Sanivara Vratha Katha - శనివార వ్రత కథ
Sanivara Vratha Katha - శనివార వ్రత కథ |
ధ్యానము
ధ్యాయాత్ శ్రీవేంకటేశం కలిమల హరణం కాంచనారాదితాంఘ్రిం
శేషాద్రౌ నివసన్ చరమపి రమయా భూమి వైకుంఠనాధం
సుబ్రహ్మణం సురేశం సకల మునిగణేప్పిత మంత్రమూర్తి
సర్వేష్టార్థ ప్రదాన ప్రధితయశసం విష్ణు మర్చావతంసం
కొండక కాలమున మహర్షి నారదుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ’ఓ బ్రహ్మదేవా! ఇది కలియుగముకదా! యీ కలియుగమున శ్రీమన్నారాయణుడైన శ్రీ మహా విష్ణువును పూజించుటయెట్లు? అసలాయన వునికి యెక్కడ? సర్వ దేవతా స్వరూపుడైన ఆ భగవానుని నివాస స్థలము యెచ్చట? తెలుపవలసినది’ అని వేడెను.
బ్రహ్మ, నారదముని అడిగిన అంశమును సావధానముగా విన్నవాడై, " నీ సంశయమును తీర్చుకొనుటకై అడిగినదే అయినను, అది లోకశ్రేయెదాయముకమై అడిగినదే అయినను, అది లోకశ్రేయెదాయకమై కూడా వున్నది. ఈ కలియుగమున శ్రీమహావిష్ణుమూర్తి తిరుపతి కొండపై శ్రీ వేంకటేశ్వరస్వామి రూపమున విరాజిల్లుచున్నాడు. అచ్చట నుండి భక్తుల సర్వవిధములైన కోర్కెలను తీర్చుచున్నాడు. ఆఆయన నారాధించువారికి సూర్యతేజః పుంజములకు చీకట్లు పటాపంచలగునట్లు సర్వపాపములు దూరమయి సుఖములు గలుగును. ఇది ముమ్మాటికి యదార్థము.
ఆ శ్రీహరి వేంకటేశ్వరస్వామిగా యుండు శేషాద్రిపైనున్న చెట్లన్నీ కల్పవృక్షముల వంటివి. అందలి శిలలు మణులుగా భాసించుచున్నవి. అచ్చటి ప్రాణులన్ని దేవతలే ఇంతకుమించి శేషాద్రి గొప్పతనమును మాటలతో కొనియాడగలమా? ఆ వేంకటేశ్వరుని సేవించిన దరిద్రుడు ధనవంతుడుగుచున్నాడు. మూగవాడు గనుక శ్రీనివాసుని పూజించిన అతనికి మాట్లాడుట వచ్చి తీరును. కుంటివారు ఆ స్వామి వారిని పూజించినచో కుంటితనము పోయి చకాచకా నడవగల్గుదురు. రోగులు జాగు చేయక ఆయనను పూజించినచో ఆరోగ్య భాగ్యవంతులగుదురు.. సంతాన హీనులు పూజించినచో నేత్రవంతులగుదురు. అంత యెందుకు? పిసినారి గనుక వేంకతేశ్వరుని పూజించినచో అతడు దాతయై కీర్తి సంపాదకుడగును, పాపాత్ములు గనుక పూజించినచో పుణ్యములనూ, ఉత్తమగతులను పొందుదురు. శేషాచలముపై సర్వమంత్రములను సిద్దించును.
సుబ్రహ్మణ్యస్వామి, శ్రీవిష్ణువు, పరమశివుడు ఈ మూర్తిత్రయము యేకరూపముగా వేంకటేశ్వరస్వామి యను పేరుతో సకల దేవతా స్వరూపుడై శేషాద్రి మిద వెలసి భక్తుల కొరిన కొర్కలను తీర్చుచున్నారు. పూర్వకాలమున అగస్త్య మహమునికి నమస్కరించుటకై వంగిన పర్వత శిఖరమే ఆశేషాద్రి. ఆది దేవతలందరకు సిద్దులకు, యక్షుకులకు, గంధర్వులకు, మహామునులకు నివాసము, భక్తుల సంరక్షణకు వరప్రధాన మెనర్చుటకు మహవిష్ణువు లక్ష్మి సమేతుడై పరమపవిత్ర పుష్కరిణీ తీరమున వెలసియున్నాడు.
కలియుగమున సర్వ పుణ్యక్షేత్రములందు యేపాటి ప్రభావము తగ్గిననూ, సుబ్రహ్మణ్య వేంకటేశ్వర క్షేత్రములందు మాత్రము మహిమ తగ్గదు.
శ్రీ మహవిష్ణువు కలియుగమున శైవ క్షేత్రములలో సుబ్రహ్మణ్యేశ్వరుడుగను, విష్ణుక్షేత్రములందు వేంకటేశునిగను సర్వదా ఆరాధించబడుచుండును. పవిత్రమగు శ్రావణ శనివారమున ఆయనను భక్తి శ్రద్దలతో అర్చించిన వారు విశేష పుణ్యమును పొందుట సత్యము.
ఎవరు శనివారమునా డొక పూట మాత్రమే ఆహరముగొని శ్రీవేంకటేశ్వరుని భక్తి ప్రవత్తులతో ఆరాధించుదురో వారు తమతమ యభీష్టములను తప్పక బడయగలుగుదురు.
వేంకతాద్రి పై యున్న పాపనాశన తీర్థము, కటాహతీర్థము, పాండవ తీర్థము, కపిల తీర్థము, వరాహతీర్థము, జాబిలి తీర్థము, పుష్కరిణీ తీర్థము, తుంబుర తీర్థము, కాయరసాయన తీర్థము మునుగు సర్వతీర్థములందు స్నాన పునీతులై స్వామిని భక్తి ప్రవత్తులతో ఆరాధించిన అట్టీవారికి భూప్రదక్షిణం చేసిన పుణ్యక్షేత్ర దర్శనాఫలమునూ లభించును.
భృగు మహర్షి గొప్ప తప్పశ్శాలి, ఆయన పాదమున మూడవనేత్రము గలవాడు. దానిని చూచుకొని గర్వితుడై విర్రవీగసాగెను. ఇట్లుండ మహర్షులు ఒక మహయజ్ఞమును తలపెట్టి, తిమూర్తులలో శాంతగుణ మెక్కువగా గలవారికి యజ్ఞ ఫలప్రదానము చేయదలచిరి, కాన ఆ ముగ్గురిలీ యవరు సాత్వికులో తేల్చుటకు భృగువు బయలుదేరినాడు.
తొలుత బ్రహ్మ వద్దకు వెళ్ళెను. ఒక ఆసనమున గూర్చుండెను. తన అనుమతి లేకనే భృగువు కూర్చెండెనని బ్రహ్మకొపము తెచ్చుకొనెను. అంతేకాదు, భృగువుతో ఎంతకును మాట్లాడనేలేదు. బృగువునకు కొపమువచ్చి "ఓరీ ధాతా! నీవే సృష్టి కర్తవని అహంబావన గలిగియిన్నావు, నన్ను గణించ లేదు గనుక, నీకు భూలోకమున పూజలు, పునస్కారములు దేవాలయములు వుండవు " అని శపించినాడు.
తరువాత శివలోకమునకు వెడలెను. పరమేశ్వరుడు పార్వతితో ప్రమద గణముతో నృత్యపరవశుడయి వుండి భృగు మహర్షి రాకను గమనించలేదు. ఋషి కొపమెంది "మహేశ్వరా! మహామునినైన నన్ను నీవు గౌరవించలేదు. కావున మాలోకమున నిన్నెవరునూవ్ విగ్రహరూపమున పూజించకుందురు గాక లింగాకార సమర్జన మాత్రమే చేయుదురుగాక" అని శపించెను.
తరువాత మహవిష్ణువు కడకుపోగా, ఆయన లక్ష్మిదేవితో సరస సల్లాపములో తేలియాడుచుండేను. భృగువుమహర్షి వచ్చి నిలబడినను గమనించక పోయను తనను నిర్లక్ష్యము చేసినాడని భృగువు భ్రమచెంది, కొపమెంది వీరభద్రుడై హూంకరించి శ్రీహరి వక్ష స్థలమునును తన్నెను. ఆ మహానుభావుని తన్నగానే లోకములన్నీ గజగజలాడెను. భూదేవి కంపించెను. సముద్రము లల్లకల్లోలము లాయెను. ఆయినను ఆయనకు కోపము రాలేదు. రాకపోగా మునీంద్రా! తమ ఆగమనము చేత వైకుంఠమే పావనమైనది. నావక్షస్థలమును తన్నుట వలన మీ పాదములకు నొప్పి కలిగినదేమె" అనుచు భృగుమహర్షి పాదములొత్తుచు ఒక పాదమునందు గల మూడవ నేత్రమును చిదిమివేసెను భృగువునకు గర్వభగమై హృదయము జ్ఞానరంగమైనది, అంతట నా ఋషి శ్రీహరితో
పురాణ పురుషా! కలియుగమున మానవులు పాపాత్ములై సంచరించుచు నానావిధ కష్టములు పొందుచున్నారు. కావున భూలోకమున దర్మస్థాపనకు ప్రజల కష్టములు తీర్చుటకు నీవే అవతారమెత్తవలెను" అని వచించి. భూలోకమున కేగి "ఘంటాపథముగా త్రిమూర్తులలో పరమ సాత్త్వికుడు మహావిష్ణువే" అని తెలుపగా, మునీంద్రులందరూ యజ్ఞఫలమును శ్రీహరికి దారపోసిరి.
కాగా హరియురమున నివసించు లక్ష్మీదేవి తన స్థలమును భృగువు తన్నుటకు పరాభవము సహించలేక విష్ణువుతో కలహించి వక్షస్థలమును వీడి భూలోకమునకు పొయి కొల్లాపురి గ్రామములో స్థిరవాసిని అయ్యెను. లక్ష్మి విడువుగా విష్ణువు కళ దప్పిన వాడయ్యెను. విచారముతో నుండి, మరల లక్ష్మినిపొంది, తీసుకువచ్చి వక్షస్థలమున నిలుపుకొను కొరికతో భూలోకమునకు వెళ్లెను. ఆ భూలోకమున పాపములు పెరుగుటను చూచెను. వారి కష్టములు రూపుమాప నిశ్చయించుకొనెను. లక్ష్మిని వెతుకుచు కొండలు బండలు దాటుచు ఆహర్నిశలు మహరణ్యములు తిరుగసాగెను. ఆకలు దప్పులతో బాదపడుచు లక్షికై వెతుకుచు శ్రమలు బడుచుండెను. ఆవిధముగా వెడలుచు శేషాద్రిని చేరెను. అచ్చటనే స్థిరనివాసము చేసుకొనెను. ఒక పెద్దపుట్టలో తలదాచుకొనెను. ఆ విధముగా శ్రీహరి భూలోకమున వెలెసెను.
శ్రీ హరి తలదాచుకొనిన పుట్టగల పర్వత ప్రాంతము చోళుల పరిపాలనలో గలదు. అప్పటి రాజు ఆకాశరాజు , అతడు సంతానమునకై పుత్రకామేష్టి చేయుటకు యాగ భూమిని దున్నుచుండగా బంగారు నాగలికి ఒక బంగారు భరిణె దొరికెను. దానిలో అందమైన శిశువు వుండెను, రాజు ఆ శిశువును పెంచి పెద్దచేసెను. ఆమెయే పద్మావతి విష్ణువు పుట్ట నుంచి బయటకు వచ్చి వరాహశ్రములో శ్రీనివాసుడను పేరుతో నుండి ప్రజల కష్టసుఖములు తెలిసిఒనుచు మహిమలు చూపుచుండెను. పద్మావతి శ్రీనివాసుని చూచి మెహించెను. తల్లిదండ్రులకు చెప్పెను. ఆకాశరాజు శ్రీనివాసుడు "విష్ణువే" నని గ్రహించి తనకుమార్తెనిచ్చి వివాహము చేసెను. వివాహానికి లక్ష్మి దేవి కూడ కొల్లాపురమును వీడి వచ్చెను. వివాహము వైభముగా జరిగెను.
కొంత కాలానికి ఆకాశారాజు స్వర్గస్థుడయ్యెను. అతని తమ్ముడు తొండమానుడు రాజ్యపాలకుడాయెను. శ్రీనివాసుడు పద్మావతులను వెంటబెట్టుకొని అగస్తాశ్రమమున నివసించసాగెను. అచ్చట నుండు వేంకటాద్రిని వెడలి భూలోకమున కలియుగాంతము వరకు వుండవలెనని నిశ్చయించుకుని అచ్చటనే శిలారూపముగా మారెను. వెంటనే లక్ష్మి పద్మావతులు కూడా శిలా విగ్రహములుగా మారిరి. తొండమానుడా స్థలముననే ఒక గొప్ప దేవాలయమును నిర్మించెను. అప్పటి నుండి శ్రీహరి శ్రీనివాసుడను పేరుతో వేంకతేద్రిపై నుండి భక్తుల కష్టములను తొలగించుచున్నాడు. ఆ శ్రీనివాసుడే "శ్రీ వేంకటేశ్వరుడు" అని బ్రహ్మదేవుడు నారదునితో ఈ వేంకటేశ్వర ఆఆధనా మహిమను స్వామి గొప్పతనమును చెప్పియున్నాడు.
శనివార వ్రతమును చేసిన పాపులు మెక్షమును పొంది జన్మరాహిత్యము పొందుచున్నారు. శేషాద్రి సకల దేవతా నివాసము.
వేంకటేశుడు త్రిమూర్త్యాత్మకముర్తి
వ్రత ఫలము
విశేషించి శ్రావణ మాసమున శనివారమునాడు యేక భుక్తమునుండి యెవరు శనివార వ్రతము ఆచతింతురో. వరికి ఆ శ్రీహరి సకల అభీష్టములను సిద్దింపచేయుచున్నాడు. శ్రావణ శనివరమున శ్రీవేంకటేశుని పూజించినచో సకల దేవతలనూ పూజించిన ఫలము సిద్దించును.
శనివార వ్రతమును భక్తితో ఆచరించువారికి సకల కష్టములను తొలగును. ఒక్క శ్రావణ శనివారమే కాక, యే శనివారముమందైనా ఈ వ్రతము నాచరించినవారు సమస్త కష్టములు తొలగి, సకల సంపదలతో భోగభాగ్యాలతో వుందురు. ఇదీ అసామాన్య వ్రతము సామాన్యులు, ధనవంతులు అనుభేదము లేక, యెల్లరునూ ఈ వ్రతము చేసి మెక్షమును పొందుదురు గాక.
శ్రీ వెంకటేశ్వర వ్రజకవచ సోత్రం
౧. నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవకవచమమ
౨. సహస్ర శీర్షాపురుషో వేంకటేశ శ్శిరోవతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణంరక్షతుమే హరిః
౩. ఆకాశరాత్ సుతానాథ ఆత్మానం మేసదావతు
దేవ దేవోత్తమః పాయా ద్దేహం మే వేంకటేశ్వరః
౪. సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజాని రీశ్వర్ః
పాలమేస్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు
౫. య ఏతత్ వజ్రకవచ మభేద్యం వేంకటేశ్వరః
సాయంపాత్రః పదేన్నిత్యం మృత్యుః తరతి నిర్భయః
అఖండ దీపం
శ్లోకం;-
సాజ్యంత్రివర్తి సంయుక్తం మహ్నినాయెజితం ప్రియం
గృహణ మంగళం దీపం త్రైలోక్యతిమెరాపహ
భక్త్యా దీపం ప్రయవ్వామి దేవాయపరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఙో రాద్దివ్యజ్యోతి రృమెస్తుతే
శ్రీ తిరుమలేశాయ అఖండ దీపం దర్శయామి
వినా వేంకటేశం ననాదో ననాధః సదా వేంకటేశం
స్మరామి స్మరామి హరే వేంకటేశం ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ ప్రయశ్చ
0 Comments