Rama Bhajana - రామ భజన
1. శ్రీ హరి భజన శ్రీతత్వబోధ విశేషమైనది రామ నామము
2. యెరక మరుపుల యెరుక చేసిన యెగసూత్రము రామ
3. యందు చూచిన నందు లేకను వెలుగుచున్నది రామ
4. పరమపదమును చేరుటందకు బాట చూపును రామ
5. పెదవి గలదని చదువు చదివిన పదవి దొరుకును రామ
6. గుట్టుగా గురుసేవ చేసితె గుర్తు తెలుపును రామ
7. గట్టిగా శ్రీహరిని నమ్మితే కానవచ్చును రామ
8. సాంబశివునకు పార్వతమ్మకు సారమైనది రామ
9. సూది మెపును సందులేకను వెలుగుచున్నది రామ
10. సురులు మునులు చూచుటందుకు చోద్యమైనది రామ
11. తీపు తెలసిన దివ్యములకు తీపై యున్నది రామ
12. మూలమెరుగని మూడజనులకు ముపడి పండు రామ
13. భజన చేసే భక్తుజనులకు బాట చూపును రామ
14. ఇందు గలదని అందులేదని ఏందు చూచిన రామ
15. కుడియెడమున తిరుగుచుండిన గొప్పయైనది రామ
16. ఎక్కు పెటి నిక్కు చూచితే ఎక్కువైనది రామ
17. దండిగా భూమండలమున పాత అయినది రామ
18. ముక్తి మార్గము తెలుపుటందుకు మెక్షలక్ష్మి రామ
19. అన్ని రుచులు మించియున్నది అమృతమైనది రామ
20. ముసుగు లోపలెయుండి దేవుని మూలమే శ్రీ రామ
21. మునులకెల్లను కరుణతోడాను మెక్షమిచ్చును రామ
22. మాయ లోకము మాయలన్ని మట్టు పరిచేది రామ
23. గుట్టు తెలిసిన దేశకులకు గురుతు తెల్పును రామ
24. వ్యాదులన్నియు మాన్నించుటకు ఎక్కువైనది రామ
25. బాధలన్నియు బాపెటందుకు భోగమే శ్రీ రామ
26. కుంజ భూతముల నెల్ల పారదోలును శ్రీ రామ
27. ఒంటి స్థంభము మేడ లోపల ఒప్పియున్నది రామ
28. అంజనేయుని బ్రోచుటాకు ఆదారమైనది రామ
29. నమ్మి నమ్మక యున్న వారికి నింది లేనిది రామ
30. బయట లోపల పల్కు తానై పల్కుచున్నది రామ
31. కల్లనిజములు రెండు దెల్పెడి గానమే శ్రీ రామ
32. నాది నీది యనేవారికి వజ్రమంటిది రామ
33. ఆత్మ శుద్ది లేని వారికి అందరానిది రామ
34. వాద వేదము లేనివారికి వజ్రమంటిది రామ
35. ఎన్ని మారులు చదివినను ఇంపు తీరదు రామ
36. మించి మటింకి సూత్రదారివై వెలుగుచున్నది రామ
37. చూపు మనస్సు ఒకటి అయితే సుఖము నొసుగును రామ
38. రామ భజన చేసేవారికి రమ్యమైనది రామ
39. కామ క్రోదము లేని వారికి కానవచ్చును రామ
40. అంత యింతని చెప్పడానికి అందలేనిది రామ
41. ముట్టు మైలు లేనివారికి కాణవచ్చును రామ
42. కులమతముల లేనివారికి కొల్లగా శ్రీ రామ
43. ఇంటిలోపల ఇల్లు గట్టిగ యిష్టమైనది రామ
44. కంటి మెంటి రెండు సందున కాణ వచ్చును రామ
45. కోర్కెలన్ని తీర్చుటకు కొదవలేనిది రామ
46. పంచ పాండవుల కెల్ల వరములిచ్చిన రామ
47. రాక్షసుల సంహరించిన రత్నమైనది రామ
48. నారదాది మునులకెల్లను నాన్యమైనది రామ
49. గాలి రాకపోకకు దేశాకులకెల్లను రామ
50. ప్రజలందరికి ఇష్టమైనది రామ
51. ముక్కుచాయసు చూచేవారికి మూలమైనది రామ
52. చింతలన్నియు కొట్టి వేయును సిద్దిమైనది రామ
53. సత్యమాడే జనులకెల్లను సిద్దమైనది రామ
54. తల్లి తండ్రి గుర్తు దెల్పెటి దాత అయినది రామ
55. ఘెరమైన పాతకంబులు కొట్టివేయును రామ
56. దీపమే రూపంగా గనబడు దివ్యమునులకు రామ
57. కల్లలాడే జనులకెల్లను కానరానిది రామ
58. మంకు గుణములు మాన్పేటందుకు మంత్రమైనది రామ
59. యేది అంతట ఏకమైతే వెలుగుచున్నది రామ
60. పాదకుణితాబట్టు బయలుగా పరుచుచున్నది రామ
61. చూచితే కనపడని వస్తువు చూపులోనె రామ
62. కంటిలోపల వెలుగుతానై కానవచ్చును రామ
63. సూటి తప్పక చూపు నిలిపితే సుఖము దొరుకును రామ
64. కౄరమైన పాపములను కొట్టివేయును రామ
65. ఆరు మూడు మూసి చూపితే అందియున్నది రామ
66. చూపులోనే రూపమాయెను సురచిరంబుగ రామ
67. తేజమే రూపంబుగా ననుబడు దివ్యమునులకు రామ
68. ఏడుకొండల మీద తాలు వెలుగుచున్నది రామ
69. కుంభకర్ణాది వీరులు ద్రుంచి వేసిన రామ
70. సన్కాది మునులకెల్ల సౌఖ్యమైనది రామ
71. భోగభోగ్యముల ఇచ్చుటందుకు భాగ్యమే శ్రీరామ
72. నాధ బిందు కళల లోటి నాణ్యమైనది రామ
73. మూడు లోకములకెల్ల మూలమైనది రామ
74. పాపములను పోగొటిడాకును బాణమైనది రామ
75. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు ఇష్టమైనది రామ
76. వాల్మీకి వశిష్ట మునులకు ఇష్టమైనది రామ
77. బాణముల అన్నిటికి మిక్కిలి బాణమైనది రామ
78. మాట తిరిగే మాయ జనులకు మెక్షమైనది రామ
79. మెక్షమివ్వను కర్తతానై మ్రెగుచున్నది రామ
80. గురువు దైవము తెలియకుంటె గుర్తు తెల్పును రామ
81. కోపములను పొగొట్టుడాకును గొడ్డలైనది రామ
82. సందులేకను నిండియున్నది సారమైనది రామ
83. సర్వరూపము శాంతి పరుడై సంతరించెడి రామ
84. బెదరి బెదరి గుణములన్ని చెందివేసును రామ
85. జపము తపము లేనివారికి చేరియున్నది రామ
86. ఆదిశేషుని పడిగమీద అమర్చయున్నది రామ
87. శంఖు చక్ర మూలమందు చేరియున్నది రామ
88. శ్రీ పట్టుగా హరిని నమ్మితే భాగ్యమిచ్చును రామ
89. లోన చూపు చూచు మునులకు లోకమెందుకు రామ
90. చూచేటందుకు చోద్యమైనది సురచిరంబుగ రామ
91. కోటి సూర్యప్రకాశమైనది కొల్లగా శ్రీ రామ
92. కవులనెల్ల బోచుటాకు తాకర్త అయినది రామ
93. భక్తులను పోషించడమునకు భాగ్యమైనది రామ
94. హంస పలుకులు విన్నవారికి అమృతము శ్రీ రామ
95. ముందు జరిగె కాలమేలను మూలము దెల్పును రామ
96. యచ్చు తగ్గులు యున్నవారికి యగదు గొప్పను రామ
97. యెప్పుడు మదిలోన మరువక ఒప్పియున్నది రామ
98. గురువు రూపము తాను అయి గుర్తు దెల్పును రామ
99. కాడు కాడు అన్నవారికి కాలమవ్వును రామ
100. మంచి మంచి దన్న వారికి మల్లె పుష్పము రామ
101. అండబాయక ఆత్మలోపల ఆడుచున్నది రామ
102. అండపిండ బ్రహ్మండమంతయు అంటియున్నది రామ
103. హరి మహిమలు తెల్పుటందుకు అలివిగానిది రామ
104. కోటి ధనములు ఇచ్చినాను కొర్క రాదు రామ
105. నాధమే బ్రహ్మంబమని తానిండియున్నది రామ
106. ఆత్మ లింగము పూజ చేసితే అమృతమే శ్రీరామ
107. అన్ని రూపులు అన్ని తచువులు ఆడుచున్నది రామ
108. సర్వము తానని పల్కుచున్నది సర్వసాక్షిగా రామ
109. కౄరమైన పాపములను చెండువేసును రామ
110. పెద్ద చిన్న గుర్తు తెల్పేటి భావమే శ్రీరామ
111. కన్ను గ్రుడ్లు దృష్టి చూచితే కానవచ్చును రామ
112. నీ లోనే బ్రహ్మం సందులేకను నిండియున్నది రామ
113. కన్ను గానక యున్నవారికి కండ్రించును రామ
114. శత్రుబాణము దృంచెటెందుకు చక్రమైనది రామ
115. రామమంత్రము తెలిసినాను రహస్యమైనది రామ
116. పామరుల కెల్ల మరువకుండ ప్రేమ గల్గును రామ
117. ఓం నమశ్శివ రామ యని ఓం కారమైనది రామ
118. భూమద్య స్థానమందున ముక్తియున్నది రామ
119. స్థూల దేహము సూక్ష్మ రూపము సురచిరంబుగ రామ
120. తారక మంత్రము కొరినాను తారకమైనది రామ
121. కొటి నామము రాయువారికి కోర్కె దీర్చును రామ
122. ఆశలన్ని అణచి వేయును అధికమైనది రామ
123. క్రిష్ణనామము చదువువారికి కష్టపెట్టదు రామ
124. రెండుక్షరముల తోటి రహస్యమైనది రామ
125. విష్ణు మాయలు దెలియవారికి విర్రవీగను రామ
126. మాయమృగమును సంహరించి మధురమైనది రామ
127. రాతినాతిక చేసి రహస్యమైనది రామ
128. కరమాషనాధుల దృంచి వ్రేసిన కండనము శ్రీ రామ
129. సురపురవాసుడైన క్రిష్ణదాసుని యందు పుట్టినది రామ
ఈ రామనామములు చదివిన వారికి విన్నవారికి వ్రాసిన వారికి అష్ట ఐశ్వర్యాభివృద్ది కలుగును.
0 Comments