Sundarakanda 6 - సుందరకాండ 6 |
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రెంచి
ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి
ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి
సుందరమైన
అశోకవనమును చిందర వందర చేసె మారుతి || 251 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగ పరుగులు తీయగ
పక్షుల గుంపులు చెల్లాచెదరై దీనారవముల ఎగిరిపోవగ
సీతయున్న శింశుపా తరువు వినా వనమంతయు వినాశము కాగా
సుందరమైన
అశోకవనమును చిందర వందర చేసె మారుతి || 252 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్ర లేచిరి
కావలియున్న రాక్షస వనితలు రావణు జేరి విన్నవించిరి
దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బట్టి దండింపుడని
ఎనుబది వేల కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి || 253 ||
శూల పట్టసాది ఆయుధ ధారులు రకరకములగు కవచ ధారులు
వేగవంతులు రణశూరులు ముద్గరపాణులు ధనుర్థారులు
మహా దంష్ట్రులు మహా బలులు మహోదరులు ఘోర రూపులు
ఎనుబది
వేల కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి
|| 254 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మిడుతలదండు
అగ్ని బడునటులె అసురుల దండు కపీశునిపై పడె
సింహనాదమును
మారుతి చేసె వాలము బెంచి భూమిపై మెదె
దిక్కలు అదరె
మృగములు బెదరె పక్షులు చెదరి నేలపై బడె
ప్రళయ
రూపుడై మారుతి ఎగసెను తోరణ స్తంభము పైన నిల్చెను || 255 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
భీమరూపుడై విజృంభించెను కింకరులను మర్ధించి వధించెను
చావగ మిగిలిన అసురులు కొందరు రావణు జేరగ పారిపోయిరి
మారుతి
ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను || 256 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన
జేసెను
జంబుమాలిని తగిన బలము గొని ఆ వానరుని దండింప బొమ్మనెను
జంబుమాలి
ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను || 257 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
జంబుమాలి మహా బలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు
రక్తాంబరములు దాల్చినాడు మణిభూషణములు ధరించినాడు
ఖరములు లాగెడు అరదము పైన రణరంగమునకు ఏతెంచినాడు
అదిగని
మారుతి గర్జన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను || 258 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
శూల పట్టసాది ఆయుధ ధారులు రకరకములగు కవచ ధారులు
వేగవంతులు రణశూరులు ముద్గరపాణులు ధనుర్థారులు
మహా దంష్ట్రులు మహా బలులు మహోదరులు ఘోర రూపులు
ఎనుబది
వేల కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి || 259 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మిడుతలదండు అగ్ని బడునటులె అసురుల దండు కపీశునిపై పడె
సింహనాదమును మారుతి చేసె వాలము బెంచి భూమిపై మెదె
దిక్కులు అదరె మృగములు బెదరె పక్షులు చెదరి నేలపై బడె
ప్రళయ
రూపుడై మారుతి ఎగసెను తోరణ స్తంభాము పైన నిల్చెను || 260 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కేసరీ సుతుడు కాయము బెంచెను చేతి కమరిన దండము బూనెను
భీమరూపుడై విజృంభించెను కింకరులను మర్ధించి వధించెను
చావగ మిగిలిన అసురులు కొందరు రావణు జేరగ పారిపోయిరి
మారుతి
ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను || 261 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఎనుబది వేల కింకర వీరుల ఒక్కవానరుడు హతము చేసెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన
జేసెను
జంబుమాలిని తగిన బలము గొని ఆ వానరుని దండింప బొమ్మనెను
జంబుమాలి
ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను || 262 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
జంబుమాలి మహా బలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు
రక్తాంబరములు దాల్చినాడు మణిభూషణములు ధరించినాడు
ఖరములు లాగెడు అరదము పైన రణరంగమునకు ఏతెంచినాడు
అదిగని
మారుతి గర్జన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను || 263 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
జంబుమాలి తన వాడి శరములను కపీశునిపై ప్రయెగించెను
శిరమును, ముఖమును బాహు, వక్షమును రక్తము చిందగ గాయపరచెను
రక్తసిక్తమై మారుతి ముఖము భానుకిరణ విద్ధాబ్జమై దోచె
హరి
కిశోరుడు గర్జన చేయుచు తోరణ స్తంబము పైన నిల్చెను
|| 264 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
వజ్రకాయుడు మారుతి విసరెను భీకరమైన పెద్ద బండను
జంబుమాలి ఆ వచ్చెడు బండను పది శరములచే పొడిపొడి చేసెను
క్రోధావేశమున అనిలాత్మజుడు సాలవృక్షమును పెరికి విసరెను
జంబుమాలి
ఆ వచ్చెడు బండను పది శరములచే పొడిపొడి చేసెను || 265 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
రథ గజ తురగ పదాతి దళములు రణరంగమున కూలిపోయెను
జంబుమాలి తన వాడి
బాణముల పవన కుమారుని బహు పీడించెను
అంతట మారుతి పరిఘతో మెది అంతము చేసెను జంబుమాలిని
మారితి
ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను
|| 266 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు
ఆజ్ఞాపించెను
మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింప బొమ్మనెను
మంత్రికుమారులు
ఏడ్గురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి || 267 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మంత్రి కుమారులు తేజోవంతులు అస్త్రశస్త్ర విద్యావిశారదులు
ఉరముల బోలిన శబ్దములెగయగ చతురంగ బలాలు సాగిరాగ
ధ్వజము లెగయగా వాయువేగమున రథములపై రవి కాంతులు చిమ్మగ
మంత్రికుమారులు
ఏడ్గురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి || 268 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
పదములతో మర్దించి కొందరిని ఉరముతో కుమ్మి మరికొందరిని
పిడికిలి బిగించి పొడిచి కొందరిని గోళ్ళతో చీల్చి మరికొందరిని
వరుసగ ఏడ్గురు మంత్రి సుతులను పవన కుమారుడు యమపరి కంపెను
మారుతి
ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను || 269 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మంత్రి సుతులను సర్వ సైన్యమును మారుతి తృటిలో సంహరించెను
ఎటు చూచునను మృత దేహములు ఎటు బోయినను రక్తపు టేరులు
ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యెచించి పల్కెను
సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింప బొమ్మనెను
విరూపాక్ష యూపాక్షులు దుర్థర ప్రఘస భసకర్ణులు
మహావీరులు వేగవంతులు శత్రు భయంకర మహాయెధులు
రథ గజ తురగ పదాతి దళములతో మారణాయుధాల బల గర్వముతో
సేనాపతులు
ఐదుగురుచేరి హనుమంతునిపై దాడి వెడలిరి || 270 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
దుర్థరుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసె
సింహనాదమును మారుతి చేసె కాయము బెంచి గగనాని కగసె
దుర్థరుండు మరి శతకరములచె కపికుంజరుని కడుపీడించె
మెరుపువోలె
మెరసి మారుతి దుమికి పిడుగువోలె పడి అసురుని గూల్చె || 271 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
దుర్థరుండటుల కూలుట గాంచి విరూపాక్ష యాపాక్షులు అలగి
గదలుబూని హరీశుని దాకగ మారుతి వారిని చావమెదగ
రక్తము గ్రక్కుచు అసుర వీరులు నేలపైబడి అసువులు వీడరి
మారుతి
ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను || 272 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మిగిలిన ప్రఘస భాస కర్ణులు శూలపట్టసాది ఆయుధ ధారులు
హనుమంతునిపై తెగబడి పోరిరి అతి భీకరముగ గాయపరచిరి
నెత్తుట దడసిన అనిలాత్మజుడు బాలార్కుని వలె భాసిల్లినాడు
గిరి
శృంగమును పెకల్చినాడు అసుర వీరుల మద్దించినాడు || 273 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను
ఈ వృతాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను
తండ్రి చూపులు తనపై సోకగ అక్షకుమారుడు దిటవుగ నిలువగ
రావణుండు
పల్కె కుమారుని గని ఆ వానరుని దండింప బొమ్మని || 274 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
స్వర్ణఘటిమౌ ధ్వజము గలది రత్నఖచిత గవాక్షములున్నది
అష్టాశ్వములతో కూడి యున్నది ఆకాశమున ఎగిరి పోగలది
సూర్యుని బోలిన కాంతులు గలది మనోహరముగ మెరయు చున్నది
అక్షకుమారుని
తపః ఫలమది అమూల్యమైన దివ్యరధమది || 275 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అక్షకుమారుడు నవయౌవ్వనుడు వేగవంతుడు తేజోవంతుడు
దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు
కాలాగ్ని ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు
అక్షకుమారుడా
దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై || 276 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
చతురంగ బలాలు కదలి రాగ భూమ్యాకాశములు మారు మ్రెగ
అక్షకుమారుడు ఏతెంచినాడు ఆంజనేయుని పరికించినాడు
ఆశ్చర్యముగ గమనించినాడు బలాబలములు యెచించినాడు
మంచు
తొలగిన బాలార్కునివలె రణరంగమున చెలరేగినాడ || 277 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మూడు శరములతో మారుతి శిరమును పది శరములతో మారుతి ఉరమును
అక్షకుమారుడు బలముగ నాటెను రక్తము చిందగ గాయపరచెను
ఉదయ భాస్కర సమాన తేజుడై మారుతి ఎగసె గగన మార్గమున
ఇరువురి
నడుమ భీకరమైన పోరు చెలరేగె ఆకాశమున || 278 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అతి నేర్చుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని
బాలుని చంపగ చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని
అక్షకుమారుడు అంతకంతకు అగ్నిహోత్రుడై రణమున రేగె
ఇరువురి
నడుమ భీకరమైన పోరు చెలరేగె ఆకాశమున || 279 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అగ్ని కణమని జాలి కూడదని రగులక మునుపే ఆర్పుట మేలని
సింహనాదమును మారుతి జేసె అరచేత చరచి హయముల జంపె
రథమును బట్టి విరిచి వేసె అక్షుని ద్రుంచి విసరి వేసె
అక్షుని
మెండెము అతి ఘోరముగ నేలపైబడై రక్తపు ముద్దగ
|| 280 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
అక్షకుమారుని మరణవార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను
మెల్లగతేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తు గని
ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని
రావణాసురుడు
ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను || 281 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఎనుబదివేల కింకర వీరుల అవలీలగ దును మాడినవాడు
జంబుమాలిని గూల్చినవాడు మంత్రి సుతుల హతమార్చినవాడు
ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని
రావణాసురుడు
ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను || 282 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
సేనాపతులను చంపినవాడు అక్షకుమారుని ద్రుంచినవాడు
వాయువు కంటెను వేగవంతుడు అగ్నికంటెను తేజోవంటుడు
ఇంరరినొకడే నిరాయుధుడై కూల్చినవాడు సామాన్యుడు గాడని
రావణాసురుడు
ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను || 283 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఓ కుమారా మహావీరా ఇంద్రాదుల అడలించిన శూరా
బ్రహ్మదేవుని వరమున నీవు దివ్యాస్త్రములను పొందినాడవు
భూమ్యాకాశముల రణము చేయగ సాటిలేని మేటి యెధుడ వీవని
రావణాసురుడు
ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను || 284 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఇంద్రజిత్తు దశకంఠు కుమారుడు తండ్రి బోలిన ప్రతిభావంతుడు
తపోధనుడు ధనుర్థరుడు అస్త్రశస్త్ర విద్యా విశరదుడు
తండ్రికి తాను ప్రదక్షిణజేసి భక్తితో మ్రెక్కి దీవనలంది
చతురంగ
బల సమేతుడై వెడలె పర్వములందు పొంగేటి కడలివలె || 285 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఇంద్రజిత్తు విశాల నేత్రుడు సుందరుడు సురేంద్ర సమానుడు
రత్నఖచిత కిరీట శోభితుడు మణిమయ భూషణ మండిత గాత్రుడు
శరగతి పోగల నాల్గు సింహముల పూన్చిన కాంచన స్యందన మందున
చతురంగ
బల సమేతుడై వెడలె పర్వములందు పొంగేటి కడలివలె || 286 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నాగ యక్ష ఋష్యాదులు నింగిని రణము జూడ వేడుకతో చేరగ
రథ గజ తురగ పదాతి దళముల రణగుణ ధ్వనులు దిక్కులు నిండగ
మేఘనాధుడు నారి సారింప భూతములదిరి పరుగిడ సాగ
చతురంగ
బల సమేతుడై వెడలె పర్వములందు పొంగేటి కడలివలె || 287 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
నానా విధముల వాడి శరముల ఇంద్రజిత్తు రోషాన వేయగ
వాయునందనుడు గగనాని కెగసి నేర్చుగ శరముల గురి తప్పుకొనగ
ఇరువురి నడుమ పోరు చెలరేగె భూమ్యాకాశముల కడు భీకరముగ
దేవగణంబులు
సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని || 288 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కపికుంజరుడు భయంకరముగ కాయము బెంచి సమరము చేయగ
ఈ వానారుడు సామాన్యుడు గాడని మహిమెపేతుడు కామరూపుడని
ఇంద్రజిత్తు బహుయెచన జేసి బ్రహ్మాస్త్రమును ప్రయెగము జేసె
దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని || 289 ||
బ్రహ్మాస్త్రముచే బంధింపడి పవన కుమారుడు నేలపై బడె
వనజభవుడు తనకు ఒసగిన వరము స్మరియించుకొని ప్రార్థన జేసె
వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము జేసె
దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని || 290 ||
కట్టుపడి యున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని
త్వరత్వరగా దానవులు దరిజేరి నారచీరలతో బిగి బంధించిరి
బ్రహ్మ వరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను
మారుతి
మాత్రము నార చీరలకె కట్టుబడినటుల కదలక యుండె || 291 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
వానరోత్తముని దూషణ లాడుచు రావణు కడకు ఈడ్చుకు బోవగ
రక్త నేత్రముల నిప్పులు రాల్చుచు లంకేశుడు గర్జించి పలుకగ
కపిని జంపి విందారగించుడని పలువురు చేరి ప్రేలుచుండగ
సభికులందరు
కేకలు వేయగ మారుతి నిలచె కడు నిబ్బరముగ || 292 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఎవడవు నీవు?ఎవని వాడవు? ఎవని పంపున ఏతెంచినావు?
ఎవరి ప్రాపున చేరినాడవు? ఎందుల కిటుల చేసినాడవు?
విషయములన్నీ వివరింపమని నిజము బల్కుచో బ్రతికి పోదువని
దశకంఠునిచే నియమింపబడి మారుతి నడిగిరి మంత్రులు గూడి || 293 ||
వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని
రామిని దూతగ ఇటు వచ్చితిని సుగ్రీవు నాన ఇటు జేసితిని
సీతామాత జాడ దెలిసితిని మిము బల్కరించి పోదలచితిని
అని
మారుబల్కె మారుతి దిటవుగ మంత్రి పుంగవుల మతులు చెలింపగ || 294 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మణిమయ రత్నకిరీట శోభితుని నవరత్న ఖచిత భూషణ ధారుని
రక్తచందన చర్చిత గాత్రుని శ్రేష్ఠమయిన పీతాంబర ధారుని
లోహితాక్షుని విశాల వక్షుని మేఘవర్ణుని తేజోవంతుని
లంకేశ్వరుని
మారుతి కనుగొని అచ్చెరువొందె మహాత్ముడేనని
|| 295 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ఇరువంకల జేరి సుందరాంగనలు వింజామరలు వీచుచుండగ
దుర్ధర ప్రహస్త నికుంభాదులు మంత్రి వర్యులు పరివేష్టింపగ
రత్నఖచిత సింహాసనమందు ఇంద్రునివలె ఆసీనుడు కాగ
లంకేశ్వరుని
మారుతి కనుగొని అచ్చెరువొందె మహాత్ముడేనని || 296 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
ముల్లోకముల ప్రతాపవంతుడు సర్వసులక్షణ సంభూతుడు
వేదశాస్త్రముల ప్రతిభావంతుడు మహాతేజుడు మహాబలుడు
ధర్మవర్తియై యుండి యుండిన స్వర్గాధిపతి కాదగు వాడని
లంకేశ్వరుని
మారుతి కనుగొని అచ్చెరువొందె మహాత్ముడేనని || 297 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
కైలాసగిరిని పెకలించునాడు నను శపించెను నందీశ్వరుడు
కపిరూపమున వాడే వీడుగ వచ్చియుండెనో నను వంచింపగ
బాణాసురుడే ఈ వానరుడుగ వేచియుండెనో నను సాధింపగ
అని లంకేశుడు మంత్రి ప్రహస్తుని ఆదేశించెను మర్మమరయమని || 298 ||
ఓ వానరుడా భయము వీడుము నీకు శుభమగు నిజమును దెల్పుము
యమ కుబేర ఇంద్రాదు లెవరేని నిను దూతగ ఇట్లు పంపినారేమి?
విష్ణుదే్వుడే మాపై పగగొని నిను బంటుగ ఇటు అంపినాడేమి?
నిజము
బల్కుచో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను || 299 ||
శ్రీ హనుమాను గురుదేవులు నాయెద పలికిన సీతా రామకథ
నే పలికెద సీతా రామకథ
మహాకాంతితో వెలుగొందు నీవు మామూలు కోతివి కానేకావు
కోతి రూపమున కనిపించు నీవు ఎవడవో కాని కామరూపుడవు
లంకేశ్వరుని మందిరమందు ఎందులకై ప్ర వేశించినావు?
నిజము
బల్కుచో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను || 300 ||
0 Comments