Kalabhairava Ashtakam - కాలభైరవాష్టకం
Kalabhairava Ashtakam - కాలభైరవాష్టకం
శ్రీ శంకరాచార్య విరచిత కాలభైరవాష్టకమ్
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ ।
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 1 ॥
భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ।
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 2 ॥
శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 3 ॥
భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ ।
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 4 ॥
ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 5 ॥
రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ ।
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 6 ॥
అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ ।
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 7 ॥
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ ।
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥ 8 ॥
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ ।
శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ॥
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ।
భావం:-
ఇంద్రుడు పూజించు పాదపద్మములు కలవాడు, పామును యజ్ఞపవీతముగా దాల్చినవాడు, తలపై చంద్రుని అలంకరించుకున్నవాడు, దయచూపించువాడు, నారదుదు మోదలైన యోగులచే నమస్కరింపబడువాడు. దిగంబరుడు, కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. || 1 ||
కోటిసూర్యులవలే ప్రజ్వలించువాడు, సంసారసముద్రమును దాటించువాడు, ఉత్తముడు, నీలకంఠుడు, కోరికలు తీర్చువాడు, మూడుకన్నులవాడు, యమునకేయముడైనవాడు, పద్మములవంతి కన్నులు కలవాడు, నాశములేనివాడు, స్థిరమైనవాడు, కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. || 2 ||
శూలము- టంకము-పాశము- దండము అను ఆయుధములను చేతులలో ధరించినవాడు, అన్నిటికి ఆదికారణమైనవాడు, నల్లని శరీరము కలవాడు, ఆదిదేవుడు, నాశములేనివాడు, దోషములంటనివాడు, భయంకరమైన పరాక్రమము కలవాడు, సమర్థుడు, విచిత్రమైనతాండవమును ఇష్టపడువాడు, కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. || 3 ||
భుక్తి - ముక్తులనిచ్చువాడు, ప్రశస్తమైన సుందర శరీరము కలవాడు, భక్తవత్సలుడు, స్థిరమైనవాడు, సమస్త ప్రపంచమును నిగ్రహించువాడు, నడుము నందు మోగుచున్న అందమైన బంగారు చిరుగంతలు ధరించినాడు, కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. || 4 ||
ధర్మమును రక్షించువాడు, అధర్మమును నాశనం చేయువాడు, కర్మపాశములను విడిపించువాడు, సుఖమునిచ్చువాడు, అంతటా వ్యాపించినవాడు, బంగారువన్నెకల కేశపాశములతో శోభిల్లు నిర్మలశరీరుడు, కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. || 5 ||
అందమైన పాదములందు రత్నపాదుకలను ధరించినవాడు, నిత్యుడు, అద్వితీయుడు, ఇష్టదైవము, నిరంజనుడు, యముని అహంకారమును నాశనం చేసినవాడు, భయంకరమైన కోరలు ఆభరణములుగా కలవాడు, కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. || 6 ||
అట్టహాసముతో బ్రహ్మాండములను బద్దలుచేయువాడు, చూపుతో పాపములను తొలగించువాడు, ఉగ్రముగా శాసించు వాడు, అష్టసిద్దులను ప్రసాదించువాడు, కపాలమాల ధరించినవాడు, కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. || 7 ||
భూతనాయకుడు, విశాలమైనకీర్తి కలిగించువాడు, కాశీలో నివసించువారి పుణ్యపాపములను శోధించువాడు, సర్వవ్యాపి, నీతిమార్గపండితుడు, పురాతనుడు, ప్రపంచరక్షకుడు, కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. || 8 ||
మనోహరమైనది, జ్ఞానమును, ముక్తిని కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము - మోహము-దీనత్వము- కోపము- పాపములను నశింపచేయునది అగు కాలభైరవాష్ఠకము పఠించువారు నిశ్చయంగా కాలభైరవ పాదసన్నిధిని చేరెదరు.
0 Comments