Vasavi 102 Sharanalu - వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి 102 శరణలు

 Vasavi 102 Sharanalu - వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి 102 శరణలు

Vasavi 102 Sharanalu - వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి 102 శరణలు
Vasavi 102 Sharanalu - వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి 102 శరణలు

1.జై వాసవి జై జై వాసవి

     జై వాసవి జై జై వాసవి

2. అమ్మలగన్న అమ్మవు నీవు

    జై వాసవి జై జై వాసవి

3. అష్టాదశపీఠంబులయందు

    జై వాసవి జై జై వాసవి

4. ఆది పరాశక్తి నీవు

    జై వాసవి జై జై వాసవి

5. కాళీ, లక్ష్మి, సరస్వతి నీవు

    జై వాసవి జై జై వాసవి

6. సర్వదేవతా రూపిణి వమ్మా

    జై వాసవి జై జై వాసవి

7. సకల కష్టములు తీర్చే తల్లి

    జై వాసవి జై జై వాసవి

8. తలచిన మాత్రము వరములుఇచ్చే

   జై వాసవి జై జై వాసవి

9. భోగ భాగ్యములు గూర్చెడి మాత

   జై వాసవి జై జై వాసవి

10. సూర్య చంద్రుల శోభలు నీవే

      జై వాసవి జై జై వాసవి

11. సిద్ది, బుద్ది విజ్ఞాన రూపిణి

      జై వాసవి జై జై వాసవి

12. సకల శక్తులు నీవేనమ్మ

      జై వాసవి జై జై వాసవి

13. సోమదత్తుని ప్రార్థనతోటి

      జై వాసవి జై జై వాసవి

14. సమాధి మహర్షి ఆశీస్సులతో

     జై వాసవి జై జై వాసవి

15. వైశ్యకులమున వెలసితివమ్మ

      జై వాసవి జై జై వాసవి

16. కుసుమ గుప్త కుసుమాంబలకు

      జై వాసవి జై జై వాసవి

17. వైశాఖమాసాన జన్మించితివి

      జై వాసవి జై జై వాసవి

18. కూతురివై ఇల జన్మించినావు

      జై వాసవి జై జై వాసవి

19. కుసుమ శ్రేష్టి ముద్దుల బిడ్డవు

     జై వాసవి జై జై వాసవి

20. విరూపాక్షుని సోదరి నీవు

     జై వాసవి జై జై వాసవి

21. నీకు ఐదో ఏడు రాగానే తల్లి

      జై వాసవి జై జై వాసవి

22. గురుకులములోన చేరితివమ్మ

      జై వాసవి జై జై వాసవి

23. సమస్త విద్యలు సాధించితివి

      జై వాసవి జై జై వాసవి

24. అనంత శక్తులు ఆర్జించితివి

      జై వాసవి జై జై వాసవి

25. ఇహపర మెక్షములొసగిన తల్లి

      జై వాసవి జై జై వాసవి

26. భాస్కర చార్యుని దీవెనలొందిన

      జై వాసవి జై జై వాసవి

27. సర్వ శాస్త్రముల సారము నీవే

      జై వాసవి జై జై వాసవి

28. యుక్త వయస్సులో వాసవి గాను

      జై వాసవి జై జై వాసవి

29. అపురూమై వెలిగావమ్మా

     జై వాసవి జై జై వాసవి

30. వివాహమంటే వలదన్నావు

      జై వాసవి జై జై వాసవి

31. పరబ్రహ్మ పరమేశ్వరి నీవని

      జై వాసవి జై జై వాసవి

32. పరమేశ్వరుడే పతి అన్నావు

      జై వాసవి జై జై వాసవి

33. వైశ్యకులానికి వరాలతల్లివి

      జై వాసవి జై జై వాసవి

34. విష్ణువర్థనా మహారాజు

      జై వాసవి జై జై వాసవి

35. కన్నూమిన్నూ కానక నిన్ను

      జై వాసవి జై జై వాసవి

36. బలదర్పముతో చూశాడమ్మా

      జై వాసవి జై జై వాసవి

37. కామకాంక్షలతో చేరాడమ్మా

      జై వాసవి జై జై వాసవి

38. కన్యకవైనా నిన్ను కోరి

      జై వాసవి జై జై వాసవి

39. దుర్మదాందుడగు విష్ణువర్థనుని

      జై వాసవి జై జై వాసవి

40. గర్వముణనిచి వధియించితివి

      జై వాసవి జై జై వాసవి

41. ఆత్మార్పణము పొందితివమ్మా

      జై వాసవి జై జై వాసవి

42. అపచారానికి తలవంచక నువ్వు

      జై వాసవి జై జై వాసవి

43. సమరశంఖమును పూరించితివి

      జై వాసవి జై జై వాసవి

44. అహింసధర్మాన్ని ఆశ్రయించి

      జై వాసవి జై జై వాసవి

45. దుష్టునికి  దాసోహంకాక

      జై వాసవి జై జై వాసవి

46. శిష్టురాలివై మార్గం చూపావు

      జై వాసవి జై జై వాసవి

47. నీతో 102 గోత్రాల వారు

      జై వాసవి జై జై వాసవి

48. ఆత్మార్పణతో పునీతులయ్యారు

      జై వాసవి జై జై వాసవి

49. శరీరత్యాగాన్ని ఆచరించావు

      జై వాసవి జై జై వాసవి

50. భౌత్తికధర్మాలు పాటించమన్నావు

      జై వాసవి జై జై వాసవి

51. నైతిక సూక్ష్మాలు పాటించమన్నావు

      జై వాసవి జై జై వాసవి

52. నీ మాటలు మాకు శిరోధైర్యాలు

      జై వాసవి జై జై వాసవి

53. నీ బాటలు మాకు శౌర్య, ధైర్యాలు

      జై వాసవి జై జై వాసవి

54. పుణ్య వశిష్టా నదీ తీరమున

       జై వాసవి జై జై వాసవి

55. బ్రహ్మ కుండల ప్రాంతములోన

      జై వాసవి జై జై వాసవి

56. ఎరుపురంగు వస్తము ధరించి

      జై వాసవి జై జై వాసవి

57. అగ్నిగుండమున అడుగేశావు

      జై వాసవి జై జై వాసవి

58. ఆత్మత్యాగము చేసిన తల్లి

      జై వాసవి జై జై వాసవి

59. దేహబ్రాంతిని తొలగించావు

      జై వాసవి జై జై వాసవి

60. కైలాసగిరిని చేరుకున్నావు

      జై వాసవి జై జై వాసవి

61. విశ్వరూప సందర్శనమిచ్చి

      జై వాసవి జై జై వాసవి

62. కోట్ల ప్రజల కుల దేవతగాను

      జై వాసవి జై జై వాసవి

63. దివ్యప్రభల ఇల వేలుపుగాను

      జై వాసవి జై జై వాసవి

64. శక్తి రూపిణిగ వెలిశావమ్మా

     జై వాసవి జై జై వాసవి

65. శాశ్వత సత్యం ప్రవచించావు

      జై వాసవి జై జై వాసవి

66. మాఘమాసమున నీ ఆత్మార్పణం

      జై వాసవి జై జై వాసవి

67. స్థితప్రజ్ఞత గల విజ్ఞురాలివి

      జై వాసవి జై జై వాసవి

68. ప్రతిభాబాటవ ప్రజ్ఞాశాలివి

      జై వాసవి జై జై వాసవి

69. నీ ఆదర్శంబగు అనుసరణీయం

      జై వాసవి జై జై వాసవి

70. జగన్మాతకు ప్రతి రూపానికి

      జై వాసవి జై జై వాసవి

71. పెనుగొండ పురమున వెలసిన తల్లి

      జై వాసవి జై జై వాసవి

72. నిను ప్రార్థిస్తే శుభ సౌభాగ్యాలు

      జై వాసవి జై జై వాసవి

73. నిను సేవిస్తే అష్టైశ్వర్యాలు

      జై వాసవి జై జై వాసవి

74. అందిస్తున్నావమ్మానీ మహిమలను

      జై వాసవి జై జై వాసవి

75. వైశ్యకులమునకు వన్నెతెచ్చిన

      జై వాసవి జై జై వాసవి

76. సర్వమంగళ మంగళమూర్తివి

      జై వాసవి జై జై వాసవి

77. కాంతి యశంబుల నిచ్చే తల్లి

      జై వాసవి జై జై వాసవి

78. అఖిల జలాచర జగత్తునందు

      జై వాసవి జై జై వాసవి

79. ఆదిదైవము నీవేనమ్మా

      జై వాసవి జై జై వాసవి

80. నీవే సత్యము నీవే నిత్యము

      జై వాసవి జై జై వాసవి

81. నీవే నిజ పరమాత్మతత్వము

      జై వాసవి జై జై వాసవి

82. ఆర్తజనుల కాపాడిన తల్లి

      జై వాసవి జై జై వాసవి

83. ఆదిశక్తి పరమేశ్వరివమ్మా

      జై వాసవి జై జై వాసవి

84. ఆదివ్యాధుల అణిచే తల్లి

      జై వాసవి జై జై వాసవి

85. భక్తులను బ్రోచేటి తల్లివి

      జై వాసవి జై జై వాసవి

86. నగరేశ్వరునికి మహారాణివే

      జై వాసవి జై జై వాసవి

87. సృష్టిస్థితిలయ కారిణి నీవే

      జై వాసవి జై జై వాసవి

88. శత్రువర్గమును చంపేతల్లి

      జై వాసవి జై జై వాసవి

89. పిలిచిన పలికే దైవము నీవే

      జై వాసవి జై జై వాసవి

90. శంకర గుప్త భక్తికి మెచ్చిన

      జై వాసవి జై జై వాసవి

91. భక్తకోటి బంగారము నీవే

      జై వాసవి జై జై వాసవి

92. దుష్టలచీల్చీ శిష్టులనేలె

      జై వాసవి జై జై వాసవి

93. సర్వవిఘ్నముల తీర్చే తల్లీ

      జై వాసవి జై జై వాసవి

94. కోరిన కోర్కెలు తీర్చే తల్లీ

      జై వాసవి జై జై వాసవి

95. ఆర్యవైశ్యుల ఇలవేల్పు నీవే

      జై వాసవి జై జై వాసవి

96. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవివే

      జై వాసవి జై జై వాసవి

97. ఆర్యవైశ్యల మహారాణివే

      జై వాసవి జై జై వాసవి

98. మృదిలాపురిలో వేలసిన తల్లి

      జై వాసవి జై జై వాసవి

99. నీ సేవలు మేము నిత్యము చేతుము

      జై వాసవి జై జై వాసవి

100. మా పూజలను అందుకోవమ్మా

        జై వాసవి జై జై వాసవి

101. మా భజనలను అలకించమ్మా

        జై వాసవి జై జై వాసవి

102. మా మనస్సందున ఉండుము తల్లి

        జై వాసవి జై జై వాసవి ||3||

శ్రీ వాసవి చాలీసా 2


Post a Comment

0 Comments