Sri Gananayaka Ashtakam-శ్రీ గణనాయకాష్టకం

శ్రీ గణనాయకాష్టకం

Sri Gananayaka Ashtakam-శ్రీ గణనాయకాష్టకం
Sri Gananayaka Ashtakam-శ్రీ గణనాయకాష్టకం

ప్ర్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే


శ్రీ గణనాయకాష్టకం

ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభమ్

లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్

బాలేందుసుకలామౌళిం వందేహం గణనాయకమ్

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితమ్

కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్

గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణ చామర భూషితమ్

పాశాంకుశాధరం దేవం వందేహం గణనాయకమ్

మూషికోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే

యెద్దుకామం మహావీరం వందేహం గణనాయకమ్

యక్ష కిన్నర గంధర్వ సిద్దవిద్యాధరైస్సదా

స్తూయామానం మహాబాహుం వందేహం గణనాయకమ్

అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితమ్

భక్తప్రియం మదోన్నత్తం వందేహం గణనాయకమ్

సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితమ్

సర్వసిద్ది ప్రదాతారం వందేహం గణనాయకమ్

ఫలము:  గణాష్టక మిదం పుణ్యం యః పఠేత్సతతం నరః

              సిధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

విద్యావినయ విజయ వైభవాలకి సర్వకార్యసిద్దికి పఠించవలసిన అష్టకమిది

గణేశ అష్టక సాహిత్యం మరియు అర్థం

ఒకే దంతముతో, లిగిన బంగారమువలె శోభాయమానముగా కనబడే బలిష్టమైన దేహముతో విశాలమైన పొత్తికడుపు, ఆహ్లాదకరమైన మరియు విశాలమైన కన్నులు గలవాడా, గణనాయకుడైన గణేశా స్వామికి నేను నమస్కరిస్తునాను.

నడుము చుట్టూ మౌంజీ గడ్డి దారం ధరించి, జింక చర్మాన్ని ధరించి, పవిత్రమైన పామును (యజ్ఞోపవీతం) కలిగి ఉన్న భగవానుడు, తన నుదుటిపై చంద్రునితో అలంకరించబడి, నాయకుడైన గణేశా నీకు నమస్కరిస్తున్నాను.

తన శరీర భాగాలపై విలువైన రత్నాలు మరియు అభరణాలతో అలంకరించబడినవాడు, అలంకరించబడిన మాలలతో మహిమాన్వితమైనవాడు, తన అభిరుచుల రూపాన్ని ధరించగల భగవంతుడు, గణనాయకుడైన గణేశా నీకు నేను నమస్కరిస్తున్నాను

ఏనుగు ముఖము కలవాడు, సురలలో ప్రతిష్టించబడినవాడా, చెవి ఆభరణాలతో అలంకరించబడినవాడా

చేతులలో పాశం మరియు అంకుశం పట్టుకొని ఉన్న భగవంతుడా, నేను నీకు నమస్కరిస్తున్నాను, నాయకుడైన గణేశ గణాలు

దేవతలు మరియు అసురులచే ఆరాధించబడే గొప్ప ఎలుక(మూషిక) పై అధిరోహించినవాడు,

గొప్ప శక్తిని మరియు అపారమైన శౌర్యాన్ని ప్రదర్శించేవాడు, గణాల నాయకుడైన గణేశ నేను నీకు నమస్కరిస్తున్నాను

యక్షులు (అపారమైన శక్తులు కలిగిన జీవులు మరియు ఆత్మలు), కిన్నరులు (స్వర్గ పరిచారకులు మరియు సంగీతకారులు), గంధర్వులు (దైవ గాయకులు మరియు నృత్యకారులు), సిద్దులు (సుప్రిం విద్యాంసులు మరియు గురువులు), మరియు విద్యాధరులు (స్వర్గపు జీవులు) ఎల్లవేళలా పూజింపబడుతున్న ప్రభువా, అపారమైన శక్తులు గలిగిన దేవతలు బలమైన బాహువులు మరియు శరీరం కలిగినవాడా, గణనాయకుడైన గణేశా నీకు నేను నమస్కరిస్తున్నాను.

భక్తులకు తన ప్రేమను, శ్రద్దను కనబరుస్తూ, మత్తులో పడి, యుద్దాలలో నిష్క్రమించే, తన తల్లి ఎల్లప్పుడు చూసుకునే దివ్యమాత అంబికా (పార్వతీ దేవి) హృదయాన్ని ఆహ్లాదపరిచేవాడు, నాయకుడైన గణేశా, నీకు నమస్కరిస్తున్నాను.

గణేశా, అన్ని ఆటంకాలను తొలగించేవాడు, అన్ని అడ్డంకులను విడిచిపెట్టేవాడు మరియు అన్ని సిద్ధులను ప్రసాదించేవాడు గణనాయకుడైన గణేశా నీకు నేను నమస్కరిస్తున్నాను.

ఎవరైతే ఆనమ్దకరమైన గానాష్టకమును తరచుగా పఠిస్తారో, జీవులకు వారి కర్మలన్నీ నెరవేరుతాయు మరియు వారికి జ్ఞానం మరియు సంపదలు ప్రసాదించనడతాయి

గణేశ అష్టకం లేదా గణాష్టకం అనేది గణేశుడిని లేదా గణపతిని, అడ్డంకులను తొలగించేవాడు మరియు శివుడు , పార్వతి దేవతలను ఆరాధించే భక్తి స్తోత్రం

అష్టకం యెక్క అర్థం ప్రధానంగా గణేశుడి రూపాన్ని, అతని శౌర్యాన్ని, తల్లి పార్వతితో బంధాన్ని మరియు అతని భక్తులపై అతని కరుణా స్వభావాన్ని వివరిస్తుంది

Facebook

సంకటనాశన గణేశస్తోత్రమ్



Post a Comment

0 Comments