Sri Lakshmi Chalisa - లక్ష్మి చాలీసా
Sri Lakshmi Chalisa - లక్ష్మి చాలీసా |
1.
అష్టలక్ష్మి
నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం ||అష్టలక్ష్మి||
2.
అక్షయ సిద్దికి
ప్రతిరూపం
రక్షింపవె మము అనునిత్యం || 2 ||
చంద్రుని చెల్లివి శ్రీలక్ష్మీ
వెన్నెల నవ్వుల వరలక్ష్మీ!
3.
చంచలమౌ నీ కన్నులవే
చైతన్యానికి వన్నెలవే || 2 ||
అమృతమైనది నీ హృదయం
అంబరీశ ఎద నీ నిలయం
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
4.
ఆకాశ మంటును నీ తేజం
నిను అర్చించుట సౌభాగ్యం || 2 ||
ఓంకారం నీతొలిమంత్రం
శుభముల నొసగును శ్రీయంత్రం
5.
శిష్ట విశిష్టల సేవలవే
ఇష్టము నీకవి ఇంద్రాణీ || 2 ||
నిష్టతో కొలిచిన నినుచాలు
కష్టము తొలుగును అలిమేలు
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
6.
సృష్టికి మూలము నీవు
గదే
దృష్టిని మాపై చూపు సదా || 2 ||
అష్టలక్ష్మీవై రావమ్మా
విష్ణువు ప్రియసఖి నీవమ్మా
7.
కుబేర మంత్రపు కలశముతో
కుచేల బాధలు తొలుగునులే || 2 ||
కరుణను చిలికే కన్నులతో
శరణము నీయవే శాంతిప్రియే
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
8.
సిరి సంపదలకు సన్నిధివే
ధరణిని కాచే పెన్నిధివే || 2 ||
శ్రీ అక్షరమున స్థిరముగను
మెక్షము నీయవే మహాలక్ష్మీ
9.
భక్తి కొలనిలో పద్మ
సఖీ!
పద్మ సుహాసిని ప్రణవముఖీ || 2 ||
పద్మ నాభునికి ప్రియసఖివే
పద్మాసినీశ్రిత పాలినివే!
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
10.
దేవత సురగణ
పూజితవే
దివ్యాంబర ధర మాలికవే || 2 ||
ధర్మ పీఠమున దక్షతతో
ధర పాలింపవే ధనలక్ష్మీ
11.
ఇంద్రాది
గణము సేవింప
ఇరువుగ కొలువగు హిరణ్మయి || 2 ||
రాజ్యలక్ష్మీవై పాలించే
రమణీ లలామ రాగమయి
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
12.
పూపుప్పొడిలో
పరిమళవే
పొలతీ నీవే నవకళవే || 2 ||
చేమంతులలో హేలవులే
హేమంతానికి
రాణివిలే
13.
కరకమలమ్ముల
కల్హరం
గిరి కనుమలలో సింధూరం || 2 ||
కామితదాయిని కమలాక్షీ
నీరజ నిర్మల
నిగమాంగీ
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
14.
డోలాసురులను
వధియించే
శూలాయుధధరి శ్రీలక్ష్మీ || 2 ||
హాలాహలమును చేదించే
లీలామానుష రూపిణివే
15.
జేష్ఠ్ర
నక్షత్ర ప్రియ సఖివే
సృష్టికి మాలధారిణివే || 2 ||
స్పష్టముమాకిది నీదరిలో
నష్టము కలగదు గమనములో
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
16.
భృగుముని
పుత్రిక నీవమ్మా
భువనము నేలగ రావమ్మా || 2 ||
నగవులు చిలికెడు నవమల్లీ
నిగమ రూపిణీవి మాతల్లీ
17.
శంఖుచక్రములు
కరములలో
శాంతిభావనలు ఎదసడిలో || 2 ||
శశాంకవన్నెలు వదనములో
ప్రభాతవెలుగులు కన్నులలో
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
18.
నీరజ నిను
మది నిలిపినచో
నిత్యశుభమ్ములు నీదరిలో || 2 ||
మడిలోమాన్యము నింపుటకై
ధాన్యలక్ష్మీవై దయగొనుమా
19.
విద్యలన్నిటికి
నాయికవై
విశ్వమునేలవే దేవతవై ||
2 ||
వీణాపాణివి నీవు గదే
విద్యాలక్ష్మీగ గావగదే
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
20.
బాలలలో
పసిపాపవులే
పాలకడలి ఒడి బాలికవే || 2 ||
సంతోషాలను కలిగించే
సంతానలక్ష్మీ నీవెకదే
21.
హంస గమనమే
నీదమ్మ
హింసను అణచగ రావమ్మా || 2 ||
సింహవాహినీ నా ఎదలో
స్థిరముగ కొలువై
ఉండమ్మా
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
22.
కరమున ఖడ్గపు
మిలమిలతో
వీరలక్ష్మీ వీరిబోణి ||
2 ||
ఘుమఘుమ పరిమళ
సొగసులతో డమరుకధరునికి సోదరివే
23.
ఐరావతమ్ములు సేవించే
ఐశ్వర్యానికి దేవతవే ||
2 ||
సకల సంపదల సంభరితం
సౌభాగ్యలక్ష్మీ నీ సదనం
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
24.
వేదనాదములు
ఘెషలతో
విజయలక్ష్మీ నిను కొలిచెదము ||
2 ||
సామవేదముల సరిగమలో
జ్ఞాన నిధులు అందింపుమిక
25.
ఐహిక జీవన
గమనంలో
ధైర్యలక్ష్మీవై దరి నిలిమా || 2 ||
హిరణ్యమయివై రావమ్మా
మా హృదయాలివి నీవమ్మా
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
26.
హరిణలోచనీ
నీరూపం
హరి హృదయానికి ఆభరణం || 2 ||
చరాచరమ్ముల చైతన్యం
హిరణ్మయీ నీ కర చరణం
27.
అఖిల
జగతికొక అమ్మవలె
అదిలక్ష్మీ నిను కొలిచెదము || 2 ||
అండపిండిముల బ్రహ్మాండాలకు
అధారానివి నీవమ్మా
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
28.
పన్నగశయునికి
ప్రియసఖికై
విన్నపమిది విను విమలధరి || 2 ||
ఎన్నగ భువిలో నీకన్న
మిన్నగు దైవము లేదు కదా
29.
కామధేనువే
నీవెంటా
కల్పతరువు నీ వరపంట || 2 ||
అర్చించే నీ భక్తులకు
అదృష్టలక్ష్మీవి శ్రీదేవీ!
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
30.
కోటి
ప్రభాకర వెలుగులలో
సాటి రారు నీకెవరమ్మా || 2 ||
వైకుంఠానికి నాయికవే
వైభవలక్ష్మీ మాజనని
31.
వేయి
కన్నులవి చాలవులే
విశ్వమాత నిను చూడంగా || 2 ||
మాయా మెహము తొలుగునుగా
మాతా నిను మది తలువంగా!
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
32.
మంత్ర స్వరూపిణి
మహాలక్ష్మీ
శాంతి సుఖమ్ములనీవమ్మా || 2 ||
యాంత్రికమౌ మా గమనంలో
మంత్రము కావే మహాదేవి
33.
చిన్మయ రూపపు కాంతిగనీ
తన్మయమెందెద శ్రీమాత || 2 ||
కర్మబంధములు తొలగించే
కమ్మని అభయము నీకరము!
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
34.
సకల దేవతారూపిణివై
శుకపికరవముల సన్నిధిలో || 2 ||
మణిమయ కాంతుల మకుటముతో
మహిమను చూపవే మహాలక్ష్మీ
35.
సురగణ సన్నత లాలనలో
వరములనొసగుము వనలక్ష్మీ || 2 ||
జనగణ మనమల జయనాదం
గణగణ అందెల నీపాదం
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
36.
మేఘ తటిల్లత మాలికవే
రాగసుధామయ ప్రకృతివే || 2 ||
ప్రీతి పుష్కరిణి నీవమ్మా
దాత్రి రక్షణకు రావమ్మా
37.
పడతికి నుదుటను
కుంకుమగా
ప్రకాశింపవే ప్రతి నిత్యం || 2 ||
మంగళ రూపిణి మా తల్లీ
ఇందు శీతలీ హిమవహ్నీ!
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
38.
కరుణను చిలికే కన్నులలో
కమలము విరిసెను కాంతిమయీ || 2 ||
శరణము కోరెద నిన్నెప్పుడూ
తరుణము నీ పద సేవనకై
39.
ఎద కర్పూరము చేసితినీ
జే గంట మ్రెగించితినీ || 2 ||
పద సన్నిధినే చేరితిని
నిను నా మదిలో నిలిపితిని
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం
40.
మంగళమమ్మా మా జననీ
మముదయ గనుమా మహాలక్ష్మి ||
2 ||
సంపదలసగే శ్రీకరణీ
హారతి నీకిది హరి పత్నీ!
అష్టలక్ష్మి నీ అవతారం
ఆశ్రీత రక్షణ మమకారం
పాలకడలిలో నీ జననం
పసుపూ కుంకుమ నీ రూపం || 2 ||
0 Comments