Shiva Panchakshara Stotram - శివ పంచాక్షరి స్తోత్రం
Shiva Panchakshara Stotram - శివ పంచాక్షరి స్తోత్రం
నమః శివాయ నమః శివాయ
గంగాధర హర నమ శివాయ
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥
యక్ష స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
ఇతి శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీగోవింద భగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః శ్రీ శివ పంచాక్షర స్తోత్రం సంపూర్ణమ్
భావం:
నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, భస్మము
ఒంటినిండా పూసుకున్న వాడు, మహేశ్వరుడు, నిత్యమైనవాడు, పరిశుద్ధుడు, దిగంబరుడు,
"నమశ్శివాయ" అను మంత్రము
నందలి ’న’ అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము. || 1 ||
ఆకాశగంగా జలమనే చందనము పూయబడినవాడు, నందీశ్వరుడు
మోదలైన ప్రమథగణములకు నాయకుడు, మందారము మోదలైన అనేక పుష్పములచే పూజింప
బడినవాడు, "నమశ్శివాయ" అను
మంత్రము నందలి ’మ’ అను
అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము. || 2 ||
మంగళకరుడు, పార్వతీ ముఖమనే పద్మసముదాయమును వికసింప
చేయు సూర్యుడు, దక్షుని యాగము నాశనం చేసినవాడు, నల్లని కంఠము కలవాడు, జండా పై ఎద్దు చిహ్నమున్న వాడు,
"నమశ్శివాయ" అను
మంత్రము నందలి ’శి’ అను
అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము. || 3 ||
వసిష్ఠిడు, అగస్త్యుడు, గౌతముడు,
మోదలైన మునీంద్రుల చేత పూజింపబడు జటాజూటము
కలవాడు, చంద్రుడు - సూర్యుడు -
అగ్ని మూడు కన్నులుగా కలవాడు, "నమశ్శివాయ"
అను మంత్రము నందలి ’వ’ అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము. || 4 ||
యక్షస్వరూపుడు, జటలను ధరించిన వాడు, పినాకము
అను ధనుస్సును చేతిలో పట్టుకున్న వాడు, సనాతనుడు, ఆకాశమునందుండు దేవుడు, దిగంబరుడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి ’య’ అను
అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము || 5 ||
పావనమైన ఈ పంచాక్షరస్తోత్ర మెవరు శివసాన్నిధ్యంలో
స్తుతిస్తారో, వారికి శివలోకప్రాప్తి కలిగి,
శివుని అనుగ్రహమును పొందుదురు
0 Comments