Sankata Nasana Ganesha Stotram -సంకటనాశన గణేశస్తోత్రమ్

 

Sankata Nasana Ganesha Stotram

సంకటనాశన గణేశస్తోత్రమ్

Sankata Nasana Ganesha Stotram -సంకటనాశన గణేశస్తోత్రమ్
Sankata Nasana Ganesha Stotram -సంకటనాశన గణేశస్తోత్రమ్


నారద ఉవాచ :

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్

భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే

 

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్

 

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్

 

నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకమ్

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్

 

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః

న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్

 

విద్యార్థీ లభతే విద్యాం దనార్థీ లభతే ధనమ్

పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్

 

జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్

సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః

 

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్

తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః

 

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.

భావం

నారదుడు పలికెను

అయుస్సు పెరగాలని, ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకొనే భక్తులు నిత్యము గౌరీపుత్రుడైన వినాయకునికి శిరస్సువంచి ప్రణమిల్లవలెను.

మెదట-వంకర తిరిగిన తొండము కలవానిగా

 రెండు- ఒకే దంతము కలవానిగా

మూడు - నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా

నాలుగు - ఏనుగు ముఖము కలవానిగా, గణేశుని భావింపుము

ఐదు-పెద్ద ఉద్దరము కలవానిగాను

ఆరు-శత్రువుల పట్ల క్రూరంగ ప్రవర్తించువానిగా

ఏడు- విఘ్నములను తొలగించువానిగా

ఏనిమిది - పొగవంటి తెల్లని శరీరకాంతి కలవానిగా విఘ్నేశ్వరుని భావింపుము

తొమ్మిది - బాలచంద్రరేఖ నుదుటను కలవానిగా

పదకొండు - ప్రమధగణములకు అధిపతిగా

పన్నెండు - ఏనుగు ముఖము కలవానిగా వినాయకుని భావింపుము

                ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాతః కాలము, మధ్యాహ్నము, సాయం సంధ్యలలో పఠింతురో, వారికి విఘ్నభయముండదు. వారు కోరినదిసిద్ధించును. విద్యను కోరిన వారికి విద్యయు, ధనము కోరినవారికి ధనము లభించును. గణపతి స్తోత్రమును పఠించిన ఆరు నెలలలో ఫలం లభించును. సంవత్సర కాలము పఠించినచో కోరికలు సిద్ధించుననుటలో సందేహము లేదు. ఈ స్తోత్రము వ్రాసి ఎనిమిదిమంది బ్రాహ్మణులకు సమర్పించినచో గణేశుని అనుగ్రహము వలన అట్టివారికి అన్ని విద్యలు కలుగును. విజ్ఞాన వంతులగుదురు

సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీ రోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలిగిపోతాయి. మనం కార్యం తలపెట్టినా, అది ఎట్టువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతగా కొనసాగాలని ప్రపథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

ప్రతి రోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లు పఠిస్తే చాలా మంచిది. ఇంక ఎక్కువ సార్లు పఠిస్తే, అది గణేశుని అనుగ్రహం లభిస్తుంది. ఎంతటి కష్టాలైన తొలగించే మహీమనీతమైన సంకటనాశన గణేశ స్తోత్రం ప్రతి రోజూ పఠిస్తే 4 సార్లు అయిన 6 నెలలు పాటు భక్తి శ్రద్ద, విశ్వాసముతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది

facebook

శ్రీ గణనాయకాష్టకం

Post a Comment

0 Comments