నీ
శోకాలు కలుగునులే శాంతి సుఖాలు
జై వాసవీ మాతా, జై జై వాసవీ మాతా
0 Comments