Sundaramainadi Sundarakanda - సుందరమైనది సుందరకాండ

1.      సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

2.      సుగ్రీవుండను వానరరాజు, శ్రీరాముని ప్రియ మిత్రుడు, సీతను వెతుకగా నలుదిక్కులకు, వానర సేనను పంపెనుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

3.      నలుడు, నీలుడు, జాంబవంతుడగు అంగదుడు, హనుమంతుని వెంటనరాగ,దక్షణ దిక్కుగా పయనించె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

4.      శతయెజనముల విస్తీర్ణముగల, సంద్రము నెట్టుల దాటుదుము? జానకి నెటుల చూచెద? మనుచు, దుఃఖము నొందిరి కపివరులు

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

5.      అతి భికరమగు, సంద్రము దాటగ, అంజని సుతునకే, తగుననుచు, ఉత్సాహంబును కలుగజేసిరి, హనుమను అందరు కీర్తించి

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

6.      అంజనేయుడా మహేంద్రగిరిని, కర, చరణంబుల మర్థించి, దేహము పెంచె అతివేగంబున, ఆకాశంబున విహరించే

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

7.      కృతయుగంబున పర్వతంబులు, రెక్కలు కలిగి గగనమున, విహరించుచూ భయబ్రాంతులు గొల్పగా, మునులు ఇంద్రుని ప్రార్థించీ

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

8.      దేవరాజు తన వజ్రాయుధములతో, అన్నిటి రెక్కలు ఖండింప, మైనాకంబను, గిరిరాజంబును, వాయుదేవుడు కాపాడే

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

9.      పాతాళంబున వశించు దనుజులు, పైలోకములకు, రాకుండా, అడ్డుగా, నిలిచిన అమైనాకుని, సాగరుండంతట పిలిచెనుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

10. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపుమన, అలసట తీరగా, నా పైనిలుమని, ఎదురుగా నిలిచెను గిరిరాజు

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

11. అనిల కుమారుడు ఆనందించి, జానికి మాతను, చూచినకాని, విశ్రమించెనని, బయలుదేరగా, సంతరించెరా దేవతలు

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

12. మునులంత ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను నాగజనని ఆ సురసాదేవిని ప్రార్థనచేసి పంపిరిగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

13. వికృత రూపము, దాల్చిన సురస గుహవలె నోటిని తెరచెనుగా నోటిని దాటి పోలేవరరని, హనుమను అడ్డుగ నిలిచెనుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

14. సూక్ష్మరూపము ధరించి మారుతి సురసా నోటిలో చొచ్చుకొని అతి వేగంబున బయలు వెడలగా గంధర్వాదులు, హర్షించె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

15. మేని నీడను పట్టి లాగెడి సింహ కయనెడు రక్కసిని సంహరించి ఆ సమీర సాగర తీరము చెరునుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

16. త్రికూట పర్వత శిఖరమునున్న లంకనుచేరి లంకిణిని జయించి హనుమ సూక్ష్మరూపియై రావణ గృహమును వెదకెనుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

17. మేడల, మిద్దెలు, విమానములను అంతఃపురములు హర్మ్యములు భవనంబులను వెదకిన హనుమ జానకి జాడనుకనడయ్యె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

18. అశోక వనిలో వృక్షము క్రిందను రక్కసి మూకల మధ్యన చిక్కినను బహు చక్కగనున్నసీతామాతను చూచెనుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

19. అతి దుఃఖితియగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావుణునంత చూచెను, వృక్షము పై నుండి

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

20. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే మనసు మార్చుకొను సీతమ్మకు ఒక రెండు మాసములు గడువిచ్చె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

21. రాక్షస వనితలు కఠినపు మాటల రాముని సతినే బాధింప త్రిజటయనెడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితి నని తెలిపె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

22. లంకా నాధుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితి ననె సీతమాతకు శుభ శకునంబులు మెదలయ్యె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

23. రామ లక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామ దూతనని విదేహపుత్రుని నమ్మించగా నిజరూపద నిలిచే

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

24. అమ్మా రాముడు నీ విరహమున అన్న పానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరమును నీకివ్వగ నను పంపెననె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

25. హనుమ పలుకులు విన్న జానికి ఆనందముతో మునిగెనుగా సాగర లంఘన చేరిన నీవు మహాను భావుడవని పొగిడే

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

26. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించి నన్ను చేరతీయమని రామచంద్రునకు తెల్పమనె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

27. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకా సురిని కథ తెలిపి చూడామణిని శ్రీరామనుకు అందజేయమని పలికెనుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

28. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరిచెనుగా అశోక వనిని ద్వంసం చేసి రావణు సేనల వధియించె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

29. రావాణ సుతుడగు అక్షయ కుమారుని మంత్రి పుత్రులను కింకరులన్ వధియించిన ఆవాయు పుత్రుడు, మేఘనాథునితో తలపడెను

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

30. మేఘనాథుడు బ్రహ్మస్త్రంబున, మారుతి నప్పుడు బంధించి, రావణ సభతో చేర్చినంతనే, రావణుడెంతయె మండిపడే

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

31. సీతమ్మను శ్రీరామునికిచ్చి, రాముని శరణము వేడుమనే, రామదూతగా వచ్చితినన్న, హనుమంతుని హతమార్చుమనె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

32. దూతను చంపగ పాపమనుచును, వీభీషణాదులు తెల్పగను, వానరములకు ప్రియమైన, తోకను కాల్చగా నియమించె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

33. రాక్షసులంతట నూనె చీరలను, తోకకు చుట్టి అంటించి, వీధులయందున త్రిప్పుచునుండ, ఇంద్లను తోకతో అంటించె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

34. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లనను, హనుమను చల్లగా చూచెనుగా, మైథిలియెక్క పాతి వ్రత్యమున, అనలుడు ఎంతయై చల్లబడె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

35. మండుచున్నా తల వాలముతోడను, గృహములనెన్నో కాల్చెనుగా, మనోజ్ఞమైన లంకానగరిని, భస్మీపటలము గావించే

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

36. హా!పుత్రా!హా! తండ్రీ యునుచును, చచ్చిన వారికై ఏడ్చుచును, రాక్షసందురు రోచన చేయుచు, భయముతో పరుగులు పెట్టిరిగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

37. పవనాత్మజుడు లాంగులాగ్రము, సాగరమందున చల్లార్చి, బీభత్సవముగా నున్నలంకను, చూచియు ఎంతయె భీతిల్లి

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

38. జానకీ మాత ఎటులనున్నదో, చూడగాకోరి, హనుమయ్య, అతి త్వరితముగా వనమును చేరి, సీతా మాతకు ప్రణమిల్లె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

39. రోహిణి చంద్రుని కలియున్నట్లుగా, రాముడు నిన్నె కలియుననె, శ్రీరాముడు ఇక శ్రీఘ్రముగాను, లంకా నాదుని చంపుననె

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

40. సీతయు తనకు ప్రియము చేసిన, హనుమను అలసట తీరగను, ఎందైయునను ఆ రాతిని గడిపి, మరలి పొమ్మని తెలిపెనుగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

41. అవలీలగా ఆ సముద్రము దాటి, మిత్రుల చేరెను మారుతియు, మధువనిలోనే మధువులు త్రాగి, రాముని చెంతనే నిలచిరిగా

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

42. అంతట మారుతి సీత క్షేమమును, యధతధముగా వినిపించి, జానికి యిచ్చిన చూడామణిని, రాఘురామునికి అందించే

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

43. చూచి రమ్మనిన కాల్చివచ్చిన, ఘనతయే నీకు దక్కెనుగా, హనుమయ్య! నీ సాటెవరనుచు, సుగ్రీవాధులు కీర్తించే

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

44. మా ఇలవేలుపు మారుతియే కద, తప్పులు క్షమించ కోరుడును, మారుతీ కిదియే అంకితమనుచును, మంగళహారతి పాడెదను

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

45. రఘురాముని నీ మనమున నిలిపిన, మారుతి నీకిదె మంగళము, నీ దాసులలో నను చేర్చగను, మరి మరి నిన్నే కోరెదను

సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము, మారుతి విజయం మరిమరి వినగా, మనసే పరవశ మెందునుగా

Post a Comment

0 Comments