Arunachalam Shiva Chalisa - అరుణాచలం శివ చాలిసా

 Arunachalam Shiva Chalisa - అరుణాచలం శివ చాలిసా

Arunachalam Shiva Chalisa - అరుణాచలం శివ చాలిసా

Arunachalam Shiva Chalisa - అరుణాచలం శివ చాలిసా

అదిగో అదిగో అరుణాచలం

ఇహపరముల యిది తేజోమయం

ఈశ్వర సృష్టికి ఇది నిలయం

సత్యం చాటిన శివ క్షేత్రం

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

ఆకాశంలో ఎంత ఎగిరినా

అగాధాలలో ఎంత వెతికినా

జ్వాలా రూపము తరగనే లేదు

అద్యంతములు అగుపడలేదు

తొలిగా లింగాకృతిని తెలియగ

సంభవించిన తీర్థమిదియే

జ్యోతిగా వెలిగేటి ఖ్యాతి నీదే

జ్ఞానమూర్తిగ తెలియు ఖ్యాతివే

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

కృతయుగమ్మున ఇది అరుణాద్రి

త్రేతా యుగమున ఇది రత్నాద్రి

ద్వాపర యుగాన ఇది కనకాద్రి

కలియుగాన ఇది మరకత మణి

అష్టమూర్తిమయ అరుణాచల

సర్వ మణిమయ శోణాచల

సతీ సమేత శోభితా స్వర్ణాచల

ఆనంద రూపా అమరేశ్వరా

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

అగ్ని రూపమున అవనిలొ మెరిసి

జ్ఞానాగ్ని తేజమై జూలు విడిచి

కర చరణాదుల కదిలి వచ్చెవు

కోరిక దాటు రీతి తెలుపగా

ఎన్నో విధముల తెలిసావు

ఎన్నో మహిమలు చాటావు

అన్నీ నీవని తెలిసే రీతిగ

అంతట నీవే విరిసావు

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

మూడు రూపముల ఇచ్చటను

ముక్కంటి మసలుటే ముచ్చటను

అరుణ తేజమేవిరిసె అన్నిటా

కరుణ పారింది మన ముంగిట

గుడిలో రూపం దాల్చినదొకటి

గిరి రూపంలో నిలిచినదొకటి

సత్యం, తత్వం ఎఱుక చేయగా

నడయాడెను నరునిగ ఒకటి

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

అన్ని దిక్కుల నీవే నిలిచి

దిక్కు నీవని తెలిపేవు

దిక్కుల పాలన చేసేవు

పెద్ద దిక్కై మమ్ముకాచేవు

ఎపుడైనా మరి ఎవ్వరికైనా

అహమన్నది ఏమాత్రమూ

నిలువ నీయదు నీ చత్రము

వెలుగు చూసును సత్వము

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

భిక్షాగ్రేశ్వర భవ హరా

చోరాగ్రేశ్వర శంభోహర

పూర్వోత్తరాల మాటే లేదు

నిందాప నిందలు నీకు లేవు

గట్టిమట్టి రూపాన ఘనమై

తపము చేయు వారలకు వరమై

గిరిలో తేజము నింపావు

ఇలలో ప్రభవించక తెలిసావు

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

మక్కువైన గిరి రూపున చేరి

గిరి తనయను చేర పిలిచి

సుర మునులను చూపించావు

నీ ఘనతను తెలుయ జేసావు

హరహర అని నిను ధ్యానిస్తూ

అరుణ గిరిని దర్శిస్తూను

గిరి వలయము చుట్టినంతనే

అజ్ఞాన తిమిరమే అదృశ్యము

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

అగ్ని స్తంభమై ఆనాడు వెలిగి

అరుణ గిరిగా నీవు నిలిచేవు

ఒక స్మరణతో నిలిపేవు నీ చెంత

మా బ్రతుకులో ఇది ఒక వింత

సోముని శాపము తీర్చావు

శోణగిరిగా మరి తెలిసేవు

అజ్ఞానము మాపె గురువే నీవు

జ్ఞాన సంపదకు గనివైనావు

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

నదీ నదములు ఒక్కటిగా

లయమయ్యేది ఈ గిరిని

గిరిగా ఇలలో నిలిచావు

గిరి గీసి మాకు చూపించావు

గౌతమాది ఋషులంతాను

ఘనమగు తపములు ఈ చెంత

కార్య సిద్దికై కాత్యాయని

కోరి చేరెను ఈ గిరి చెంత

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

తామస గుణము తొలగంగ

సత్వ గుణము పెంపొంద

ఆశ్రయించెను ఈ గిరిని

తపమాచరించెను ఈ గిరిని

శోణగిరిగా తెలుసుకుంటూ

అరుణగిరిగా తలచుకుంటూ

హరుని కన్నుల చూసుకుంటూ

ఆనంద డోలికల తేలిపోదాం

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

పాపహరణము శోణగిరి

అమృత ప్రాయము అరుణగిరి

సకల శుభములకు నీవుసరి

నీ నామ స్మరణమే జయభేరి

ప్రదర్శన లేని నిదర్శనం

పరమానందం నీ దర్శనం

పరమ పావన నీ స్మరణం

పాపహరణం గిరి ప్రదక్షిణం

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

ఆది శేషుడు అర్చించి

ప్రియమగు వరమును సాధించి

కామ రూపుడై మసలేను

కామ్యము తీరగ మురిసేను

అణగారిన తేజము కలవాడై

ఆదిత్యుడు చేరెను అరుణగిరి

దీర్ఘ తపమున వరమెంది

పూర్వ తేజమున ప్రభవించె

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

శుభకరమైనది శివసేన

శుభ ప్రధమైనది నీ ఆన

వలయము లోన నీ ఆలయం

ప్రతి దిక్కున నీ సంతకం

ముక్తి ప్రదాయకం ఈ క్షేత్రం

శక్తి ప్రచోదకము ఈ దామం

సప్త ఋషి తీర్థశోభిచే

సప్త ఋషులు ఇందు బాసించే

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

పంగమునిగల అంగ వైకల్యం

పాద స్పర్శతో తొలిగేను

సకల శోకములు తొలగించే

పుణ్య భూమిగా తెలిసేను

శోణగిరి ఎంతో శోభాయమానం

అరుణగిరి ఎంతో ఆనంద దామం

అజ్ఞానానికిది అంతిమ యాత్ర

వికాసానికిది జైత్రయాత్ర

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

జీవనదులన్ని జీవధారలై

దిక్కు దిక్కున నదులుకూడేను

అంతర్గీనమై అంతట నిండి

సేవించుచుండె ఆనాటి నుండి

ఎనెన్నొ తీర్థాలు ఎఱుక కలుగు

అరుణాచలము చెరి అధివసించియు

అర్పించు చున్నాయి సేవగా

సేవించు చున్నాయి హాయిగా

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

తీర్థ రాజములు గిరిని చేరగా

అనువుగా నీ సేవలందు నిలిచి

భాసించు చున్నాయి నీ కరుణతో

కరుణించు చున్నాయి నీ స్పూర్తితో

బ్రహ్మ తీర్థము భాసించుచూ

పాతక హరిణిగా కీర్తినొందెను

ఇంద్రాది దేవతలు ఇచ్చగ చేరి

కామిత ఫలములు కను జూచినారు

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

అష్ట దిక్పాలకులు అరుణగిరిని

తీర్థ రాజములుగ తెలియవచ్చిరి

పాప ప్రక్షాలన చేయు నెపమున

కొలువై వున్నారు దీక్షను బడసి

చోరులతో జత కూడావు

వేడుకగా అది తలచావు

పట్టుబడగా నీ వంతు

ప్రదక్షిణలో చెల్లించావు

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

పరమేశా ఇది నీ లీల

పరమార్థం ఇది నీ హేల

పంచ భూతాలు నీవు

పంచ భౌతికం నేను

యానికానిచ పాపాని

జన్మాంతర కృతానిచ

తాని తాని ప్రణశ్యంతి

ప్రదక్షిణం పదే పదే

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

పాపోహం పాపకర్మాహం

పాపాత్మా పాప సంభవః

త్రాహిమాః కృపయా దేవ

శరణాగత వత్సలా

అన్యధా శరణం నాస్తి

త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన

రక్ష రక్ష మహేశ్వరా

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

ప్రదక్షిణ ప్రియ అరుణ సివా

అరూప రూప ఓ అగ్నిలింగ

సకల కుసుమార్చిత సర్వలింగ

శరణు శరణు శరణు శరణమయ్యా

శంభో శంభో శివ శంభో

అరుణాచల శివ హర శంభో || 3 ||

Facebook

శ్రీ లలితా చాలీసా

Post a Comment

0 Comments