Sri Viswanatha Ashtakam - శ్రీ విశ్వనాథాష్టకమ్
Sri Viswanatha Ashtakam
- శ్రీ విశ్వనాథాష్టకమ్
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాప హారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ॥ 1 ॥
వాచామగోచర మనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం [ పద్మం ]
వామేన విగ్రహ వరేణ కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ॥ 2 ॥
భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకు శాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ॥ 3 ॥
శీతాంశు శోభిత కిరీట విరాజమానం
భాలేక్షణానల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత భాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ॥ 4 ॥
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ॥ 5 ॥
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనందకంద మపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళ మాత్మరూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ॥ 6 ॥
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ॥ 7 ॥
రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ ॥ 8 ॥
వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ॥
విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ॥
ఫలం : ధనధాన్యాలూ, విద్యా విజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు
ఇతి శ్రీ విశ్వనాథాష్టకమ్
భావం:-
గంగానదీ అలలను తన జటాజూటంలో అందంగా కలిగినవాడు, ఎల్లప్పుడూ తన ఎడమవైపు పార్వతీదేవితో శోభించేవాడు, శ్రీహరికి ప్రియమైనవాడు, మన్మథుని గర్వ మణచినవాడు, వారణాసి పురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. || 1 ||
వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్నవాడు, బ్రహ్మ, విష్ణు మరియు ఇతర దేవతలచే సేవించబడు పాదములు గలవాడు, తన ఎడమవైపు శుభములు కల్గించు పార్వతిని కలిగి ఉన్నవాడు. వారణాసి పురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. || 2 ||
సమస్త భూతములకు అధిపతియైనవాడు, సర్వములను ఆభరణంగా కలిగినవాడు, పులిచర్మం వస్త్రంగా ధరించిన జడలి కట్టిన కేశములు కలిగినవాడు, త్రాడు, అంకుసము, త్రిశూలము ధరించి, అభయము, వరములను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. || 3 ||
చల్లదనాన్ని ఇచ్చే చంద్రుని కిరీటముగ కలిగివున్నవాడు, తన ఉగ్రనేత్రముతో మన్మథుని దగ్ధము చెసినవాడు, నాగేంద్రుని కర్ణములకు అలంకారముగా ధరించినవాడు, వారణాసి పురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. || 4 ||
మదించిన ఏనుగుల పాలిటి సింహంలా ఉన్నవాడు, అసురుల పాలిటి గరుత్మంతుని వలె ఉన్నవాడు, అసురుల పాలిటి గరుత్మంతుని వలె ఉన్నవాడు, మరణాన్ని, శోకాన్ని, వృద్దాప్యాన్ని నాశనం చేసి అగ్నిలా ఉన్నవాడు, వారణాసి పురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. || 5 ||
తేజస్సు సుగుణములు కల్గినవాడు, గుణములు లేనివాడు, వేరెవరూ సాటిలేనివాడు, ఆనందకారకుడు, ఓటమి ఎరుగని, తర్కానికి అందని, సర్వములకు ఆత్మయై అన్ని శుద్ద స్వరూపములు తానేయై, అత్మస్వరూపుడై వారణాసి పురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. || 6 ||
ఏ కోరికలు లేనివాడు, దోషములు ఎంచని, నింద చేయని, పాపములకు దూరముగా ఉండి సమాధి స్థితిలో ఉన్న, హృదయకమలము మధ్యలో నివసించియున్నవాడు, వారణాసి పురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. || 7 ||
రాగద్వేషాది దోషములు ఎరుగనివాడు, తన భక్తులను ప్రేమతో చూచుచూ, వైరాగ్యము, శాంతికి నిలయమై, హిమవంతుని పుత్రిక సహాయం పోందుచూ, మాధుర్యము, ధైర్యము కలిగి విషాన్ని ధరించి, వారణాసి పురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. || 8 ||
వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని అష్టకాన్ని పఠనం చేసే మనుష్యులకు దేహమున్నప్పుడు విద్య,
మంచి ఎనలేని సుఖం,
అనంతమైన కీర్తి, అటు తర్వాత మోక్షము లభించును.
0 Comments