Sri Vasavi Khadgamala Stotram - శ్రీ వాసవి ఖడ్గమాలా స్తోత్రం

 Sri Vasavi Khadgamala Stotram - శ్రీ వాసవి ఖడ్గమాలా స్తోత్రం

Sri Vasavi Khadgamala Stotram - శ్రీ వాసవి ఖడ్గమాలా స్తోత్రం
Sri Vasavi Khadgamala Stotram - శ్రీ వాసవి ఖడ్గమాలా స్తోత్రం

1 .శ్రీ కరంబుగ మాకు సిరులివ్వుమమ్మా

2. నీకన్న మాకన్యులెవరు లేరమ్మా

3. బ్రహ్మ దేవుడ నీవె భారతివి నీవె

4. వాసుదేవుడ నీవె వరలక్ష్మీ నీవె

5. వసుధలో, మమ్మెల్ల రక్షింప నీవె

6. పరగశంభుడ నీవె పార్వాతివి నీవె

7. పాయకను ప్రతి దినము పాలింప నీవె

8. పరగ ఇంద్రడ నీవె ఇంద్రాణి నీవె

9. ఎంచి చూడగ మాకు వేడుకలు నీవె

10. ముక్కొటి దేవతలు ముద్దు రూపము నీవె

11. నిక్కముగ మాపాలి భ్రమరాంబ నీవె

12.భూదేవి నీవె ఈ భువనములు నీవె

13. ప్రేమతో మమ్మెల్ల పోశింప నీవె

14. గ్రహ తారకలు నీవె ఈ గగనంబు నీవె

15. ఆదరించెడునట్టి అమ్మ నీవె

16. మేరు పర్వతము నీవె మేఘంబు నీవె

17. మేఘంబు లోపలి మెరుపు నీవె

18.  ద్దిగ్గజంబులు నీవె దిశలెల్ల నీవె

19. దీనపోషణ జేయు దైవము నీవె

20. ఆదిశేషుడ నీవె ఆఖిలంబు నీవె

21. జీవ సంతతి కెల్ల జీవము నీవె

22. కామధేనువు నీవె కల్పవృషంబు నీవె

23. కమనీయ మధు సుధా కలశంబు నీవె

24. సాగరంబులు నీవె సకలంబు నీవె

25 సమ్మతిగ మాపాలి సంపదవు నీవె

26. నవరత్నములు నీవె నాణెములు నీవె

27. నాటికి నేటికి నమ్మకము నీవె

28. కలధాన్యములు నీవె కనకంబు నీవె

29. కలలోన ఆపదలు ఖండింప నీవె

30. పదునాల్గు భువనాలు పాలింప నీవె

31. భాసురమ్ముగ మాకు బలములు నీవె

32.సలలితంబగు వేద శాస్త్రములు నీవె

33. శాస్త్రముల్  చెప్పెడి సారము నీవె

34. మంత్ర తంత్రంబులు మహిమలు నీవె

35. మరువక మా తప్పు మన్నింప నీవె

36. యుగధర్మములు నీవె యుగములు నీవె

37.ఆగణితంబు వెలయు ఆత్మ నీవె

38. బలమిచ్చి సిరులిచ్చి భయములందీర్చి

39. గుణమిచ్చి గణమిచ్చి జయములంగూర్చి

40. మమ్మేలు మాతల్లి యిలవేల్పు

41. వైశ్య్ కులాంబోది సౌభాగ్యలక్ష్మీ

42. మమతాను రాగాల సామ్రాజ్య లక్ష్మీ

43. కృపాజూపి రక్షించు శ్రీ కన్యకాంబ

44. పెనుగొండలో వెలసిన కోమలాంగి

45. వైశ్యులను కాచి రక్షించు వాసవాంబ

46. నగర మధ్యమందు నగుమెముతో నీవె వెలసినావదేవి విశ్వజనని

47.కోరుకొన్న వారి కోర్కలు దీర్చంగ, కల్పవృక్షమటుల కన్యకాంబ

48. కలియుగాన నీవు ఖలులకు స్వప్నమై, దీనజనుల వెతల దీర్చినావు

49. నీన్నె నమ్మినాడ నిరతముజగదంబ, కాటిఏని సఖియ కన్యకాంబ

50. జగము ల్లేలెడి మాయమ్మ జనని జగదంబ వరములీయవె వరదాయి శరణు శరణు

51. కేలుమెర్చితి నీమ్రెల ఏలుకొనుచు కరుణజూడవె శాంభవి కన్యకాంబ

52. లోకమంతయునిండిన లోకమాత పేరుపేరున ప్రణుతింతు కోరినిన్ను

53.అమ్మలకుయమ్మ పెద్దమ్మ అలుకమాని గావరావమ్మ గారాలకన్యకాంబ

54.నిన్ను పల్లకి ఎక్కించి ముమ్మారు ప్రీతితోడ నీదు గుడి చుట్టు తిరిగాను నిష్టబూని

55. దీక్షబూనిని నాపైన దృష్టిలేదా కమలోచని కామాక్షి కన్యకాంబ

56.వెడుకొంటిని శాంభవి వే విధముల పాడుకొంటిని మదనారి పాటలెన్నో

57. పలుకడేమమ్మ జడధారి పరమశివుడు! కనికరింపుము నీవైన కన్యకాంబ

58. మధుర వంటకాలు మామంచి లడ్డులు భోగమిడితి మమ్ము వేగరిమ్మ

59. ఆగ్రహమిక వీడి ఆరగించవె తల్లి ఆలకలింక చాలు కన్యకాంబ

60. సాటిలేరమ్మ నీకిల మేటితల్లి కోటిదండాలు జననిరో కోరిగిల్తు

61. నీదు దాసానదాసుడు నిజము నమ్ము కనకరించవె దుర్గాంబ వాసవి కన్యాకాంబ

62. పెనుగొండన వెలసిన కోమలాంగి వైశ్యులను కాచి రక్షించు కన్యకాంబ

63. శ్రీ మించు పెనుగొండ సింహాసనంబున నెలకోని ధరణిపై నెగడినావు

64.దిక్కు దిక్కులయందు పెక్కు కవులచేత ప్రస్తుత్ల్ కడునంది ప్రబలినావు

65. వైశ్యుల యిండ్లలో వరలక్ష్మీ వై వెల్గి యిష్టార్థ సంపద లిచ్చినావు

66. ఉదయ భానుని రీతి పద్మ గర్భాండాన ఆసురుడౌ మహిషుని అణచినావు

67.సకల సద్గుణ వంద్యులు చాల వెలయు పెనుగుండన వెలసిన కోమాలాంగీ

68.కంటి నిన్ను నా కన్నుల కరువుదీర కాచి, రక్షించు కుసుమాంబ కన్యకాంబ

69. హ్రీంకార మెంకార ఝంకారముల నెల్ల బీజాక్షరంబుల బిరుదుగల్గి

70. జంభారి హస్తాన గంభీరతన్ వెల్గు దంభోళి పట్టి విజృంభణాన

71. కారించి, మాయించి ఖలుని తంత్రములు ముల్లోకముల కెల్ల మెదమిచ్చి

72. కాళివై, శూలివై, కమలవై, గౌరివై దుచిరాంగ శోభిత రూపసివై

73.రోగములనెల్ల బాపి నిరోగ జగతి సృష్టి నేయవె మాతల్లి, చిరునగవిన

74. భక్త రక్షణ నేయవె భద్రమూర్తి కాచి రక్షించు కుసుమాంబ కన్యకాంబ

75. కన్నులెరగజేసి గండ్రగొడ్డలి బూని చండహాసుని తలపిండిచేసి

76. జృంబిత గర్వులు శుంభ నిశుంభుల మదమణచి క్షణాన మట్టుబెట్టి

77. మహిలోన జితుడై  న మహిషుని తలగొట్టి రక్తబీజుని గూల్చ రణమునందు

78. శక్తి యుక్తుల జూపి రక్తపానము చేసి కాళికామాతగా గ్రాలినావు

79. అలరు శక్తివి నీ వట్టు లలిగి నపుడు కారణంబేమి తెలుపవే కన్యకాంబ

80. నీదు లీలామృతంబును నీదు మహిమ తలచువారికి సౌఖ్యముల్ తనరగలవు

81. పెనుగొండన నెలకొన్న కోమలాంగి కాచి రక్షించు కుసుమాంబ కన్యకాంబ

82.ఓంకారముం జెప్పి హూంకరించితె చాలు భగ భగల్ నిప్పులు భగ్గుమనియే

83.చేతి గజ్జెలు కోల చెలరెగి త్రిప్పితే బాపురే! భూతాలు వణుకుచుండె

84. జడలన్ని ముడివైచి కుడివైపు తిరిగితే బ్రహ్మదేవుని గుండె భగ్గుమనియే

85. మిడీగ్రుడ్లు కదిలించి మీసాలు రిప్పితే బాపురే! భూతాలు వణుకుచుండె

86.నీదు లీలామృతంబును నీదు మహిఅమ తలచు వారికి సౌఖ్యముల్ తనరగలవు

87.పెనుగొండన నెలకొన్న కోమలాంగి కాచి రక్షించు కుసుమాంబ కన్యకాంబ

88. వీభూతి నికచేత వీరంగ మెకచేత గణ గణా గంటలు ఘల్లుమనియె

89.పచ్చాకు కురువేల పైనున్న వీభూతి వన్నె వస్తముల చేత వీరబలుక

90. కుడిచేత నరకంగ పెడబొబ్బ పెట్టబొబ్బ పెట్టంగ దక్షయాగంబెల్ల తల్లడిల్లె

91. దక్షయాగానికే తప్పదా చేటంచు చొచ్చెను మూలకు సురగణంబు

92. ఆహా! శరభావ తారమై అలరినావు వినుత శశిరుద్ర దోర్దండ వీరభద్ర

93. భద్రరూపిణి భక్త సౌభాగ్య ఫలమ కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

94. పార్వతి దేవివే పరమ కళ్యాణివే గాన వాణివె, తల్లి కన్యకాంబ

95.గణపతి తల్లివే కర్పూర గమనవే గర్వ సంహారివే కన్యకాంబ

96. కస్తూరి తిలకవే కమలాల మెలకవే కరుణతో జూదవే కన్యకాంబ

97. పాపాత్ముడౌ విష్ణువర్దను తల ప్రక్కలగునట్లు శపము లాడినావు

98. గురువు భాస్కరాచార్యులు కలవరులను బంధు గణములు సజ్జనుల్ భళియనంగ

99. సోమ రవిబింబ జగదాంబ చూడుమమ్ము కాచి, రక్షించు  వాసవీ కన్యకాంబ

100.వసుధను పెనుగొండ పట్టణాన కుసుమ శెట్టికి పుత్రివై పుట్టినావు

101.గట్టిగా వైశ్యులు నట్టింట  జేజేలు పెట్ట, రక్షింప జేపట్టి నావు

102. కులమత ధర్మాలు, కలుషించి పోవంగ ధర్మాన్ని కాపాడ తరలినావు

103. దుష్టుడౌ నృపతికి నష్టంబు కలిగెడు నట్టి శాఫంబును బెట్టినావు

104.ఇట్టిమాయల నెన్నెన్నొ నెట్టినావు కమల ముఖబింబ వాసవీ కన్యకాంబ

105. పెనుగొండన నెలకొన్న కోమలాంగి వైశ్యులను కాచి , రక్షీంచి వాసవాంబ

106. ఒకటంటే ఒక్కటి కాదు రెండు

107. రెండుంటే రెండు కాదు మూడు

108.మూడంటే మూడు కాదు నాలుగు

109.నాలుగంటే నాలుగు కాదు ఐదు

110.ఐదంటే ఐదు కాదు ఆరు

111.ఆరంటే అరుకాదు ఏడు

112.ఏడంటే ఏడు కాదు ఎనిమిది

113.ఎనిమిదంటే ఎనిమిది కాదు తొమ్మిది

114.తొమ్మిదంటే తొమ్మిది కాదు పది

115.పది కాదా! దశావతారాలు

116.తొమ్మిది కదయ్య నవగ్రహాలు

117.ఏన్మిది చూడ ఆష్ట దిక్కులు ఏడు ఆదిగో సప్తఋషులు

118.ఆరు అలరిరి చక్రవర్తులు

119.ఐదు మంది పాండవ వీరులు

120. నాలుగు కనబడు దిక్కులు కావా

121. మూడు రూపులు త్రిమూర్తి గణము

122. రెండు వెల్గులూ సూర్య చంద్రులు

123.ఒక్కటి రూపమె శ్రీ కన్యకాంబ

124. కుసుమ శెట్టికి ముద్దు కూతరై జన్మించి పెనుగొండ పురమందు వెలసినావు

125. బంగారు తొట్లలో బాగుగా నిన్నుంచి సొంపుతో రమణుల జోలపాడి

126.నిదురించి మరిలేచి నెలతలందరు కూడి ఆట్లాడగ బోవ హర్షమగును

127.వాసవీ కన్యకల్ వరుస బొమ్మల పెండ్లి చేసి వేడుక, ఇల్లు చేరి చూడ

128.పాలు పెరుగు త్రావి పట్టెమంచము మీద కూర్చిని ఉన్నట్టి కుసుమ గంధి

129. నిను చూచు వారలు నిక్కమా! కలయంచు ఆశ్చర్యమగ్నలై ఆడిపాడ

130.కృష్ణ లీలలు చూసిన విష్ణుపత్ని జగతి వైశ్యుల గృహమందు జననమంది

131.భక్తులం బ్రోచు హేమాద్రి వరకు మారి కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

132.నీ మాయ తెలియక నిఖిల లోకములందు అష్ట దిక్పాలకు లబ్బులైరి

133.నీ రూపు చూడగ త్రిభుజ వనమునందు రాజాది రాజులు రుక్తి చెడిరి

134. నీ యుగ్ర రూపాన నిలివంగలేక 612 గోత్రాలు అగ్నికి ఆహుతై మడిసిరి

135. ఇట్టి దైవము మాకు ఇలను లేరనుచును మునివరుల్ తలపోసి ముదముగొనిరి

136.  అహహ! నీ శక్తి యుక్తులు హర్షపులక లెసగు మాకిటు! నీ మాయ లేమని తలతుమమ్మ

137. ఆంబలింతుము ప్రేమ నాదుకొనుము

138. పెనుగొండలో నెలకొన్న కోమలాంగి కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

139.ఖచ్, ఖచ్. ఖచా ఖచ్చన్ని కాలిగ్ని దీప్తులు రవ రవ ధ్వనులచే భువియునిండ

140. రర్, రర్, రర్రనుచు రక్తనుచు రక్తకాంతులు చిమ్మి భీకారా కారియై పెరిగినిలిచి

141. ధుమ ధుమ ధుమ ధుమ దూమ్రలోచన దీప్తి ఫెళ ఫెళ తరువులై ఫెళ్ళగిలగ

142.జల తంత్రంణులు, శల్య తంత్రంబులు సకల తంత్రంబులు విశదమగునట్లు

143.తెలియ జెప్పవె మాతల్లి భద్రమూర్తి భక్త రక్షణ సేయవే భాగ్యలక్ష్మి కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

144.కాశికా పురి వీధి కదలి విప్రుల వెంట ప్రతిన మీరగ సాక్షి వల్కినావు

145. మార్గన నెదురై న మదిర పానీయులై చెడ్డగు దైవాల చెండినావు

146.అష్ట దిక్పాలకుల్ ఆశ్చర్య మందగా గట్టిగా గట్టిగా పెడ బొప్ప పెట్టినావు

147. ఆర్య వైశ్య కులంబు నాచంద్రమై నిల్వ ఎనలేని వరముల నిచ్చినావు

148.నీవు జగదేక, మాతవు! నిన్ను పొగడ బ్రహ్మకైనను సాధ్యంబు పడదు తల్లి!

149.జోక తోడుత నెలకొన్న సికతాంబ సరస సద్గుణ వాసవీ శారదాంబ

150.పెనుగొండ పట్నంబు పట్టి చల్లాడంగ నీలాలు వజ్రాలు నీ వలంబె

151. వడిబారు గుర్రంబు వారంపు గజ్జెలు బూపట్టు దగ్గర బొడ్డుగంట

152.తన కేశ పాశంబు తనకట్టు జల్లులు ముత్యాల గొడుగులు ముదముతోడ

153. పదునారు వన్నెల బంగారు కళ్లెంబు పంచ వన్నెల తోడ పట్టు సుదతి

154.అప్పుడు తురగంబు నెక్కి దాటించినప్పుడు దేవంద్రు దేవేరివే తల్లి నీవు

155. పెనుగొండన నెలకొన్న కోమలాంగి కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

156. నీ ముఖము చూచితే నిండు చందురుకాంతి చంద్ర బింబము బోలు చెక్కులమరె

157. నీ ముఖము చూచితే మేఘంబు సరివచ్చు నీలి పట్టపు చీర నీకు నమరె

158. కనుగ్రుడ్లు కోరలు గుండు తుమ్మెద బోలు భామ నీ కమరె పాపిటల బొట్టు

159.నొసట దీర్చిన మంచి తిలక మమరె మురిపెంపుతోన నీకు ముక్కెర మీరె

160.పెనుగొండన నెలకొన్న కోమలాంగి కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

161. శ్రీ కంఠు రాణిపై శృంగార వేణివై చిత్తరుపు ప్రతిమవై చెలగినావు

162. తిల పుష్ప రాసివై తొలకరి మెరుపువై పన్నీరు తేటవై ప్రబలినావు

163. కువలయ పాణివై కోకిల రాణివై కనకాద్రి తీరమై గ్రాలినావు

164. కనుక శుకంబవై కైలాస వాసివై సురరాత వినతివై పరగినావు

165. కరుణ చూపవె మాయమ్మ కన్యకాంబ

166.పరము లొసగవె మాయమ్మ వాసవాంబ

167.అమర సేవిత పద పద్మ! అంచితముగ

168.కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

169.మార్కొన్న వైరులన్ మర్థించి నీవె

170.దేవాది దేవతల దిక్కు నీవె

171. చలపట్టి వై రులన్ సాధించు నీవె

172. కరుణతో కాపాడు తల్లి నీవె

173.ఏడేడు భువనామ పాలింప నీవె

174. దాటు రోగంబుల దాటకుండగ నీవె

175.మటుమాయ విద్యల మాత నీవె

176. వంచకులన్ బట్టి శిక్షింతునీవె

177.ఒంటరికి తోడుగా నుందు నీవె

178.ఇంత దైర్యంబు_ నీకింత మ్రేమలేల

179.కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

180.ధళికుట ధళికుట నీదు పైతాని చీర చెంగులు జౌర శిస్తుమీద

181.నీరూపు కులుకు నీదు కమ్మలకాంతి చెక్కు టద్దంబు చేబంతులాడి

182. సొగసుగా మగరాజు నగల హారంబులు కుచ్చు కుమ్మల మీద కునుకులాడ

183.పెక్కుగా కందూరు వర్తకులు పిలిపింప పరమ డయాళువై పేరుగాంచితివి

184.నూట యిబ్భండ్రు వారి నగరము వారిండ్ల కొలువు తీరిన వాసవీ కన్యకాంబ

185. సంగ రంగణ భేరి జన జనా వాగినా పొంగి నాకాశంబు క్రుంగిపడును

186.బిరు చుట్టు చుట్టగా బిరుద వాహన మెక్కి సమ వర్తనుల గుండె ఝల్లుమనుచు

187. బిండి వాలముబూని కంటి రెప్పాడితే చల్లని చుక్కలు త్రెళ్ళి నిలుచు

188.ఆరకించి ఒకటి రెండడుగులు పెట్టితే బ్రంహాండ భాండంబు భగ్గుమనుచు

189.ఆదిశక్తివి నీవమ్మ! అద్బుతంబు నీదు లీలలు మాతల్లి! ఆడుకొనవె

190. పెనుగొండన నెలకొన్న కోమలాంగి కాచి, రక్షించు వాసవీ కన్యకాంబ

191.నీ వాడనంటి నన్ను మన్నించ మంటి నేరములు నావిగా ఎంచవద్దమ్మా

192. నిన్ను నేను నమ్మితినే

193. నన్ను వదల వద్దంటినే

194.వృథా పరాకు చేసితివే!

195.నీవు నాతల్లి విగదా

196. నేను నీ బిడ్డనుగదా

197. తగదమ్మ ఇఅది నీకు తగని పరాకు

198.వంచకుండను గాను

199.నీపంచ గాచితిని

200. నిన్ను నమ్మియుంటి- నీ వాడనంటి

201.కరుణ జూపించవే- కన్యకాంబ


Facebook

శ్రీ వాసవీ శరణ ఘోష


 


Post a Comment

0 Comments