Hanuman Chalisa - హనుమాన్ చాలీసా
Hanuman Chalisa - హనుమాన్ చాలీసా |
శ్రీ హనుమద్గాయత్రీ
ఓం అంజనేయాయవిద్మహే, వాయుపుత్రాయధీమహి తన్నోహనుమాన్ ప్రచోదయాత్
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
జయ హనుమంత జ్ఞానగుణవందిత
జయపండిత త్రిలోక పూజిత
రామదూత అతిలితబలధామ
అంజనీపుత్ర పవనసుతనామ
ఉదయభానుని మధుర ఫలమని
భావనలీలామృతమును గ్రోలిన
కాంచనవర్ణ విరాజితవేష
కుండల మండిత కుంచితకేశ
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకిపతి ముద్రికదోడ్కొని
జలధికించి లంకచేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి
వికటరూపమున లంకనుగాల్చి
భీమ రూపమున అసురులజింపిన
రామకార్యమును సఫలముచేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
సీత జాడగనివచ్చిన నినుగని
శ్రీ రఘువీరుడు కొగిటనినుగని
సహస్రరీతులు నినుగొనియాడగ
కాగల కార్యము నీపైనిడగ
వానర సేనతో వారధిదాటి
లంకేశునితో తలపడిపోరి
హూరుహూరున పోరుసాగిన
అసురసేనల వరుసగూల్చిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
లక్ష్మణమూర్చతో రాముడడలగ
సంజోవి దెచ్చిన ప్రాణప్రదాత
రామలక్షణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీరామబాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురులేని ఆ లంకాపురమున
ఏలికగా విభీషణు జేసిన
సీతారాములు నగవులు గనిరి
ముల్లొకాలు హారతులందరి
అంతులేని ఆనదంశృవులె
అయ్యెద్య పురి పొంగిపొరలె
సీతారాముల సుందరమందిరం
శ్రీకాంతు పదం నీ హృదయం
రామచరిత కర్ణామృతగానా
రామనామ రసామృతపానా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
దుర్గమమగు ఏ కార్యమైన
సుగమమేయగు నీ కృప జాలిన
కలుగు సుఖములు నినుశరణన్న
తొలుగు భయములు నీరక్షణయున్న
రామద్వారపు కాపరి వైననీ
కట్టడిమిద బ్రహ్మాదుల తరుమా
భూతపిశాచ శాకినీ ఢాకిని
భయపడిపారు నీనామ జపమువిని
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
ధ్వజావిరాజా వజ్రశరీరా
భుజబలతేజా గదాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్ర
కేసరి పుత్ర పావనగాత్ర
సనకాదులు బ్రహ్మదిదేవతలు
శారద నారద ఆది శేషులు
యమకుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీకిర్తిగానములు
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
సోదరభరత సమాన యని
శ్రీరాముడు ఎన్నికగన్న హనుమా
సాధులపాలిటి ఇంద్రుడవన్నా
అసురులపాలిటి కాలుడవన్నా
అష్టసిద్ది నవనిధులకు దాతగ
జానికిమాత దీవించెనుగ
రామరసామృత పానము జేసిన
మృత్యుంజయుడవై వెలిసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
నీ నామభజన శ్రీ రామరంజన
జన్మ జన్మాంతర ధుఃఖభంజన
ఎచ్చటుండినా శ్రీ రామదాసు
చివరకు రామునుచేరుట తెలుసు
ఇతర చింతనలు మనసునమెతలు
స్థిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీ రామకీర్తన
అందందున హానుమాను నర్తన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు
శ్రద్దగా దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు గలుగుసుమా
భక్తిమిరగ గానము సేయగ
ముక్తి గలుగు గౌరీశుల సాక్షిగ
తులసీదాస హనుమాన చాలీసా
తెలుగున సులువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముల పలుకులు
దోసములున్న మన్నింపుమన్నా
మంగళ హారతిగొను హనుమంత
సీతారామలక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమె అనంత
నీవే అంతా శ్రీ హనుమంత
ఓం శాంతి శాంతి శాంతిః
ఈ హనుమాన్ చాలీసాను చదవడం వల్ల మనకు అనేక
ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే అందులోని ప్రతి పదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
హనుమన్ చాలిసా ప్రతి రోజు 9 సార్లు భక్తి శ్రద్ద, విశ్వాసముతో చదవడం వలన విశేష అనుగ్రహం
కలుగుతుంది.
0 Comments