Om Namashivaya song - ఓం నమశ్శివాయ గేయామృతము
Om Namashivaya song - ఓం నమశ్శివాయ గేయామృతము |
ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయా ఓం నమశ్శివాయా
- నమశ్శివాయ యని నా మనసందున నబినుతి చేసెద నను కడ తేర్చుము "ఓం"
- నమశ్శివాయ యను మంత్రము నానా నరకములను తెగద్రంచునయా
- అతి దీనుడనై అనుదినమును నిను మదిలో తెంచెద బ్రోవుమయా
- పతితపావన పన్నగదారణ, పాలన సేయవె దయామయా
- ఏంతని వేడుదు పంతమ నాపై నుంతయు దయరాదేనయా
- శంభో హరహర మహాదేవ నీ చరణములే గతి యంతినయా
- అండపిండ బ్రహ్మాండము లంతట నిండిన జ్యోతివి నీవేనయా
- ఆదియు మధ్యము అంతయు దెలియని ఆనందా మృతత్త్వమయా
- ఇంద్రుడాదిగా సకలసురులకును, ఇష్టదైవమగు మూర్తి వయా
- ఈశ్వర నామెర నాలకింపవే శాశ్వత గుణగణ సత్యవనా
- ఉరగవిభూషణ నీదగునామము, మరువగజాలర మానసమునా
- ఊరడించి నను గావక యుండిన నోపజాలగతి నీవేనయా
- ఋతువులు మాసములెన్నో గడిచెను వెతలుదీర్చి వెటుబోదునయా
- ఎందుకు నీదయరాదు పరాత్పర, మందుడనిన కడుకోపమయా
- ఏమియు తెలియని దీనుడునైతిని పామర ముడిపియు పాలింపవే
- ఐక్యస్వరూపము దెలిపిన జాలుర, అనంద బుద్ది మునుగుదురా
- ఒకటి రెండు మూడక్షరములలో, సకలంబునకు సాక్షివయా
- ఓంకారాత్మమగు బ్రహ్మము, నొందెడుమూలము తెలుపుమయా
- ఔరా యేటికి నీ దయరాదురా, అంత కఠినమా హరహర హరహర
- అంతయు నీవై యుండగ వేరే చింతలు నాకిక నేలనయా
- అలకింపు మిక నాదగు మనవిని అరమర సేయక ఆదిదేవ
- ఆహార్నిశంబును నీదగు మంత్రము, నను సందింపగ జేయుమయా
- కమలసంభ వాద్య మరగణావన కంజలోచనా భవమెచన
- ఖగవాహన ప్రియ కరుణాసాగర, కంతుమదాహర హర
- ఘనమౌ నీ దగు కీర్తిని వినినే మనమున నమ్మితి గావుమయా
- జ్ఞాత జ్ఞానజ్ఞేయము లొకటై, గాంచిన నీదయ గల్గునయా
- చదువులలోపల చదువై వెలసిన, సారము గ్రోలిన జాలునయా
- జనన మరణములు బొరయని పదవికి, సాక్షి మాతృడవు నీవేనయా
- ఝమ్మను ప్రణవనాదము లోపల, గ్రమ్మిన వెన్నెల కాంతివయా
- టక్కరిజగమున మాయకు లోబడి, చిక్కితి నిన్నెట్లు గాంతునయా
- డబ్బుకొరకు నిను జేరగలేదయా, మబ్బు దొలగెడు మార్గమేదయా
- ఢంకాది మహానందనందా, సంకటముల తొలగిపుమయా
- తలచి తలచి వేసారితి నీదయ, కలుగదాయె నిక నేమి సేతు
- తారకయెగము దారినెరింగిన ధన్యులు నీదయ గాంతురయా
- దరిజేరుత యిక నెన్నడు తండ్రి తాపమాయె నిక తాళజాల
- దారుణమగు నీ సంసారాంబుది, తీరము జేరగాజాలనయా
- దుఃఖము తొలగెడు మార్గము నామది, దోపగజేయుర దురితహర
- దండము దండము నీ పాదములకు, భండన భీమా భవహరహర
- ధనధాన్యంబులు, గనుగొన సర్వము మాయేనయా
- నరక, స్వర్గము లాదిద్వందముల, బొరయని తత్త్వమెస్థిరమయా
- నానారూపములందియు దేనిని, నటన వెలిగిదా అద్బుతముగ
- నిజముగ నిను మది నెరిగిన దాసులు నిఖిల మెరిగిన వారెనయా
- నీవే కర్తవు నీవే భర్తవు నీవే హర్తవు నీవేనయా
- నీవే యజుడవు నీవే విష్ణువు నీవే హరుడవు నిరుపమ గుణ
- నీ కంటే పరదైవము లేదుర, నిన్నే కొలిచెద నిర్ద్వంద్వా
- నేను నీవనెడు ద్యైతమే దొలిగిన నీవే నేనై యుందునయా
- నీవే నేనై అడిగిన తదుపరి నేమియు తెలుపగ జాలనయ్య
- అన్ని మతంబుల కాది మూలమిది, కన్న జన్మమిక సున్నయ్యా
- అనందము దివ్యానందము, బ్రహ్మనందము పరమానందము
- పలువురు వినుమది గొలిచెడు ఘనులకు, కలిగెడు భాగ్యమిదేనయా
- పాపవిదూరము పంచాక్షరి మది పఠనము సేతుర భవభయ హర
- ఫలమును గోరక కర్మలు చేసిన కలిగెడు సత్పలమదికమయా
- భజన చేసిన భక్తులకెల్లను, పాపము దొలుకుట సులభమయా
- భూరి ఘెర సంసార మహా బుద్ది తీరము జేరగ దారిగదా
- మర్మము తెలిసిన మహనీయులకును, కర్మము భస్మము జేందుకదా
- మౌనముతో నీమంత్రము మదిలో, ధ్యానము జేయుటే జ్ఞానమయా
- మూర్ఖులకందని మునిజన వందిత, మెక్షసాధనము ఇదేగదా
- మహాదేవ హర శంభో నీదగు మహిత్యమేమని యెంతునయా
- ముందుగ నీదయ గల్గిన నాపై మెక్షము జెందుట సులభమయా
- యతిజనవందిత నీవె గతియని సతతము గొలిచెద సాంబశివా
- రజతాచలమున కథినాధుండవు, రాజరాజప్రియ రాజధరా
- రామతారకము భోదన చేసిన, రాజిత గురుడవు నీవేనయా
- రాతిరి పవలను లేని స్థలమ్బు రంజిలుచుండెడు పాతకహర
- రూపము నామము విలియమునందిన, దాపున వెలిగెడు ధన్యగుణా
- లవలేశంబును ఘనమునుగాని, విలక్షణమూర్తి విలాసమయా
- వశమౌనే నిను బొగడక నాకిక, పశుపతి సర్వము నీవేనయా
- వాదము భేదము మెదము ఖేదము, లేదని తెలిసిన రాధిక జన్మము
- విటింని నీయశ మంటిని శరణని, కటకముల ముక్కంటిబాపు
- వీనుల వీందుగ నీచరితంబును విన్న భవంబులు మన్నునుర
- వేషములేన్నో వేసిన ఘనమా, శేషభాష నిను గేరుకున్న
- వైరము కామము లోభము వదలిన ధీరులకే ఈ దారికదా
- వేదములే నిను కనుగొన జాలక, వెదకిన నీ ఘనత ఏమయ్యా
- శమదమాదిగుణ జాలము లేకను, శక్యముగాదుర నినుగనుటకు
- శాంతి శాంతియను మంత్రము నిరతము, చెవి నెరింగి జపియింతుమయా
- శుచిగా ప్రణవము భావన జేసిన శుద్దులు నిను మదిగాంతురయా
- శౌరికి ప్రియుడవు సర్వగరుడవు సాంబశివుండవు సాదుపాల
- శైలసుతా హృదయాంబుజ భాస్కర, శూలపాణి దయ జూడుమయా
- శోభనగుణగణ నీనామమురుచి, చూపిన నమృతమింకేలనయా
- షణ్ముక జనక సురాసురవందిత, సామజచర్మాంబర ధరహర
- సకలము నీవై సాక్షిగనుండెడు జాడనెరింగిన జాలునయా
- సాకారంబు నిరాకారంబును నేకమైన తెరివిదేనయా
- సీతాపతివరనామము నీయెడ సిద్దిగాంచుట ప్రసిద్దమయా
- హరహర తారకమంత్ర స్వరూపము, అరక్షణంబును మరువనయా
- క్షరాక్షరంబుల కవ్వలి పదవికి జాడనెరుంగగ జేయునుమయా
- శివశివ నీపదచింతన గలిగిన, సిద్దము మెక్షము సిద్దమయా
- శూలి మహేశ్వర నాపైనింకను, జాలిగలుగదదియేలనయా
- శంకర నీదగు కింకరుడునను, సంకటములు తొలగింపుమయా
- మృత్యుంజయ భూతేశ్వర మాకిక, మృత్యుభయము తొలగింపుమయా
- చంద్రశేఖరా సాంద్రదయాకర, శరణాగత జనరక్షణగుణ
- ప్రమదాదిప నీ పాదపద్మములు, ప్రణుతిజేతు దయజూడుమయా
- శ్రీకంఠ శశికంఠ నిను నుతిజేసిన జన్మము ధన్యమయా
- వాసుదేవ త్రిపురాంతకవృక్ష రుదామాం మాంపాహీపాహి
- వ్యోమకేశ భవ బీమయనుచు నీ నామ భజన నేమనయా
- గంగాధర నీ పాదములకిదే, సాష్టాంగ నమస్కారమయా
- తారకసాంఖ్యామస్కయెగ విచారసుందరకారహరా
- నీవే తల్లివి దండ్రివి నీవే గురుడవు దైవము నిజమయ్యా
- బాలుడు నీదయ చాలు వహింపుము, మేలుగ నను దయమేలునయా
- తప్పులు నెంచడు దాతవు నీవని, తలచి వినుతి జేసితినయ్యా
- తెలిసితి నీదగు మహిమను యిక నాతలుపునీపయిని తప్పదయా
- అద్వైతంబును అమృతము గ్రోలిగ, నాదారము నీనామమయా
- హృదయ కమలమున కుదరుగ నిలిచియు మదము నొపపర సదాయుడవై
- శరణము శరణము శరణము భవహర, జయ జయ శంభో సాంభశివా
- వ్యాసాశ్రమమున వాసిగ వెలుగుచు, దాసుల బ్రోచెడు దాతవయా
- భక్తాశ్రమమున తేజరిల్లును, భక్తుల గాచిన శక్తివయా
- శ్రీమళయాళ సద్గురువర్యుల, చరణాంబుజముల గొలుతుమయా
- నాగలింగదర భక్త జనోద్దర, నన్నిక మరవగ వలదయ్యా
- వరదాసహృదయాంబుజ భాస్కర, హరహర హరహర హరహరహర
- మంగళమగు జయమంగళమగు శుభ మంగళమగు హరమంగళహర
ఓం
నమశ్శివాయ
నమశ్శివాయ
నమశ్శివాయా
ఓం
నమశ్శివాయా
0 Comments