Ganesha Pancharatnam in Telugu – శ్రీ గణేశ పంచరత్నమ్
Ganesha Pancharatnam in Telugu – శ్రీ గణేశ పంచరత్నమ్
ముదా
కరాత్త మోదకం
సదా విముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైకనాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశునాశకం నమామి
తం వినాయకమ్
|| 1 ||
నతేతరాతిభీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 2
||
సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || 3||
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపంచ నాశభీ షణం ధనంజయాది భూషణం
కపోల దానవారణం భజే
పురాణ వారణమ్ || 4 ||
నితాంత కాంత దంత కాంతి మంత కాంతకా త్మజం
అచింత్య రూపమంత హీనమంతరాయకృన్తనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || 5
||
మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది
స్మరన్గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్
|| 6 ||
ఇతి శ్రీ
గణేశ పంచరత్నం సంపూర్ణం ||
గణేశ పంచరత్నం గణేశుడిపై శ్రీ ఆది శంకరాచార్యులు స్వరపరిచిన భక్తి స్తోత్రం. పంచరత్నం అంటే ‘ఐదు రత్నాలు’ అని అర్ధం. గణేశ పంచరత్నం సాహిత్యంలో గణేశుడిని స్తుతించే ఐదు చరణాలు మరియు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే ఫలస్తుతి చరణం ఉంటాయి. ఐదు చరణాలను ఐదు రత్నాలుగా పరిగణిస్తారు, అందుకే దీనికి గణేశ పంచరత్నం అని పేరు. ఈ స్తోత్రం ముదకరత మోడకం స్తోత్రం అని కూడా ప్రాచుర్యం పొందింది.
శ్రీ గణేశ పంచరత్నం భావం
సంతోషముతో ఉండ్రాళ్ళు పట్టుకొన్నవాడు, ఎల్లప్పుడు మెక్షమిచ్చువాడు.
అనాథలకు దిక్కైనవాడు, చంద్రుని తలపై అలంకరించుకున్నవాడు
విలసిల్లు లోకములను
రక్షించువాడు, గజాసురుని సంహరించినవాడు, భక్తుల పాపములను వెంటనే పోగొట్టువాడు అగు వినాయకుని
నమస్కరించుచున్నాను.
నమస్కరించని వారికి అతి భయంకరుడు, ఉదయించిన సూర్యుడు వలే
ప్రకాశించు వాడు, రాక్షసులను, దేవతలను తన ఆథీనములో నుంచుకొన్నవాడు, నమస్కరించు వారిని
ఆపదల నుండి ఉద్ధరించువాడు,
దేవతలకు రాజు, నిధులకధిపతి, గజేశ్వరుడు, ప్రమథగణములకు నాయకుడు,
ఐశ్వర్యసంపన్నుడు, పరాత్పరుడు అగు వినాయకుని నల్లప్పుడు అశ్రయించుచున్నాను.
సమస్తలోకములకు మేలు చేయువాడు మదించిన ఏనుగులవంటి రాక్షసులను
సంహరించిన వాడు, పెద్దబొజ్జ కలవాడు, శ్రేష్ఠుడు, గజముఖుడు, నాశములేనివాడు, దయదలచువాడు.
సహనవంతుడు, సంతోషమునకు స్థానమైన వాడు, కీర్తి కలిగించువాడు,
నమస్కరించు వారికి మంచి మనస్సునిచ్చువాడు, ప్రకాశించువాడు అగు వినాయకుని నమస్కరించుచున్నాను.
దరిద్రుల బాధలను తొలగించువాడు, వేదవాక్కులకు నిలయమైనవాడు,
శివుని పెద్ద కుమారుడు, రాక్షసుల గర్వమును అణగదొక్కువాడు, ప్రళయకాల భయంకరుడు,
దరిద్రుల బాధలను తొలగించువాడు, వేదవాక్కులకు నిలయమైనవాడు,
శివుని పెద్ద కుమారుడు, రాక్షసుల గర్వమును అణగదొక్కువాడు, ప్రళయకాల భయంకరుడు,
అగ్ని మెదలగు దేవతలకు అలంకారమైన వాడు, చెంపలపై మదజలము కారుచున్నవాడు,
అగు గజాననుని సేవించుచున్నాను
తళతళలాడు దంతమున్న వాడు, యముని కూడ అంతమెందించు శివునకు పుత్రుడు,
ఊహకందని రూపము కలవాడు,
అంతము లేనివాడు, విఘ్నములను భేదించువాడు అగు ఏకదంతుని ఎల్లప్పుడు
ధ్యానించుచున్నాను
0 Comments