Godadevi Sankeerthana - గోదాదేవి సంకీర్తన
Godadevi Sankeerthana - గోదాదేవి సంకీర్తన |
గోదాదేవి శుభ చరితం మహిమాన్విత శుదా భరితం ||గో||
అతులిత పావన
సంకలితం శ్రవణ జీవనం ముక్తి ప్రదం
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
మానవ కన్యగా జనయించి విగ్రహ రూపుణి వరయించె
శ్రీ రంగా నాధుని పతిగా ఎంచి అపూర్వ చరితను సృష్టించె
పవిత్ర వ్రతమును వరయించి ఎల్ల జనులకు హితమును పంచి
బావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
ఎదురుగా ఉన్న విగ్రహ మూర్తిని నిజ మూర్తిగా తను బావించి
అణుపమాణమును అసమానమును దైవప్రభావము దర్శించె
విగ్రహ మూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాన్యం
గోదా కళ్యాణం వైభవము అమ్మవారికి ప్రాముక్యం
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
వులకని పలకని దేవదేవుని తన చేతనతో మెలుగొలిపినది
విలవానిగా మనస్సున తలచి స్వామికి బోదన చేసినది
మనుజులు బాగును మదిలో ఎంచి స్వామికి నడవడి నేర్పినది
స్పందించిన శ్రీ రంగా నాయకుల అండాళ్ళమ్మకు వరించేను
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
శ్రీ విల్లిపుత్తూరు నందు అవతారమూర్తి శ్రీ కృష్ణునుడు
వటాపత్రముపై శయనించి లోకరక్షణం గావించె
కాశీ విల్లిపుత్తూరు నందు వట్టనాదుడు అను విప్రడ్డు వసించే
నిరతము
విష్ణువుచిత్తనతో ప్రసిద్ద చెందును విష్ణుచింతునిగా
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
విష్ణుచిత్తుడు ప్రతి నిత్యం పూలమాల్లలు స్వయముగా గూర్చి
శ్రీ కృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచు ఉండేను
విష్ణుచిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ద
పొందిన
ఆళ్ళవారులుగా కీర్తించి పెరిఆళ్ళవారుగా బిరుదను నొసగిరి
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
పెరిఆళ్ళవార్లు ఒకనాడు తులసి మెక్కలకు పాదులు తీయుచు
ఆశ్చర్యముగా అచ్చట గాంచేను బాలురుగా చినారి పాపను
అచ్చట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి
గోదై నామముతో గారాబముగా పెంచ సాగెను
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
గోదై అనగా పూలమాల గోదై కాలాక్రమమున
గోదాదేవిగా మార్పును చెంది బావిదముగా ప్రసిద్దిచెందేను
చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అకురించేను
కృష్ణలీలను ఎల్లప్పుడు ఆడుతు పాడుతు గడుపుచుండేను
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి
కళ్ళుమూసిన కళ్ళు తెరచిన నల్లనివానివే కాంచ సాగేను
విల్లి పూత్తురు గోగులమ్మగా తన స్నేహితులను గోపికలగా
అన్ని వేళ్ళల భావన చేసి బావితముగా చరిపింప సాగేను
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూమాలలను
గోదాదేవి ముందుగ ధరయించి తన కృష్ణుని గాంచి మురిసేను
ఈ దృశము విష్ణుచిత్తుడు ఒక దినము నందు కన్నులు గాంచి
జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించే
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
కలలో గాంచిన విష్ణుచిత్తునకు శ్రీ కృష్ణుడు తన మెదము తెలిపె
గోదాదేవి దరయుంచు పూలమాలలను ప్రీతి పాత్రం అని వివరించే
వివరములు ఎరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి
చెల్లికతలను కలుపుకొని కాత్యాయిని వ్రతము ఆచరించేను
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
ఆహారానికి అలంకరనకు సంభదించిన కంఠిన నియమములు
గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే
వైష్ణవ భక్తుల గృహములను తిరుప్పావైగా విన్నపించె
గీతములు1000 పాసురములను ఉపనిశక్తుల సారమును
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణుచిత్తునకు కనిపించి
గోదాదేవికి శ్రీరంగమునకు తోడుకొని రమ్మని వివరించె
శ్రీ రంగములో అర్చకులకు గోదాదేవితో తన పరిణయము
నిర్ణయమును ఎరిగించా అందరు అనందము పొందిరింటా
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
సకల పుర జనులు వెంటకు రాగా అర్చకులు అందరు తోడుగరాగా
గోదాదేవిని తోడుకొని వెళ్ళి ఆలయము నందు ప్రవేశం అందే
పెళ్ళికూత్తురుగా గర్బగుండి నందు ప్రవేశించిన గోదాదేవి
ఎల్ల జనులు చూచుండగా రంగనాధునిలో అయిక్యమైయేను
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము ||2||
శ్రీ విల్లి ఫూత్తూరు నందు అమ్మవారిని ఉత్సవ మూర్తిగా
రంగానాధుడు మలచిన పదప తాను కలిసేను ఉత్సవమూర్తిగా
అవతరమూర్తి శ్రీ రామచంద్రుని ఇలవేల్పు శ్రీ రంగానాధుడు
శ్రీ రంగానాధుని పరిణయమాడి గోదాదేవిగా ఇలవేలుపు అయేను
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము||2||
నాటి నుండి ప్రతి
వైష్ణాలాయమున బోగి నాడు
గోదాదేవికి విష్ణు మూర్తితో కళ్యాణోశ్చవం
జరిపించుట ఒక సంప్రాదాయము
దనురుమాసమున తొలి దీపరాధన చేయుట వలన
లక్ష్మీ కటాక్ష సిద్ది ప్రార్థము సకల సంపదలు సిద్ది తద్ద్యము
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము||2||
తిరుపావైని సుభ్రబాతముగా దనురుమాసమున గానము చేయుట
విష్ణాలయమున నివేదనములను పాలలకు ఇచ్చుట సంప్రాదాయము
దేవతలకు ఇది బ్రహ్మీముహుర్తము మకర సంక్రాతులలో
పూజలు చేయుట శుభకరము భక్త జనులకు ఒక వరము
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము||2||
ధనురుమాసమున ఆలయాలలో పండగ సందడి నేలకొని
ఉండగా ధనుమాసం వ్రతం ఆచరించడం వైష్ణవభక్తుల బోదనము
మెదట పక్షమున చెక్కర పొంగలి రెండవ పక్షమున దద్దోజనము
నైవేద్యముగా మధుసుదనికి సమర్పించడం దివ్య బోగము
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము||2||
భూదేవి అవతారమైన ఆడళ్ళామ్మ విరచితమైన
దివ్య ప్రభదము గానము చేయుట సర్వజనులకు ముక్తి ప్రదం
అను నిత్యంను బ్రహ్మ మూహుర్తం శుభ గడియలలో తిరుపావై
పారాయణం దివ్య వరము దైవా అనుగ్రహ సంప్రాతం
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము||2||
ఇంటి ముంగిట ముగ్గులు వేసి గోబ్బెమ్మలను అందున నిలిపి
పసుపు కుంకుమలతో అలంకరించి పూజించు కన్యకకు కళ్యాణ యెగము
ధనురుమాసం అడాళ్ళుపూజ తిరుప్పావై పఠనముతో
గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మ ధన్యము శుభ యెగం
గోదాదేవి వందనము దరణి పుత్రిక వందనము
శ్రీ రంగ నాయకి వందనము మంగళ దీపిక వందనము||2||
గోదాదేవి
పాట
మల్లెలు మెల్లలు మందారములు
మాలలు కట్టెను ఆండాళ్ళు || 2 || మల్లెలు ||
నల్లని వానికి నప్పునుయనుచు
పలుకుచు మురిసె ఆండాళ్ళు ||2||
మెల్లగ మెడలో వేసి చూచుకొని
కిల కిల నవ్వెను ఆండాళ్ళు || మల్లెలు ||
చందనము తన మేని పూసుకొని
గంధము బాగను ఆండాళ్ళు || 2 ||
మందారపు పన్నీరు జల్లుకొని
ఎంతో బాగను ఆండాళ్ళు || మల్లెలు ||
రకరకాల పలు రుచుల చూచి
చక్కెర తీపనె ఆండాళ్ళు || 2 ||
శ్రీకరుడు శ్రీ రంగనాధునికి
నిక్కము నచ్చెను ఆండాళ్ళు || మల్లెలు ||
0 Comments