Garuda Gamana Tava Telugu – గరుడ గమన తవ

 Garuda Gamana Tava Telugu – గరుడ గమన తవ

Garuda Gamana Tava Telugu – గరుడ గమన తవ
Garuda Gamana Tava Telugu – గరుడ గమన తవ


గరుడ గమన తవ చరణ కమల మిహ

మనసిల సతు మమ నిత్యం || 2 ||

మమ తాప మపా కురుదేవా      

మమ పాప మపా కురుదేవా || 2 ||

జలజ నయన విధి నముచి హరణ ముఖ

విబుధ వినుత పద పద్మా || 2 ||

మమ తాప మపా కురుదేవా      

మమ పాప మపా కురుదేవా || 2 ||

భుజగ శయన భవ మదన జనక మమ

జనన మరణ భయ హారి || 2 ||

మమ తాప మపా కురుదేవా      

మమ పాప మపా కురుదేవా || 2 ||

శంఖ చక్ర ధర దుష్ట దైత్య హర

సర్వ లోక శరణా || 2 ||

మమ తాప మపా కురుదేవా      

మమ పాప మపా కురుదేవా || 2 ||

అగణిత గుణ గణ అశరణ శరణద

విదిళి సురరి పుజాలా || 2 ||

మమ తాప మపా కురుదేవా      

మమ పాప మపా కురుదేవా || 2 ||

భక్త వర్య మిహ భూరి కరుణయా

పాహి భారతీ తీర్థం || 2 ||

మమ తాప మపా కురుదేవా      

మమ పాప మపా కురుదేవా || 2 ||

గరుడ గమన తవ చరణ కమలమిహ

మనసిల సతు మమ నిత్యం || 2 ||

మమ తాప మపా కురుదేవా      

మమ పాప మపా కురుదేవా || 3 ||


గరుడ గమన తవ భావం

గరుడ వాహనా (విష్ణుమూర్తీ), నీ పాద పద్మములు.

నా మనసునందు నిత్యము ఉద్దీపనము (ప్రకాశింప) చేయుము

నన్ను నా తాపముల (బాధలు) నుండి విముక్తి చేయుము

నన్ను నా పాపముల నుండి విముక్తి చేయుము

కమలము వంటి కన్నుల కలవాడా,

బ్రహ్మ ఇంద్రుడు, మెదలగు దేవతలచేత ప్రశంసింప బడేవాడా,

పద్మములవంటి పాదములు కలవాడా

ఆదిశేషుని పైన శయనించువాడా. మన్మధుని తండ్రీ

నా జనన మరణ భయములను తీర్చువాడా

శంఖ చక్ర ధరుడా, దుష్టులైన రాక్షసుల హరించువాడా

ఎల్లలోకములను రక్షించువాడా

లెక్కింప లేనన్ని సుగుణములు కలవాడా

దీనులకు దిక్కైనవాడా, దేవతల వైరులను హరించువాడా

నీభక్తుడనైన భారతీ తీర్థుని మహా కరుణతో రక్షించుము

Facebook

శ్రీ గణేశ పంచరత్నమ్


Post a Comment

0 Comments